Friday, August 31, 2007

మహేశ్ బాబు తో రూ.55 కోట్ల ఒప్పందం చేసుకున్న యు.టి.వి.


భారత దేశంలోని ప్రముఖ చిత్ర నిర్మాణ, పంపిణీ సంస్థ అయిన యు.టి.వి. యంగ్ హీరో మహేశ్ బాబుతో రూ.55 కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా యు.టి.వి.సంస్థ నిర్మించే మూడు చిత్రాలలో హీరో మహేశ్ బాబు నటించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన అడ్వాన్స్ కూడా మహే బాబుకు ఇవ్వడం జరిగిందని పద్మాలయా స్టూడియోస్ తెలియజేసింది.

వీరి ఒప్పందంలోని మొదటి చిత్రం జనవరి,2008 లో ప్రారంభమౌతుంది. వీటిని ప్రముఖ యువ దర్శకులతో చిత్రించాలని యు.టి.వి.భావిస్తోందని తెలిసింది. అధికారికంగా తెలియజేయకున్నా ఇప్పటికే ఆయా చిత్రాలకు సంబంధించిన కథా చర్చలు ప్రస్తుతం కొనసాగుతున్నట్లు తెలిసింది. కాగా ప్రస్తుతం మహేశ్ బాబు నటించిన "అతిథి" చిత్రం దేశవ్యాప్త ప్రదర్శన హక్కులను యు.టి.వి.పెద్ద మొత్తం చెల్లించి సొంతం చేసుకుంది. ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.

తెలుగు సినీ "మల్లీశ్వరి" కత్రినా కైఫ్ ఫోటో గ్యాలరీ.
















నాకూ ఒక్క జాతీయ అవార్డు కావాలి: త్రిష.



టాలీవుడ్, మరియు కోలీవుడ్ లలో క్రేజీ హీరోయిన్ అయిన త్రిష అవార్డుకోసం చకోర పక్షిలా ఎదురు చూస్తొంది. తెలుగు, తమిళ భాషలలో పలు చిత్రాల్లో నటించినా ఇంతవరకు ఒక్క జాతీయ అవార్డయినా రాక పోవడం ఆమెను చాలా బాధ పెట్టినట్లు తెలిసింది. దాంతో ఎలాగయినా ఒక్క జాతీయ అవార్డయినా సాధించాలనే లక్ష్యంతో ఆమె ఒక్క సమాంతర చిత్రం (ఆర్ట్ ఫిల్మ్) లో అయినా నటించాలని నిర్ణయించినట్లు తెలిసింది.

అలాగే ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలలో కూడా తన పాత్ర ప్రాధాన్యతను, ఆయా విషయాలు అవార్డు కమిటీలను తృప్తి పరిచేలా ఉన్నాయా, లేవా అని తరచి తరచి చూస్తున్నట్లు తెలిసింది. కమర్షియల్ చిత్ర నిర్మాతలు అవార్డు విషయాలకు అంత ప్రాధాన్యం ఇవ్వరని తెలిసినా తను మాత్రం ఆశగానే ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం తను తెలుగులో ప్రభాస్ ప్రక్కన "బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై", చిత్రంలో, అలాగే రవితేజ ప్రక్కన నటిస్తోంది. ఇక తమిళంలో విజయ్ తో "కురవి" చిత్రంలో, గౌతం మీనన్ దర్శకత్వం వహిస్తున్న "చెన్నయిల్ ఒరు మలై కాలం" చిత్రంలో, మరియు రాధా మోహన్ చిత్రంలో నటిస్తోంది. కాగా రాధా మోహన్ చిత్రంలో తండ్రీ కూతుళ్ళ మద్యన కొనసాగే ఆత్మీయానుభంధాలు కథాంశంగా నిర్మిస్తుండడం వల్ల ఆ చిత్రం తన కోరిక తీర్చొచ్చనే ఆశతో త్రిష ఉన్నట్లు తెలిసింది.ఎనీ హౌ త్రిషా బెస్ట్ ఆఫ్ లక్.

నటశేఖర కృష్ణ,ఇళయరాజా, అంబరీష్ లకు ప్రతిష్టాత్మక ఎన్.టి.ఆర్. అవార్డు.









ప్రముఖ నటుడు నటశేఖర కృష్ణ, ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా, ప్రముఖ కన్నడ నటుడు, కేంద్ర మంత్రి అంబరీష్ లకు ప్రతిష్టాత్మక ఎన్.టి.ఆర్. అవార్డును రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఐదు సంవత్సరాలక్రితం ప్రభుత్వం ఆపేసిన ఎన్.టి.ఆర్. అవార్డు లను తిరిగి పునరుద్దరిస్తూ వరుసగా మూడు సంవత్సరాలకు ఎన్.టి.ఆర్. అవార్డులను ప్రభుత్వం ప్రకటించింది. ఈ అవార్డు ప్రధానోత్సవంలో భాగంగా 2003,2004,2005వ సంవత్సరాలకు గాను నటశేఖర కృష్ణ,ఇళయరాజా, అంబరీష్ లకు ప్రతిష్టాత్మక ఎన్.టి.ఆర్. అవార్డును ప్రభుత్వం ప్రకటించింది.ఈ అవార్డు కింద రూ.5 లక్షల నగదు, ఒక లక్ష విలువైన వెండి జ్ఞాపికను ప్రదానం చేస్తారు. 2006,2007వ సంవత్సరాలకు గాను ఎన్.టి.ఆర్ అవార్డుల ఎంపికకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఎంపిక చేయవలసి ఉందని ప్రభుత్వం ప్రకటించింది. కాగా ఈ అవార్డులను ఈ నవంబరులో జరిగే నంది అవార్డుల ప్రధాన కార్య క్రమంలో గ్రహీతలకు అందజేస్తారు.

Thursday, August 30, 2007

బాంబు దాడితో భీతిల్లిన తెలుగు సినీ పరిశ్రమ.

హైదరాబాదు జంట బాంబు పేలుళ్ళు తెలుగు సినీ పరిశ్రమను ఆర్థికంగా దెబ్బతీసాయి. శనివారం జరిగిన బాంబు పేలుళ్ళ నేపద్యంలో హైదరాబాదులోని థియేటర్లను వరుసగా మూడు రోజులపాటు మూసి వుంచారు. బుధవారమే థియేటర్లను తిరిగి ఓపెన్ చేయడంతో బాంబు పేలుళ్ళ భీతితో వున్న ప్రేక్షకులు థియేటర్లకు రావడానికే భయపడిన సందర్బాలు ఉన్నాయి. దాంతో ఒక్కసారిగా సినిమాల కలెక్షన్లు దెబ్బతిని థియేటర్లన్నీ ఢీలాపడిపోయాయి. దాంతో తెలుగు సినీ పరిశ్రమలోని అత్యధికులు బాగా కలతచెందినట్లు కనిపించారు.ఇటీవల తన కొత్త చిత్రం విడుదలైన ఎన్.టి.ఆర్ తోసహా చాలామంది బాధపడినట్లు పరిశ్రమలోని అనేకులు చెబుతున్నారు. మొదటి వారం గొప్ప కలెక్షన్లతో రికార్డు నెలకొల్పిన "యమదొంగ" చిత్రం బాంబుల దెబ్బకు దివాలా తీసాయి. పూరీ జగన్నాథ్ తమ్ముడు సాయిరాం శంకర్ నటించిన "హల్లో ప్రేమిస్తారా" చిత్రాన్ని కూడా ఈ కారణంగానే విడుదలను సెప్టెంబర్ 14కు పొడిగించారు. ఇక మిగతా చిత్రాల సంగతి మరీ ధారుణంగా వుందని తెలిసింది. ప్రభుత్వాలపై కక్ష పెంచుకున్న తీవ్రవాదులు అందుకు అమాయకులను బలి చేయడమనే విష సంస్కృతి తొలిగినప్పుడే సామాన్య ప్రజానీకానికి రక్షణ. అప్పుడే సినిమాలైనా, ఇతర వ్యాపారాలైనా ఎలాంటి దెబ్బతినకుండా కొనసాగుతాయి.

టాలీవుడ్ టాప్ హీరోయిన్ ఇలియానా ఫోటో గ్యాలరీ











430 కోట్లు చెల్లించి "షోలే" హక్కులు కొన్న పి.ఎన్.సి.


"షోలే" చిత్రం ఎప్పుడూ సంచలనమే.
ముప్పై రెండు సంవత్సరాల క్రితం విడుదలై కనీవినీ ఎరుగని అఖండ విజయం సాధించిన ఈ చిత్రం డైలాగులు నాటి అత్యధిక భారతీయ ప్రేక్షకులకు కంఠస్థమే. భాషతో సంబంధంలేకుండా అన్ని ప్రాంతాలవారిని ఈ చిత్రం మెప్పించింది.ఈ క్లాసిక్ చిత్రం రాంగోపాల్ వర్మ వల్ల మరోసారి చర్చనీయాంశమైంది.
ఈ చిత్ర హక్కులు పొందకుండా "షోలే" చిత్రాన్ని రీమేక్ కు ఆయన పూనుకోవడంతో వ్యవహారం కొర్టులదాకా వెల్లింది.ఆ తర్వాత ఆయన పేరు మార్చడం, కథ మార్చడం వేరే విషయం. ఇప్పుడు కొత్తగా ఈ చిత్రం రీమేక్ కు పొందిన రేటుతో మరోమారు భారతీయ చిత్ర పరిశ్రమలో సంచలనం సృస్టించింది. "షోలే" చిత్రాన్ని రీమేక్ కోసం చిత్ర నిర్మాత జి.పి. సిప్పీ, దర్శకుడు రమశ్ సిప్పీలకు ఏకంగా రూ.430 కోట్లు చెల్లించి ప్రీతీశ్ నంది కమ్యూనికేషన్స్ (పి.ఎన్.సి.) హక్కులు పొందడం బాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. ప్రీతీశ్ నంది కమ్యూనికేషన్స్ సంస్థ "షోలే" చిత్రాన్ని నాలుగు భాగాలుగా చిత్రించడానికి పూనుకుంది. అసలు "షోలె" కు ముందు ఏం జరిగి వుంటుందోననే కథాంశంతో మొదటి భాగాన్ని,అసలు చిత్రాన్ని యధాతతంగా రెండవ భాగాన్ని, త
దనంతరం జరిగే కథతో మూడవ భాగాన్ని చిత్రించడంతోబాటు, అసలు చిత్రాన్ని యధాతతంగా యానిమేషన్ రూపంలో నాలుగవ చిత్రాన్ని నిర్మినంచడానికి పూనుకుంది. వీటికి సంబంధించిన స్క్రిప్ట్ కార్యక్రమాలు అప్పుడే ప్రారంభమయ్యాయని తెలిసింది. దీని షూటింగ్ కూడా అతి త్వరలోనే సెట్స్ పైకి వస్తుంది.
శ్రీవెంకట్ బులెమోని

Wednesday, August 29, 2007

తోడుకోసం ఎదురు చూస్తున్న టాబూ...!?.


బాలీవుడ్ కథానాయిక టాబూకు తోడుకొసం అయినవాళ్ళు ఒకటే వెతుకుతున్నారు. అమ్మాయికి తోడు తేవడమంటే మాటలా... ఎన్నెన్నో విషయాలను పరిగణలోకి తీసుకుని గానీ సరైన జోడీని నిర్ణయించలేమని సంబంధీకులు తెగ వాపోతున్నారు. పాపం చంద్ర సిద్దార్థ కయితే నిద్ర కరువై నెలపైనే గడిచిందని వారి కుటుంబీకులు తెగ ఆందోళన పడుతున్నారు.

ఇదేంటి టాబూకు జొడీని తీసుకురావడం కోసం చంద్ర సిద్దార్థకు నిద్ర కరువవ్వడానికి సంబంధమేమిటని అనుకుంటున్నారా...!.తప్పదు కదండీ చేసుకున్నోడికి చేసుకున్నంత మహదేవా అన్నట్లు చంద్ర సిద్దర్థ తన కొత్త చిత్రం కోసం ఎలాగోలా టాబూనయితే ఒప్పించాడుగానీ ఆమెకు జోడీగా ఎవరినీ ఒప్పించలేక పోతున్నాడు పాపం. ఇప్పటికి అర్థమైందనుకుంటున్నాను. చంద్ర సిద్దర్థ తన కొత్త చిత్రం "ఇదీ సంగతి"కి కథానాయికగా బాలీవుడ్ హీరోయిన్ టాబూను ఒప్పించాడు. ఆమెకు జోడీగా ఇప్పటికి చాలామందినే అనుకున్నా ఎందుచేతనో ఎవ్వరూ ఒప్పుకోవట్లేదని తెలిసింది. చివరికి బాలీవుడ్ నటుడు కె.కె.మీనన్ ను ఒప్పించినా చివరి నిమిశంలో ఆయానా కాదని అన్నారని తెలిసింది. దాంతో కొత్తగా నటుడు అబ్బాస్ దగ్గరికి వెళ్ళొచ్చాడు దర్శకుడు చంద్ర సిద్దార్థ. అబ్బస్ సరే అన్నట్లే తెలిసింది. కానీ డేట్ల సమస్య ఒకటి ముందుకొచ్చింది.దాంతో చివరికి ఏంజరుగుతుందోనని ఈ దర్శకునికి ఒకటే ఆందోళన. అన్నట్లు కె.కె.మీనన్ కూడా చివరికి డేట్ల విషయమే ముందుంచి ఈ చిత్రంలోంచి తప్పుకున్న విశయం టాలీవుడ్ లో అందరికీ తెలిసిందే.

టాలీవుడ్ బాస్ నాగార్జున "డాన్" ఫోటో గ్యాలరీ.






రాజశేఖర్ తమిళ చిత్రం "ఒల్లెలావుంది".





ప్రముఖ నటుడు రాజశేఖర్ నటించిన తెలుగు సినిమా "ఎవడైతే నాకేంటి" ఇప్పుడు తమిళంలోకి డబ్బింగ్ అవుతోంది. తెలుగులో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని తమిళంలో "ఉడంబు ఎప్పడి ఇరుక్కు" పేరుతో డబ్బింగ్ చేస్తున్నారు. దీనికి తెలుగు అర్థం "ఒల్లెలావుంది".
గతంలో రాజశేఖర్ నటించిన "అంకుశం" తమిళంలో "ఇదుదాండా పోలీస్" పేరుతో తమిళంలో ఘన విజయం సాధించింది. ఆ తర్వాత రాజశేఖర్ నటించిన పలు చిత్రాలు తమిళంలో విడుదలై మంచి విజయాన్ని సాధించాయి. ఆ కోవలో ఇప్పుడు "ఎవడైతే నాకేంటి" చిత్రం "ఉడంబు ఎప్పడి ఇరుక్కు" పేరుతో తమిళంలో విడుదల అవుతొంది. కాగా ఈ చిత్రానికి రాజశేఖర్ సతీమని జీవిత దర్శకత్వం వహించింది.

Tuesday, August 28, 2007

శృంగార తార మల్లిక నిర్మాతగా కొత్త అవతారం!.

భారతదేశ అందాల తార మల్లికా శెరావత్ నిర్మాతగా కొత్త అవతారం ఎత్తింది. శృంగార తారగా కుర్రకారు గుండెలు కొల్లగొట్టిన మల్లిక "బ్లూ వెల్వెట్" పేరుతో తన సంస్థను ప్రారంభిస్తున్నట్లు ఇటీవలే ప్రకటించింది.
ప్రస్తుతం "అన్ వీల్డ్" అనే హాలీవుడ్ సినిమాలో నటిస్తున్న మల్లిక తమ సంస్థ నిర్మాణ వ్యవహారాలను తన తమ్ముడు విక్రం కు అప్పజెప్పింది. "బ్లూ వెల్వెట్" సంస్థ అదికారికంగా తన పనులను ప్రారంభించింది. ఒప్పటికే కుప్పలు తెప్పలుగా వస్తున్న ఫిలిం స్క్రిప్ట్ లను స్క్రూటినీ చేసే కార్యక్రమాలు చాలా వేగంగా జరుగుతున్నట్లు తెలిసింది. అయితే అధికారికంగా ఏ చిత్రాన్ని ముందుగా ప్రారంభిస్తారో ఇంతవరకూ తెలుపలేదు. కాకపోతే ఆ చిత్రం తప్పకుండా మల్లిక అందాలను ఆరబోసేది మాత్రం కాదని తెలిసింది. అదే నిజమై
తే కుర్రకారు కొద్దిగా డిసప్పాయింట్ కావలసిందే.

మెగా స్టార్ చిరంజీవి తన కొత్త చిత్రంకోసం తీసుకున్న ఫోటో సెషన్లోంచి కొన్ని ఫోటోలు (Photos Gallery).











రజినీకాంత్, మణిరత్నంల కాంబినేషన్లో మరో "దళపతి".



"శివాజి" తర్వాత రజినీకాంత్ చిత్రంపై తమిళ, తెలుగు సినీ పరిశ్రమల్లో చాలా ఆసక్తి నెలకొని ఉంది. రజినీకాంత్ నటించే తదుపరి చిత్రం ఏమై వుంటుందా అనే ఆసక్తితోబాటు, ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారా అనే ఆసక్తి కూడా సినీ పరిశ్రమలో నెలకొని ఉంది.
ఈ ఆసక్తికి తాత్కాలికంగా సమాధానం దొరికిందని తమిళ పరిశ్రమ చెబుతుండగా, అది నిజమనే సంఘటనలు కూడా జరుగుతున్నాయి. రజినీకాంత్ తదుపరి ప్రముఖ దర్శకుడు మణిరత్నం చిత్రంలోనటించనున్నారని కోలీవుడ్ కొడై కూస్తోంది. భారతీ రాజా, కె.ఎస్.రవి కుమార్ లతో రజినీ చర్చలు జరపడాని బట్టి తన తదుపరి చిత్రం భారీ విజయాన్ని సాధించే చిత్రంగా ఉండాలని రజినీ మంచి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిని నిజం చేస్తూ రజినీకాంత్ ఇటీవల తన "దళపతి" దర్శక, నిర్మాత మణిరత్నంతో చర్చలు జరుపుతున్నారు. గడచిన నెలరోజుల్లో రజినీ ఇంటిలో మణిరత్నంతో మూడు పర్యాయాలు చర్చలు జరిగినట్లు తెలిసింది. ఈ మూడు దఫాలు కూడా అయిదారు గంటలకు పైగా చర్చలు జరగడాన్ని బట్టి ఇది ఖచ్చితంగా రజినీ తదుపరి చిత్రం గురించే తప్ప మరేమీ కాదని కోలీవుడ్ తీర్మానించింది. అదే నిజమైతే వీరిద్దరి కాంబినేషన్లో మరో భారీ "దళపతి" ని ఆశించవచ్చునని సినీ పరిశ్రమలోని పలువురు అనుకుంటున్నారు.

దెయ్యంతో ప్రేమలో పడ్డ హీరో మాధవన్!.




ప్రముఖ తమిళ హీరో మాధవన్ ఓ దెయ్యంతో ప్రమలో పడ్డాడు. దాంతో హీరో మాధవన్ గత నాలుగు నెలలుగా తన ప్రేమలో మునిగి తేలుతూ చెట్ల వెంటా, పుట్టల వెంటా పడి తిరుగుతున్నాడు. ఈ విశయాన్ని అటు తమిళ సినీ పరిశ్రమ, ఇటు తెలుగు సినీ పరిశ్రమ ఎంతో ఆసక్తిగా గమనిస్తోంది. ఈ ప్రేమాయణం ముదిరి ఎప్పుడు పాకాన పడుతుందా, ఆ తర్వాత ఏంజరుగుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


హీరో మాధవన్ ఏంటి, దెయ్యంతో ప్రేమలో పడడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా! అవునండీ బాబూ... మన దయ్యాల సినిమాల దర్శక నిర్మాత రాంగోపాల్ వర్మ తను తాజాగా నిర్మిస్తున్న తెలుగు చిత్రంలో తమిళ హీరో మాధవన్ ను తీసుకువచ్చి తన రొటీన్ దెయ్యంతో ప్రేమాయణాన్ని సాగిస్తున్నాడు. అయితే ఈ సినిమాకు దర్శకుడు మాత్రం రాంగోపాల్ వర్మ కాదు. తన శిశ్యుడైన కోన వెంకట్ కు దర్శకత్వ భాద్యతలను అప్పజెప్పాడు. తన వర్మ కార్పోరేషన్లోనే ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో ఓ దెయ్యం హీరో మాధవన్ తో ప్రేమలో పడుతుంది. తదనంతరం జరిగే సన్నివేశాలు, ఫ్యామిలీ సెంటిమెంటు కూడా కలగలిసిన ఈ చిత్రం ఈ సెప్టెంబర్లోనే విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. చూద్దాం ఈ కొత్త దెయ్యం ఏం చేస్తుందో. అన్నట్లు ఈ సినిమా పేరు చెప్పలేదు కదూ ...ఈ సినిమా పేరు " అది ఒక ఇదిలే".

Monday, August 27, 2007

నగ్నంగా నటించనని చిత్రంలోంచి తప్పుకున్న "నమిత".


తెలుగు, తమిళ చిత్రాలలో కథానాయికగా ఎదిగిన నటి నమిత నగ్నంగా నటించమన్నందుకు ఓ చిత్రంలోంచి తప్పుకుంది.
తెలుగులో పలు చిత్రాలలో నటించిన నమిత ఇప్పుడు తమిళంలో స్థిరపడింది. ఇటీవల "మాయ" అనే ఆంగ్ల చిత్రంలో నటించేందుకు నమిత ఒప్పుకుంది. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను సహితం చిత్రీకరించారు. ఇందులో ఈమె వేశ్యగా నటిస్తొంది. అందుకు తగ్గట్లుగానే ఇందులో కొన్ని మసాలా సన్నివేశాలలో నటించాలని చెప్పిన దర్శక, నిర్మాతలు ఇప్పుడు మొత్తం నగ్నంగా నటించమని చెప్పడంతో తను ఈ చిత్రంలోంచి తప్పుకున్నానని, అలాగే ఇంతకు ముందు తను నటించిన సన్నివేశాలను కూడా చిత్రం లోంచి తొలగించాలని సూచించినట్లు తెలిసింది.దీనికి సంబంధించి ఈ చిత్ర నిర్మాతలు " ఆమె డిమాండ్లను ఒప్పుకోలేం" అంటున్నట్లు తెలుస్తోంది.ముందు ముందు ఏం జరుగుతుందో వేచిచూస్తేగానీ తెలీదు. కానీ ఒక్క విషయం. ఒక చిత్రంలో నటించమని చెప్పగానే వెంటనే ఒప్పుకోకుండా, దానికి సంబంధించిన పూర్వాపరాలను కూలంకశంగా తెలుసుకోవాల్సిన భాద్యత నటీనటులదైతే, ఆయా సినిమాలకు సంబంధించి ముఖ్యంగా అది ఆయా నటీనటుల మర్యాదకు భంగంకలిగించేదయినప్పుడు తాప్పకుండా ఈ విశయం ముందుగానే వారికి తెలియజేసి వారి అనుమతి తీసుకున్నాకే మిగతా కార్యక్రమాలు కొనసాగించడం చిత్రానికి, చిత్రపరిశ్రమకు ఆరోగ్యకరం.

అందాల బొమ్మ ఛార్మీ... "బామ్మ ఛార్మీ"గా మారితే..!!.(Photo Gallery)









Saturday, August 25, 2007

6 కోట్లకు శేఖర్ కమ్ముల "హ్యాప్పీ డేస్" చిత్ర హక్కులు కొన్న దిల్ రాజు.






ప్రతిభావంతుడైన దర్శకుడిగా పర్గాంచిన శేఖర్ కమ్ముల "హ్యాప్పీ డేస్" చిత్రం ప్రదర్శన హక్కులను సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ కం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు తీసుకున్నారు. దీంతో ఈ చిత్రంపై తెలుగు సినీ పరిశ్రమలో అంచనాలు పెరిగాయి. ముక్యంగా దిల్ రాజు చిత్ర హక్కులు తీసుకుంటే అది ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే సెంటిమెంట్ ఇండస్ర్టీలో ఉంది. గతంలో దిల్ రాజు ప్రదర్శన హక్కులు తీసుకున్న "పోకిరి", "ఖుశి" తదితర చిత్రాలు అఖంఢ విజయం సాధించడమే ఈ చిత్రంపై అంచనాలు పెరగడానికి ప్రధాన కారణంగా తెలుగు సినీ పరిశ్రమ చెబుతోంది. ఈ చిత్ర ప్రదర్శన హక్కుల కోసం దిల్ రాజు 6 కోట్ల రూపాయలు చెల్లించినట్లు తెలిసింది.