Journey to the Center of the Earth Trailer
Thursday, July 24, 2008
Wednesday, July 23, 2008
కమెడియన్ ఆలి సిక్స్ ప్యాక్...!!
ఇప్పటి వరకు సిక్స్ ప్యాక్ మోజులో ఉన్న హీరోల సరసన కొత్తగా కమేడియన్ ఆలి చేరారు.
త్వరలో విడుదల కానున్న 'సెల్యూట్' చిత్రం లో ఆలి సిక్స్ ప్యాక్ శరీర సౌష్టవంతో కనిపించనున్నారు. ఈ చిత్ర కథనాయకుడు విషాల్ సిక్స్ ప్యాక్ తో కనిపించనుండగా ఆలి కూడ ఈ అదేవిధంగా దర్శనమివ్వనుండటం గమనార్హం. శరీరాన్ని ఒక షేపులో చూపించే ఈ సిక్స్ ప్యాక్ విధానంపై ఇప్పటికే బాలివుడ్ నుంచి దక్షిణాధి హీరోలంతా మోజుపడగా కొత్తగా కామెడీ తారలు కూడ ఈ వరుసలో చేరటం దీనిపై ఎంతటి క్రేజ్ ఏర్పడిందో తెలుస్తొంది. ఈ సిక్స్ ప్యాక్ ఏ మేరకు ఆకట్టుకుంటుందో తెలియదు కాని త్వరలో కామెడీ హీరో అల్లరి నరేష్ కూడ కొత్త సినిమాలో తన శరీర దారుడ్యాన్ని సిక్స్ ప్యాక్ లో చూపించేందుకు సిద్దమవుతున్నారు.
Tuesday, July 22, 2008
చిరంజీవి పార్టీ ఫోన్ నంబర్: 040-44333344
కొంతకాలంగా ఊహిస్తున్న చిరంజీవి పార్టీ కార్యకలాపాలకు చిరునామా స్పష్టమైంది. సోమవారం హైదరాబాద్ లో ప్రారంభమైన చిరంజీవీ పార్టీ సన్నాహక సమావేశాలలో భాగంగా మంగళ వారం కూడా వివిధ జిల్లల నేతలతో పార్టీ కోర్ కమిటీ నాగబాబు
, అల్లు అరవింద్, డాక్టర్ మిత్రా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా పార్టీ అనుసరించాల్సిన వైఖరి, వెళ్ళాల్సిన మార్గాలను డాక్టర్ మిత్రా, నాగబాబు, అల్లు అరవింద్ లు నేతలతో విస్తృతంగా చర్చించారు. ప్రదానంగా నేతల నుంచి సలహాలు, సూచనలు తీసుకున్న కోర్ కమిటీ ప్రతి జిల్లలోను పార్టీ జిల్లా కార్యాలయాన్ని త్వరితగతిన ఏర్పాటు చేయాలని సూచించారు. పాటీ విధివిధానాలను సైతం సిద్దం చేస్తున్న కోర్ కమిటీ ఆయా జిల్లాల నేతలు, కార్యకర్తలతో సంప్రదింపులు జరిపెందుకు హైదరాబాద్ లోని పార్టీ ప్రధాన కార్యలయ ఫోన్ నంబర్ ను ప్రకటించారు. ఇకపై పార్టీ కార్య కలాపాలకు సంభందించిన వ్యవహారాలకు 040-44333344 అనే నంబర్ లో సంప్రదింపులు జరపాలని డాక్టర్ మిత్రా ఈ సందర్బంగా తెలిపారు. చిరంజీవి జన్మదినోత్సవమైన ఆగష్ట్ 22 కు ముందుగానే పార్టీని ప్రకటించెందుకు ప్రణాళిక సిద్దమవుతుండటంతో దీనికి ముందే అన్ని ప్రంతాలలో సభ్యులను చేర్పించే విషయం కోర్ కమిటీ సన్నహక సమావేశాల్లో నేతలకు సూచనలు చేస్తోంది.
చిరంజీవి పార్టీ షురూ...!!
ఇప్పటి వరకు అంతరంగికంకానే సాగిన పార్టీ ఆవిర్భావ ప్రణళికలకు పుల్ స్టాప్ పెట్టిన మెగ స్టార్ చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. త్వరలో పార్టీ ఆవిర్భావాన్ని ప్రకటించెందుకు సిద్దమైతున్న చిరంజీవి ముందుగా రష్ట్రంలోని ఆయా జిల్లల్లో ఉన్న తమ పార్టీ నేతలతో సమవెశం కావాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే సోమవారం నుంచి శని వారం వరకు వివిధ జిల్లల నేతలతో సమవేశమవుతున్నారు. ఇందులో భాగంగానే సోమవారం పార్టీ సన్నాహక సమావేశాలను బంజరా హిల్ల్స్ లోని రావి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో ఏర్పాటు చేశారు. ఇందులో తెలంగాణ జిల్లాలైన కరిమ్నగర్, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు చెందిన నేతలతో సమావెశమై భవిష్య కార్యాచరణపై చర్చించారు. ఈ సమావేశంలో చిరంజీవి సోదరుడు నాగబాబు, చిరంజీవి సన్నిహితుడు, పార్టీ సలహాదారుడు డాక్టర్ పి.మిత్రా పల్గొన్నారు. శనివారం వరకు కొనసాగే ఈ సమావేశాల్లో రోజు నాలుగు జిల్లాలకు చెందిన నేతలతో చర్చించనున్నారు.
Monday, July 21, 2008
Subscribe to:
Posts (Atom)


















