సినిమా ఛాన్స్ కోసం ఆసక్తి పరులు నిర్మాతల చుట్టూ, దర్శకుల చుట్టూ తెగ తిరుగుతూ అలిసిపోయే ప్రతిభావంతులకు ఓ శుభ వార్త. ప్రతిభా వంతులైన నటీ నటులు, దర్శకుల కోసం తమిళ నాడుకు చెందిన డ్యూయట్ ఫిలింస్ ఓ మంచి అవకాశం కల్పించడానికి పూనుకుంది.ఈ డ్యూయట్ ఫిలింస్ పేరెక్కడో విన్నట్లుందే అనుకుంటున్నారా. అదే నండీ, ప్రముఖ నటుడు, నిర్మాత అయిన ప్రకాశ్ రాజ్ స్వంత సంస్థ ఇది.గతంలో పలు తమిళ చిత్రాలు నిర్మించిన ఈ సంస్థ ప్రస్తుతం తమిళంలో అరడజను చిత్రాలను నిర్మిస్తోంది. తెలుగులో ఘన విజయం సాధించిన "హ్యాప్పీడేస్" చిత్రాన్ని అదే పేరుతో తమిళంలో నిర్మించనుందా సంస్థ. దీనికోసం ప్రతిభా వంతులైన నటీ, నటులు దర్శకుల కోసం ఈ సంస్థ వెతుకుతోంది.18 నుంచి 23 ఏళ్ళలోపు యువతీ,యువకులకోసం ఈ సంస్థ వెతుకుతోంది. మంచి ముఖ వర్ఛస్సు ఉండి, నటించగలమనే నమ్మకం ఉన్న ఆసక్తి పరులు తమ ఫోటోలు, దరఖాస్తులను వెంటనే duetmovies@gmail.com కు ఈ మెయిల్ చేయండి. అదృష్టం బావుంటే మీకే ఈ ఛాన్స్ వచ్చినా రావచ్చు. బెస్ట్ ఆఫ్ లక్.
Tuesday, November 27, 2007
తమిళ "హ్యాప్పీడేస్" లో నటించాలనుందా...

Monday, November 26, 2007
పవన్ కళ్యాణ్ "జల్సా" కు రూ.29/- కోట్ల భారీ ఆఫర్!!!!

పవన్ కళ్యాణ్ నూతన చిత్రం "జల్సా" నిర్మాణానికి ముందే సంచలనాలు సృష్టించడం ప్రారంభించింది. ముంబై కి చెందిన భారీ కార్పోరేట్ కంపెనీ యు టి వి ఈ చిత్ర దేశవ్యాప్త హక్కులకోసం ఏకంగా రూ.29/-కోట్ల భారీ మొత్తాన్ని ఆఫర్ గా ఇచ్చింది.ఇంతవరకు మరే తెలుగు చిత్రానికీ ఇంత పెద్ద మొత్తంలో ఆఫర్ రాకపోవడం ఇక్కడ గమనార్హం. మెగా స్టార్ చిరంజీవి చిత్రానికి మించిన ఆఫర్ ఈ చిత్రానికి ఇవ్వడంపై రాబోయే చిరంజీవి చిత్రాన్ని(ఇంకా ప్రారంభం కాలేదు) ఇంకా పెద్ద మొత్తం
వెచ్చించి కొనడానికి తాము సిద్దమేనని యు టి వి స్పష్టం చేయదలచిందని, అందుకే ఈ చిత్రానికి భారీ మొత్తంలో వెచ్చించడానికి ముందుకు వచ్చ్చిందని టాలీవుడ్ బిజినెస్ పండితులు తెలియజేస్తున్నా, దక్షిణ భారత దేశంలోని బలీయమైన తెలుగు భాషా చిత్రాలను తాము ఎక్కువగా కొనదలచినందులకే ఇక్కడి ప్రముఖ చిత్రాలను పెద్ద మొత్త వెచ్చించి కొంటున్నామని సంస్థకు సంబంధించినవారు ఇండస్ట్రీలో చెబుతున్నట్లు వినికిడీ.గతంలో మహేశ్ బాబు నటించిన "అతిధి" చిత్రాన్ని రూ.23/-కోట్లు వెచ్చించి కొన్న ఈ సంస్థ పవన్ కళ్యాణ్ "జల్సా" కు పెద్ద మొత్తం ఆఫ్ర్ ఇచ్చింది. అయితే ఈ ఆఫర్ ను చిత్ర నిర్మాత అల్లు అరవింద్ ఇంకా ఒప్పుకోలేదు. ముచ్చటగా ముప్పై కోట్ల రూపాయల ఆఫర్ కోసం ఆయన ఎదురుచూస్తున్నట్లు వినికిడి. 

దొంగల కాలేజీ ప్రిన్సిపాల్ గా నటించనున్న "బ్రహ్మానందం"

"డా.ఆనందం,ప్రిన్సిపాల్,దొంగల కాలేజీ" పేరుతో ఓ చిత్రం రూపొందనుంది. ప్రముఖ తెలుగు సినీ హాస్య నటుడు బ్రహ్మానందం ప్రధాన పాత్ర పోశిస్తున్న ఈ చిత్రానికి శరత్ ఉండవల్లి దర్శకత్వం వహించనున్నారు. ఇటీవల పెరిగిన హాస్య చిత్రాల కోవలో పూర్తి స్థాయి వినోదాత్మకంగా రూపొందే ఈ చిత్రంలో తెలుగు సినీ పరిశ్రమలోని హాస్య నటులంతా నటించనున్నట్లు తెలిసింది. ఈ "డా.ఆనందం,ప్రిన్సిపాల్,దొంగల కాలేజీ"చిత్రానికి "బిసైడ్, అసెంబ్లీ రెండో గేటు" అనే క్యాప్షన్
ను కూడా పెట్టి మరీ చిత్రం ద్వారా తము చెప్పదలచుకున్న విషయాన్ని దర్శక,నిర్మాతలు స్పష్టం చేయడంతో ఈ చిత్రం పై పరిశ్రమలో కొన్ని అంచనాలు ఏర్పడ్డాయి.డిసెంబరు నెలాఖరులో షూటింగ్ ప్రారంభమయ్యే ఈ చిత్రాన్ని వచ్చే వేసవిలో విడుదల చేయాలని దర్శక,నిర్మాతల లక్ష్యంగా తెలుస్తోంది.
ను కూడా పెట్టి మరీ చిత్రం ద్వారా తము చెప్పదలచుకున్న విషయాన్ని దర్శక,నిర్మాతలు స్పష్టం చేయడంతో ఈ చిత్రం పై పరిశ్రమలో కొన్ని అంచనాలు ఏర్పడ్డాయి.డిసెంబరు నెలాఖరులో షూటింగ్ ప్రారంభమయ్యే ఈ చిత్రాన్ని వచ్చే వేసవిలో విడుదల చేయాలని దర్శక,నిర్మాతల లక్ష్యంగా తెలుస్తోంది.చిరంజీవి తదిపరి చిత్రం వి వి వినాయక్ దర్శకత్వంలోనే...!

తెలుగు సినీ అభిమానులు ముఖ్యంగా చిరంజీవి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిరంజీవి తదుపరి చిత్రం వి వి వినాయక్ దర్శకత్వంలోనే రూపొందనున్నట్లు తాజా సమాచారం. చిరంజీవి నటించనున్న 150వ చిత్రానికి "ఉయ్యాలవాడ నరసిం హా రెడ్డి" కథను ఎన్నుకోవడం, ఈ చిత్రానికి చిరంజీవే స్వయంగా దర్శకత్వం వహించనుండగా, ఆయన్ శ్రీమతి సురేఖ స్వయంగా నిర్మించనున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం కన్నా ముందు నిర్మించబడే 149వ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారా అని ఇంతకాలం తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద చర్చ కొనసాగింది. తమిళ దర్శకుడు శంకర్ మొదలుకుని కృష్ణ వంశీ, కోదండ రామి రెడ్డి,మురుగదాస్ ల పేర్లు ప్రముఖంగా చర్చకు వచ్చాయి. అయితే చివరికి చిరంజీవి వి వి వినాయక్ వినిపించిన రాజకీయ నేపధ్యం గల చిత్రం వైపు మొగ్గు చూయించారని చిరంజీవికి అతి సన్నిహితులు పేర్కొంటున్నారు. జనవరి నెలలోగానీ, లేక ఫిబ్రవరి నెలలోగానీ ఈ చిత్రం ప్రారంభం కావచ్చు. లేదా వచ్చే ఉగాదికి ఈ చిత్రాన్ని ప్రారంభించవ్బచ్చు. ప్రస్తుతానికి కథను పరిపుష్టిగా తయారుచేయడంలో దర్శకుడు నిమగ్నమై ఉన్నందువల్ల ఇప్పట్లో ఈ చిత్రానికి సంబంధించిన సమాచారాన్ని బయటికి తెలియజేయవద్దని చిరంజీవి, దర్శకుడు కూడా భావించడం వల్ల ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటక్నకోసం మరికొంత కాలం ఎదురుచూడక తప్పదు.
Saturday, November 24, 2007
Subscribe to:
Posts (Atom)