Saturday, January 31, 2009

సిద్దార్థ, తమన్నా ల 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' ఫోటో గ్యాలరీ









Thursday, January 29, 2009

పవన్ కళ్యాణ్ పెళ్ళి: ఒకటైన ప్రేమ జంట

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ప్రేమను సార్ధకం చేసుకున్నాడు. చిరకాలంగా తను ప్రేమిస్తున్న రేణుకా దేశాయ్ ని తమ కుమారుడు అకిరా పెళ్ళిపెద్దగా, సకుటుంబ సమేతంగా ఆర్య సమాజంలో అతి నిరాడంభరంగా తన పెళ్ళి జరుపుకున్నారు.
పవన్ కల్యాణ్, రేణూ దేశాయ్ ల పెళ్ళికి చిరంజీవి హాజరై అక్షింతలు వేశారు. ఇంకా రామ్ చరణ్ తేజ, నాగబాబు, అల్లు అరవింద్ ఇతర కుటుంబ సభ్యులు కూడా ఈ వివాహానికి హాజరయ్యారు. పెళ్ళి పవన్ కల్యాణ్ జూబిలీహిల్స్ గృహంలో ఆర్య సమాజ పద్ధతిలో నిరాడంబరంగా జరిగింది.
ఈ రోజు ఉదయం పది గంటల 15 నిముషాలకు దండల పెళ్ళి చేసుకున్న అనంతరం పవన్, రేణూలు మీడియా ముందుకు వచ్చారు. ఆ తర్వాత వివాహాన్ని రిజిస్టర్ చేసుకోడానికి రిజిస్ట్రార్ ఆఫ్ మ్యారేజెస్ కార్యాలయానికి వెళ్ళారు. గత కొన్నేళ్ళుగా సహజీవనం చేస్తున్నప్పటికీ వీరిద్దరూ అధికారికంగా పెళ్ళి చేసుకోలేదు. కుమారుడు అకిరా పెళ్ళి పెద్దగా వీరి వివాహం నేడు సినిమా ఫక్కీలో జరిగింది.
మొదటి భార్య నందినికి విడాకులు ఇచ్చిన వెంటనే పవన్ రేణూల వివాహం జరగవలసి ఉంది. అయితే తండ్రి వెంకటరావు మరణించిన ఏడాది తర్వాతే వివాహం చేసుకోవాలని పవన్ నిర్ణయించుకోవడంతో ముహుర్తం నేడు నిర్ణయమైంది.

Wednesday, January 28, 2009

కథా నాయిక తమన్నా ఫోటో గ్యాలరీ










డా. రాజశేఖర్, భూమికల 'నా స్టైలే వేరు' స్టిల్స్





'ది ఇంటర్నేషనల్' ఫిలిం వాల్ పేపర్స్







The International Wallpapers

Saturday, January 24, 2009

మరో ప్రేమ కావ్యం 'మంజీర' పోస్టర్స్










Monday, January 19, 2009

'అరుంధతి ': అమ్మో అధ్భుతంగా వుంది

తెలుగు సినిమాకు మళ్ళీ పాత రోజులు వచ్చాయిలాగుంది.
నిజ్జంగా నామటుకు నాకు అలాగే అనిపిస్తోంది. భారతీయ చలన చిత్ర జగత్తుకు ఒక 'మాయాబజాఋ, ఒక 'పంతులమ్మ ', ఒక 'మళ్ళీశ్వరి ', మరో 'పాతాళ భైరవి ' అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చేంతాడమతవుతుంది.మళ్ళీ ఇన్నాళ్ళకు ఒకే ఒక్క 'ఆరుంధతి '.
ఎంత బావుందో కదూ!
పండిత పామరులంతా మరో మాట లేకుండా అద్భతం అంటున్నారు. తెలుగు తెరపై కలెక్షన్ల వర్షం కురిసి చానాళ్ళయ్యిందేమో. సగటు తెలుగు అభిమాని పులకించి పోతున్నాడు.తెలుగు తెరపై గతంలో ఎప్ప్పుడూ చూడని గ్రాఫిక్స్ చూసామని ప్రేక్షకులు ఆనందపడుతున్నారు.
అలాగే దర్శకుడు కోడి రామకృష్ణ మళ్ళి అమ్మోరు సినిమా తర్వాత తన విశ్వరూపం చూపించి మంచి విజువల్ ట్రీట్ గా మలిచారని సినీ వర్గాలు ఆ సీనియర్ ని మెచ్చుకుంటున్నారు.
మరి కొంతమంది అయితే ఈ క్రెడిట్ మొత్త ఎంత ఖర్చయినా ఫరవాలేదు, అనుకున్నట్లు రావాలని రెండేళ్ళపాటు ఎడతెరపి లేకుండా శ్రమించి,డబ్బు పెట్టిన నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి గట్స్ ని ఆకాశానికి ఎత్తుతున్నారు.
మొత్తానికి సంక్రాంతి వెళ్తూ మంచి హిట్ ఇచ్చింది.
మంచి ఓపినింగ్ తో ప్రారంభమయిన ఈ సంవత్సరాన్ని అంతే విజయంతో ముందుకు తీసుకు వెళ్ళవలసిన భాధ్యత మన దర్శక, నిర్మాతలపై ఉంది.


No, doubt this is a ‘Graphical Tech-ni-thriller in Tollywood. The ‘Arundhathi’ reserved their golden berth in Tollywood history too.
Genre: Thriller
Banner: Mallemala Entertainments
Lead Cast: Anushka, Sonu Sood, Deepak, Manorama, Sayaji Shinde, Kaikala Satyanarayana, Ahuti Prasad, Annapurna
Musi: Koti
Dialogues: Chintapally Ramana
Cinematography: Senthil Kumar
Visual effects: Rahul Nambiar
Art: Ashok
Editing: Marthand K Venkatesh
Story – screenplay: Mallemala unit
Direction: Kodi Rama Krishna
Producer: M Shyam Prasad Reddy
Release date: 16 January 2009

మీ అందరికోసం 'అరుంధతి ' ట్రైలర్

video


వెంకటేశ్వర్లు బులెమోని

Friday, January 16, 2009

కథానాయకి 'మల్లిక' ఫోటో గ్యాలరీ






Tuesday, January 13, 2009

సంక్రాంతి పర్వదిన శుఖాకాంక్షలు

సంక్రాంతి లేదా సంక్రమణము అంటే మారడం అని అర్థం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తరరాశిలోకి ప్రవేశించడం సంక్రాంతి. అందుచేత సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు ఉంటాయి. అయినా పుష్యమాసంలో, హేమంత ఋతువులో, శీతగాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఇది జనవరి మాసంలో వస్తుంది. మకర సంక్రాంతి రోజున, అంటే జనవరి 14 తేదీన సూర్యుడు ఉత్తరాయణ పథంలో అడుగుపెడతాడు. ఈరోజు నుంచి స్వర్గద్వారాలు తెరచి ఉంటాయని పురాణాలు పేర్కొన్నాయి.
ప్రాధాన్యత
ఆంధ్రులకు పెద్ద పండుగ సంక్రాంతి. "భిన్నత్వంలో ఏకత్వం" అనే వాక్యానికి సంక్రాంతి పండుగ బాగా నప్పుతుంది, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక లలో సంక్రాంతి అని; తమిళనాడు లో పొంగల్ అని; మహారాష్ట్ర, గుజరాత్ లలో మకర్‌సంక్రాంతి అని; పంజాబు, హర్యానా లలో లోరీ అని పిలవబడే ఈ పండుగను మూడు రోజుల పాటు జరుపుకుంటారు. పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు ఈ పండుగ జరుపుకుంటారు. పండుగ జరుపుకునే మూడు రోజులలో మొదటి రోజును భోగి అని, రెండవ రోజును సంక్రాంతి అని, మూడవ రోజును కనుమ అని పిలుస్తారు. మకర సంక్రాంతితో ఉత్తరాయణం మొదలవుతుంది.
భోగి, మకర సంక్రమణం, కనుమ - ఈ మూడు రోజులూ పండుగే కనుక, దీన్ని పెద్ద పండుగ అంటారు. నిజానికి ధనుర్మాసారంభంతో నెల రోజులు మూమూలుగానే సంక్రాంతి వాతావరణం చలిచలిగా తెలుగునాట ప్రారంభమవుతుంది. ఆ నెల రోజులు తెలుగు పల్లెలు ఎంత అందంగా, ఆహ్లాదకరంగా అలరారుతూ ఉంటాయో చూసి తీరవలసిందే. బుడబుక్కలవాళ్లు, పగటివేషధారులు, రకరకాల జానపద వినోద కళాకారులు తయారవుతారు. ఈ పండుగకు దాదాపు నెలరోజుల ముందునుంచే - అంటే ధనుర్మాసం ఆరంభం నుండే - ప్రతీ రోజు తమ ఇళ్ళ ముంగిళ్ళను రంగవల్లులు, గొబ్బెమ్మ లతో అలంకరిస్తారు. ముగ్గులు వేయటానికి ప్రత్యేకంగా బియ్యపు పిండిని వాడతారు. కళ్లం నుంచి బళ్ల మీద ధాన్యం బస్తాలు వస్తూ ఉంటాయి. భోగినాడు భోగిమంట విధిగా వేయవలసిందే. ఆ సాయంత్రం పేరంటంలో పిల్లలకు భోగిపళ్లు తప్పవు. ఈ పెద్ద పండుగకు కొత్త అల్లుడు తప్పనిసరిగా అత్తవారింటికి వస్తాడు. మరదళ్ల ఎకసెక్కాలకు ఉడుక్కుంటాడు. ఇవన్నీ సంక్రాంతి పండుగకు శోభ చేకూర్చే సర్వసామాన్య విషయాలు. రైతులు చెమటోడ్చి పండించిన పంటలు చేతికొచ్చే సమయంలో సంక్రాంతి పండుగ వస్తుంది కాబట్టి రైతుల పండుగగా దీన్ని అభివర్ణిస్తారు.
భోగి
ఇది జనవరి 13న వస్తుంది. ఈ రోజున ఉదయం తెల్లవారక ముందే, అంటే 3:30, 4:00 మధ్యలో అందరూ లేచి భోగి మంటలు వెలిగిస్తారు. దీనిని సంవత్సరంలో ఆ కాలంలో ఉండే చలి పారద్రోలటానికే కాక ఇంకో సందర్భంగా కూడా జరుపుకుంటారు. ఇంట్లో ఉండే పాత చీపుర్లూ, తట్టలూ, విరిగిపోయిన బల్లలూ వగైరాలను వదిలేసి, కొత్తవాటితో నిత్య నూతన జీవితం ఆరంబించటానికి గుర్తుగా కూడా ఈ రోజున భోగి మంటలు వెలిగిస్తారు.
సాయంత్రం పూట చాలా ఇళ్ళలో చిన్న పిల్లలు బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తారు. బొమ్మల కొలువు లో పిల్లలు తమ దగ్గర ఉన్న వివిధ రకాల ఆటవస్తువులను ప్రదర్శనగా ఉంచి ఆనందిస్తారు. ఇంకొంత మంది భోగి పళ్ళ పేరంటం ఏర్పాటు చేస్తారు. ఇక్కడ పేరంటాళ్ళు మరియు బందువులు సమావేశమై, రేగిపళ్ళు, శనగలు, పూలు, చెరుకుగడలు, మరియు కొన్ని నాణాలను కొత్త బట్టలు వేసుకున్న పిల్లలపై ఆశీర్వాద సూచకంగా కుమ్మరించి దిష్టి తొలగిస్తారు. ఈ పేరంటానికి వచ్చినవారికి తాంబూలాలతో పాటు పట్టుబట్టలు, పసుపు, కుంకుమలు పెట్టడం ఆనవాయితీ.
సంక్రాంతి
రెండవ రోజయిన సంక్రాంతి రోజున పాలు పొంగించి, దానితో మిఠాయిలు తయారు చేస్తారు. దాదాపుగా అందరి ఇళ్ళలో అరిసెలు, బొబ్బట్లు, జంతికలు, సాకినాలు, పాలతాలుకలు, సేమియాపాయసం, పరమాన్నం, పులిహోర, గారెలు మొదలయిన వంటకాలు చేసి, కొత్తబట్టలు ధరించి ఈ పండుగను ఆస్వాదిస్తారు.ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు ఇస్తారు.ప్రతీ సంక్రమణానికీ పితృతర్పణాలు ఇవ్వాలి. కాని మిగిలిన పదకొండు సంక్రమణాలకు ఇవ్వక పోయినా, ఈ మకర సంక్రమణానికి మాత్రం తప్పకుండా పితృ తర్పణాలు ఇస్తారు. సంక్రాంతి రోజులలో మనము చూసే ఇంకో సుందర దృశ్యం.. గంగిరెద్దులను ఆడించే గంగిరెద్దులవారు. చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికీ తిప్పుతూ, డోలు, సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటిచేత చేయించే నృత్యాలు చూడటానికి చాలా రమణీయంగా ఉంటాయి. ఆ గంగిరెద్దులు మనము ఇచ్చే కానుకలను స్వీకరిస్తున్నట్లుగా తలలు ఊపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మోకాళ్ళ మీద వంగటం వంటి విద్యలు వాటికి నేర్పిస్తారు. అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దుల వాళ్ళు సందడి చేస్తూ కొత్తగా వచ్చిన ధాన్యాన్ని అడుక్కుంటారు. హరిలో రంగ హరీ అంటూ నడినెత్తిపై నుంచి నాసిక దాకా తిరుమణి పట్టెలతో, కంచు గజ్జెలు ఘల్లుఘల్లుమనగా చిందులు త్రొక్కుతూ, చేతుల్లో చిరుతలు కొడుతూ కోడిగుడ్డు లాంటి బోడి తలపై రాగి అక్షయపాత్ర కదలకుండా హరిదాసు ప్రత్యక్షమవుతాడు.
కనుమ
మూడవ రోజయిన కనుమ వ్యవసాయంలో తమకు ఎంతో చేదోడువాదోడు ఉన్నందుకు పశువులకు శుభాకాంక్షలు తెలుపటానికి జరుపుతారు. కొన్ని ప్రాంతాలలో కోడి పందాలు కూడా నిర్వహిస్తారు. అయితే ఆ పందాలను జీవహింసగా భావించి రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. అంతే కాదు, వనభోజనాలను కూడా ఈరోజే నిర్వహిస్తుంటారు. కనుమ నాడు మినుము తినాలనేది సామెత. దీనికి అనుగుణంగా, ఆ రోజున గారెలు, ఆవడలు చేసుకోవడం ఆనవాయితీ. కనుమ మరునాటిని ముక్కనుమ అని అంటారు. దీనికి బొమ్మల పండుగ అని పేరు. దక్షిణ భారతదేశం లోని ప్రజలు ఈ పండుగ మూడు రోజులను శ్రద్ధాసక్తులతో జరుపుకుంటారు. ఉత్తర భారతదేశంలో మాత్రం ఈ పండుగలోని రెండవ రోజయిన మకర్‌సంక్రాంతి లేదా లోరీ ని మాత్రమే జరుపుకుంటారు.
కనుమ రోజున మాంసాహారం తినడం ఆంధ్ర దేశాన ఆనవాయితీగా వస్తూంది. మాంసా హారులు కాని వారు, గారెల తో (మినుము లో మాంసకృతులు హెచ్చుగా ఉంటాయి కనుక దానిని శాకా హార మాంసం గా పరిగణించి కాబోలు) సంతృప్తి పడతారు. అలాగే కనుమ రోజున ప్రయాణాలు చెయ్యకపోవడం కూడా సాంప్రదాయం.

Saturday, January 10, 2009

సైన్స్ ఫిక్షన్ 'పుష్' వైడ్ డెస్క్ టాప్స్





Wednesday, January 7, 2009

హాలీవుడ్ ఫ్యాంటసీ "స్టార్ ట్రెక్" వాల్ పేపర్స్ 2














Tuesday, January 6, 2009

హాలీవుడ్ ఫ్యాంటసీ "స్టార్ ట్రెక్" వాల్ పేపర్స్














Monday, January 5, 2009

'ఇంఖర్ట్' వాల్ పేపర్ గ్యాలరీ









Saturday, January 3, 2009

కృష్ణ భగవాన్ నటించిన 'టిక్ టిక్ టిక్'