Thursday, March 6, 2008

పవన్ "పులి"లో కరీనా కపూర్ లేదా ప్రియాంక చోప్రా

పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రం "పులి"లో హీరోయిన్ గా బాలీవుడ్ తారామణులు కరీనా లేదా ప్రియాంక నటించే అవకాశాలున్నాయి. వారిలో ఒకరిని ఫిక్స్ చేయడానికి పవన్ తరఫున ఆయన మనుషులు ప్రయత్నిస్తున్నారు.
పవన్ "పులి" సినిమాకు ఎస్ జె సూర్య దర్శకత్వం వహించనున్నారు. ఇలా ఉండగా పవన్ తాజా చిత్రం "జల్సా" బిజినెస్ రికార్డు స్ధాయిలో జరగడంతో నిర్మాత ఆనందంగా ఉన్నారు. జల్సా ఆడియో ఇటీవల విడుదలై అభిమానులను అలరిస్తోంది.

యంగ్ ఎన్ టి ఆర్ ప్రతిష్టాత్మక చిత్రం "కంత్రి" గ్యాలరీ






Wednesday, March 5, 2008

రెడ్ కార్పెట్ ఫిలిం రేటింగ్స్ (05-03-2008)

అంతర్జాతీయంగా అత్యంత ప్రఖ్యాతి గాంచిన అమెరికన్ మోషన్ ఫిక్చర్ అసోసియేషన్ ఈ వారం హాలీవుడ్ లో విడుదలకాబోతున్న చిత్రాలకు రెడ్ కార్పెట్ ఫిలిం రేటింగ్స్ నిర్ణయించింది. ప్రతిష్టాత్మకమైన ఆ రెడ్ కార్పెట్ ఫిలిం రేటింగ్స్ (05-03-2008) మీకోసం.
10,000 B.C.
Rating: PG-13
for sequences of intense action and violenceTHE BANK JOB
Rating: R
for sexual content, nudity, violence and language
CJ7
Rating: PG
for language, thematic material, some rude humor and brief smoking
COLLEGE ROAD TRIP
Rating: G
all ages admitted
GIRLS ROCK!
Rating: PG
for thematic elements and language
MARRIED LIFE
Rating: PG-13
for some thematic elements and a scene of sexuality
MISS PETTIGREW LIVES FOR A DAY
Rating: PG-13
for some partial nudity and innuendo
PARANOID PARK
Rating: R
for some disturbing images, language and sexual content
SNOW ANGELS
Rating: R
for language, some violent content, brief sexuality and drug use
RATINGS GUIDE
G: GENERAL AUDIENCES (All Ages Admitted)
PG: PARENTAL GUIDANCE SUGGESTED (Some Material May Not Be Suitable for Children)
PG-13 : PARENTS STRONGLY CAUTIONED (Some Material May Be Inappropriate for Children Under 13)
R : RESTRICTED (Under 17 Requires Accompanying Parent or Adult Guardian)
NC-17 : NO ONE 17 AND UNDER ADMITTED

క్రేజీ హీరో అల్లు అర్జున్ "పరుగు" లేటెస్ట్ స్టిల్ల్స్






మహేశ్ బాబు, ఛార్మి ఇళ్ళపై ఇన్ కం ట్యాక్స్ దాడులు


సోమవారం టాలీవుడ్ సినీ ప్రముఖులు మహేశ్ బాబు, ఛార్మి, దిల్ రాజు, వి వి వినాయక్ ఇళ్లతోపాటు వారి బంధువుల ఇళ్లపై ఇన్ కం ట్యాక్స్ అధికారులు దాడులు చేసి బ్యాంక్ లాకర్లను సీజ్ చేశారు. ఇదే సమయంలో చెన్నైలోని వారి ఆస్తులపై కూడా ఏకకాలంలో దాడులు జరిగాయి. మహేష్ బాబు ఇటీవల కాలంలో అత్యధిక పారితోషికం తీసుకోవటంతోపాటు పలు ప్రకటనా సంస్థల్లో అత్యధిక పారితోషికం, మల్టీ నేషనల్ కంపెనీలు మహేష్‌తో చిత్రాలు నిర్మించటం వంటి వార్తలు రావటంతో ఐటీ ఆయనపై దృష్టి సారించినట్లు తెలిసింది. అదేవిధంగా "మంత్ర" చిత్రంతో హిట్ హీరోయిన్‌గా నిలిచిన ఛార్మి ఇంటిపైనా ఇటువంటి దాడులు జరిగాయి. "కృష్ణ" చిత్రంతో సంక్రాంతి డైరెక్టరుగా విజయం సాధించిన వినాయక్ కూడా ఐటీ దాడులకు గురయ్యారు. అగ్ర హీరోల చిత్రాలకు దర్శకత్వం వహించే వినాయక్ అత్యధిక పారితోషికం తీసుకునే దర్శకునిగా పేరుంది. ఇక దిల్ రాజు "బొమ్మరిల్లు" విజయంతో భారీ ఆదాయాన్ని పొందారు. ఈ దాడులు జరిగేటపుడు ఎవరినీ అనుమతించకుండా అధికారులు సోదాలు నిర్వహించారు. ఈరోజు ఉదయం వరకూ ఐటీ దాడులు కొనసాగవచ్చునని టాలీవుడ్ సమాచారం. ఇదిలా ఉండగా, ఇటువంటి దాడులు తమకు సర్వసాధారణమేనని దిల్ రాజు వ్యాఖ్యానించడం కొసమెరుపు.