Friday, July 18, 2008

రజని 'సుల్తాన్ 'లో ఇలియానా

రజనీకాంత్ కుమార్తె సౌందర్య భారిస్థాయిలో రూపొందిస్తున్న 'సుల్తాన్ -ది వారియర్' చిత్రంలో గోవా ముద్దుగుమ్మ ఇలియానా నటించనుంది. ఇండియా యానిమేషన్, పిక్షర్ పరిజ్ణానాన్ని మొదటి సారిగా ప్రపంచ తెరపై ఆవిష్కరించే విధంగా సరికొత్త మోషన్ క్యాప్చుర్ టెక్నాలజితో సౌందర్య 'సుల్తాన్ 'ను రూపొందిస్తోంది. ఏ ఆర్ రహమాన్ అందించిన సాంగ్స్ ను మోషన్ క్యాప్చుర్ విధానంలో తెరకెక్కించేందుకుగాను సౌందర్య, రజనికాంత్, ఇలియానా వియత్నం బయలుదేరేందుకు సిద్దమవుతున్నారు. రజని నటించిన శివాజీ కంటే భారిస్తాయిలో విజయాన్ని నమోదు చెసుకునేందుకు సౌందర్య సిద్దమవుతుంది.

రజినీయే ఒక నిప్పు లాంటి నిజం: జగపతి బాబు

హాలీవుడ్ 3-డి ఫిలిం "ఫ్లై మి టు ద మూన్" అఫిషియల్ Trailar

Fly Me To The Moon 3D Trailer

Tuesday, July 15, 2008

జెనీలియా "లవ్ విత్ సత్య"

జెనీలియా, శివ రాజ్ కుమార్‌లు హీరోహీరోయిన్లుగా నటించిన కన్నడ చిత్రం ఇప్పుడు తెలుగు వారిన్ని పలకరించబోతోంది.కన్నడంలో విజయవంతమైన 'సత్య ఇన్ లవ్' చిత్రాన్ని అదే పేరుతో తెలుగులోకి డబ్బింగ్ చేస్తున్నారు. చౌడేశ్వరి ప్రసన్నమూవీస్ పతాకంపై రాఘవలోకి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని తెలుగులోకి ఆర్. శంకర్ తీసుకువస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రంపై నిర్మాత శంకర్ మాట్లాడుతూ చిత్ర ఆడియోను ఈ నెలాఖరులోగా విడుదల చేస్తామని చెప్పారు. జెనీలియా, శివరాజ్ కుమార్ ల నటన అద్భుతంగా ఉందని, ఈ చిత్రంలో జెనీలియా నటన చిత్రానికి హైలైట్ కానుందని తెలిపారు. యాక్షన్, ప్రేమ, సెంటిమెంట్‌లతో ఈ చిత్రం అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.