Monday, December 31, 2007

లండన్ పారిశ్రామికవేత్త రాజ్ కుంద్రాతో శిల్పాశెట్టి డేటింగ్‌


బాలీవుడ్ హీరోయిన్లలో శిల్పాశెట్టికి ప్రత్యేక గుర్తింపువుంది. ఎందుకంటే ఆమె చేసే ప్రతి పనీ ఓ సంచలనమే. మొన్న యూకే సెలిబ్రిటీగా ఎన్నిక కావడం. ఆ తర్వాత ఢిల్లీలో జరిగిన ఎయిడ్స్ అవగాహన కార్యక్రమంలో హాలీవుడ్ నటుడితో బహిరంగ చుంభనం చేయడం వంటివి స్వదేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలు సృష్టించాయి. తాజాగా లండన్ పారిశ్రామికవేత్తరాజ్ కుంద్రాతో డేటింగ్‌లో పాల్గొన్నట్టు యూకే సెలిబ్రిటీగా నీరజనాలు అందుకున్న శిల్పాశెట్టి ప్రకటించి 2007 సంవత్సరానికి ముగింపు పలుకనుంది. ఈ పారిశ్రామికవేత్త, తనకు మధ్య ప్రేమాయణం సాగుతున్నట్టు ఆమె స్వయంగా ప్రకటించింది. అయితే ఈ ప్రేమకథ ఇంకా ప్రారంభదశలోనే ఉందని, దీనిపై లేనిపోని కట్టుకథలు రాసి మొగ్గలోనే తుంచి వేయవద్దని ఆమె మీడియాకు విజ్ఞప్తి చేయడం గమనార్హం. తాజాగా డైలీ మెయిల్‌కు శిల్పా శెట్టి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో తన మనస్సులో దాగివున్న ప్రేమ రహస్యాన్ని బయటపెట్టింది. గత వేసవి కాలంలో లండన్‌కు వెళ్లినపుడు ఆ దేశానికి చెందిన ఒక పారిశ్రామికవేత్తతో పరిచయం ఏర్పడింది. ఇలా ఆరంభమైన తమ ప్రేమకథ అపుడపుడూ డేటింగ్‌లకు వెళ్లే వరకు వచ్చింది. అయితే మా మధ్య ఉన్న పరిచయం ఇంకా ఆరంభదశలోనే ఉంది. నేను చాలా అందంగా ఉంటానని, నా కోసం, నా స్నేహం కోసం కోట్లాది మంది పడితపిస్తారని పలు మ్యాగజైన్‌లలో కథనాలు వస్తుంటాయి. అయితే ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా నా ఎదుటకు వచ్చి ఇష్టపడుతున్నట్టు చెప్పేందుకు సాహసం చేయలేదు. వివిధ కార్యక్రమాల నిమిత్తం విదేశాలకు వెళ్లినప్పుడు ఒంటరి తనం నన్ను చాలా వేధించేది. ముఖ్యంగా ఇంటికి దూరంగా ఉన్పప్పుడు చాలా బోర్‌గా కొట్టేది. ఇప్పటి వరకు బాయ్‌ఫ్రెండ్స్ అంటూ ఎవరూ లేరు. నాకు కూడా ప్రేమను పంచుకోవాలని ఉంది. అందుకే లండన్ పారిశ్రామికవేత్తతో మనస్సు విప్పి మాట్లాడుతున్నానని యూకే సెలబ్రిటీ శిల్పాశెట్టి కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది.

Saturday, December 29, 2007

చిరంజీవి 149వ చిత్రానికి దర్శకత్వం వహించనున్న వి వి వినాయక్చివరికి మెగాస్టార్ చిరంజీవినటించే 149వ చిత్రానికి దర్శకుడిని ఖరారు చేశారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించేందుకు గుణశేఖర్, వి.వి.వినాయక్‌ల పేర్లు వచ్చాయి, ఒక దశలో తమిళ దర్శకుడు శంకర్ తో చిరంజీవి 149వ చిత్ర ఉంటుందనీ వార్తలు వచ్చాయి, అయితే చివరికి వినాయక్ పేరు ఖరారు చేసినట్లు ఫిలిం నగర్ వర్గాల సమాచారం. ఈ చిత్రానికి "చెలి","అపరిచితుడు","ఘర్షణ" వంటి మ్యూజికల్ హిట్స్ అందించిన హరీష్ జయరాజ్ బాణీలు సమకూర్చనున్నట్లు సమాచారం. అల్లుఅరవింద్, అశ్వినీదత్‌ల సంయుక్త నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రం రూపొందనున్నట్లు తెలిపాయి. "స్టాలిన్" చిత్రం తర్వాత వచ్చిన "శంకర్‌దాదా జిందాబాద్" ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల చిరంజీవి తండ్రి మరణంతో ఈ చిత్రం రూపొందడంలో కాస్త ఆలస్యమవ్వచ్చని వార్తలు అందుతున్నాయి.

Friday, December 28, 2007

"కృష్ణార్జున" పాటలు విడుదలయ్యాయి


శ్రీలక్ష్మీప్రసన్న పిక్చర్స్ పతాకంపై రూపొందుతున్న "కృష్ణార్జున" చిత్రంపాటలు విడుదలయ్యాయి. పి వాసు దర్శకత్వంలో ఎం మోహన్ బాబు నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున, మంచు విష్ణువర్థన్ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు.ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు సినీరంగ ప్రముఖులు పాల్గొన్నారు. ముందుగా అక్కినేని నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. నాగార్జున మాట్లాడుతూ మోహన్‌బాబు చాలా చిత్రాలను ఈ స్టూడియోలో తీసి మా సంస్థకు గొప్ప ఎస్సెట్‌గా మారారని ఆయన పేర్కొన్నారు. భక్తుడు చిక్కుల్లో ఉంటే భగవంతుడు ఏ విధంగా కాపాడాడు అన్నది ఈ చిత్రంలో కీలకాంశంగా తెరకెక్కించిన వైనం బాగుందన్నారు.ఇందులో తనది చాలా మంచి పాత్రగా వివరించాడు. మల్టీ స్టారర్ చిత్రాలు ఈ చిత్రంతో ఊపందుకోవాలని చెప్పాడు. మోహన్ బాబు మాట్లాడుతూ నాగార్జున అడిగిన వెంటనే కథ వినకుండానే ఈ చిత్రంలో నటించేందుకు అంగీకరించడం తనకు ఆనందాన్ని కలిగించిందని, అదే సమయంలో భాద్యతను గుర్తుచేసిందని చెబుతూ నాగార్జునకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జనవరి 25న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు.

Thursday, December 27, 2007

మొమైత్ ఖాన్ కథానయకిగా "బేసిక్ ఇన్‌స్టింక్ట్స్‌" తెలుగులో పునర్నిర్మాణం


హాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన చిత్రం "బేసిక్ ఇన్‌స్టింక్ట్స్‌". హాలీవుడ్ శృంగార నాయకి షరాన్ స్టోన్ తన ఒంపు సొంపులు, వయ్యారాలతో ప్రపంచవ్యాప్తంగా కుర్రకారును వెర్రెత్తించింది. ఈ చిత్రాన్ని టాలీవుడ్ హాట్ భామిని మొమైత్ ఖాన్ కథానాయికగా రూపొందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. కొద్ది పాటి మార్పు, చేర్పులతో తెలుగు వాతావరణంలో పునర్నిర్మించనున్న ఈ చిత్రం ద్వారా మొమైత్ ఖాన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని సదరు దర్శక,నిర్మాతలు భావిస్తున్నట్లు తెలిసింది."మైసమ్మ ఐపీస్" చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డప్పటికీ ముమైత్‌లో ఇంకా సత్తా తగ్గలేదని, ఆమె అంటే అభిమానులు ఎగబడుతారని నిర్మాతలు అంచనా వేస్తున్నారు.హాలీవుడ్‌లో వివాస్పదమైన ఈ చిత్ర కథలో సీరియల్ హత్యల్లో ప్రధాన పాత్ర పోషించిన ఓ బైసెక్సువల్ శృంగార రచయిత్రిని, ఓ పోలీసు ఆఫీసర్ ఇంటరాగేట్ చేయడానికి ఆమె కోసం ప్రయత్నించడం, ఆమెతో ప్రేమాయణం, తదనంత సంఘటనల నేపద్యంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా మంచి కలెక్షన్లను సాధించింది.

అవకాశాల్లేక ఇటెం సాంగ్ ల కోసం ఎదురు చూస్తున్న మనీషా కొయిరాలా!!!?

ఒకప్పటటి నేపాల్ రాజ కుటుంబానికి చెందిన మనీషా కొయిరాలా బాలీవుడ్ నటిగా ఒక వెలుగు వెలిగింది. కొద్ది కాలం మంచి నటిగా గుర్తింపు పొందిన మనీషాకు అకస్మాత్తుగా సినిమాలు తగ్గిపోయాయి. దాంతో గత కొంత కాలంగా సినిమాలకు దూరమైన మనీషా కోయిరాల మళ్లీ సినిమాలలో కనిపించడానికి సమాయత్తమవుతోంది. ఇంతకుముందు "ఒంబాయి","భారతీయుడు", "ఒకే ఒక్కడు", "క్రిమినల్" తదితర సినిమాలతో దక్షిణాది ప్రేక్షకులకు పరిచయమున్న మనీషా కోయిరాల ఇపుడు తెలుగు సినిమా నగరంలో ఐటమ్ సాంగ్ చేయడానికి ఓకే అంది. శ్రీకాంత్, జగపతి బాబు హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో మనీషా తన ఐటమ్ సాంగ్ తో అలరించనున్నది.

Wednesday, December 26, 2007

ధోనీతో కలిసి నటించాలని ఉంది : ఛార్మీ


టాలీవుడ్ క్రేజీ సుందరి ఛార్మీకి క్రికెట్ స్టార్ ధోనీతో కలిసి నటించాలని ఉందట. తన జీవితంలో తాను అత్యంత అభిమానించే వ్యక్తులలో ధోనీదే అగ్ర స్థానం అని చెబుతున్న ఛార్మీకి ధోనీతో కలిసి ఒక్క చిత్రంలో అయినా నటించాలని ఉందని తన మనసులోని కోరికను వ్యక్తం చేసింది. ధోనీ ఒప్పుకుంటే అతనితో కలిసి యాడ్ ఫిలింలో అయినాసరే తాను నటించడానికి సిద్దమేనని, ఇందుకు సదరు నిర్మాత తనకు ఒక్క రూపాయి ఇవ్వకపోయినా సరేనని మరీ చెప్పింది. ఇప్పుడున్న పొట్టి జుట్టు ధోనీకన్నా, గతంలోని పొడవుజుట్టు ధోనీ అంటే అమ్మాయిలకు తెగ క్రేజీ వుండేదని, అయితే ఆ జుట్టు తో బాటే వారి అభిమానం పోలేదని, హ్యాండ్ సం ధోనీ ఎలా ఉన్నా తమకు నచ్చుతాడని అమ్మాయిల తరపున వకాల్తా పుచ్చుకుని మరీ చెబుతున్న ఛార్మీ, తాను త్వరలో ఓ పెళ్ళికూతురిని కాబోతున్నానని, తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తినే తాను వివాహం చేసుకోబోతున్నట్లు తెలిపింది. అయితే టాలీవుడ్ లో మాత్రం ఛార్మీ తన ప్రియుడు, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ నే వివాహం చేసుకోనుందని కోడై కూస్తున్నా, ఛార్మీ మాత్రం అతని పేరు ఇప్పట్లో చెప్పనని చెబుతోంది. ఏదేమైనా ఛార్మీ కోరిక అన్ని విషయాలలో నెరవేరాలని కోరుకుందాం.

రవి తేజ "క్రిష్ణ" ఎక్స్ క్లూజివ్ ఫొటో గ్యాలరీMonday, December 24, 2007

ఈ శతాబ్దపు ప్రపంచ శృంగార నటి:ఏంజెలీనా జోలి

హాలీవుడ్ హాటెస్ట్ నటీమణి ఏంజెలినా జోలి ప్రపంచంలోని ఈ శతాబ్దపు శృంగార నటిగా ఎన్నికైంది. హాలీవుడ్ కు చెందిన ప్రముఖ చలనచిత్ర పత్రిక ఎంపరర్ జరిపిన సర్వేలో ప్రపంచవ్యాప్తంగా అభిమానులు శృంగారనటిగా ఏంజెలినాకు పట్టం కట్టారు.ఈ నటీమనికి సంబంధించిన కొన్ని ఫోటోలను ఇక్కడ ఇస్తున్నాము. గమనించండి.
నటుడు చిరంజీవికి పితృవియోగం


మెగాస్టార్ చిరంజీవి తండ్రి కొణిదెల వెంకట్రావు సోమవారం తెల్లవారుజామున హృదయసంబంధిత వ్యాధితో కన్నుమూశారు. క్రమశిక్షణకు మారుపేరైన వెంకట్రావు మృతి చిరజీవి కుటుంబాన్ని తీవ్ర దుఖఃసాగరంలో ముంచెత్తింది. రాష్ట్ర ఎక్సైజ్ విభాగంలో ఎస్‌ఐగా పనిచేసిన వెంకట్రావు ప్రతి చిన్న విషయాన్ని నిశితంగా విశ్లేషించి, చక్కని నిర్ణయాలు తీసుకునేవారు. గత రెండుమూడు నెలలుగా అస్వస్థకు లోనైన వెంకట్రావును స్థానికంగా ఉన్న ఒక కార్పోరేట్ ఆస్పత్రిలో చేర్చారు. ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. చిరంజీవి తండ్రి కన్నుమూశారని వార్త తెలియడంతో పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, చిరంజీవి అభిమానులు జూబ్లీ హిల్స్‌లోని చిరంజీవి నివాసానికి చేరుకుని తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ చిరు కుటుంబసభ్యులను ఓదార్చారు. కాగా వెంకట్రావుకు భార్య అంజనీదేవీ, కుమారులు చిరంజీవి, నాగేంద్రబాబు, పవన్ కళ్యాణ్, కుమార్తెలు విజయదుర్గ, మాధవిలు ఉన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుకొండలో జన్మించిన వెంకట్రావు అదే జిల్లాలో ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్‌గా చేసి, నెల్లూరు జిల్లాలో ఎస్ఐగా పదవీ విరమణ చేశరు. ప్రతి ఒక్కరితో కలుపుగోలుతనంగా ఉండే వెంకట్రావు మృతి సినీ రంగానికి చెందిన పలువురిని దిగ్భ్రాంతికి గురిచేసింది.

Saturday, December 22, 2007

సినిమాలలో నటించలని ఉందా: ఉంటే www.pstl.in లోకి లాగిన్ కండి

సినిమా రంగానికి ప్రతిభా వంతులైన యువ కళాకారులను అందించే ప్రక్రియలో పిరమిడ్ సాయిమిరా సంస్థ "వన్ రీల్ మూమెంట్" కు తెర లేపింది. ప్రతిభా వంతులైన కళాకారులను తెరకందించే ప్రక్రియలో భాగంగా పిరమిడ్ సాయిమిరా థియేటర్ లిమిటెడ్, మరియు జ్ఞానబా విజువల్ మీడియాలు సమ్యుక్తంగా "వన్ రీల్ మూమెంట్" పేరుతో ఒక రీల్ చిత్రాలను అందించడానికి రంగం సిద్దం చేశాయి. పది నిమిషాలపాటు కొనసాగే ఈ వన్ రీల్ చిత్రాలను థియేటర్లలో ప్రధాన చిత్రానికి ముందుగా ప్రదర్శిస్తారు. అంటే న్యూస్ రీల్ మాదిరిగా అన్నమాట. అయితే ఇవి సంక్షిప్తమైన కథతో రూపొందించిన చిత్రాలన్న మాట. వీటికోసం అదనంగా ప్రేక్షకుల దగ్గ ఎటువంటి చార్జీని వసూలు చేయరు. పూర్తిగా కొత్త, యువ కళాకారులను భారత చిత్ర ప్రపంచానికి అందించడమే లక్ష్యంగా రూపొందనున్న ఈ చిత్రాలను ముందుగా చెన్నయ్ లో ప్రారంభించిన ఈ పద్దతిని, అతి త్వరలోనే దీనిని దేశవ్యాప్తంగా, ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా విస్తరించడం సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రక్రియలో భాగంగా జ్ఞానభాను విజువల్ మీడియా డైరెక్టర్ నాని దర్శకత్వంలో రూపొందిన వన్ రీల్ చిత్రంతో ఈ వన్ రీల్ చిత్రాల ప్రదర్శన ప్రారంభమైది. సినిమా రంగానికి ప్రతిభావంతులైన కళాకారులను అందించడమే లక్ష్యంగా ప్రారంభిస్తున్న ఈ కొత్త ట్రెండులో పూర్తిగా కొత్త వారికి అవకాశం కల్పించాలని నిర్ణయించడం జరిగింది. రెండున్నర గంటలలో చెప్పే సందేశాన్ని కేవలం పది నిమిషాల వ్యవధిలో చెప్పడం ఒక లక్ష్యం కాగా, కొత్త కళకారులకు ఎటువంటి లాభాపేక్ష లేకుండా అవకాశాన్ని అందించడం రెండవ లక్ష్యంగా ఈ ప్రక్రియ కొనసాగుతుందని పిరమిడ్ సాయిమిరా థియేటర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సామినాథన్ విలేఖరులకు తెలిపారు. ఈ వన్ రీల్ చిత్రాలలో నటించాలనుకునే నూతన కళాకారులు, ఔత్సాహికులు "వన్ రీల్ మూమెంట్, పిరమిడ్ సాయిమిరా థియేటర్ లిమిటెడ్, నంబర్ 27, జి.ఎన్ చెట్టి రోడ్, చెన్నై" చిరునామాకు తమవివరాలను, ఫోటోలను, అబ్యర్థనను పంపించవచ్చు. లేదా www.pstl.in వెబ్ సైట్ ద్వారా కూడా దరఖాస్తులను డౌన్ లోడ్ చేసుకుని తమ అబ్యర్థనను పంపించవచ్చు. ప్రస్తుతం తమిళంలో ప్రారంభమైన ఈ ప్రక్రియ అతి త్వరలోనే తెలుగు, మళయాలం,కన్నడ, హిందీ, ఇంగ్లీషు భాషలలో ప్రారంబించనున్నాము.

హాలీవుడ్ హాట్ "హిలరీ డఫ్" ఎక్స్ క్లూజివ్ వీకెండ్ గ్యాలరీ