యంగ్‌టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) సమర్పణలో వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై రూపొంతున్న భారీ చిత్రం రెగ్యూలర్ షూటింగ్ ఈ నెల 24న ప్రారంభం కానుంది. వల్లభనేని వంశీమోహన్ ఈ చిత్ర నిర్మాత.అక్టోబరు 24 నుంచి నవంబరు 12 వరకు ఈ సినిమా తొలి షెడ్యూల్ జరుగుతుంది. ఈ షెడ్యూల్‌లో సినిమాలోని చైల్డ్ ఎపిసోడ్ తీస్తామని నిర్మాత తెలిపారు. 29 నుంచి వచ్చే నెల 4 వరకు ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ ఫైట్‌ను భారీ ఎత్తున తెరకెక్కిస్తామని చెప్పారు. అనంతరం నవంబరు 12 వ
రకు రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్మిస్తున్న భారీ సెట్‌లో ఒక పాటను చిత్రీకరిస్తామని వెల్లడించారు.ఎన్టీఆర్ సరసన ఇలియానా ఒక కథానాయికగా నటిస్తోంది. మరో కథానాయికను ఎంపిక చేయాల్సివుంది.
No comments:
Post a Comment