తెలుగులో వరుస చిత్రాల నిర్మాణానికి సిద్దమవుతున్న పిరమిడ్ సాయిమిర సంస్థ జీ (తెలుగు) టీవీలో వాయిస్ ఆప్ యూత్ పేరుతో సరికొత్త టాలెంట్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రంలో టాప్ 10గా నిలిచిన గాయని గాయకులతో వాయిస్ ఆప్ యూత్ అనే ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బం ను రూపొందించడానికి పిరమిడ్ సాయిమిరా సన్నాహాలు చేస్తోందని సంస్థ ప్రతినిధి, దర్శక, నిర్మాత తమ్మారెడ్ది భరద్వాజ తెలిపారు. అదేవిధంగా వాయిస్ ఆప్ యూత్ కార్యక్రమంలో పాల్గొనే ప్రతిభవంతులైన గాయని గాయకులకు తమ సంస్థ నిర్మించనున్న చిత్రాలలో అవకాశాలు ఇవ్వనున్నామని చెప్పారు. సినిమా అవకాశాలకు ముందుగా ఆల్బంలో అవకాశం ఇచ్చేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ ఆల్బంకు కోటి, కె.ఎం రాధాకృష్ణన్, నితిష్ నారాయణన్ లు సంగీతం అందించనున్నారని తెలిపారు. వీడియో ఆల్బం కూడా నిర్మిచే ఆలోచన్లో ఉన్న పిరమిడ్ సాయిమిరా సంస్థతోపాటు విశాల్ ప్రాజెక్ట్ లిమిటెడ్ సంస్థ పాలుపంచుకోనుందని భరద్వాజ చెప్పారు.
Thursday, August 7, 2008
పిరమిడ్ సాయిమిరా 'వాయిస్ ఆప్ యూత్ '

Monday, August 4, 2008
చిరంజీవి పార్టీకి రూ.500 కోట్ల ఎన్నారై నిధులు
మెగాస్టార్ ప్రారంభించనున్న కొత్త పార్టీకి ఎన్నారైల నుంచి నుధులు వెల్లువెత్తుతున్నాయి. విదేశాల్లోని ప్రవాస భారతీయులు, పారిశ్రామికవేత్తలు, ఉన్నత వర్గాలకు చెందిన అభిమానుల నుంచి ఇప్పటికే రూ.500 కోట్లకు మేర నిధులు అందినట్లు తెలుస్తోంది. చిరు కొత్త పార్టీకి సారధులైన నాగబాబు, అల్లు అరవింద్, పవన్ కళ్యాన్, డా.మిత్రాలు ఈ నిధుల సేకరణలో ప్రధాన భూమికను పోషిస్తునట్లు తెలుస్తోంది. ఇప్పటికే వివిద జిల్లాల ప్రముఖ నేతలతో చర్చలు జరుపుతూ పార్టీని బలోపేతం చెస్తున్న సారధులు పార్టీ ప్రరంభం నాటికే భారిగా నిదులను సైతం సేకరించాలని నిర్ణయించారు. తద్వారనే పార్టీకీ భవిష్యత్తులో సైతం నిదుల లేమి రాకుండా చేయాలని వారు ప్రణాళికను సిద్దం చేసినటు తెలుస్తోంది. ఇందులో భాగంగానే పార్టీ సభ్యత్వంతో పాటు నిధులపై దృష్టి సారించారు. అయితే పార్టీకి సంభందించిన వివరాలపై చిరు ఇంతవరకు నోరు మెదపక పోవటం గమనార్హం. రాష్ట్రంలోని ప్రదాన పార్టీలన్నీ చిరు ప్రకటన కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో చిరు తమ ఏజండాను అన్ని వర్గాల వారికి అనుగుణంగా కొత్త రాజకీయాలను వెలుగు చూపించే విధంగా విదివిదానాలను సిద్దం చేస్తున్నారు. అదేవిదంగా చిరు రైల్ ఎక్కెందుకు వివిద పార్టీలకు చెందిన సీనియర్ నేతలు ఎదురు చూస్తుండటంతో వచ్చే ఎన్నికల్లో ఎవరికి టికెట్స్ ఇవ్వాలనే విషయమై ముందుగానే చర్చిస్తున్నారు. ఏది ఏమైన చిరు పార్టీకి అటు నిధుల వరదతో పాటు, పార్టీలో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకు అధికమవటం కొత్త రాజకీయలకు తెరతీస్తుంది."ది సిస్టర్ హుడ్ ఆఫ్ ది ట్రావెలింగ్ ప్యాంట్స్-2" ట్రైలర్
The Sisterhood of the Traveling Pants 2 Trailer
Saturday, August 2, 2008
రజనికాంత్ 'సుల్తాన్' లో 'చెన్నై-28' విజయలక్ష్మి
ప్రేమ లేఖ చిత్ర దర్శకుడు అగస్త్యన్ గుర్తుండే ఉంటాడు. ఆయన కుమార్తె విజయలక్ష్మి తమిళ్ లో హీరోయిన్ గా ఇటీవలే రెండు సినిమాలు నటించింది. అలా నటించిందో లేదో అమెకు మంచి అవకాశం వచ్చింది. అదే సూపర్ స్టార్ రజినికాంత్ తో నటించటం. రజని కుమార్తె సౌందర్య భారి స్థాయిలో రూపొందిస్తున్న సుల్తాన్ ది వారియార్ యానిమేషన్ చిత్రంలో విజయలక్ష్మి హీరోయిన్ గా నటించింది. అది రజినికి జోడీగా. సుల్తాన్ 18 భాషల్లో భారిస్థాయిలో రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే హైదరాబాద్ లో జరిగిన సుల్తాన్ చిత్రీకరణలొ పాల్గొన్న విజయలక్ష్మి చెన్నై రాగానే తన అదృష్టానికి మురిసిపోతుంది. రజని సార్ తో నటించటం ఇప్పటికి కలగానే ఉందని, ఇంకా మర్చిపోలేక పోతున్నానని విజయలక్ష్మి సంతొషంగా చెప్పింది. ఇప్పటి వరకు తను నటించాల్సిన నాలుగు రోజుల చిత్రీకరణ ముగుసిందని ఇంకా 20 రోజులు పాల్గొనాల్సి ఉంటుందని తెలిపింది. చిత్రీకరణలో రజిని సార్ తనను ఎంతగానో ప్రోత్సహించారని, ఇంకా 20 రోజులు ఆయనతో నటించబోతున్నాననే ఆలోచనే తనకు ఆనందాన్ని ఇస్తుందని పేర్కొంది.
Subscribe to:
Posts (Atom)