Friday, February 29, 2008
అమెరికాలో నిర్వహించనున్న "చేంజ్ అండ్ హోప్ విత్ చిరంజీవి"
అమెరికాలోని "ప్రో తెలుగు ఆర్గనైజేషన్" (పిటివో) " చేంజ్ అండ్ హోప్ విత్ చిరంజీవి" అనే కార్యక్రమాన్ని మార్చి ఒకటో తేదీన సీటెల్, లాస్ వెగాస్, మిన్నె పోలిస్ నగరాల్లో నిర్వహించబోతోంది. పోర్ట్ ల్యాండ్ లో రెండో తేదీన సమావేశం జరుగుతుంది.
ఈ సంస్ధ ఇటీవల డల్లస్, హోస్టన్, వాషింగ్టన్, న్యూజెర్సీ, బే ఏరియా, లాస్ ఎంజెలిస్, చికాగో, డెట్రాయిట్, అట్లాంటా, ఆర్లాండో, శాన్ డీగో, సెంట్ లూయిస్, బోస్టన్, కొలంబస్, ఫీనిక్స్, రలేగ్ ప్రాంతాల్లో నిర్వహించి ఇటువంటి కార్యక్రమాలకు మంచి స్పందన వచ్చిందని ప్రో తెలుగు ఆర్గనైజేషన్ ఒక ప్రకటనలో తెలియజేసింది. మార్చి 1, 2 తేదీల్లో అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో జరుగనున్న కార్యక్రమ్మాల్లో పాల్గొని చిరంజీవి రాజకీయాల్లోకి రావలసిన ఆవశ్యకత, పార్టీ విధానాలు తదితర అంశాలపై చర్చించడానికి రావలసిందిగా అమెరికాలో ని చిరంజీవి అభిమానులను ఈ సంస్ధ ఆహ్వానించింది. మరిన్ని వివరాలకు ఈ సైట్స్ ను సందర్శించవలసిందిగా ఈ సంస్ధ వ్యవస్ధాపకుడు రామ్ తాతినేని తెలిపారు.

Thursday, February 28, 2008
పిరమిడ్ గ్రూప్ విడుదల చేయనున్న "గమ్యం"
నరేష్, శర్వానంద్ హీరోలుగా, కమలిని ముఖర్జీ హీరోయింగా రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందిన "గమ్యం" చిత్రాన్ని పిరమిడ్ సాయిమిరా గ్రూప్ విడుదల చేస్తోంది. ఫర్స్ట్ ఫ్రేం పతాకంపై జగర్లమూడి సాయిబాబు రూపొందించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఎవరికైనా గమ్యం ఉంటుంది, అది చేరుకోవడానికి ఎవరి ప్రయత్నాలు వారు చేయడం సహజం. అలాగే ఈ చిత్రంలో కథా నాయకులకు, హీరోయిన్ కు వేరు వేరు గమ్యాలు వుంటాయి, వాటిని చేరుకోవడానికి వారు చేసిన ప్రqయత్నమే ఈ "గమ్యం" చిత్రం కథ.ఆద్యంతం వినోదాన్ని పంచుతూపోయే ఈ చిత్రంలో అభిషేక్, బ్రహ్మానందం, గిరిబాబు, శ్వేత అగర్వాల్, ఎల్ బీ శ్రీరాం, ఎం ఎస్ నారాయణ, హేమ ముఖ్య తారాగణంగా నటించిన ఈ చిత్రానికి సిరివెన్నెల సీతారామ శాస్త్రి అందించిన పాటలు ప్రత్యేక ఆకర్షనగా నిలుస్తాయని పత్రికలు తమ రివ్యూలలో పేర్కొనడం ఇక్కడ గమనార్హం.
పిరమిడ్ గ్రూప్ భారత్ లో విడుదలచేయనున్న హాలీవుడ్ చిత్రం "డి-వార్" గ్యాలరీ
కొరియాలో నిర్మింపబడి ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయాన్ని సాధించిన "డి-వార్" చిత్రాన్ని పిరమిడ్ సాయిమిరా థియేటర్ లిమిటెడ్ భారత దేశంలో విడుదల చేయనుంది. ఒక్క ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడులలో తప్ప మిగిలిన అన్ని రాష్టాలలో ఈ చిత్రాన్ని పిరమిడ్ విడుదల చేయనుంది. ప్రపంచ వ్యాప్తంగా మంచి విజయాన్ని సాధించిన ఈ చిత్రంపై భారతీయ చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలే నెలకొన్నాయి.
Wednesday, February 27, 2008
Subscribe to:
Posts (Atom)