Wednesday, September 10, 2008

అక్కినేని నాగార్జున 'కింగ్'

అక్కినేని నాగార్జున కొత్త చొత్రం 'కింగ్'తో ఒకనాటి రాజరికాన్ని మరో మారు చూయించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. అలాగని ఇది ఏ జానపద లేక పౌరాణిక చిత్రమో కాదని, కథలో వచ్చే మలుపులలో రాజరికపు కథనం ఉంటుందని తెలుస్తోంది. ఒకప్పటి రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి కథతో "కింగ్" చిత్రం రూపొందుతోంది. తను ఇప్పటి కింగ్‌ననుకుంటాడా? ఆయనేం చేస్తాడు? అనేవి తెలుసుకోవాలంటే "కింగ్" సినిమా వచ్చే వరకు ఆగాల్సిందేనని చిత్ర నిర్మాత డి. శివప్రసాద్ రెడ్డి అంటున్నారు.
కామాక్షి కళామూవీస్ పతాకంపై నాగార్జునతో రూపొందిస్తున్న"కింగ్" సినిమా షూటింగ్ టోలీచౌక్‌లోని డాగ్‌హౌస్‌లో జరుగుతోంది. ఇప్పటి వరకు ఓ పాట, రెండు ఫైట్లు, కొంత టాకీ కలిపి 45శాతం షూటింగ్ పూర్తయిందని నిర్మాత చెప్పారు. ఈ నెల 26వరకు ఇదే ప్రాంతంలో షూటింగ్ జరుగనుందని, 27 నుంచి గోవాలో జరుగనున్న షూటింగ్‌లో ఛేజ్, ఓ పాటను చిత్రీకరిస్తామని నిర్మాత వెల్లడించారు. మళ్ళీ అక్టోబర్ ఆరు నుంచి నెలాఖరు వరకు బెంగళూరు పేలస్‌లో చిత్ర నిర్మాణం కొనసాగుతుందన్నారు. నవంబరులో రెండు పాటలను విదేశాల్లో చిత్రీకరించనున్నట్లు వెల్లడించారు. ఈ షూటింగ్ డిసెంబర్ 5వరకు జరుగుతుందని, అనుకున్నట్లుగా డిసెంబర్ 18న సినిమాను విడుదల చేస్తున్నట్లు నిర్మాత స్పష్టం చేశారు. మైసూర్ ప్యాలెస్‌లో దాదా 40 మంది నటీనటులు పాల్గొంటారని పేర్కొన్నారు.
పూర్తి వినోదాత్మకంగా చిత్రాన్ని మలుస్తున్నామని, ఇందులో సందేశాలంటూ ఏమీ ఉండవని నిర్మాణ సారథి అన్నారు.దర్శకుడిగా శ్రీనువైట్ల చాలా కంఫర్ట్‌బుల్‌గా ఉన్నారని, ముందే ఆయన పరిచయముంటే ఎప్పుడో ఇలాంటి చిత్రాన్ని నిర్మించే వాడినని నిర్మాత చెప్పుకొచ్చారు. కొత్త యాంగిల్‌లో "హలోబ్రదర్స్" చూస్తే ఎలా ఉంటుందో "కింగ్" కూడా అలాగే ఉంటుందన్నారు. త్రిష, మమతామోహన్‌దాస్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఐదు పాటలుంటాయని శివప్రసాద్ రెడ్డి చెప్పారు.

2 comments:

Anonymous said...

what happened to the other one?

Anonymous said...

when will you go online?