అద్బుతమైన ప్రేమ కథతో రూపొందించబడ్డ "జోధా అక్బర్" ఈ నెల 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవనుంది. ఐశ్వర్యారాయ్, హృతిక్ రోషన్ నటించిన "జోథా అక్బర్" చిత్రం పాటలు వీనులవిందుచేస్తుండగా, ఈ చిత్రంపై అంచనాలు భారీ యెత్తున పెరిగిపోయాయి. చిత్రాన్ని ఎప్పుడు వీక్షిద్దామా అన్న ఆసక్తిలో యావత్భారత సినీ ప్రేక్షకులు ఉన్నారు.16వ శతాబ్దంనాటి కాలాన్ని జ్ఞప్తికి తెచ్చే భారీ సెట్ల మధ్యన రూపొందించిన ఈ చిత్రంలో ప్రపంచ అందాల సుందరిగా మన్ననలు అందుకుంటున్న ఐశ్వర్యారాయ్ అద్భుత లావణ్యరాశి జోథా భాయ్ గా నటించటం, ఇండియన్ టార్జాన్ హృతిక్ రోషన్ జోథా ప్రేమికుడైన సలీం చాలా వ్యయ ప్రయాషలతో అతద్భుతంగా రూపొందించినట్లు వినికిడి. చిత్రం తాలూకు నటులు, వారి పాత్రలు ఎలా ఉంటాయన్నవాటిపై ఒక్కసారి దృష్టి సారిస్తే. బాలీవుడ్ డాషింగ్ హీరో హృతిక్ రోషన్ ప్రధానపాత్ర అయిన జలాలుద్దీన్ మహ్మద్ అక్బర్‌గా నటిస్తున్నాడు. రాజా భర్మాల్ కూతురైన జోథా పాత్రలో ఐశ్వర్యారాయ్ నటిస్తోంది.
రాజకీయ విజయం సాధించి తనకు ఎదురేలేదని నిరూపించుకున్న అక్బర్(హృతిక్ రోషన్) తన సామ్రాజ్యాన్ని అటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇటు బంగాళాఖాతం వరకు, హిమాలయాలనుంచి గోదావరి వరకు విస్తరింపచేయాలని నిశ్చయించుకుంటాడు. ఈ క్రమంలో రాజ్‌పుట్‌లపై అక్బర్ ఘనవిజయం సాధించి రాజ్యాన్ని తన వశం చేసుకుంటాడు. రాజకీయ లబ్ధికోసం రాజా భర్మాల్ తన కుమార్తె జోథా చేతిని అక్బర్‌కి అందివ్వాలనుకుంటాడు. అయితే అక్బర్ తన పయనాన్ని నిజమైన ప్రేమవైపు సాగిస్తాడు. మరోవైపు యుద్ధభూమిలో అజేయుడైన జలాలుద్దీన్ "అక్బర్ ది గ్రేట్" బిరుదును పొందుతాడు. అరబిక్ భాషలో "అక్బర్" అంటే "గొప్ప" అని అర్థం. తన యుద్ధ నైపుణ్యంతో రాజ్యాలను సునాయాశంగా గెలిచిన అక్బర్ జోథా మనసును గెలుచుకోవటం కోసం ఏంచేశాడన్నఆసక్తితో చిత్రం సాగుతుంది. ఈ చిత్రాన్ని దాదాపు రూ.400 మిలియన్ల భారీ బడ్జెట్‌తో రూపొందించారు. అంతేకాదు నాటి పరిస్థితులను అద్దంపట్టేటట్లు ప్రముఖ చరిత్రకారులను వినియోగించారు. ఆగ్రా, జైపూర్ ప్రాంతాలలో ఈ చిత్రం రూపుదిద్దుకోవటంతో నాటి అక్బర్ సామ్రాజ్యం నిజంగానే మన కళ్లముందు ప్రత్యక్షమవుతుంది. ఇంకా ఈ చిత్రంలో 80 ఏనుగులు, వంద గుర్రాలు, 55 ఒంటెలను వినియోగించారు. మొత్తంమీద ప్రేమజంట "జోథా అక్బర్" ఫిబ్రవరి 15న ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment