Tuesday, September 30, 2008
Monday, September 29, 2008
చిరంజీవి ప్రజాయాత్ర
చిరంజీవి ప్రజాయాత్రకు సమయం ఆసనమవుతోంది. ప్రజాయాత్ర తేదీలు ఇంకా ఖరారు కాలేదని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి చెప్పినా ఈ అక్టోబర్ రెండు నుంచి ఆయన అనధికారికంగా అధికార యాత్రనే చేయనున్నారు.
త్వరలో ఈ యాత్ర తేదీలను ఖరారు చేస్తామని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. తాను మొదట కోస్తాలో మూడు జిల్లాలు, ఆ తర్వాత రాయలసీమ, తెలంగాణ జిల్లాల్లో పర్యటిస్తానని ఆయన వెల్లడించారు. అక్టోబరు 2 గాంధీ జయంతి రోజున "వూరూరా ప్రజారాజ్యం-వూరూరా పండగ" అనే కార్యక్రమాన్ని వారం రోజుల పాటు జరపనున్నట్టు ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తెలిపారు. అక్టోబరు 2న రాష్ట్రంలోని అన్నీ గ్రామాలు, పట్టణాల్లో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పార్టీ జెండాలు ఆవిష్కరించాలని కోరారు. అదే రోజు కోటిమొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఆయన పిలుపునిచ్చారు. దీన్ని కేవలం పార్టీ కార్యక్రమంగా భావించకుండా ఒక సామాజిక కార్యక్రమంగా చూడాలని ఆయన పిలుపునిచ్చారు.
అదే రోజునుంచి పార్టీ సభ్యత్వ నమోదును కూడా ప్రారంభించనున్నట్టు ఆయన వెల్లడించారు. మొదటి సభ్యత్వం వికలాంగుడైన బాలకృష్ణకు ఇచ్చి, తరువాత తాను తీసుకుంటానని ఆయన తెలిపారు. మొదట జిల్లా కార్యాలయాలు ప్రారంభమవుతాయని అనంతరం మండలస్థాయి, గ్రామకమిటీలను ఏర్పాటు చేయనున్నట్టు చిరు తెలిపారు. ఆదీవాసీలకు ఇబ్బంది కలిగితే బాక్సైట్ వెలికితీతను ఆపాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. పోలేపల్లిలో ఎకరం రూ.18 వేలకు తీసుకొని అదే భూమిని లక్షలకు అమ్మడాన్ని ఆయన ప్రశ్నించారు.
అమెరికాతో చేసుకున్న 123 ఒప్పందంపై స్పష్టమైన వైఖరి వెల్లడించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఒప్పందంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, అందువల్ల స్పష్టత అవసరమని ఆయన అన్నారు.
Thursday, September 25, 2008
గోపీ చంద్ 'శౌర్యం'
గోపిచంద్, అనుష్క జంటగా సినిమాటోగ్రాఫర్ శివ దర్శకత్వంలో రూపుదిద్దుకొన్న చిత్రం "శౌర్యం"। ఈ రోజు (గురువారం) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ముస్తాబయ్యింది. కధ ప్రకారం ''విజయ్ (గోపీచంద్) తన చిన్నప్పటి లక్ష్యం కోసం కఠోరంగా శ్రమిస్తుంటాడు. అందులో భాగంగానే కోల్‌కతాకు వెళ్లాల్సి వస్తుంది. అక్కడ శ్వేత (అనుష్క), దివ్య (పూనమ్‌కౌర్) పరిచయమవుతారు. అతనికి లక్ష్యసాధనలో ఎదురైన అడ్డంకులేమిటి? వాటిని ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఆసక్తికరం'' అని దర్శకుడు పేర్కొన్నారు.అలాగే గోపిచంద్, అనుష్కలపై చిత్రీకరించిన రొమాంటిక్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకొంటాయని చెప్పారు. మణిశర్మ సంగీత బాణీలు సమకూర్చిన ఈ చిత్రం ఆడియోకు మంచి స్పందన లభిస్తోంది. ఇక భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయన మాట్లాడుతూ యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో కూడిన చిత్రంగా ఇది ఉంటుంది. అలాగే మా సినిమా పాటలు ఇప్పటికే ప్రజాదరణ పొందాయి. గోపీచంద్ సినిమాల్లో ఉండే యాక్షన్ సన్నివేశాలతోపాటు చక్కటి వినోదం, లవ్లీ రొమాన్స్ కూడా మా చిత్రంలో ఉంటాయి. స్విట్జర్లాండ్ లొకేషన్లు కూడా కనువిందు చేస్తాయని అన్నారు.
Tuesday, September 23, 2008
Saturday, September 20, 2008
Thursday, September 18, 2008
తెలంగాణపై చిరంజీవికి స్పష్టత లేదు: విజయశాంతి
తెలంగాణ కోసం ఇదే చివరి యుద్ధమని తల్లి తెలంగాణ అధినేత విజయశాంతి అన్నారు. తెలంగాణ వాదులంతా ఏకం కావాలని ఆమె పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లా కడివెండి గ్రామంలో ఆమె తెలంగాణ సాయుధ పోరాట అమర వీరుడు దొడ్డి కొమురయ్య స్మారక స్థూపానికి నివాళులర్పించారు.తెలంగాణపై ప్రజారాజ్యం అధినేత చిరంజీవికి స్పష్టత లేదని ఆమె విమర్శించారు. తెలంగాణకు తాము వ్యతిరేకం కాదనే డొంక తిరుగుడు ప్రకటనలు వద్దని ఆమె అన్నారు.
తెలంగాణపై అన్ని పార్టీలు స్పష్టంగా ముందుకు రావాలని ఆమె అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చి తీరాల్సిందేనని ఆమె అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో తల్లి తెలంగాణ విలీనంపై విలేకరులు వేసిన ప్రశ్నకు ఆమె జవాబు దాటవేశారు. తెలంగాణ పార్టీల మధ్య ఐక్యతకు తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చొరవ చూపడం హర్షణీయమని ఆమె అన్నారు.
తెలంగాణపై అన్ని పార్టీలు స్పష్టంగా ముందుకు రావాలని ఆమె అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చి తీరాల్సిందేనని ఆమె అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో తల్లి తెలంగాణ విలీనంపై విలేకరులు వేసిన ప్రశ్నకు ఆమె జవాబు దాటవేశారు. తెలంగాణ పార్టీల మధ్య ఐక్యతకు తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చొరవ చూపడం హర్షణీయమని ఆమె అన్నారు.
Wednesday, September 17, 2008
Wednesday, September 10, 2008
అక్కినేని నాగార్జున 'కింగ్'
అక్కినేని నాగార్జున కొత్త చొత్రం 'కింగ్'తో ఒకనాటి రాజరికాన్ని మరో మారు చూయించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. అలాగని ఇది ఏ జానపద లేక పౌరాణిక చిత్రమో కాదని, కథలో వచ్చే మలుపులలో రాజరికపు కథనం ఉంటుందని తెలుస్తోంది. ఒకప్పటి రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి కథతో "కింగ్" చిత్రం రూపొందుతోంది. తను ఇప్పటి కింగ్‌ననుకుంటాడా? ఆయనేం చేస్తాడు? అనేవి తెలుసుకోవాలంటే "కింగ్" సినిమా వచ్చే వరకు ఆగాల్సిందేనని చిత్ర నిర్మాత డి. శివప్రసాద్ రెడ్డి అంటున్నారు.
కామాక్షి కళామూవీస్ పతాకంపై నాగార్జునతో రూపొందిస్తున్న"కింగ్" సినిమా షూటింగ్ టోలీచౌక్‌లోని డాగ్‌హౌస్‌లో జరుగుతోంది. ఇప్పటి వరకు ఓ పాట, రెండు ఫైట్లు, కొంత టాకీ కలిపి 45శాతం షూటింగ్ పూర్తయిందని నిర్మాత చెప్పారు. ఈ నెల 26వరకు ఇదే ప్రాంతంలో షూటింగ్ జరుగనుందని, 27 నుంచి గోవాలో జరుగనున్న షూటింగ్‌లో ఛేజ్, ఓ పాటను చిత్రీకరిస్తామని నిర్మాత వెల్లడించారు. మళ్ళీ అక్టోబర్ ఆరు నుంచి నెలాఖరు వరకు బెంగళూరు పేలస్‌లో చిత్ర నిర్మాణం కొనసాగుతుందన్నారు. నవంబరులో రెండు పాటలను విదేశాల్లో చిత్రీకరించనున్నట్లు వెల్లడించారు. ఈ షూటింగ్ డిసెంబర్ 5వరకు జరుగుతుందని, అనుకున్నట్లుగా డిసెంబర్ 18న సినిమాను విడుదల చేస్తున్నట్లు నిర్మాత స్పష్టం చేశారు. మైసూర్ ప్యాలెస్‌లో దాదా 40 మంది నటీనటులు పాల్గొంటారని పేర్కొన్నారు.
పూర్తి వినోదాత్మకంగా చిత్రాన్ని మలుస్తున్నామని, ఇందులో సందేశాలంటూ ఏమీ ఉండవని నిర్మాణ సారథి అన్నారు.దర్శకుడిగా శ్రీనువైట్ల చాలా కంఫర్ట్‌బుల్‌గా ఉన్నారని, ముందే ఆయన పరిచయముంటే ఎప్పుడో ఇలాంటి చిత్రాన్ని నిర్మించే వాడినని నిర్మాత చెప్పుకొచ్చారు. కొత్త యాంగిల్‌లో "హలోబ్రదర్స్" చూస్తే ఎలా ఉంటుందో "కింగ్" కూడా అలాగే ఉంటుందన్నారు. త్రిష, మమతామోహన్‌దాస్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఐదు పాటలుంటాయని శివప్రసాద్ రెడ్డి చెప్పారు.
Friday, September 5, 2008
Subscribe to:
Posts (Atom)