Monday, October 6, 2008

రామ్ గోపాల్ వర్మ "రక్తచరిత్ర"

ప్రముఖ దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ "రక్తచరిత్ర"కు శ్రీకారం చుట్టారు. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు దివంగత పరిటాల రవిపై రక్తచరిత్ర సినిమా తీయడానికి ఇరు కుటుంబాలు అంగీకరించినట్లు ప్రముఖ దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ తెలిపారు. మద్దెల చెర్వు సూర్యానారాయణ రెడ్డితో పాటు పరిటాల రవి సతీమణి, శాసనసభ్యురాలు పరిటాల సునీత సినిమా తీయడానికి అంగీకరించినట్లు ఆయన తెలిపారు. శనివారంనాడు మద్దెలచెర్వు సూరిని కలిసిన వర్మ ఆదివారం పరిటాల సునీతను కలిశారు. తాను తీయబోయే సినిమా గురించి ఆమెతో మాట్లాడారు.

తన సినిమా ఎవరినీ బలపరిచేదిగా ఉండదని, సందేశాత్మకంగా ఉంటుందని ఆయన చెప్పారు. తన రక్తచరిత్ర సినిమాకు మద్దెలచెర్వు సూరి పెట్టుబడి పెడుతున్నారనే వార్తలను ఆయన ఖండించారు. సినిమా మొత్తం రాయలసీమ జిల్లాల్లోనే షూటింగ్ జరుపుకుంటుందని ఆయన చెప్పారు. నవంబర్ 20వ తేదీ నుంచి షూటింగ్ జరుపుతామని ఆయన చెప్పారు.

Monday, September 29, 2008

జెనిలియా డిసౌజా గ్లామరస్ స్టిల్స్








చిరంజీవి ప్రజాయాత్ర

చిరంజీవి ప్రజాయాత్రకు సమయం ఆసనమవుతోంది. ప్రజాయాత్ర తేదీలు ఇంకా ఖరారు కాలేదని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి చెప్పినా ఈ అక్టోబర్ రెండు నుంచి ఆయన అనధికారికంగా అధికార యాత్రనే చేయనున్నారు.
త్వరలో ఈ యాత్ర తేదీలను ఖరారు చేస్తామని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. తాను మొదట కోస్తాలో మూడు జిల్లాలు, ఆ తర్వాత రాయలసీమ, తెలంగాణ జిల్లాల్లో పర్యటిస్తానని ఆయన వెల్లడించారు. అక్టోబరు 2 గాంధీ జయంతి రోజున "వూరూరా ప్రజారాజ్యం-వూరూరా పండగ" అనే కార్యక్రమాన్ని వారం రోజుల పాటు జరపనున్నట్టు ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తెలిపారు. అక్టోబరు 2న రాష్ట్రంలోని అన్నీ గ్రామాలు, పట్టణాల్లో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పార్టీ జెండాలు ఆవిష్కరించాలని కోరారు. అదే రోజు కోటిమొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఆయన పిలుపునిచ్చారు. దీన్ని కేవలం పార్టీ కార్యక్రమంగా భావించకుండా ఒక సామాజిక కార్యక్రమంగా చూడాలని ఆయన పిలుపునిచ్చారు.

అదే రోజునుంచి పార్టీ సభ్యత్వ నమోదును కూడా ప్రారంభించనున్నట్టు ఆయన వెల్లడించారు. మొదటి సభ్యత్వం వికలాంగుడైన బాలకృష్ణకు ఇచ్చి, తరువాత తాను తీసుకుంటానని ఆయన తెలిపారు. మొదట జిల్లా కార్యాలయాలు ప్రారంభమవుతాయని అనంతరం మండలస్థాయి, గ్రామకమిటీలను ఏర్పాటు చేయనున్నట్టు చిరు తెలిపారు. ఆదీవాసీలకు ఇబ్బంది కలిగితే బాక్సైట్‌ వెలికితీతను ఆపాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. పోలేపల్లిలో ఎకరం రూ.18 వేలకు తీసుకొని అదే భూమిని లక్షలకు అమ్మడాన్ని ఆయన ప్రశ్నించారు.

అమెరికాతో చేసుకున్న 123 ఒప్పందంపై స్పష్టమైన వైఖరి వెల్లడించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఒప్పందంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, అందువల్ల స్పష్టత అవసరమని ఆయన అన్నారు.

Thursday, September 25, 2008

గోపీ చంద్ 'శౌర్యం'

గోపిచంద్, అనుష్క జంటగా సినిమాటోగ్రాఫర్ శివ దర్శకత్వంలో రూపుదిద్దుకొన్న చిత్రం "శౌర్యం"। ఈ రోజు (గురువారం) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ముస్తాబయ్యింది. కధ ప్రకారం ''విజయ్‌ (గోపీచంద్‌) తన చిన్నప్పటి లక్ష్యం కోసం కఠోరంగా శ్రమిస్తుంటాడు. అందులో భాగంగానే కోల్‌కతాకు వెళ్లాల్సి వస్తుంది. అక్కడ శ్వేత (అనుష్క), దివ్య (పూనమ్‌కౌర్‌) పరిచయమవుతారు. అతనికి లక్ష్యసాధనలో ఎదురైన అడ్డంకులేమిటి? వాటిని ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఆసక్తికరం'' అని దర్శకుడు పేర్కొన్నారు.అలాగే గోపిచంద్, అనుష్కలపై చిత్రీకరించిన రొమాంటిక్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకొంటాయని చెప్పారు. మణిశర్మ సంగీత బాణీలు సమకూర్చిన ఈ చిత్రం ఆడియోకు మంచి స్పందన లభిస్తోంది. ఇక భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయన మాట్లాడుతూ యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో కూడిన చిత్రంగా ఇది ఉంటుంది. అలాగే మా సినిమా పాటలు ఇప్పటికే ప్రజాదరణ పొందాయి. గోపీచంద్‌ సినిమాల్లో ఉండే యాక్షన్‌ సన్నివేశాలతోపాటు చక్కటి వినోదం, లవ్లీ రొమాన్స్‌ కూడా మా చిత్రంలో ఉంటాయి. స్విట్జర్లాండ్‌ లొకేషన్లు కూడా కనువిందు చేస్తాయని అన్నారు.

Tuesday, September 23, 2008

రజినీ కాంత్, ఐశ్వర్య రాయ్ ల "రోబో" ఎక్స్ క్లూజివ్ స్టిల్స్

రజినీ కాంత్ మరియు ఐశ్వర్య రాయ్ అభిమానులకు శుభవార్త. వీరిద్దరి కాంబినేషన్లో ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఇటీవలే యూరోప్ లో షూటింగ్ ప్రారంభించుకున్న "రోబో" చిత్రానికి సంబంధించిన కొన్ని షూటింగ్ స్టిల్స్ ను ఇక్కడ ఇస్తున్నాం. చూసి ఆనందించండి.