Thursday, July 24, 2008

రజినీ కాంత్, జగపతి బాబుల "కథానాయకుడు" వాల్ పేపర్స్


కన్నడ నాట కాజల్ అగర్వాల్

'చందమామ' సినిమాతో తెలుగునాట వరసగా ఆఫర్స్ సంపాదిస్తూ దూసుకు పోతున్న కాజల్ అగర్వాల్ మీద ఇప్పుడు కన్నడ వారి దృష్టి పడింది. అక్కడ సూపర్ స్టార్ గా వెలుగుతున్న శివరాజ్ కుమార్ హీరోగా చేసే AK97 సినిమా లో ఆమె బుక్కయింది. దాంతో ఆల్రెడీ తమిళంలో (భరత్ తో Pazhani, అర్జున్ తో Bommalattam) చేస్తూ పేరు తెచ్చుకున్న ఆమె మరో సౌత్ సినిమాకు సైన్ చేయటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.దాంతో అందరకీ డేట్స్ ఎడ్జెస్ట్ చేయటం చాలా కష్టం కదా అని ఒకరిద్దరు దగ్గరవారు ఆమెతో అన్నారుట. అయితే ఆమె తనకు టైం మేనేజ్ మెంట్ తెలుసు ప్లాబ్లం లేదని చెప్తోందిట. ఇక ఈ AK97 సినిమాని ఓం ప్రకాష్ డైరక్ట్ చేస్తున్నాడు. డిసెంబర్ లో సెట్స్ మీదకు వెళ్ళబోయే ఈ సినిమాలో జయప్రద హీరో తల్లిగా ప్రత్యేక పాత్రలో నటించనుంది. ఇది ఫ్యామిలీ నేపధ్యంలో జరిగే యాక్షన్ ఓరియెంటడ్ సినిమా అని దర్శకుడు చెప్తున్నారు.

కథానాయకుడు కథానాయకి నయనతార


"జర్నీ టు ది సెంటర్ ఆఫ్ ది ఎర్త్" TrailerJourney to the Center of the Earth Trailer

Wednesday, July 23, 2008

కమెడియన్ ఆలి సిక్స్ ప్యాక్...!!

ఇప్పటి వరకు సిక్స్ ప్యాక్ మోజులో ఉన్న హీరోల సరసన కొత్తగా కమేడియన్ ఆలి చేరారు.
త్వరలో విడుదల కానున్న 'సెల్యూట్' చిత్రం లో ఆలి సిక్స్ ప్యాక్ శరీర సౌష్టవంతో కనిపించనున్నారు. ఈ చిత్ర కథనాయకుడు విషాల్ సిక్స్ ప్యాక్ తో కనిపించనుండగా ఆలి కూడ ఈ అదేవిధంగా దర్శనమివ్వనుండటం గమనార్హం. శరీరాన్ని ఒక షేపులో చూపించే ఈ సిక్స్ ప్యాక్ విధానంపై ఇప్పటికే బాలివుడ్ నుంచి దక్షిణాధి హీరోలంతా మోజుపడగా కొత్తగా కామెడీ తారలు కూడ ఈ వరుసలో చేరటం దీనిపై ఎంతటి క్రేజ్ ఏర్పడిందో తెలుస్తొంది. ఈ సిక్స్ ప్యాక్ ఏ మేరకు ఆకట్టుకుంటుందో తెలియదు కాని త్వరలో కామెడీ హీరో అల్లరి నరేష్ కూడ కొత్త సినిమాలో తన శరీర దారుడ్యాన్ని సిక్స్ ప్యాక్ లో చూపించేందుకు సిద్దమవుతున్నారు.

Tuesday, July 22, 2008

చిరంజీవి పార్టీ ఫోన్ నంబర్: 040-44333344

కొంతకాలంగా ఊహిస్తున్న చిరంజీవి పార్టీ కార్యకలాపాలకు చిరునామా స్పష్టమైంది. సోమవారం హైదరాబాద్ లో ప్రారంభమైన చిరంజీవీ పార్టీ సన్నాహక సమావేశాలలో భాగంగా మంగళ వారం కూడా వివిధ జిల్లల నేతలతో పార్టీ కోర్ కమిటీ నాగబాబు, అల్లు అరవింద్, డాక్టర్ మిత్రా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా పార్టీ అనుసరించాల్సిన వైఖరి, వెళ్ళాల్సిన మార్గాలను డాక్టర్ మిత్రా, నాగబాబు, అల్లు అరవింద్ లు నేతలతో విస్తృతంగా చర్చించారు. ప్రదానంగా నేతల నుంచి సలహాలు, సూచనలు తీసుకున్న కోర్ కమిటీ ప్రతి జిల్లలోను పార్టీ జిల్లా కార్యాలయాన్ని త్వరితగతిన ఏర్పాటు చేయాలని సూచించారు. పాటీ విధివిధానాలను సైతం సిద్దం చేస్తున్న కోర్ కమిటీ ఆయా జిల్లాల నేతలు, కార్యకర్తలతో సంప్రదింపులు జరిపెందుకు హైదరాబాద్ లోని పార్టీ ప్రధాన కార్యలయ ఫోన్ నంబర్ ను ప్రకటించారు. ఇకపై పార్టీ కార్య కలాపాలకు సంభందించిన వ్యవహారాలకు 040-44333344 అనే నంబర్ లో సంప్రదింపులు జరపాలని డాక్టర్ మిత్రా ఈ సందర్బంగా తెలిపారు. చిరంజీవి జన్మదినోత్సవమైన ఆగష్ట్ 22 కు ముందుగానే పార్టీని ప్రకటించెందుకు ప్రణాళిక సిద్దమవుతుండటంతో దీనికి ముందే అన్ని ప్రంతాలలో సభ్యులను చేర్పించే విషయం కోర్ కమిటీ సన్నహక సమావేశాల్లో నేతలకు సూచనలు చేస్తోంది.

చిరంజీవి పార్టీ షురూ...!!

ఇప్పటి వరకు అంతరంగికంకానే సాగిన పార్టీ ఆవిర్భావ ప్రణళికలకు పుల్ స్టాప్ పెట్టిన మెగ స్టార్ చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. త్వరలో పార్టీ ఆవిర్భావాన్ని ప్రకటించెందుకు సిద్దమైతున్న చిరంజీవి ముందుగా రష్ట్రంలోని ఆయా జిల్లల్లో ఉన్న తమ పార్టీ నేతలతో సమవెశం కావాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే సోమవారం నుంచి శని వారం వరకు వివిధ జిల్లల నేతలతో సమవేశమవుతున్నారు. ఇందులో భాగంగానే సోమవారం పార్టీ సన్నాహక సమావేశాలను బంజరా హిల్ల్స్ లోని రావి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో ఏర్పాటు చేశారు. ఇందులో తెలంగాణ జిల్లాలైన కరిమ్నగర్, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు చెందిన నేతలతో సమావెశమై భవిష్య కార్యాచరణపై చర్చించారు. ఈ సమావేశంలో చిరంజీవి సోదరుడు నాగబాబు, చిరంజీవి సన్నిహితుడు, పార్టీ సలహాదారుడు డాక్టర్ పి.మిత్రా పల్గొన్నారు. శనివారం వరకు కొనసాగే ఈ సమావేశాల్లో రోజు నాలుగు జిల్లాలకు చెందిన నేతలతో చర్చించనున్నారు.

"ది మమ్మీ - టామ్బ్ ఆఫ్ ది డ్రాగన్ ఎమ్పరర్" అఫిషియల్ వాల్ పేపర్స్