Saturday, August 30, 2008

రంగులలో రానున్న "శ్రీకృష్ణ తులాబారం"

అలనాటి బ్లాక్ అండ్ వైట్ సినిమాలు త్వరలో సప్తవర్ణాల శోభను సంతరించుకోనున్నాయి. ప్రదానంగా ఎన్ టీఆర్ నటించిన పౌరాణిక అణిముత్యాలైన చిత్రాలను రంగుల్లోకి మార్చేందుకు ప్రముఖ నిర్మాత రామానాయుడు యత్నిస్తున్నారు. త్వరలోనే ఈ ప్రయత్నాలు విజయవంతంగా అమలు చేస్తామని రామానాయుడే స్వయంగా చెప్పారు. అంతే కాకుండా కొన్ని పాత చిత్రాలను చిత్రాలను పునర్నిర్మించనున్నట్లు ఆయన వెళ్లడించారు.
ఇందులో భాగంగానే అలనాటి అణిముత్యంగా అందరి మన్ననలు పొందిన శ్రీకృష్ణ తులాభారం చిత్రం త్వరలో సప్తవర్ణాలతో పులుముకోనుంది. ఈ చిత్రాన్ని రంగుల్లోకి మార్చి రాష్ట్ర వ్యాప్తంగా మరోమారు విడుదల చేసే పనుల్లో అగ్ర నిర్మాత రామానాయుడు నిమగ్నమయ్యారు. ఇందుకు సంబందించి ముంబైలోని ఆయా రంగాల సాంకేతిక నిపుణులతో చర్చించిన రామానాయుడు శ్రీకృష్ణ తులాబారం, మాయాబజార్ వంటి ఘన విజయం సాధించిన చిత్రాలను రంగుల్లోకి మార్చనున్నట్లు చెప్పారు.
దీంతోపాటు ఎన్ టీఆర్ సురేష్ ప్రొడక్షన్ పతాకంలో నటించిన రాముడు భీముడు చిత్రాన్ని రీమేక్ చేసే ప్రయత్నాలలో ఉన్నట్లు రామానాయుడు తెలిపారు. ఎన్ టీఆర్ ద్విపాత్రాభినయంలో నటించి అప్పట్లో సంచల విజయం సాధించిన రాముడు భీముడు చిత్రాన్ని ఎన్ టీఆర్ మనవడైన జూనియర్ ఎణ్ టీఆర్ తో పునర్నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నట్లు రామానాయుడు తెలిపారు. శాతాధిక చిత్రాల నిర్మాతగా గిన్నిస్ బుక్ ఆప్ రికార్డ్స్ లో స్థానం సంపాధించిన రామానాయుడు అలనాటి చిత్రాలకు రంగుల శొభను అద్దటంతో పాటు, కొన్ని చిత్రాలను రేమేక్ చేయటం ద్వారా కూడ అంతర్జాతీయంగా తమ బ్యానర్ కు గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Friday, August 29, 2008

"కింగ్" నాగార్జున కు 50వ జన్మదిన శుభాకాంక్షలు

ముందుగా మన యువ సామ్రాట్ నాగార్జునకు జన్మదిన శుభాకాంక్షలు చెపుదాం. అంతే కాదు కింగ్ అయిన ఈ మన్మధుడు ఈ రోజు 50 వసంతాల వడిలో అడుగుపెడుతున్నందుకు అభినందిద్దాం. ఇంకా వందేళ్లు ఆయురారోగ్యాలతో, విజయాలతో ముందుకు సాగాలని ఆశిద్దాం.
యువ సామ్రాట్ నాగార్జున నటిస్తున్న కొత్త చిత్రం కింగ్. శ్రీను వైట్ల దర్శకుడు. ఎప్పటిలాగే సొంత బ్యానర్ లాంటి కామాక్షి మూవీస్ శివప్రసాద్ రెడ్డి నిర్మాత. వెరైటీని కోరుకునే నాగార్జున ఇటీవ కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుడుతూ తన అభిమానులనే కాకుండా మంచి సినిమాలను చూసే కుటుంభాలను సైతం థియేటర్లకు రప్పిస్తారని నిర్మాతలు కాస్తా అయానపై నమ్మకం పెట్టుకుంటున్నారు. అసలే చార్మిగ్.. స్టైలీష్.. హేరో అయిన నాగార్జున మన్మధుడు చిత్రంతో చేసిన అల్లరి యువత ప్రదానంగా అమ్మాయిలు ఇంకా మర్చిపోలేదు. ఆ చిత్రం ద్వారా యుక్త వయసులో ఉన్న అమ్మాయిలంతా ఇదో మన్మధుడు వంటి వరుడు కావాలని కొరుకున్నారంటే ఆ చిత్రం ఎంతగా యువ హృదయాలలో దూసుకుపోయిందో చెప్పొచ్చు. అటువంటి రొమాటిక్ లవ్ స్టోరీలను చేసి మెప్పించిన నాగార్జున అంతకు ముందే భక్తి.. ముక్తి రస ప్రదానమైన పాత్రల్లో కనిపించి అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. మన్మధుడు తర్వాత కూడా యాక్షన్, సెంటిమెంట్ చిత్ర ద్వార అందరి మన్ననలు పొందాడు. ఈ నేపధ్యంలో ఇటీవల చేసిన డాన్ చిత్రానికి భిన్నంగా అటు మాస్, ఇటు క్లాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు కొత్తగా ఇదో "కింగ్" అవతారం మొదలు పెట్టాడు. సింగ్ అంగానే నాగార్జున కొత్తగా ఏదో చేస్తున్నాడని ప్రేక్షకులు అనుకోవటం మామూలే అయితే ఇందులో ట్విస్ట్ ఏముంటుంది. కాని ఈ ట్విస్ట్ అంతా దర్శకుడైన శ్రీను వైట్లలోనే ఉండి. లవ్, మాస్, మసాల, కామెడి పంచ్ లు ఇవ్వటంలో దిట్టైన శ్రీను వైట్ల నాగార్జునతో చిత్రం చేస్తుండటమే కొత్త పంచ్. ఇటీవల విడుదలైన కింగ్ పోస్టర్లు, స్టిల్ల్స్ చూసిన వారికి నాగార్జున కొత్త లుక్ లో కనిపించటమే అసలు కారణం. కింగ్ అంటూ గన్ లు పట్టుకుంటూనే మన్మధుడిలా పోజు కొడుతుండటమే ఇందులో కొత్తదనం. ఈ స్టిల్స్ చూస్తుంటే మీరు కూడ కింగ్ అయిన నాగార్జున మన్మధుడిగా మరొ మారు దర్శన మిస్తాడని అనుకుంటారు. అయితే ఈ చిత్రంలో నాగార్జున మన్మధుడు.. లేక కింగా అన్నది మాత్రం సినిమా విదుదలయ్యకే తెలియాలి మరి..!
50 వసంతాల వడిలో అడుగు పెడుతున్న నాగార్జునకు పిరమిడ్ సాయిమిరా గ్రూప్ సంస్థలకు చేందిన హైదరాబాద్ సాయిమిరా(http://www.hyderabadsaimira.com/ ), న్యూస్ రీల్ ఇండియా( http://www.newsreelindia.in/) హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అందిస్తోంది. హ్యాపీ బర్త్ డే నాగార్జున .

Thursday, August 28, 2008

చిరంజీవి వర్సెస్ బాలకృష్ణ

ఒకరు మెగాస్టార్ గా వెలిగి తెలుగుతెరపై వెలుగువెలిగిన హీరో.. మరొకరు నటసార్వబౌముడిగా విశ్వనట చక్రవర్తి అయిన దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం ఆవిర్భవనేత ఎన్ టీఆర్ కుమారుడు, నటుడు... ఇరువురు తెలుగు సినీ కళామ తల్లికి ముద్దుబిడ్డలే. ఇద్దరూ ఉద్దండులే.. కలిసి మెలిసి తిరిగిన ఈ కళాకారులు త్వరలో కాలు దువ్వేందుకు సన్నద్దమవుతున్నారు. చిరంజీవి ఏకంగా ప్రజారాజ్యాన్ని స్థాపించగా, బాలకృష్ణ తన తండ్రి పెట్టిన తెలుగుదేశానికి కొత్త ఊపిరి పోసేందుకు సిద్దమవుతున్నారు. సినిమాల జయాపజాయాలతో పరిశ్రమ ఒడుదుడుకులను ఎదుర్కొంటున్నా మంచి ఆహ్లాద వాతావరణాన్ని అందిస్తూ ముందుకు సాగుతున్న తరుణంలో రెండు భిన్న దృవాలు రాజకీయలలో కాలు దువ్వేందుకు సిద్దమవుతుండటం సినీ వర్గాన్ని దిగ్బ్రాంతికి గురిచేస్తోంది. వీరి రాజకీయ భవిష్యత్తు ఎలా ఎదుగుతుందో తెలియదు కాని ఇద్దరు మహా కథానాయకులు రాజకీయ రంగ ప్రవేశం చేయటం వారి అభిమాన వర్గాలను ఇరుకున పెడుతోంది.
తిరుపతిలో జరిగిన మహా సభ ద్వారా చిరంజీవి రాజకీయారంగేట్రానికి తెరతీయగా, గుంటూరులో జరగనున్న టిడిపి యువ ఘర్జన సభ ద్వారా బాలకృష్ణను ప్రజారాజ్యం పార్టీకి ధీటుగా తీసుకు రావాలని కొందరు సీనియర్ నేతలు ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి చిరంజీవి ద్వారా టిడిపి ఏ మేరకు నష్టం వాటిల్లిందో అంచనా వేస్తున్న నేతలు నష్టాన్ని పూడ్చుకోవటంతో పాటు పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్ టీఆర్ కుటుంభం మొత్తం తమతో ఉందని నిరూపించుకొని తద్వారా వచ్చే ఎన్నికల్లో లాభ పడాలని యోచిస్తున్నారు.
సొంత పార్టీ ఏర్పాటు ద్వారా రానున్న ఎన్నికల్లో విజయదుంధుభి మోగించి మరో మారు రాష్ట్రంలో కొత్త రాజకీయాలను వెలుగు చూపించాలని చిరంజీవి బావిస్తున్నారు. ఇందులో భాగంగానే తనకున్న ప్రజా భలం ఏపాటిదో పరీక్షించేందుకు తిరుపతి సభను ఉపయోగించుకున్నట్లు తెలిసింది. అంతే కాకుండా ఎన్ టీఆర్ దారిలోనే తమ పార్టీ మనుగడను కొనసాగించేలా అట్టడుగు వర్గాల బాట పట్టినట్లు చిరు రాజకీయారంగేట్ర సభ నిరూపించినట్లు విశ్లేషకులు సైతం అంటున్నారు. తద్వారా చిరంజీవి ప్రజల నాడిని పట్టుకునేందుకు అధిక ప్రాదాన్యతిస్తూ రాష్ట్ర పర్యటన చేయాలని యోచిస్తున్నారు. అంతే కాకుండా తన పార్టీని బలోపేతం చేసుకునేందుకు వివిద పార్టీల్లోని సీనియర్లను తమ ప్రజారాజ్యంలో చేరాలని స్వాగతిస్తున్నారు. ఇప్పటికే వేర్వేరు పార్టీలకు చేందిన పలువురు సీనియర్లతో రహస్య సమావేశాలు నిర్వహించిన చిరంజీవి సమయానుకూలంగా వారిని పార్టిలో చేర్చుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది.
ఎన్ టీఆర్ స్థాపించిన తెలుగుదేశంలో ఆయన కుటుంభీకుల పాత్ర తక్కువేనని చెప్పొచ్చు. బాలకృష్ణ సోదరుడైన హరికృష్ణ ఒక్కరే తెలుగుదేశంలో కీలక భూమికను పోషిస్తుండగా వీరి సోదరి పురందరేశ్వరి మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. ఇక బాలకృష్ణ కూడ ఓమారు ఎన్నికల ప్రచారం చేసినా వేదికలెక్కిన సందర్బం లేదు. ఈ నేపధ్యంలో చిరంజీవి పార్టీ, అధికార కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి తెలుగుదేశానికి పూర్వ వైభవాన్ని తెప్పించాలన్నది చంద్రబాబు ప్రయత్నం. అందుకు ఎన్ టీఆర్ కుంటుంభాన్ని తెరపైకి తీసుకు రావటమే సరైన నిర్ణయంగా తెలుగుదేశం భావిస్తోంది. మరో వైపు కుటుంభాలపరంగా మనస్పర్థలున్నా అన్నింటిని మరచి నందమూరి వంశస్తులనందరినీ ఒకే తాటిపై తెచ్చె ప్రయత్నాలు కొంతకాలంగా జరిగాయి. ఏదయితేనేం రాజకీయంగా తమ తండ్రి స్థాపించిన తెలుగుదేశానికి పూర్వ వైభవాన్ని తీసుకురావాలనే పట్టుదల నందమూరి వంశంలో వచ్చింది. ఇందులో భాగంగానే బాలకృష్ణ, జూనియర్ ఎన్ టీఆర్, కల్యాణ్ రాంతో పాటు నందమూరి కుటుంభాన్ని గుంటూరు వేధికపైకి తీసుకురావాలని తెలుగుదేశాన్ ప్రయత్నిస్తోం.
నందమూరి వంశీయులు గుంటూరు వేధిక ఎక్కితే వచ్చే ఎన్నికల్లో జరిగే రాజకీయ పోరు చిరంజీవి ప్రజారాజ్యం, బాలకృష్ణ తెలుగుదేశం నడుమే దిగ్గజాలు డీ కొట్టినట్లుగా ఉంటుందని విశ్లేషకుల భావిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ కూడా ఈ రెండు పార్టీల వ్యవహారాన్ని సునిశితంగా పరిశీలిస్తూనే తమ వైపు నుంచి కూడా సినీ తారలను రంగంలోకి దింపేందుకు సన్నాహాలు చేస్తోంది. దీని ద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికల చిత్రం మహా సంగ్రామాన్నే సృష్టిచే అవకాశాలకు తెరతీస్తోంది. 1983 తర్వాత త్వరలో జరగనున్న ఎన్నికలు మరో మారు ఆంధ్రరాష్ట్ర రాజకీయలకు కేంద్ర భిందువు కానుంది. ఇక తారల పోరా... రాజకీయ హోరా అన్నది రానున్న ఎన్నికల ద్వారా నిర్ణయించుకోవాల్సింది ప్రజలే.

Friday, August 22, 2008

జై చిరంజీవ

రాజకీయారంగేట్రం చేస్తున్న పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదినం నేడు. ఈ సందర్బంగానే 30 ఏళ్ల తెలుగు సినీ కళామతల్లి ఒడిలోంచి రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్న మెగాస్టార్ కు అశేష ఆంద్ర ప్రజానికం అభినందనలు తెలిపింది. శుక్రవారం తెల్లవారుజాము నుంచే వద్దని వారించినా వేలాదిమంది అభిమానులు చిరంజీవి గృహం ముందు పడిగాపులు కాస్తూ తమ అభిమాన నాయకుడికి శుభాకాంక్షలు తెలిపారు. మన ఊరి పాండవులు చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేసిన చిరంజీవిక్ గడిచిన 30 ఏళ్ల జీవితంలో 148 చిత్రాల్లో నటించి అఖిలాంధ్ర ప్రేక్షకాభిమానుల అభినందనలు గౌరవాన్ని అందుకున్నారు. మూడు సార్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ నటుడికి అందించే నంది అవార్డును అందుకున్నారు. భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక పద్మభూషణ్ గౌరవాన్ని పొందిన చిరంజీవి బ్లడ్ బ్యంక్, ఐ బ్యాంక్ ద్వారా స్వచ్చమద సేవకు శ్రీకారం చుట్టి బడుగు వర్గాలకు దగ్గరయ్యారు. తానను కదిలించిన రెండు సంఘటనలతో రాజకీయారంగేట్రానికి తెరతీసిన చిరంజీవి 26న తిరుపతిలో జరిగే బహిరంగ సభ ద్వారా పార్టీ పేరును, పతాకాన్ని, విధివిదానాలను ప్రకటించనున్నారు. ఈ నేపధ్యంలో జన్మదినాన్ని జరుపుకుంటున్న మెగాస్టార్ కు సన్నిహితులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, రాజకీయ, పారిశ్రామిక, సినీరంగ ప్రముఖులు అభినందనలు తెలిపారు.
ముందస్తుగా ప్రకటించినట్లుగానే చిరంజీవి తన పుట్టిన రోజున తన తల్లితోనే గడిపారు. ఉదయానే తన తల్లి అంజనదేవి పాదాలకు నమస్కరించి అశిర్వాదం అందుకున్న చిరు ముందుగా కుటుంభ సభ్యుల శుభాకాంక్షలు అందుకున్నారు. అనంతరం తన కోసం వచ్చిన అభిమానుల నుంచి అభినందనలు అందుకున్నారు.

చిరు జన్మదినాన్ని పురష్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా ముస్లిం సోదరులు మసీదుల్లో నమాజులు, క్రిష్టియన్ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఇందులో కొందరు అభిమానులు చిరును నేరుగా కలిసి అభినందనలు తెలుపగా మరికొందరు పొన్ల ద్వారా అభినందనలు తెలిపారు. దీనితోడు చిరు జన్మదినాన్ని పురస్కరించుకొని వివిద ప్రాంతాల్లోని వేలాది మంది అభిమానులు పేదలకు అన్నదానం, విద్యార్ధులకు పుస్తకాలు, రక్తదాన శిభిరాలు నిర్వహించారు. అదేవిదంగా చిరు పిలుపు మేరకు ఆయన అభిమానులు మొక్కలు నాటి స్వీట్స్ పంచారు.

ఇదిలా ఉండగా విశాకపట్నమ జిల్లా చోడవర్మ్ కు చెందిన గోతిరెడ్డి రాంబాబు అనే అభిమాన దంపతులు చిరంజీవి రాజకీయ భవిష్యత్తు దిగ్విజయంగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ కాంచిపురంలోని కామాక్షి ఆలయంలో శతచండి యాగం నిర్వహించారు. ఈ యాగానికి నటరాజ శాస్త్రీ గురుకుల్ నేతృత్వం వహించారు. ఈ సందర్బంగా చిరంజీవి కుటుంభికుల పేరున మహా సంకల్పం నిర్వహించారు. ఇందులో 30 మంది వేద పండితులు పాల్గొన్నారు. యాగం కోసం ప్రత్యేకంగా సిద్దం చేసిన కూర్మాసనానికి నటరాజ శాస్త్రీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కూర్మాసనంపై కూర్చుని యాగం చేస్తే రాజ్యాధికార్మ్ చేపట్ట వచ్చని అనాధిగ వస్తున్న నమ్మకమని నటరాజ శాస్త్రీ తెలిపారు. ఇదిలా ఉండగా చిరంజీవికి కంచి స్వాములైన జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతి జన్మదిన అభినందనలు తెలిపారు. చిరంజీవికి అంతా శుభమే జరుగుతుందని ఆశీర్వదించారు.

ఎన్నో విజయాలతో ముందుకు వెళుతూ జన్మదినాన్ని జరుపుకుంటున్న మెగాస్టార్ చిరంజీవికి పిరమిడ్ సాయిమిరా గ్రూప్స్ కు చెందిన హైదరాబాద్ సాయిమిరా ( http://www.hyderabadsaimira.com/ )మరియు న్యూస్ రీల్ ఇండియా ( http://www.newsreelindia.in/)హృదయ పూర్వక శుభాకాంక్షలు చెపుతోంది.

Thursday, August 21, 2008

అచ్చతెలుగు ఆవకాయ బిర్యానీ


ఆవకాయకు, బిర్యానికి అసలు సంబందమేలేదు. కాని మేం అవకాయ బిర్యాని అనేశా. దీనికి తోడు అచ్చ తెలుగు కలిపాం. అవకాయ అంటేనే తెలుగు వారి నోరూరించే పచ్చడని ప్రపంచం మొత్తం తెలుసు. దీనికి అచ్చతెలుగు అని అనడమేంటీ ? అనేగా మీ ప్రశ్న. అక్కడికే వస్తున్నాం. శేఖర్ కమ్ముల అదేనండి ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్ వంటి స్వచ్చమైన తెలుగు సినిమాలను తీశాడే అయనే. ఆయన నిర్మాతగా తన శిష్యుడైన అనీష్ దర్శకత్వంలో ఆవకాయ బిర్యాని అనే సినిమాను తీస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయినట్లే. ఈ చిత్రంలో అంతా కొత్త నటులే. అయితే ప్రధాన నటి పాత్రకు ఇటీవల కాలంలో వెలుగు చూస్తున్న పరభాషా భామలను కాకుండా అచ్చ తెలుగు అమ్మాయైన బిందును శేఖర్ పరిచయం చేస్తుండటమే ఈ అచ్చతెలుగు ఆవకాయకు పూర్తి అర్థం.

తెలుగుదనపు తియ్యదనాన్ని తన సినిమాల ద్వారా చూపించే శేఖర్ నిర్మాతగా కూడా తన ఆవకాయ బిర్యాని చిత్రంలో తెలుగు అమ్మాయినే పరిచయం పరిశ్రమలోని పెద్దల అభినందనలు అందుకుంటుంది. ఇదిలా వుండగా ఇటీవల కాలంలో పరభాషా నటీమణులకు నిర్మాత, దర్శకులు పెద్దపెట వేస్తుండగా తిరుపతికి చెందిన బిందు అవకాయ బిర్యాని లో ఎంపిక కావటం తెలుగు సినీ పరిశ్రమలో శుభపరిణామంగా చెప్పొచ్చు.


బిందును శేఖర్ టలెంట్ సెర్చ్ లో చూసి తన సినిమాలో అవకాశం ఇచ్చారు. శేఖర్ సినిమాలలో హీరోయిన్ గా పరిచయమయ్యే నటులకు ఒక్కసారిగా పరిశ్రమలో గుర్తిపు లభించటం జరుగుతూ వచ్చింది. ఈ వరుసలో అనంద్ ద్వారా రాజా, కమలిని ముఖర్జీ, హ్యాపీడేస్ ద్వారా తమన్నతోపాటు యువ తారలు బిజీగా పలు చిత్రాల్లో నటిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక ఇప్పుడు అచ్చ తెలుగు బిందు సినీ అవకాశాల అహ్వానంలో ముందుకు సాగుతుంది. ఎలాగైతేనెం శేఖర్ కమ్ముల ద్వారా ఓ అచ్చ తెలుగు అమ్మాయి తెలుగు పరిశ్రమ దొరకటం నిజంగా శుభ పరిణామమే.


Wednesday, August 20, 2008

కమల్ తో పిరమిడ్ సాయిమిరా 'మర్మయోగి '

పద్మశ్రీ కమల్ హాసన్ ప్రతిష్టాత్మక చిత్రమైన మర్మయోగి పలు భాషల్లో నిర్మించేందుకు అంతర్జాతీయ ఎంటర్ టైన్మెంట్ సంస్థ పిరమిడ్ సాయిమిరా ముందుకు వచ్చింది. ఇందుకు సంభందించిన ఒప్పందాన్ని పిరమిడ్ సాయిమిరా సంస్థ కమల్ హాసన్ తో కుదుర్చుకుంది. తదనుగునంగా పిరమిడ్ సాయిమిరా, రాజ్ కమల్ పిల్మ్ ఇంటర్ నేషనల్ సం యుక్తంగా మర్మయోగిని నిర్మించనున్నయని పిరమిడ్ సంస్థల చైర్మన్ పి ఎస్ స్వామినాధన్ ప్రకటించారు.

ప్రతిష్టాత్మక మర్మయోగి చిత్రం గురించిన ఊహాగానాలు గత ఐదేళ్ళుగా తమిళ సినీ పరిశ్రమలో వినిపిస్తూనే ఉన్నాయి. అయితే హాలివుడ్ స్థాయిలో భారి బడ్జెట్ గా ఈ చిత్రం నిర్మించటానికి సుమారు 100 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని అంచనా కావటంతో దీనిని నిర్మించేందుకు ఏ నిర్మాత సాహసించలేదు. దీంతో ఈ ప్రాజెక్ట్ వాయిదా పడుతూ వచ్చింది. ఈ నేపద్యంలో కమల్ తన తదుపరి చిత్రంగా మర్మయోగి తెరకెక్కించనున్నట్లు వెల్లడించారు. దీంతో మళ్ళీ ఈ చిత్రంపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఇదిలా ఉండగా ఈ భారీ ప్రాజెక్ట్ ను ఎవరు నిర్మించనున్నారనే చర్చ తిరిగి మొదలయింది.

ఈ నేపద్యంలో మర్మయోగిని ప్రముఖ ఎంటర్ టైన్మెంట్ సంస్థ పిరమిడ్ నిర్మించనున్నట్లు వార్తలు వెలువడ్డాయి। ఇదిలా ఉండగా కొద్దిరోజులకే ఈ చిత్రాన్ని పిరమిడ్ సాయిమిరా నిర్మించటం లేదని వదంతులు వ్యాపించాయి। దీంతో ఈ చిత్రంపై ఉన్న ఊహగానాలకు తెరతీస్తూ పిరమిడ్ సంస్థల చైర్మన్ స్వామినాధన్, నటుడు కమల్ హాసన్ ఒకేసారి ప్రకటన వెలువరిచారు. వీరి ప్రకటనల మేరకు మర్మయోగి చిత్రాన్ని పిరమిడ్ సాయిమిరా, రాజ్ కమల్ పిల్మ్ ఇంటర్ నేషనల్ సమ్యుక్తంగా భారి స్థాయిలో రూపొందించేందుకు సిద్దమవుతున్నాయి. ఈ విషయమై స్వామినాధన్ మాట్లాడుతూ మర్మయో చిత్రపై పూర్తి స్థాయి పరిశోదన జరిగాకే తమ సంస్థ దీనిని నిర్మించేందుకు ముందుకు వచ్చిందని తెలిపారు. కథకు తగ్గట్లుగానే భారి బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ఒప్పందం కుదుర్చుకోవటం జరిగిందని చెప్పారు.

మర్మయోగి గురించి...

త్రిభాషా చిత్రంగా తెరకెక్కనున్న ఈ మర్మయోగి తెలుగు, తమిళ్, హింది భాషాల్లో రూపొందనుంది. అదేసమయంలో ఇంగ్లీష్ లో కూడా రూపొందనుంది. అంతర్జాతీయ తారాగణంతోపాటు భారి బడ్జెట్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. కమల్ హాసన్ సొంత కథతో అయన దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో కమల్ ప్రధాన కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పిరమిడ్ సాయిమిర, రాజ్ కమల్ ఇంటర్ నేషనల్ సం యుక్తంగా నిర్మించనున్నాయి.

తెలుగు సినిమా అణిముత్యాలు: ''శ్రీ రామదాసు ''

తెలుగు సినీ చరిత్రలో అణిముత్యాలుగా కోట్లాది ప్రజల అదరాభిమానాలు పొందిన చిత్రాల్లో 2006 మార్చి 30న ఆంద్రదేశంలో విడుదలైన శ్రీ రామదాసు ఒకటిగా మన్ననలు పొందింది. భక్తిని, ముక్తిని ప్రసాదించే దైవమైన శ్రీరామచంద్రమూర్తి కథనంతో తెరకెక్కిన ఈ చారిత్రత్మక చిత్రం తెలుగు ప్రేక్షకుల మదిలో చిరస్మరణీయ మధురానుభూతిని నింపింది. కే.రాఘవేంద్రరావు నిర్దేశకత్వంలో తెరకెక్కిన ఈ చిత్ర రాజంలో అక్కినేని నాగార్జున, స్నేహా ముఖ్య భూకలు పొషించారు. ప్రధన పాత్రలను అక్కినేని నాగేశ్వరరావు, నాజర్, నాగేంద్రబాబు, శరత్ బాబు పోషించారు. ఎం ఎం కీరవాణి అందించిన సంగీతం, ఎస్ గోపల్ రెడ్డి చాయాగ్రహణం, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, రాఘవేంద్రరావు దర్శకత్వం, దైవాంశ సంభూతుడైన శ్రీరామచంద్రుడి కథ ఈ చిత్రం బాక్స్ ఆపీస్ హిట్ గా నిలబెట్టింది.



పాటలు [వీడియో]










Monday, August 18, 2008

చిరంజీవి మహానాడుకు విజ్ క్రాఫ్ ట్ హంగామా


మరో చరిత్రను సృష్టించేందుకు చిరంజీవి చేస్తున్న పార్టీ ఆరంగేట్రానికి తిరుపతి సన్నద్దమవుతోంది. ఈ నెల 26న తిరుపతిలో జరిగే బహిరంగ సభ ద్వారా పార్టీ పేరును, కార్యాచరనను వెళ్ళడించనున్నట్లు చిరంజీవి ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు అంతర్జాతీయ ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థగా గుర్తిపుపొందిన విజ్ క్రాఫ్ట్ సర్వం సిద్దం చేస్తోంది. బాలీవుడ్ సినిమాలు, ప్యాషన్ షోలకు ఇప్పటి వరకు తమ సహకారాన్ని అందించిన విజ్ క్రప్ట్ మొట్టమొదటి సారిగా ఓ రాజకేయ పార్టీ ఆవిర్భావానికి పనిచేస్తూ కొత్త ఒరవడి సృష్టించబోతోంది. ఇందుకుగాను చిరంజీవితో బారి ఒప్పందాన్నే కుదుర్చుకున్న విజ్ క్రాప్ట్ ఏర్పాట్లలో నిమగ్నమైంది.
ఒప్పందంలో భాగంగానే విజ్ క్రాఫ్ట్ తిరుపతిలోని రాజీవ్ గాంధి మైదానాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతుంది. భారి వేదికతోపాటు మైదానం మొత్తం వెదిక కనిపించే విధంగా ప్రత్యేక తరహా ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఈ మైదానంలో ఏడు లక్షల మంది పడతారు. కాని సభకు సుమారు 10 లక్షల మందికి పైగా అభిమానులు హాజరయ్యే అవకాశం ఉందని అల్లు అరవింద్ ప్రకటించటంతో వచ్చిన వారంతా సభని స్పష్టంగా చూసే విధంగా విజ్ క్రాఫ్ట్ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకుగాను మైదానం మొత్తం 20 భారి స్క్రీన్లను ఏర్పాటు చేసి వాటి ద్వారా సభను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
అంతేకాకుండా సభ 26 సాయంత్రం 5.30 గంటల నుండి రాత్రి 9.30 వరకు అంటే సుమారు ఐదు గంటలపాటు జరగనుండటంతో ఈ సమ్యంలో మైదానానికి వచ్చే అభిమానులకు ఎటువంటి అసౌకర్యం ఏర్పడకుండా గట్టి భధ్రత సౌకర్యాలను ఏర్పాటుచేస్తోంది. దీనికితోడు జాతీయస్థాయిలో రానున్న మీడియా వారికి ప్రత్యేకంగా 300 గదులను సిద్దం చేసింది. అదేవిధంగా చిరంజీవికి సన్నిహితులైన వారితోపాటు ముక్య ప్రముఖులకు తిరుపతి, నాయుడుపేత, గూడూరు, సూళ్ళూరుపేట, చిత్తూరు పరిసర ప్రాంతాలలోని 70 అత్యదునిక వసతులతో కూడిన కళ్యాణ మండపాలను సిద్దం చేస్తోంది. సభ వద్దకు వచ్చే లక్షలాధి అభిమానుల వహానాలతో ట్రాపిక్ అంతరాయం కలుగకుండా తిరుపతి శివారుల్లోనే వాహనాల పార్కింగును ఏర్పాటు చేస్తోంది.
ఈ బహిరంగ సభ ద్వారా చిరంజీవి తన పార్టీ అవిర్బావాన్ని చరిత్ర సృష్టించే విధంగా వెలుగు చూపించాలని ప్రయత్నిస్తుండగా ఈ బారి కార్యక్రమం ద్వారానే తమ ఇమేజ్ ను రాజకీయ కార్యక్రమాలకు విస్తరించాలని విజ్ క్రాప్ట్ గట్టి పట్టుదలతో తిరుపతి చిరు సభను విజయవంతం చేసేందుకు తీవ్రంగా కష్టపడుతోంది. ఇదిలా ఉండగా ఓ రాజకీయ పార్టీ ఆవిర్బావానికి సినిమా కర్యక్రమాలను నిర్వహించే సంస్థను రంగంలోకి దింపటం ద్వారా చిరు మరో కొత్తకోణానికి తెరతీస్తూ చరిత్ర సృష్టించబోతున్నారు

Tuesday, August 12, 2008

ఒలంపిక్ లో భారత్ 'బంగారం' అబినవ్ బింద్రా

భారత క్రీడ చరిత్రలో ఆగస్టు 11 సువర్ణాక్షరాలతో లిఖించబడింది. దేశ క్రీడాకారులంతా సగర్వంగా తలెత్తుకునె సంఘటన వెలిగిచూసింది. బీజింగ్ లో జరుగుతున్న విశ్వా క్రీడా సంబరంలో పసిడి పతకాన్ని అందించి 112 ఏళ్ళ ఒలంపిక్ చరిత్రలో భారత్ పేరును ప్రపంచం నలుమూలలా ఇనుమడింప చేసిన ఘనతను 25 ఏళ్ళ షూటర్ అబినవ్ బింద్రా దక్కించారు. బీజింగ్ లో జరుగుతున్న ఒలంపిక్ క్రీడల్లో భాగంగా భారత షూటర్ అభినవ్ బింద్రా పురుషుల వ్యక్తిగత 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో చైనాకు చెందిన హాట్ పేవరేట్ జుక్వినాన్ ను మట్టి కరిపించారు. మొత్తం 700.5 పాయింట్ల స్కోర్ తో ఒలంపిక్ లో వ్యక్తిగత స్వర్ణాన్ని చేజిక్కించుకొని దేశ ప్రతిష్టను ప్రపంచం నలుమూలల వ్యాపింపజేశారు. బింద్రా కు దేశం మొత్తం అభినందన వర్షం కురిపించింది. బింద్రా సొంత రాష్ట్రమైన పంజాబ్ ప్రభుత్వం కోటి రూపాయిల నజరాన ప్రకటించగా దేశంలోని పలు రాష్ట్రాలు తమ వంతుగా లక్షల రూపాయిల నజరానాలు ప్రకటించాయి. రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ మొదలు ప్రదాని, వివిద రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, పార్టీల ప్రముఖులు, క్రీడాకారులు అభినందనలు అందించారు.
అభినవ్ బింద్రా గురించి క్లుప్తంగా...
పేరు : అభినవ్ బింద్రా
జననం : 28 సెప్టెంబర్ ౧౯౮౩
తల్లిదండ్రులు : బబ్లి బింద్రా, ఏఎస్ బింద్రా
ప్రాంతం : చండీగడ్
చదువు : ఎంబీఏ
ఉద్యోగం : సీఈవో, అబినవ్ ప్యూచరిస్టిక్
రికార్డు : 1998 కామన్ వెల్త్ గేంస్ లో పాల్గొన్న అతిచిన్న వయస్సు షూటర్
పతకాలు : 2001 మ్యూనిచ్ వరల్డ్ కప్ కాంస్యం, 2002 మాంచెస్టర్ (ఇంగ్ళాండ్) కామన్ వెల్త్ గేంస్ లో స్వ్ర్ణం (పెయిర్స్ విభాగం), రజతం (వ్యక్తిగత విభాగం), 2001 ఆయా వేదికల్లో జరిగిన ఈవెంట్లలో ఆరు స్వ్ర్ణాలు, 2006 జాగ్రెబ్ (క్రోయేషియా) వరల్డ్ చాంపియన్ షిప్
అవర్డులు : 2001లో అర్జున అవార్డ్, 2001-02లో రాజీవ్ గాంధి ఖేల్ రత్న అవార్డ్

జూబ్లీహిల్స్ లో చిరంజీవి రాజకీయ కార్యాలయం

సినినటుడు చిరంజీవి రాజకీయ ఆరంగేట్రానికి సమయం దగ్గర పడుతుండటంతో ఇందుకు సంభంధించిన పనులన్నీ శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే చిరంజీవి రాజకీయ కార్యాలయం జూబ్లీహిల్స్ లోని రోడ్ నంబర్ 46 లో సర్వాంగ సుందరంగా సిద్దమైంది. ప్రిప్యాబ్ టెక్నాలజీతో కేవలం 45 రోజుల్లో తయారైన అధినేత కార్యాలంలో అన్ని సౌకర్యాలు అమరాయి. ఆదివారం (ఆగస్టు 10)అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ కార్యాలయ ప్రారంభంలో చిరంజీవి, అల్లు అరవింద్, డాక్టర్ మిత్రా, నాగబాబు, పవన్ కళ్యాన్, రాం చరణ్, అల్లు అర్జున్, కేఎసార్ మూర్తి, కోటగిరి విద్యాధరరావు, చేగొండి హైరామజోగయ్య తదితరులు పాల్గొన్నారు. దీంతో చిరంజీవి పార్టీ కార్యకలాపాలు అధికారికంగా మొదలైనట్లైంది. 1300 చదరపు గజాల విస్తీర్ణంలో 6,500 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాతో ఒకే అంతస్థుగా ఇది ఏర్పాటైంది. ఇందులో చిరంజీవికి ప్రత్యేక కార్యాలయంతో పాటు అగ్ర నేతలు (కొర్ కమిటీ)లకు ప్రత్యేక క్యాబిన్లు ఉన్నాయి.
ప్రతి గదిలోను క్లోజ్డ్ సర్కూట్ కెమెరాలు అమర్చి వీటిని చిరంజీవి గదికి అనుసంధానం చేశారు. ఈ కార్యాలం ప్రవేశం నుంచి ప్రతి గదిలోనూ ఏం జరుగుతుందో తెలుసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. అతిధులకు రెండు, సమావేశానికి మరొకటి, పాత్రికేయులతో మాట్లాడేందుకు 80 సీట్ల కెపాసిటి కలిగిన ప్రత్యేక గది ఉన్నాయి. ఇందులో ఎలక్ట్రానిక్ మీడియా కొసం ప్రత్యేక సౌకర్యాలు ఉన్నాయి. అదేవిధంగా రికార్డుల కోసం ఒకటీ, సిబ్బందికి మరొక గది ఇందులో కొలువు తీరాయి. అన్ని గదులు ఏసీతో పాటు, రికార్డు, సిబ్బంది గదుల్లోని కంప్యూటర్లకు చిరు గదికి అనుసంధానించటం జరిగింది. ప్రతి గదిలోను మహాత్మ గాంధి, మదర్ థెరిస్సా, అబ్దుల్ కలాం సూక్తులు వారి పొటోలు ఉన్నాయి. ఇక ఈ కార్యాలయం లోనికి ప్రవేశించగానే రిసెప్షన్ పై భాగంలో రెండు చేతులతో నమస్కరించే చిరు పోటో స్వాగతిస్తున్నట్లు ఉంది. ఈ కార్యాలయమంతా హైటెక్ తరహాలో ఉండగా వాహనాల పార్కింగ్ మాత్రం కొద్దిగానే ఉంది.






Monday, August 11, 2008

మెగాస్టార్ చిరంజీవి (బయోగ్రఫీ)

మెగాస్టార్ గా తెలుగునాట సుపరిచితమైన చిరంజీవి 1955 ఆగష్టు 22న పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోని మిషనరి హాస్పిటల్ లో జన్మించారు. చిరంజీవి అసలు పేరు కొణిదల శివశంకర వర ప్రసాద్. చిరంజీవికి ఇద్దరు తమ్ముళ్ళు, ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. అయన తండ్రి వెంకట్రావు, తల్లి అంజనాదేవి. తండ్రి ఉద్యోగరీత్యా చిరంజీవి చిన్నవయసంతా తాతగారి ఊరైన మొగల్తూరు లోనే గడిపారు.
చదువు
చిరంజీవి విద్యాబ్యాసం ఒక్క చోటంటూ సాగలేదు. తండ్రి ఉద్యోగరీత్యా పలు చొట్లకు బదిలి కావల్సి వచ్చింది. అయన విద్యాబ్యాసం మొదట నిడదవోలులో ప్రారంభమైంది. అనంతరం గురజాల, పొన్నూరు, మంగళగిరి, మొగల్తూరు అంటూ సాగింది. చిన్న వయస్సు నుంచే చిరంజీవికి ఉన్న సినిమా ఆసక్తి పాఠశాల విద్యాబ్యాసంలోనే స్టేజ్ డ్రామాల్లో నటించేందుకు దారితీసింది. ఆయన హైస్కూలు చదివెటప్పుడు మొదటిసారిగా నటించిన పరంధామయ్య పంతులు డ్రామాకుగాను మొదటి బహుమతి అందుకున్నారు. అనంతరం బైపీసీకి గాను ఒంగోలు లోని పీఆర్ శర్మ జూనియర్ కళాశాలలో చేరారు. తదనంతరం నర్సాపూర్ కళాశాలలో బీకాం ముగించారు.
నటనాసక్తి... సినిమాలు
చిరంజీవికి సినిమాల్లో నటించాలన్నది చిన్న వయస్సులోనే ఆయన మనసులో నాటుకున్న కల. అందుకే స్కూల్ వయసు నుంచే డ్రామాల్లో నటిస్తూ తన నటనాసక్తికి తీర్చుకున్నారు. ఒకవైపు చదువుతున్నా సినిమాల్లో నటించాలన్న ఆసక్తిని వదులుకోలేదు. అందుకే తన డిగ్రీ ముగించగానే 1977లో మద్రాస్ వెళ్ళి ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో చేరారు. అదే సమయంలో రాజ్ కుమార్ దర్శకత్వంలో షేక్ అబ్దుల్ ఖాదర్ రూపొందిస్తున్న పునాదిరాళ్ళు చిత్రంలో నటించే అవకాశం కలిగింది. ఈ చిత్రంలో నటించేటప్పుడే శివశంకర వరప్రసాద్ చిరంజీవిగా మారారు. పునాదిరాళ్ళు చిరు మొదటి చిత్రమే అయినా ముందుగా 1978 సెప్టెంబర్ 22న విడుదలైంది మాత్రం ప్రాణంఖరీదు. దీనికి కె.వాసు దర్శకుడు. తదనంతరం విడుదలైన రెండవ చిత్రం మన ఊరి పాండవులు. ఈ చిత్రం చిరుకు హీరోగా గుర్తింపు లభింది.
విలన్ గా
ఆరంభ కాలంలో నటుడిగా గుర్తింపు పొందేందుకు విలన్ పాత్రల్లో సైతం పలు చిత్రాల్లో నటించారు. విలన్ గా నటించిన చిత్రాల్లో కుక్కకాటుకు చెప్పుదెబ్బ, కోతల రాయుడు తదితర చిత్రాలు ఉన్నాయి.
వివాహం.. పిల్లలు
అప్పటికే ప్రముఖ హాస్య నటుడిగా ఉన్న అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖతో 1980 పిబ్రవరి 20న చిరుకు వివాహమైంది. వీరికి రాం చరణ్ తేజ, సుస్మిత, శ్రీజ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు.
మొదటి విజయాలు
ఆరంభంలో కోతలరాయుడు, పున్నమినాగు, మొగుడుకావాలి, కిరాయిరౌడీలు, శుభలేఖ, మగమహరాజు, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, అభిలాష, మంత్రిగారి వియ్యంకుడు తదితర చిత్రాలు విజయం సాధించటం చిరంజీవి పరిశ్రమలొ నిలదొక్కుకునేందుకు దారితీసింది.
మలుపు
ప్రదమార్థమైన 1983లో విడుదలైన ఖైదీ చిరంజీవి కెరీర్ ను మలుపు తిప్పింది. కమర్షియల్ గా మెగా హిట్ తోపాటు చిరుకు ప్రత్యేక గుర్తింపునిచ్చింది. ఈ ద్వారా చిరంజీవిలోని నటుడు, డ్యాన్సర్ తెలుగు పరిశ్రమకు దక్కాడు. అనంతరం గూండా, దొంగ, నాగు, అడవిదొంగ, యమకింకరుడు, రుస్తుం ద్వారా చిరు యాక్షన్ హీరో అయ్యారు.
మెగా విజయాలు
ద్వితీయార్థంలో విజేత, మగధీరుడు, కొండవీటిరాజా, చంటబ్బాయ్, చాలెంజ్, రాక్షసుడు, దొంగమొగుడు వంటి చిత్రాల విజయాలు నటుడిగా అన్ని వర్గాల వారి నుంచి చిరుకు లభించాయి. 1987లో విడుదలైన పసివాడి ప్రాణం ద్వారా బారతీయ సినిమాలకు చిరు బ్రేక్ డ్యాన్స్ చూపించారు. అదే సమయంలో విడుదలైన స్వయంకృషి చిరుకు ఉత్తమ నటుడిగా నంది అవార్డ్ ను అందించింది.
చిరు ఓ ప్రభంజనం
పసివాడి ప్రాణం అనంతరం వచ్చిన యముడికిమొగుడు, అత్తకి యముడు అమ్మాయికి మొగుడు చిరును మెగా స్టార్ గా నిలిపాయి. నిర్మాత కే ఎస్ రామారావ్ తన మరణమృదంగం చిత్రం ద్వారా చిరును మెగాస్టార్ గా సంబొధించటం ఆయన మెగా నటుడిగా రూపాంతరం చెందేలా చేసింది. తదనంతరం చిరు నిర్మాతల పాలిట హాట్ కేక్ కాగా అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఈ సమయంలోనే చిరు నిర్మాతగా తీసిన రుద్రవీణ నర్గీస్ దత్ అవార్డును సొంతం చేసుకుని జాతీయంగా ఆయనకు పేరు ప్రఖ్యాతులను సాధించి పెట్టింది.
జాతీయంగా
1990 కాలంలో విడుదైల గ్యాంగ్ లీడర్, రౌడీల్లుడు, జగదేకవీరుడు అతిలోక సుందరి, ఘరానమొగుడు వంటి చిత్రాలు చిరును జాతీయ హీరోను చేశాయి. ఈ సమయంలోనే చిరు హిందీలో నటించిన ప్రతిభంధ్, ఆజ్ కా గూండారాజ్, ది జంటిల్ మెన్ చిత్రాలు బాక్స్ ఆపీస్ రికార్డ్ సృష్టించి ఆయన్ను జాతీయ నటుడిగా నిలబెట్టాయి.
'చిరు ' చిరు విశేషాలు
అసలు పేరు : కొణిదల శివశంకర వరాప్రసాద్
సినిమా పేరు : చిరంజీవి
జన్మస్థలం : మిషనరి హాస్పిటల్, నర్సాపూర్
తల్లిదండ్రులు : అంజనాదేవి, వెంకట్రావు
సోదరులు : నాగేంద్రబాబు, పవన్ కళ్యాన్
సోదరిణులు : విజయదుర్గ, మాదవి
బావలు : పంజా ప్రసాద్,సోమరాజు,అల్లు అరవింద్
విద్యాభ్యాసం : నిడదవోలు, గుజరాల, మొగల్తూరు, బాపట్ల, ఒంగోలు, నర్సాపూర్
పిల్మ్ ఇన్సిస్టూట్ : 1977
మొదటి చిత్రం, అవకాశం : పునాదిరాళ్ళు
వివాహం : ఉదయం 11.50, పిబ్రవరి 20, 1980
భార్య పేరు : సురేఖ
కుమారుడు : రాంచరణ్ తేజ
కుమార్తెలు : సుస్మితవందన, శ్రీజ
అత్తామామలు : అల్లు కనకరత్నం, రామలింగయ్య
ఇష్టదైవం : ఆంజనేయుడు
మొదటి 100 రోజుల చిత్రం :మన ఊరి పాండవులు
పౌరాణిక పాత్రలు
యమదర్మరాజు (చట్టంతో పొరాటం)
విశ్వామిత్ర, కౌసికుడు (ఖైదీ)
సత్యహరిచంద్ర (మగదీరుడు)
అర్జునుడు (స్టేట్ రౌడి)
ఆంజనేయుడు (జగదేకవీరుడు అతిలోకసుందరి)
పార్వతి పరమేశుడు (ఆపత్బాందవుడు)
నవలాధార సినిమాలు
చంటబ్బాయ్ (మల్లాది)
అభిలాష (యండమూరి)
చాలెంజ్ (యండమూరి)
రాక్షసుడు (యండమూరి)
రక్తసిందూరం (యండమూరి)
మరణమృదంగం (యండమూరి)రుద్రనేత్ర (యండమూరి)
దొంగమొగుడు (యండమూరి)
స్టువర్టుపురం పోలిస్టేషన్ (యండమూరి)
ఆంగ్లంలోకి అనువదింపబడిన సినిమ: హంటర్స్ ఆప్ ది ఇండియం ట్రెజర్ (కొదమసిం హం)
గాయకుడిగా : మాస్టర్ (తమ్ముడూ)
విదేశాల్లో మొదటి సినిమా : లవ్ ఇన్ సింగపూర్
మొదటి ఔట్ దోర్ : పునాదిరాళ్ళు (రాజమండ్రి)
అతిధిపాత్రలు:మాపిల్లై(తమిళ్),
సిపాయి(కన్నడ) హీరోగా బ్రేక్ చిత్రం : చట్టానికి కళ్ళులేవు
రష్య భాలో అనువదించబడిన చిత్రాలు : పసివాడిప్రాణం, స్వయంకృషి
ద్విపాత్రాభినయం : నకిలిమనిషి, జ్వాల, సిమ్హపురిసిమ్హం, రక్తసిందూరం, రోషగాడు, దొంగమొగుడు, యముడికి మొగుడు, రౌడి అల్లుడు, స్నేహంకోసం, అన్నయ్య, అందరివాడు
త్రిపాత్రాభినయం : ముగ్గురు మొనగాళ్ళు
చిరు బిరుదులు
మెగా స్టార్, నటకిషోర, డేరింగ్ డ్యాషింగ్ డైనమిక్ హీరో, నట భాస్కర

అవార్డులు

మనఊరి పాండవులు (స్పెషల్ జూరీ)

పున్నమినాగు (ఉత్తమ నటుడు - ఫిల్మ్ ఫేర్)

ఊరికిచ్చిన మాట (ఉత్తమ నటుడు-సినిహెరాల్డ్)

చట్టానికి కళ్ళులేవు (స్పెషల్ జూరీ)

శుభలేఖ (ఉత్తమ నటుడు-వంసి బర్కిలీ, సితార, ఫిల్మ్ ఫేర్)

మఘమహారాజు (ఉత్తమ నటుడు-కలాసాగర్)

ఇంటిగుట్టు (ఉత్తమ నటుడు-ఫిల్మ్ ఫేర్)

స్వయం కృషి (ఉత్తమ నటుడు-నంది)

రుద్రవీణ (ఉత్తమ నటుడు-ఫిల్మ్ ఫేర్, నర్గీస్ దత్ జాతీయ అవార్డ్)

ఆపద్బాందవుడు (ఉత్తమ నటుడు-నంది)

ముఠామేస్త్రీ(ఉత్తమ నటుడు-ఫిల్మ్ ఫేర్)

హిట్లర్ (ఉత్తమనటుడు-స్క్రీన్-వీడియోకాన్)

మాస్టర్(ఉత్తమ నటుడు-స్క్రీన్-వీడియోకాన్)

స్నేహం కోసం (ఉత్తమ నటుడు-ఫిల్మ్ ఫేర్)

ఇంద్ర(ఉత్తమ నటుడు-నంది, ఫిల్మ్ ఫేర్, సిని మా, శాంతారాం మెమోరియల్)

ఠాగూర్ (ఉత్తమ నటుడు-ఫిల్మ్ ఫేర్, సంతోషం)

శంకర్ దాదా ఎంబీబీఎస్ (ఉత్తమ నటుడు - ఫిల్మ్ ఫేర్, సంతోషం)

పద్మభూషణ్ పురస్కారం (2007)

మూలం: శ్రీవెంకట్

అనువాదం: జి.సంజయ్

Saturday, August 9, 2008

హ్యాపీ బర్త్ డే మహేష్


యంగ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు 34వ వడిలో అడుగు పెట్టారు। ఇంకా పాలబుగ్గల రాకుమారిడిలా కనిపించే ఈ స్మైల్ స్టార్ తన 34వ జన్మదినాన్ని శనివారం(ఆగస్టు 9) కుటుంభ సభ్యులు, మిత్రులు, సన్నిహితులు, అభిమానుల నడుమ ఘనంగా జరుపుకున్నారు.

టాలివుడ్ సూపర్ స్టార్ కృష్ణ తనయుడైన మహేష్ కొడుకుదిద్దిన కాపురం చిత్రం ద్వారా చిన్న వయసులోనే స్టార్ గా ఎదిగారు। బాలనటుడిగా గుర్తింపు పొందిన మహేష్ 1999లో విడుదలైన రాజకుమారుడు చిత్రం ద్వారా హీరోగా టాలివుడ్ రంగ ప్రవేశం చేశారు. ఆ చిత్రంతోనే మహేష్ ప్రిన్స్ గా గుర్తింపుపొందారు.

టక్కరిదొంగ చిత్రం ద్వారా కౌబాయ్ గా, బాబీ ద్వారా సెంటిమెంట్, నాని ద్వార కామెడి వంటి అన్ని రకాల పాత్రలను పోషించి స్టార్ డం పెంచుకున్నారు। అయితే మురారి తర్వాతే నటుడిగా మహేష్ కు గుర్తింపు లభించింది. తదనంతరం ఒక్కడు, అతదు, సైనికుడు, అర్జున్ చిత్రాలతో యువ హీరోల నడుమ యంగ్ సూపర్ స్టార్ గా నిలిచారు. తక్కువ చిత్రాలలో నటించినా పొకిరి ఘనవిజయంతో టాలివుడ్ యువ కింగ్ గా మహేష్ కెరీర్ ఒక్కసారి ఆకాశాన్ని తాకింది. అంతేకాకుండా పొకిరి టాలివుడ్ రికార్డులను బ్రేక్ చేసి చరిత్ర సృష్టించింది.

నాలుగేళ్ల క్రిందట బాలివుడ్ నటీమణి నమ్రతను వివాహం చేసుకున్న మహేష్ కు ఒక కుమారుడున్నాడు। ప్రస్తుతం కొత్త చిత్రాల కథా చర్చల్లో నిమగ్నమైన మహేష్ 34వ జన్మదినాన్ని అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. మహేష్ తో సినిమాలు నిర్మించేందుకు హాలివుడ్ నుంచి వార్నర్ బ్రదర్స్ వంటి సంస్థలు పోటి పడుతుండటం గమనార్హం.

ఎన్నో విజయాలతో ముందుకు వెళుతూ 34వ జన్మదినాన్ని జరుపుకుంటున్న ప్రిన్స్ మహేష్ కు పిరమిడ్ సాయిమిర గ్రూప్స్ కు చెందిన హైదరాబాద్ సాయిమిర ( http://www.hyderabadsaimira.com/)మరియు న్యూస్ రీల్ ఇండియా ( http://www.newsreelindia.in/)హృదయ పూర్వక శుభాకాంక్షలు చెపుతోంది.

Friday, August 8, 2008

ఆంధ్రప్రదేశ్ వెబ్ సైట్ ను ప్రారంభించిన న్యూస్ రీల్ ఇండియా

జాతీయ వార్తలను ఎప్పటికప్పుడు వేగంగా అందించేందించటంలో పిరమిడ్ సాయిమిర గ్రూప్ కు చెందిన న్యూస్ రీల్ ఇండియా వెబ్ సైట్ మరో అడుగు ముందుకు వేసింది. ఇప్పటికే జాతీయ వార్తలను వేగంగా అందించటంలో ముందున్న న్యూస్ రీల్ ఇండియా తెలుగు వారికి ప్రాతీయ విశేషాలను క్షణాల్లొ అందించేందుకు కొత్తగా హైదరాబాద్ సాయిమిరా.కాం (http://www.hyderabadsaimira.com )అనే మరో వెబ్ సైట్ ను ప్రారంభించింది.
హైదరాబాద్ సాయిమిరా.కాం ( http://www.hyderabadsaimira.com ) అనే ఈ ప్రాంతీయ వెబ్ సైట్ ఆంధ్రప్రదేశ్ పూర్తి సారుప్యం నిర్లిప్తమైంది. సాయిమిర యాక్సెస్ టెక్నాలజీస్ సీ ఒ ఒ ఆర్ వెంకట కృష్ణన్ అద్యక్షతన ప్రెసిడెంట్ (ఆపరేషన్స్) వీకే విభాకర్ హైదరాబాద్ సాయిమిర.కాం (http://www.hyderabadsaimira.com )వెబ్ సైట్ ను లాంచనంగా ప్రారంభించారు.
ఈ ప్రాంతీయ హైదరాబాద్ సాయిమిరా.కాం (http://www.hyderabadsaimira.com ) వెబ్ సైట్ ద్వారా తియ్యనైన తెలుగుదనపు సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార అలవాట్లు, చరిత్ర, కళలు, జీవన విధానం, సంగీతం, సినిమాలు, పుస్తకాలు, శాస్త్ర సాంకేతిక పరిజ్ణానం, పర్యాటకం, ప్రాంతీయ వార్తలు ఎప్పటికప్పుడు క్షణాల్లో మీముందు ఉంచుతుంది.
ఈ 24 గంటల హైదరాబాద్ సాయిమిరా.కాం ( http://www.hyderabadsaimira.com )వార్తల వెబ్ సైట్ ద్వారా వీక్షకులకు కావలిసిన సమగ్ర సమాచారం, స్వచ్చంద సేవలు, ఆంద్రప్రదేశ్ నలుమూలల జరిగే రోజువారి విశేషాలను పొందవచ్చు. అంతేకాకుండా ఆయా వార్తలు, విశేషాలకు సంబంధించిన ఆడియో, వీడియోలు, ఫొటోలు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్ సాయిమిరా.కాం ( http://www.hyderabadsaimira.com )ద్వారా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఆంద్రప్రదేశ్ లోని తెలుగు వాతావరణాన్ని పొందవచ్చు.
ఇప్పటికే చెన్నై సాయిమిరా.కాం తో దూసుకు వెళుతున్న పిరమిడ్ సాయిమిరా గ్రూప్స్ న్యూస్ రీల్ ఇండియా.ఇన్ (http://www.newsreelindia.in) ప్రస్తుతం హైదరాబాద్ సాయిమిరా.కాం ప్రారంబించగా త్వరలో హైదరాబాద్ సాయిమిరా తెలుగు వెబ్ సైట్ ను ప్రాభించనుంది.