Wednesday, February 6, 2008

వి వి వినాయక్ దర్శకత్వంలో ఎన్టీఆర్


వి వి వినాయక్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతోంది. ఇది అందరూ అనుకుంటున్నట్లుగా యుగంధర్ రీమేక్ కాదట. వినాయక్ దర్శకత్వం వహించిన ఎన్టీఆర్ సినిమా "ఆది" బాక్సాఫీసు వద్ద పెద్దగా హిట్టయిన విషయం తెలిసిందే. మళ్లీ వీరిద్దరూ కలిసి పని చేస్తున్నారు. ఎన్టీఆర్ తో "సాంబ" సినిమాను నిర్మించిన కొడాలి నానీ ఈ సినిమా నిర్మాత. ఈ కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 28వ తేదీన ప్రారంభమవుతుందని తెలిసింది. వినాయక్ ఎన్టీఆర్ ను దృష్టిలో పెట్టుకుని స్క్రిప్టు రాస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది చివరలో విడుదల చేయాలని కొడాలి నాని భావిస్తున్నారు.

Tuesday, February 5, 2008

బర్త్ డే బాయ్ "అభిషేక్ బచ్చన్"

బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ఈ రోజుతో 32వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాడు. ముంబాయిలో తన ఖుటుంబతో ఈ రోజు పెద్ద యెత్తున పుట్టిన రోజు జరుపుకోనున్న అభిషేక్ కు మనమూ శుభాకాంక్షలు చెబుదామా.






దర్శకుల సంఘం ఎన్నికల బరిలో ఎంఎస్ రాజు

నిర్మాతగా ఎన్నో విజయాలు సాధించిన రాజు తెలుగు సినిమా దర్శకుల సంఘం ఎన్నికల బరిలోఖీ దిగారు. ఈ నెల 10న జరుగనున్న దర్శకుల సంఘం ఎన్నికలలో ఆయన పోటీ చేస్తున్నారు. పరుచూరి బ్రదర్స్ ప్రోత్సాహంతో ఎంఎస్ రాజు ఈ ఎన్నికలలో పాల్గొంటున్నట్లు సమాచారం. ఇలా ఉండగా దాదాపు ప్రముఖ దర్శకులంతా ఎంఎస్ రాజు వ్యతిరేక కూటమిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఎన్నికల సందర్భంగా ఎంఎస్ రాజు ఇంద్రప్రస్ధ కాంప్లెక్స్ లో పెద్ద పార్టీ ఇచ్చారు.మరి చివరికి విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూస్తేగానీ తెలీదు.

Monday, February 4, 2008

ఆబోయే "ది హాటీ అండ్ ది నాటీ" చిత్రం గ్యాలరీ












"జోధా అక్బర్" ఎక్స్ క్లూజివ్ ఫొటో గ్యాలరీ









ఫిబ్రవరి 15న విడుదలవనున్న "జోధా అక్బర్"

అద్బుతమైన ప్రేమ కథతో రూపొందించబడ్డ "జోధా అక్బర్" ఈ నెల 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవనుంది. ఐశ్వర్యారాయ్, హృతిక్ రోషన్ నటించిన "జోథా అక్బర్" చిత్రం పాటలు వీనులవిందుచేస్తుండగా, ఈ చిత్రంపై అంచనాలు భారీ యెత్తున పెరిగిపోయాయి. చిత్రాన్ని ఎప్పుడు వీక్షిద్దామా అన్న ఆసక్తిలో యావత్భారత సినీ ప్రేక్షకులు ఉన్నారు.16వ శతాబ్దంనాటి కాలాన్ని జ్ఞప్తికి తెచ్చే భారీ సెట్ల మధ్యన రూపొందించిన ఈ చిత్రంలో ప్రపంచ అందాల సుందరిగా మన్ననలు అందుకుంటున్న ఐశ్వర్యారాయ్ అద్భుత లావణ్యరాశి జోథా భాయ్ గా నటించటం, ఇండియన్ టార్జాన్ హృతిక్ రోషన్ జోథా ప్రేమికుడైన సలీం చాలా వ్యయ ప్రయాషలతో అతద్భుతంగా రూపొందించినట్లు వినికిడి. చిత్రం తాలూకు నటులు, వారి పాత్రలు ఎలా ఉంటాయన్నవాటిపై ఒక్కసారి దృష్టి సారిస్తే. బాలీవుడ్ డాషింగ్ హీరో హృతిక్ రోషన్ ప్రధానపాత్ర అయిన జలాలుద్దీన్ మహ్మద్ అక్బర్‌గా నటిస్తున్నాడు. రాజా భర్మాల్ కూతురైన జోథా పాత్రలో ఐశ్వర్యారాయ్ నటిస్తోంది.
రాజకీయ విజయం సాధించి తనకు ఎదురేలేదని నిరూపించుకున్న అక్బర్(హృతిక్ రోషన్) తన సామ్రాజ్యాన్ని అటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇటు బంగాళాఖాతం వరకు, హిమాలయాలనుంచి గోదావరి వరకు విస్తరింపచేయాలని నిశ్చయించుకుంటాడు. ఈ క్రమంలో రాజ్‌పుట్‌లపై అక్బర్ ఘనవిజయం సాధించి రాజ్యాన్ని తన వశం చేసుకుంటాడు. రాజకీయ లబ్ధికోసం రాజా భర్మాల్ తన కుమార్తె జోథా చేతిని అక్బర్‌కి అందివ్వాలనుకుంటాడు. అయితే అక్బర్ తన పయనాన్ని నిజమైన ప్రేమవైపు సాగిస్తాడు. మరోవైపు యుద్ధభూమిలో అజేయుడైన జలాలుద్దీన్ "అక్బర్ ది గ్రేట్" బిరుదును పొందుతాడు. అరబిక్ భాషలో "అక్బర్" అంటే "గొప్ప" అని అర్థం. తన యుద్ధ నైపుణ్యంతో రాజ్యాలను సునాయాశంగా గెలిచిన అక్బర్‌ జోథా మనసును గెలుచుకోవటం కోసం ఏంచేశాడన్నఆసక్తితో చిత్రం సాగుతుంది. ఈ చిత్రాన్ని దాదాపు రూ.400 మిలియన్ల భారీ బడ్జెట్‌తో రూపొందించారు. అంతేకాదు నాటి పరిస్థితులను అద్దంపట్టేటట్లు ప్రముఖ చరిత్రకారులను వినియోగించారు. ఆగ్రా, జైపూర్ ప్రాంతాలలో ఈ చిత్రం రూపుదిద్దుకోవటంతో నాటి అక్బర్ సామ్రాజ్యం నిజంగానే మన కళ్లముందు ప్రత్యక్షమవుతుంది. ఇంకా ఈ చిత్రంలో 80 ఏనుగులు, వంద గుర్రాలు, 55 ఒంటెలను వినియోగించారు. మొత్తంమీద ప్రేమజంట "జోథా అక్బర్" ఫిబ్రవరి 15న ప్రేక్షకుల ముందుకు రానున్నారు.