Thursday, October 9, 2008

రజనీకాంత్ కు బిజెపి పిలుపు

సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చి, ప్రజాసేవ చేయాల్సిన అవసరముందని భారతీయ జనతా పార్టీ కోరింది। తెలుగు హీరో చిరంజీవి ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో అడుగుపెట్టినట్టే రజనీకాంత్ కూడా క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని తమిళ ప్రజలు కోరుకుంటున్నారని బిజెపి జాతీయ కార్యదర్శి, పార్లమెంటు సభ్యుడు ఎస్ తిరునవుక్కరసు అన్నారు. "రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడానికి ఇది సరైన సమయం. ఆయన సొంతంగా పార్టీ పెట్టుకోవడం ఇంకా ఉత్తమం. తమిళనాడు ప్రజల్లో ఆయన అంటే ఎంతో అభిమానం ఉంది. చిరంజీవి లాగా ఆయన పార్టీ ఏర్పాటు చేస్తే బిజెపి స్వాగతిస్తుంది" అని ఆయన వివరించారు.
కోయంబత్తూర్ లో రజనీ అభిమానులు ఇటీవల దేశీయ ద్రావిడ మక్కల్ మున్నేట్ర కజగం (డిడిఎంఎంకె) పార్టీని స్ధాపించిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో రజనీకాంత్ ఆలస్యం చేయకుండా రాజకీయాల్లోకి దిగాలని తిరునవుక్కరసు సూచించారు. రజనీ సొంతగా పార్టీ పెట్టుకున్నా, బిజెపిలో చేరినా తమకు ఆనందమేనని ఆయన అన్నారు.

No comments: