
Friday, April 11, 2008
Thursday, April 10, 2008
Wednesday, April 9, 2008
రెడ్ కార్పెట్ ఫిలిం రేటింగ్స్ (09-04-2008)
(Courtesy:Motion Picture Association of America, inc)
ఈ వారం విడుదలవనున్న హాలీవుడ్ చిత్రాలకు మోషన్ పిక్షర్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా "రెడ్ కార్పెట్ ఫిలిం రేటింగ్స్" ప్రకటించింది. ఆ వివరాలు.
CHAOS THEORY
Rating: PG-13
for mature thematic material, sexual content and language
Rating: PG-13
for mature thematic material, sexual content and language
DARK MATTERRating:R
for a scene of violence, brief sexual content and language
PROM NIGHTRating:PG-13
for violence and terror, some sexual material, underage drinking, and language
RATINGS GUIDE
G: GENERAL AUDIENCES (All Ages Admitted)
PG: PARENTAL GUIDANCE SUGGESTED (Some Material May Not Be Suitable for Children)
PG-13 :PARENTS STRONGLY CAUTIONED (Some Material May Be Inappropriate for Children Under 13)
R :RESTRICTED (Under 17 Requires Accompanying Parent or Adult Guardian)
NC-17 :NO ONE 17 AND UNDER ADMITTED
పరిటాల రవీంద్ర జీవిత కథతో రాం గోపాల్ వర్మ సినిమా
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దివంగత పరిటాల రవి జీవిత చరిత్రను "చరిత్ర" టైటిల్ తో రాంగోపాల్ వర్మ తెరకు ఎక్కించటానికి సన్నాహాలు చేస్తున్నారనే వార్త హాట్ టాపిక్ అయింది. "సత్య", "కంపెనీ", "సర్కార్" వంటి గ్యాంగ్ స్టర్ సినిమాలను ప్రతిభావంతంగా తెరకెక్కించిన రాం గోపాల్ వర్మ ఈ ప్రాజక్టును ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నట్లు సమాచారం. సాధారణంగా సంచలనం
సృష్టించే విధంగా నిజ జీవిత పాత్రలను తన సినిమాల్లో చూపించటానికి వర్మ ఇష్టపడుతుంటారు। గతంలో "సర్కార్" చిత్రంలోలో శివ సేన అధినేత భాల్ థాకరే ని అనుకరిస్తూ అమితాబ్ పాత్రను చిత్రీకరించారు. అదే విధంగా ఇప్పుడు అనంతపురం జిల్లాను తన కనుసన్నల్లో శాసించి, స్థానికంగా అతి పెద్ద నాయకునిగా, ఎం ఎల్ ఎ గాఎదిగిన పరిటాల రవీంద్ర ఆ తర్వాత దారుణ హత్యకు గురయ్యారు. అయితే పరిటాల రవి పాత్రను తెరకెక్కించాలని నిర్ణయించుకోవటం వివాదాలకు అవకాశమున్న సున్నితమైన అంశం అని కొందరు భావిస్తున్నారు. మరో ప్రక్క అసెంబ్లీ సమావేశాల్లో రవి భార్య సునీత ఆయన హత్య వెనుక ముఖ్యమంత్రి వైఎస్ కుమారుడు జగన్ వున్నాడని ఆరోపించారు. ఇలా వాడి వేడిగా ఉన్న సబ్జెక్టు కావటంతో మరింత ఆసక్తి రేపుతోంది. "చరిత్ర" పేరుతో నిర్మించనున్న ఈ సినిమాకు వర్మే దర్శకత్వం వహిస్తారా లేక తన శిష్యులకు అప్పచెపుతారా, సినిమాలో పరిటాల రవీంద్ర పాత్రను ఎవరు పోషిస్తారు వంటి విషయాలు తెలియాల్సి ఉంది.
"బెనహర్" హీరో హెస్టన్ కన్ను మూత
ప్రపంచ చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోయే క్లాసిక్ చిత్రాలైన "టెన్ కమాండ్ మెంట్స్" , "బెనహర్" చిత్రాల ల హీరో హెస్టన్ గత శనివారం రాత్రి కన్నుమూశారు. "బెనహర్" చిత్రానికికి గాను ఆస్కార్ అవార్డు అందుకున్న ఈ అంతర్జాతీయ నటుడు గత కొద్ది కాలంగా అల్జీమర్స్ వ్యాధితో భాధపడుతున్నారు. తన 84 వ యేట అమెరికా లాస్ లోని ఏంజిల్స్ లోని బెవర్లీ హిల్స్ లో గల తన సొంత ఇంట్లో ఆయన ప్రశాంతంగా తుదిశ్వాస వదిలారు. ఈ వార్త తెలిసిన ప్రపంచ నినీ ప్రియులు, అభిమానులు, హాలీవుడ్ వాసులు అంతా ఒక్కసారిగా విచార సముద్రంలో మునిగి పోయారు.ఒడిదుడుకులుగా ఉన్న హెస్టన్ సినీ కెరీర్ "బెనహర్" సినిమా వచ్చాక మారిపోయింది. ఆ తరువాత కొద్ది కాలానికే హాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకునే స్థాయికి ఎదిగాడు ఆయన. తర్వాత తరం వాళ్శకే గాక తన తరం వారికి కూడా ప్రేరణగా నిలవడం ఆయన ప్ర
త్యేకత. దాదాపు వంద సినిమాల్లో ఆయన నటించి తారాస్థాయికి ఎదిగాడు. తనకు ఉన్న వ్యాధిపై చాలా కాలం ఆయన బయటి ప్రపంచానికి తెలియనివ్వలేదు.
Subscribe to:
Posts (Atom)





























