Wednesday, February 27, 2008

"శివాజీ" భామ శ్రీయా సరన్ కొత్త ఫోటోలు











మార్చి 6న విడుదలవనున్న శ్రీహరి "భద్రాద్రి"

నంది ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీహరి, రాజా, గజాలా, నిఖిత జంటగా నటిస్తోన్న చిత్రం "భద్రాద్రి". మల్లికార్జున్ దర్శకత్వంలో యం శివకుమార్ నిర్మించారు. ఈ చిత్రాన్ని మార్చి 6న విడుదల చేస్తున్నట్లు నిర్మాత తెలిపారు. సెన్సార్ పూర్తయిన సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ చిత్రంపై ఉన్న నమ్మకంతో డిస్ట్రిబ్యూషన్ పెట్టి నైజాంలో 65 థియేటర్లలో విడుదల చేస్తున్నానని, మొత్తం 150 ప్రింట్లతో ముందుకు వస్తున్నామని పేర్కొన్నారు. నేటి వైద్య వ్యవస్థ ఎంత దిగజారిందో కళ్లకు కట్టినట్లు తెలియచెప్పే చిత్రమే "భద్రాద్రి" అని నటుడు రాజా అంటున్నారు. చాలా కాలం తర్వాత ఓ మంచి చిత్రంలో నటించాననే సంతృప్తి మిగిలిందని పేర్కొన్నారు. ఇందులో బ్రహ్మానందం పాత్ర హైలెట్‌గా నిలుస్తుందన్నారు. ఫైటర్స్ రామ్‌లక్ష్మణ్‌లు తనను కొత్త కోణంలో ఆవిష్కరించారన్నారు. శ్రీహరి మాట్లాడుతూ, నా చిత్రాల సేలబిలటీకంటే మించి శివకుమార్ ఖర్చుపెట్టారు. మంచి స్నేహితుని చిత్రంలో నటించినందుకు ఆనందంగా ఉంది. ఇటువంటి వ్యక్తులు నిర్మాతగా ఉంటే మరింత ఎత్తుకు ఎదుగుతాను. నాపై పెద్దగా బిజినెస్ అవ్వదు అని చాలా మంది నిర్మాతలు భయపెట్టినా తను నమ్మిన సిద్ధాంతంతో ముందుకు సాగుతున్నారు. బయ్యర్లు అనుకున్నవిధంగా డబ్బులు ఇవ్వకపోయినా తాను డిస్ట్రిబ్యూటర్‌గా మారి చిత్రాన్ని ముందుకు తెస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు మరోమారు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ, ఈ చిత్రానికి బాబీ రాసిన మాటలకు ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన వస్తుందనే నమ్మకముంది. ప్రతి వారినీ ఆలోచింపజేసేవిగా ఉంటాయి. మణిశర్మ సమకూర్చిన బాణీలకు ఆదరణ అనుకున్నవిధంగానే ఉంది. ప్లాటినం వేడుకను జరుపుకున్నామని తెలిపారు.

Tuesday, February 26, 2008

ఉత్తమ నటి మారియన్ కోటిల్లార్డ్ "ఆస్కార్ క్షణాలు"..(ఎక్స్ క్లూజివ్ గ్యాలరీ)






చిరంజీవి "చిరు"నామా & ఫోన్ నంబర్...


తెలుగు చిత్రసీమలో రారాజుగా వెలుగొందుతున్న నటుడు మెగాస్టార్ చిరంజీవి. "స్వయంకృషి"నే నమ్ముకుని వెండితెరపై నీరజానాలు అందుకుటున్న చిరంజివి తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగిడి 30 సంవత్సరాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో వుంటున్న మెగాస్టార్‌ చిరునామా తెలుసుకోవాలని ప్రతి తెలుగు అభిమానికి ఆసక్తిగానే వుంటుంది. వారి కోసం ఆయన ఇంటి అడ్రస్‌, ఫోన్‌ నంబరును కింది ఇస్తున్నాం.
పద్మభూషణ్ చిరంజీవి
ప్లాట్ నంబర్ 303 ఎన్,
రోడ్ నెంబర్ 25,
ఓబుల్ రెడ్డి స్కూల్ సమీపంలో,
రోడ్ నెంబర్ 64,
జుబ్లీ హిల్స్,
హైదరాబాద్-33.
ఫోన్ నంబర్. 044-23542765.

జాకీచాన్ విడుదల చేయనున్న "దశావతారం" ఆడియో


పద్మశ్రీ కమల్ హాసన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం "దశావతారం". ఇందులో ఆయన పది వేషాల్లో నటిస్తుండటంతోబాటు, బాలీవుడ్ సెక్సీబాంబ్ మల్లికాషెరావత్ ప్రత్యేక పాత్రలో తన అందాలను ప్రదర్శించి దక్షిణాది ప్రేక్షకులకు రుచి చూపించనుండటం మరో ప్రత్యేకత.ఈ ప్రత్యేకతలకు హాలీవుడ్ సూపర్ స్టార్ జాకీచాన్ కూడా ఇప్పుడు జత కలిశారు. ఆయన ఈ చిత్ర ఆడియోను విడుదల చేయనున్నారు.నిజంగానే జాకీచాన్ "దశావతారం" ఆడియోను ఆవిష్కరించనున్నారు. ఇందుకోసం కమల్ హాసన్ మల్లిక సాయం తీసుకున్నారు.జాకీ సరసన ఓ హాలీవుడ్ (ది మిథ్) చిత్రంలో మల్లిక నటించిన విషయం తెల్సిందే. అందువల్ల కమల్ ఆమె సాయం తీసుకుని జాకీని చెన్నైకు రప్పిస్తున్నారు. రానున్న మార్చిలో జాకీచాన్ చేతుల మీదుగా "దశావతారం" ఆడియో విడుదలకానుంది. ఈ చిత్రంలో మల్లికతో పాటు ఆసిన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, హిమేష్ రేష్మాయి సంగీత బాణీలు సమకూర్చారు.