రానున్న డిసెంబర్ ధర్టీ ఫస్ట్ నైట్ పార్టీలో కత్రినా కైఫ్ ఆడిపాడటానికి ముంబయిలోని జి.డబ్ల్యూ మారెయట్ హోటల్ వారు ఆమెకా రేటు ఆఫర్ చేసారు.
ఎందుకంటే బాలీవుడ్ లో హైయిస్ట్ పెయిడ్ హీరోయిన్ ప్రస్తుతం ఆమే మరి. ఆమె వస్తోందంటే ఆ రాత్రి హోటల్ లో రూమ్స్ ఎంత రేటున్నా ఫిలప్ అయిపోతాయి. క్రితం సంవత్సరం తొంభై లక్షలు ఇచ్చి అలానే బిబాసా బసు ని అంతకు ముందు సంవత్సరం యాభై లక్షలిచ్చి మల్లికా షెరావత్ ని బుక్ చేసారు.
ఇప్పుడా అవకాశం కత్రినా వరించటం బాలీవుడ్ లోని మిగతా హీరోయిన్స్ కి నిద్రపట్టనివ్వటం లేదు. ఇక ఆ పంక్షన్ కోసం వారే ప్రత్యేక మైన డిజైన్ తో డ్రస్ తయారు చేస్తారు. రాత్రంతా హ్యాపీ న్యూఇయిర్ సంబరాలు కి అణుగుణంగా డాన్స్ లు చేస్తూ వచ్చిన అతిధులకు విషెష్ చెప్పాలి. ఇక ఈ బిగ్ నైట్ ని కొన్ని ఛానెల్స్ కి లైవ్ ఇస్తారు. ఇక ఇదే పని ఏ రికార్డింగ్ డాన్స్ వారో మరొకరో పొట్ట కూటి కోసం చేస్తే తమ రేంజిలో చేస్తే పోలీసులు అరెస్టు చేస్తారు. అదే ఈ పంక్షన్ కి పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఓ స్ధాయిలో వారు కూడా ఫ్రీ పాస్ లు కోసం ట్రై చేస్తూంటారని ముంబయి పత్రికలు వ్యాఖ్యానిస్తున్నాయి. లోక న్యాయం అంతే కదా మరి.
No comments:
Post a Comment