
ఈ సంస్ధ ఇటీవల డల్లస్, హోస్టన్, వాషింగ్టన్, న్యూజెర్సీ, బే ఏరియా, లాస్ ఎంజెలిస్, చికాగో, డెట్రాయిట్, అట్లాంటా, ఆర్లాండో, శాన్ డీగో, సెంట్ లూయిస్, బోస్టన్, కొలంబస్, ఫీనిక్స్, రలేగ్ ప్రాంతాల్లో నిర్వహించి ఇటువంటి కార్యక్రమాలకు మంచి స్పందన వచ్చిందని ప్రో తెలుగు ఆర్గనైజేషన్ ఒక ప్రకటనలో తెలియజేసింది. మార్చి 1, 2 తేదీల్లో అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో జరుగనున్న కార్యక్రమ్మాల్లో పాల్గొని చిరంజీవి రాజకీయాల్లోకి రావలసిన ఆవశ్యకత, పార్టీ విధానాలు తదితర అంశాలపై చర్చించడానికి రావలసిందిగా అమెరికాలో ని చిరంజీవి అభిమానులను ఈ సంస్ధ ఆహ్వానించింది. మరిన్ని వివరాలకు ఈ సైట్స్ ను సందర్శించవలసిందిగా ఈ సంస్ధ వ్యవస్ధాపకుడు రామ్ తాతినేని తెలిపారు.
No comments:
Post a Comment