Tuesday, September 2, 2008

విఘ్నాలు వదిలే "చవితి" శుభాకాంక్షలు

శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం... అంటూ వక్రతుండుడైన విఘ్న రాజ వినాయకుడిని మొక్కందే ఏ రోజు ప్రారంభం కాదు. ముందు ఆయనకు పూజ చేసిన తర్వాతే మిగిలిన దేవుళ్లకు. అలా శాశించింది కూడా పరమేశ్వరుడే. అందుకే ఎంతటి వారైన సరే ముందుగా విఘ్నేశ్వరున్ని తలంచుకుని తమ విఘ్నాలన్ని తొలగిపొయ్యి అంతా శుభం జరగాలని కోరుకుంటారు. అంతేకాదు భారతీయ సంసృతి, సాంప్రదాయాల్లో, ఆచార, వ్యవహారాల్లో కూడా విఘ్న రాజుకు ప్రధమ నివేదనకే ప్రాధాన్యత ఇస్తారు. దీనికి తోడు భారతీయులు జరుపుకునే పండుగల్లో వినాయక చవితి (వినాయకచతుర్థి)ని మొదటి పండుగగా వ్యవరిస్తారు.
ఇందులో భాగంగానే నేడు వినాయక చతుర్థి(03.09.2009)అంటే భారతీయుల మొదటి పండుగ. నేటి నుండి దేశంలోని అన్ని ప్రాంతాలలో వినాయకుడి విగ్రహాలను కొలువుతీర్చి తొమ్మిది రోజులపాటు భక్తి శ్రద్దలతో కొలుస్తారు. హైదరాబాద్, ముంబై వంటి ప్రధాన నగరాలలో వేలాదిగా వినాయకుడి విగ్రహాలకు భారి స్థాయిలో ఏర్పాటు చేసేందుకు పోటీలు పడతారు. నవరాత్రులు ప్రత్యేక పూజలు నిర్వహించి చివరిగా భక్తి శ్రద్దలతో నిమజ్జనం చేస్తారు.
గత ఆరు నెలల ముందు నుంచే విఘ్నేశ్వరుడు అయిన వినాయకుడి విగ్రహాలను తయారు చేయించటంలో పోటి పడిన హైదరాబాద్ నగర వాసులు తమ ప్రాతాలలో వీటిని కొలువుతీర్చేందుకు సిద్దమయ్యారు. విభిన్న అవతారాలలో దర్శనమిస్తున్న విఘ్నేశ్వరుడి రూపాలు నగరానికి కొత్త శోభను అందించనున్నయి. విగ్రహాలను ఏర్పాటు చేయనున్న ప్రాతాలకు పోలిసుల అనుమతి కూడా తీసుకోవటం జరిగింది. అదేవిధంగా పండుగ సందర్బంగా ఎటువంటి అవాంచనీయ సంగటనలు జరగకుండా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లలో పోలీసు యంత్రాంగం సిద్దంగా ఉంది. ఈ ఏదాది కేవలం హైదరాబాద్ నగరంలోనే 25 వేల విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. విగ్రాహాల ఏర్పాట్లు, నిర్వాహణ, నిమజ్జనం ద్వారా మొత్తం సుమారు 100 కోట్ల రూపాయిల మేరకు ఖర్చు కానుంది.
భక్తి శ్రద్దలతో వినాయక చతుర్థిని జరుపుకుంటున్న అఖిలాండకోటి భారతీయులకు పిరమిడ్ సాయిమిరా సంస్థకు చెందిన హైదరాబాద్ సాయిమిర (http://www.hyderabadsaimira.com/ ), న్యూస్ రీల్ ఇండియా ( http://www.newsreelindia.in/)హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలుపుతోంది.

No comments: