
గురువారం సెవన్‌అప్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఆయన విజయవాడలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. సెవన్‌అప్ ఏర్పాటుచేసిన కాంటెస్ట్‌లో విజేతలైన వారికి బహుమతులు అందించారు. ఇష్టమైన పనులు చేయడంలో ఉన్న అందం వర్ణించలేనిదని, సెవన్‌అప్ అనేది నాకిష్టమైన డ్రింక్ అని.. అందుకే పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని అల్లు అరవింద్ తెలిపారు. పుట్టిపెరిగింది మద్రాసులోనైనా, విజయవాడతో ఎనలేని అనుబంధముందని ఆయన గుర్తుచేసుకున్నారు. తన మాతృమూర్తి పుట్టినిల్లు విజయవాడేనని, అప్పుడు ఎక్కువసార్లు విజయవాడ వచ్చినా ఎవరికీ తెలిసేది కాదని, కానీ ఈ స్థితిలో వచ్చాక అందరికీ తెలిసిపోతుందని చెప్పారు. తాను యూత్‌కే పెద్దపీఠ వేస్తానని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చిన అరవింద్, సినిమా సినిమాకు గ్యాప్‌వస్తే ఆర్టిస్టుని మర్చిపోతారని పేర్కొన్నారు. ఇలాంటి యాడ్స్‌లో కన్పిస్తే మళ్ళీ ప్రేక్షకుడికి గుర్తు చేసినట్లవుతుందని తెలిపారు. చిరంజీవి రాజకీయపార్టీపై స్పందిస్తూ... తాను
కూడా చిరంజీవి అభిమానినని, పార్టీ పెడితే స్పందించకుండా ఎలా ఉండగలను? అని తిరిగి ప్రశ్నించారు. ప్రచారం చేస్తానా? నిలబడతానా? అనేవి తగిన సమయంలో ఏది చేయాలో అదే చేస్తానని దాటవేశారు. తన అభిమానులతో పాటు తాను కూడా శక్తి వంచన లేకుండా చిరంజీవి పార్టీ కోసం కృషిచేస్తానని మాత్రం ఇప్పటికి చెప్పగలనని వెల్లడించారు. ప్రస్తుతం ఆర్య-2 చిత్రం చేస్తున్నానని వెల్లడించారు.

No comments:
Post a Comment