తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ను భారతీయ జనతా పార్టీ (బిజెపి) అగ్రనేత ఎల్। కె. అద్వానీ బుధవారం సాయంత్రం కలుసుకున్నారు. సాయంత్రం 6.30 గంటలకు అద్వానీ పోయెస్ గార్డెన్‌లో ని రజనీకాంత్ ఇంటికి వెళ్లారు. దాదాపు అర్థగంట పాటు ఆయనతో మంతనాలు జరిపారు. ఇది పలు రాజకీయ ఊహాగానాలకు తెరలేపింది. ఇటీవలే అభిమానులతో సమావేశమైన రజనీకాంత్ 'దేవుడు ఆదేశిస్తే తాను రేపైనా రాజకీయాల్లోకి వస్తాన'ని చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అద్వానీ రజనీకాంత్ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. రజనీకాంత్ ఇంటికి సమీపంలోనే అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఇల్లు ఉంది। అద్వానీ ఆమెతో సమావేశమయ్యే అవకాశాలున్నాయని బిజెపి వర్గాలు కూడా భావించాయి. ఈ మేరకు ప్రచారం కూడా జరిగింది. అయితే రజనీకాంత్ ఇంటికి అద్వానీ వెళ్లి సంచల
నం సృష్టించారు. అనంతరం రజనీకాంత్ నారదగాన సభలో జరిగిన అద్వానీ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరై కార్యక్రమం ముగిసేంత వరకు ఉన్నారు. కార్యక్రమం అనంతరం రజనీకాంత్ విలేకరులతో మాట్లాడుతూ తమ సమావేశానికి ఎలాంటి ప్రాధాన్యం లేదని, ఇది కేవలం మర్యాదపూర్వక సమావేశం మాత్రమేనని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో భాజపాకు ప్రచారం చేస్తున్నారా అని ప్రశ్నించగా 'లేదు' అని సమాధానమిచ్చారు.
అయితే అద్వానీ మాత్రం ఎప్పటి నుంచో తన ఇంటికి రావాల్సిందిగా రజనీకాంత్ కోరారని, దీంతో తాను ఈ రోజు వీలు చూసుకుని ఆయన ఇంటికి వెళ్లానని తెలిపారు. చాలాసేపు పలు అంశాలపై మాట్లాడుకున్నామన్నారు. తాను ఇటీవల నటించిన శివాజీ చిత్రం తాలూకు డీవీడీని రజనీకాంత్ బహుకరించారని తెలిపారు.
No comments:
Post a Comment