Monday, April 21, 2008

అమితాబ్ బచ్చన్ బ్లాగు చూస్తారా...!

బాలీవుడ్ ఎవర్-గ్రీన్ హీరో అమితాబ్ బచ్చన్ స్వంతంగా ఒక బ్లాగు ప్రారంభించాడు. గత కొన్ని దశాబ్దాలుగా భారతీయ చలన చిత్ర జగత్తులో తనదైన ముద్ర వేసిన అమితాబ్ బచ్చన్ తన అభిమానులకోసం స్వంత బ్లాగు ప్రారంభించడం పట్ల సర్వతా అభినందనలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే బాలీవుడ్ కు చెందిన శేఖర్ కపూర్, అమీర్ ఖాన్ ల బ్లాగులను వీక్షకులు అతధిక స్థాయిలో సందర్శిస్తూ వాటిని విజయవంతం చేశారు. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ బ్లాగు ప్రారంభించి నాలుగు రోజులైనా కాకుండానే ప్రపంచ వ్యాప్తంగా వీక్షకులు ఆ బ్లాగును సందర్శిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇదే కోవలో త్వరలోనే మరి కొందరు బాలీవుడ్ ప్రముఖులు కూడా స్వంత బ్లాగులను ప్రారంభించనున్నట్లు సమాచారం.

రాజకీయాల్లోకి రానున్న వేణు మాధవ్, జీవిత, జయసుధ


తెలుగు సినీ రంగానికి రాజకీయాలేం కొత్త కాదు.అయితే కొత్తగా మరికొందరు సినీ తారలు రాజకీయాలలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సమాయత్తంవుతున్నారు. తాజాగా సినీ నటీమణులు జయసుధ, జీవిత, హాస్య నటుడు వేణు మాధవ్ లు రాజకీయాలలోకి ప్రవేశిస్తున్నారు. ఈ ముగ్గురూ అధికార కాంగ్రెస్ పార్టీలో చేరి రానున్న ఎన్నికలలో పోటీకి దిగనున్నట్లు తాజా సమాచారం. కరీంనగర్ జిల్లా కమలాపూర్ నియోజకవర్గం నుంచి తెలుగు సినీ హాస్యనటుడు వేణుమాధవ్ ను బరిలోకి దింపాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం యోచిస్తోంది. రానున్న ఉప ఎన్నికల్లో తెలంగాణ ప్రజల ఆకాంక్షను, తెలుగుదేశం పార్టీ సినీ గ్లామర్ ను కాంగ్రెస్ పార్టీ సినీ గ్లామర్ తో ఎదుర్కోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే వేణుమాధవ్ ను కమలాపూర్ నుంచి బరిలో దింపాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. వేణు మాధవ్ పోటీకి సుముఖంగా ఉన్నట్లు ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తోంది.
కాగా, హైదరాబాదులోని ముషిరాబాద్ నియోజకవర్గం నుంచి సినీ నటి జీవితను పోటీకి దించాలని ఆలోచన చేస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. సినీ హీరో రాజశేఖర్, జీవిత దంపతులు కాంగ్రెసుకు అనుకూలంగా, మెగాస్టార్ చిరంజీవికి వ్యతిరేకంగా మాట్లాడిన విషయం తెలిసిందే. వారిపై చిరంజీవి అభిమానులు దాడి చేసిన తర్వాతి కాలం నుంచి వారు కాంగ్రెసుకు మరింత సన్నిహితంగా మెలుగుతున్నారు. ఇదిలా ఉంటే, సికింద్రాబాదు నియోజకవర్గం నుంచి మరో సినీ నటి జయసుధను పోటీకి దింపనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మైనారిటీ వర్గాలైన క్రిస్టియన్లు అధికంగా నివసించే ఈ ప్రాంతంలో క్రిస్టియన్ మతంలోకి చేరిన జయసుధ తమకు బలంగా పరిణమిస్తుందని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థులుగా ముషిరాబాదు నుంచి నాయని నర్సింహారెడ్డి, సికింద్రాబాదు నుంచి పద్మారావు పోటీకి దిగనున్న విషయం తెలిసిందే.

Saturday, April 19, 2008

హాలీవుడ్ అందగత్తెలు

డ్రు బెర్రి మోర్
యాంజెనినా జోలి
అలిసియా సిల్వర్స్టన్
ఎలిషా కుత్బర్ట్
క్యాటరిన్ జేటా జోన్స్
జూలియా రాబర్ట్
రీస్ వైథర్స్పూన్
జెన్నిఫర్ గార్నర్
స్కార్లెట్ జాన్సన్
ఇవా లాంగోరియా
బేవన్స్
కెరియానైట్లీ
కేట్ హడ్సన్

చైనా ప్రభుత్వంతో పిరమిడ్ సాయిమిరా ఒప్పందం

సినిమా నిర్మాణ, పంపిణీ రంగాలతోబాటుగా టెలివిజన్ సాప్ట్ వేర్ ను కూడా రూపొందిస్తున్న పిరమిడ్ సాయిమిరా థియేటర్ లిమిటెడ్ సంస్థ చైనా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోబోతోంది. చైనాలోని మూడు వందల థియేటర్లను లీజుకు తీసుకుని సినిమాల ప్రదర్శనకు ఒప్పందం చేసుకోబోతున్నామని, అందుకోసం చైనా నుండి వచ్చిన ప్రతినిధుల బృందం చెన్నైలోనూ, హైదరాబ్ లోనూ తాము నిర్వహిస్తున్న కార్యకలాపాలను వీక్షించాయని సాయిమిరా థియేటర్ లిమిటెడ్ సంస్థ చైనా ఆపరేషన్స్ సి ఇ ఒ వెంకట్ తెలిపారు. ఏడుగురు సభ్యులు కలిగిన చైనా బృందం సాయిమిరా థియేటర్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అరోనా టెక్నలజీస్ సంస్థ రూపొందిస్తున్న యానిమేషన్, ఆన్ లైన్ గేంస్ సాప్ట్ వేర్, శబ్దాలయా స్టూడియోలోని పోస్ట్ ప్రొడక్షన్ యూనిట్ ను, పద్మాలయా స్టూడియోస్ తోబాటు, జంటనగరాలలోని కొన్ని థియేటర్లను సందర్శించారు. చైనా బృందంలో చైనా సోషల్ మ్యూజిక్ రీసెర్చ్ బోర్డ్ కు చెందిన లూ షి జంగ్, లంగ్జూ గ్రూప్ కు చెందిన యంగ్ లీ, యంగ్ జుడోంగ్, డింగ్ యాలీ, లీ గుపూ, కీ టైప్ టెక్నాలజీస్ లిమిటెడ్ సి ఇ ఒ లియు జున్(మైఖేల్) ఉన్నారు. ఆంద్ర ప్రదేశ్ లో జరుగుతున్న సాయిమిరా థియేటర్ లిమిటెడ్ సంస్థ కార్యకలాపాలను ఎ పి ఇంచార్జ్ తమ్మారెడ్డి భరద్వాజ ఈ బృందానికి వివరించారు.

"భయపడుతున్న" చిరంజీవి..?!


రాజకీయ రంగ ప్రవేశం పట్ల చిరంజీవి భయపడుతున్నారా?. ఏమో, పరిస్థితులు చూస్తే చిరంజీవి భయపడుతున్నట్లుగానే అనిపిస్తోందని టాలీవుడ్ సమాచారం. తెలుగు సినీ రంగంలో చిరంజీవి రాజకీయ పార్టీ పెట్టకపోవచ్చన్న వదంతులు సర్వత్రా వ్యాపిస్తున్నాయి. ప్రస్తుత రాజశేఖరరెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అనేక విధాలుగా చిరంజీవిని బ్లాక్ మెయిల్ చేస్తూ ఆయనను రాజకీయాల్లోకి రాకుండా చూస్తోందన్న అభిప్రాయం సినీ రంగ ప్రముఖుల్లో ఉంది. చిరంజీవి బ్లడ్ బ్యాంకులో అనేక అవకతవకలు జరుగుతున్నాయన్న విషయాన్ని అధికారులు వైఎస్ కు నివేదించారట. ఈ విశయమై రాజశేఖర రెడ్డి ఇంటలిజెన్స్ అధికారులకు సంపూర్తి దర్యాప్తు చేయాల్సిందిగా రహస్య ఆదేశాలిచ్చారని టాలీవుడ్ లో వదంతులు వినిపిస్తున్నాయి. అదీగాక చిరంజీవి ఆస్తులకు సంబంధించిన గుప్త సమాచారం కూడా కేంద్ర ప్రభుత్వం వద్ద ఉందని మరో వదంతి సినీ పరిశ్రమలో వ్యాపించింది. కేంద్ర ఆర్ధిక శాఖకు చెందిన ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల నుంచి ఈ సమాచారాన్ని రాష్ట్ర కాంగ్రెస్ పాలకులు తెప్పించుకున్నట్టు పలువురు అనుకోవడం తెలుగు సినీ పరిశ్రమలో బహిరంగ రహస్యమే. అల్లు అరవింద్ సహా, పలువురు కుటుంబ సభ్యులు, అభిమానులు, కొందరు మితృల వత్తిడికి తలొగ్గిన చిరంజీవి రాజకీయాల గురించి ఆలోచిస్తున్నారే కానీ ఆయనకు మనస్ఫూర్తిగా ఇష్టం లేదని చెబుతున్నారు. చిరంజీవికి రాజకీయాల్లోకి వచ్చి సొంత డబ్బు పాడుచేసుకోవడం ఇష్టం లేదంటున్నారు. చిరంజీవి పార్టీపై మీడియాలో వార్తా కథనాలు బాగా తగ్గిపోయాయి. మరో నెలరోజుల్లో చిరంజీవి రాజకీయ పార్టీ విశయంలో ముందుకు రానట్టయితే ఆయన రాజకీయాల్లోకి శాశ్వతంగా రాకపోవచ్చన్ని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.