Tuesday, February 10, 2009

'స్లమ్‌డాగ్ మిలియనీర్' ఏఆర్. రెహ్మాన్

భారతీయ చిత్రంగా నిర్మించబడిన స్లమ్‌డాగ్ మిలియనీర్ లెక్కలేనన్ని రికార్డులను సొంతం చేసుకుంటోంది. ఇప్పిటికే ఆస్కార్ నామినేషన్‌ను సాధించుకున్న ఈ చిత్రం ఆదివారం మరో ఘనతను సొంతం చేసుకుంది.
బ్రిటన్ ప్రభుత్వం ఇచ్చే బ్రిటీష్ అకాడెమీ ఆఫ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ (బీఏఎఫ్‌టీసీ) అవార్డు ఈ ఏడాది స్లమ్‌డాగ్ మిలీనియర్ సొంతమైంది. బాఫ్టా అని పిలవబడే ఈ అవార్డులు మొత్తం ఏడింటిని స్లమ్‌డాగ్ మిలియనీర్ దక్కించుకోవడం విశేషం.

ఇందులో భాగంగా ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సంగీతం, ఉత్తమ శబ్ధ గ్రాహకుడు, ఉత్తమ ఎడిటర్, ఉత్తమ స్క్రీన్‌ప్లే, ఉత్తమ ఛాయాగ్రాహుకుడిలాంటి అవార్డులను స్లమ్‌డాగ్ సొంతం చేసుకుంది.

భారత్ గర్వించదగ్గ సంగీత దర్శకుడు ఏఆర్. రెహ్మాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రానికి డానీ బోయల్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఇప్పటికే పలు అవార్డులను సొంతం చేసుకున్న సంగతి కూడా తెలిసిందే.

Tuesday, February 3, 2009

గాయకుడు క్రిష్ ను వివాహం చేసుకున్న నటి సంగీత

సంగీత పెళ్ళి చేసుకుంది. తమిళనాడులోని తిరువణ్ణామలై అరుణాచళ్వేర ఆలయంలో ఉదయం 6.45గంటలకు సంగీత మెడలో క్రిష్‌ మూడుముళ్లు వేశారు. గత కొద్ది కాలంగా సంగీత, క్రిష్ ప్రేమించుకుంటున్నారు. క్రిష్ ఓ సింగర్. కుటుంబ సభ్యుల అనుమతి లభించిన తరవాతే ఒకటవుతామని అప్పట్లో సంగీత తెలిపారు.
ఇరుపక్షాల వారూ నిర్ణయించిన ముహూర్తానికే ఈ ప్రేమ జంట వివాహమైంది. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు రీమాసేన్‌, ఐశ్వర్య, శ్రీదేవి, మహేశ్వరి, పృథ్వీరాజ్‌, లక్ష్మీరాయ్‌, ముంతాజ్‌, బాలా, వెంకట్‌ ప్రభు తదితరులు పాల్గొన్నారు. సంగీత ప్రస్తుతం తెలుగులో 'శ్రీమతి కల్యాణం'లో నటిస్తున్నారు. సంగీత తెలుగులో అలీ ప్రక్కన ఆశల సందడి సినిమాతో పరిచయమైనా ఖడ్గం చిత్రంతోనే తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. ఆ తరవాత తెలుగుతోపాటు తమిళంలోనూ పలు విజయవంతమైన చిత్రాల్లో ఆమె నటించారు.