Thursday, October 30, 2008

జేమ్స్‌బాండ్ నూతన చిత్రం 'క్వాంటమ్ ఆఫ్ సొలెస్'

జేమ్స్‌బాండ్ సిరీస్‌లో కొత్తగా వస్తున్న క్వాంటమ్ ఆఫ్ సొలెస్ జేమ్స్‌బాండ్- 2008 చిత్రం వచ్చే నెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. మార్క్‌పోస్టర్ ఈ సినిమా దర్శకుడు. ఇటలీ, పిలి, పనామా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, రష్యా తదితర దేశాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రాన్ని అత్యధిక ప్రింట్లతో భారత్‌లో విడుదల చేస్తున్నారు.
సినిమాను దక్షిణాది రాష్ట్రాల్లో విడుదల చేస్తున్న విజయ సినీ ఎంటర్‌ప్రైజెస్ అధినేత ఎం.శ్రీధరన్ మాట్లాడుతూ.. మొత్తం 300 ప్రింట్లతో సినిమాను విడుదల చేస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనే 150 ప్రింట్లతో సినిమాను ఇంగ్లీషు, తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నట్టు చెప్పారు.

అమెరికాలో ఈ సినిమా నవంబర్ 14న విడుదలవుతుండగా, వారం రోజుల ముందుగా భారత్‌లో విడుదలవుతుండటం గమనార్హం. పైరసీను నియంత్రించడం కోసమే ఇండియాలో దీనిని ముందుగా విడుదల చేస్తున్నట్టు శ్రీధరన్ వెల్లడించారు. సాధారణంగా జేమ్స్‌బాండ్‌ చిత్రాల్లో ఉండే ఫైట్‌లు, ఛేజ్‌లు ఈ సినిమాలోనూ ఉంటాయి.

ప్రపంచాన్ని అత్యధిక ఉష్టోగ్రతో నాశనం చేసిన అనంతరం సరికొత్త ప్రపంచాన్ని సృష్టించి, దానికి నాయకుడు అవ్వాలనే విలన్ ఫార్ములాను హీరో ఎదుర్కోడవమే ఈ సినిమా కథాంశం. యాక్షన్ సన్నివేశాల్లో హీరో డానియల్ క్రెగ్, హీరోయిన్ ఓల్గా కురివెంకో అద్భుతంగా నటించారు. బాండ్ సిరీస్‌లో వస్తున్న 28వ చిత్రమిది.

'Quantum of Solace' Official Trailer

Tuesday, October 28, 2008

ఒక్క రాత్రికి కత్రినా కైప్ఫ్ రేటు అక్షరాలా కోటి !


రానున్న డిసెంబర్ ధర్టీ ఫస్ట్ నైట్ పార్టీలో కత్రినా కైఫ్ ఆడిపాడటానికి ముంబయిలోని జి.డబ్ల్యూ మారెయట్ హోటల్ వారు ఆమెకా రేటు ఆఫర్ చేసారు.
ఎందుకంటే బాలీవుడ్ లో హైయిస్ట్ పెయిడ్ హీరోయిన్ ప్రస్తుతం ఆమే మరి. ఆమె వస్తోందంటే ఆ రాత్రి హోటల్ లో రూమ్స్ ఎంత రేటున్నా ఫిలప్ అయిపోతాయి. క్రితం సంవత్సరం తొంభై లక్షలు ఇచ్చి అలానే బిబాసా బసు ని అంతకు ముందు సంవత్సరం యాభై లక్షలిచ్చి మల్లికా షెరావత్ ని బుక్ చేసారు.
ఇప్పుడా అవకాశం కత్రినా వరించటం బాలీవుడ్ లోని మిగతా హీరోయిన్స్ కి నిద్రపట్టనివ్వటం లేదు. ఇక ఆ పంక్షన్ కోసం వారే ప్రత్యేక మైన డిజైన్ తో డ్రస్ తయారు చేస్తారు. రాత్రంతా హ్యాపీ న్యూఇయిర్ సంబరాలు కి అణుగుణంగా డాన్స్ లు చేస్తూ వచ్చిన అతిధులకు విషెష్ చెప్పాలి. ఇక ఈ బిగ్ నైట్ ని కొన్ని ఛానెల్స్ కి లైవ్ ఇస్తారు. ఇక ఇదే పని ఏ రికార్డింగ్ డాన్స్ వారో మరొకరో పొట్ట కూటి కోసం చేస్తే తమ రేంజిలో చేస్తే పోలీసులు అరెస్టు చేస్తారు. అదే ఈ పంక్షన్ కి పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఓ స్ధాయిలో వారు కూడా ఫ్రీ పాస్ లు కోసం ట్రై చేస్తూంటారని ముంబయి పత్రికలు వ్యాఖ్యానిస్తున్నాయి. లోక న్యాయం అంతే కదా మరి.

Tuesday, October 21, 2008

ఎన్టీఆర్ కొత్త సినిమా

యంగ్‌టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) సమర్పణలో వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై రూపొంతున్న భారీ చిత్రం రెగ్యూలర్ షూటింగ్ ఈ నెల 24న ప్రారంభం కానుంది. వల్లభనేని వంశీమోహన్ ఈ చిత్ర నిర్మాత.అక్టోబరు 24 నుంచి నవంబరు 12 వరకు ఈ సినిమా తొలి షెడ్యూల్ జరుగుతుంది.

ఈ షెడ్యూల్‌లో సినిమాలోని చైల్డ్ ఎపిసోడ్ తీస్తామని నిర్మాత తెలిపారు. 29 నుంచి వచ్చే నెల 4 వరకు ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ ఫైట్‌ను భారీ ఎత్తున తెరకెక్కిస్తామని చెప్పారు. అనంతరం నవంబరు 12 రకు రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్మిస్తున్న భారీ సెట్‌లో ఒక పాటను చిత్రీకరిస్తామని వెల్లడించారు.ఎన్టీఆర్ సరసన ఇలియానా ఒక కథానాయికగా నటిస్తోంది. మరో కథానాయికను ఎంపిక చేయాల్సివుంది.

తన అభిమానుల అంచనాలను అందుకునే రీతిలో ఈ సినిమా ఉంటుందని హీరో ఎన్టీఆర్ నమ్మకం వ్యక్తం చేశారు. తన కెరీర్‌లో మరో సెన్సేషనల్ మూవీ అవుతుందన్నారు. ఆడియన్స్, ఫాన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్లుగా చాలా హైలెవెల్‌లో ఈ సినిమా ఉంటుందని దర్శకుడు తెలిపారు.ఎన్టీఆర్- వినాయక్ కాంబినేషన్‌లో గతంలో "ఆది", "సాంబ" చిత్రాలు వచ్చాయి. ఈ సినిమా కూడా ఘన విజయం సాధిస్తుందని వినాయక్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సినిమాకు కథ- మాటలు: కోన వెంకట్, సంగీతం: దేవీశ్రీప్రసాద్, ఫొటోగ్రఫీ: ఛోటా కె.నాయుడు, ఫైట్స్: స్టన్ శివ, ఆర్ట్: ఆనంద్‌సాయి, ఎడిటింగ్: గౌతంరాజు, కో-ఆర్డినేటర్: తోట రామకృష్ణ, కో- డైరెక్టర్: పుల్లారావు కొప్పినీడి, ప్రొడక్షన్ కంట్రోలర్: జి.వి.కె.రాజు.

Monday, October 20, 2008

హాలీవుడ్ టాప్ 5 (అక్టోబర్ 17 - 19 , 2008)

1. Max Payne (Fox): $18.0 million 2. Beverly Hills Chihuahua (Buena Vista): $69.1 million
3. The Secret Life of Bees (Fox Searchlight): $11.1 million
4. W. (Lionsgate): $10.6 million
5. Eagle Eye (Paramount (DreamWorks)): $81.3 million