Saturday, October 11, 2008

చిరంజీవికి మహిళల నీరాజనం

ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ప్రజా అంకితయాత్ర ప్రారంభించిన రెండో రోజున శ్రీకాకుళం జిల్లాలో అడుగడుగునా అన్ని వర్గాల ప్రజలు నిరాజనాలు పలుకుతున్నారు. మహిళలు అయితే కర్పూర హారతులతో స్వాగతం పలుకుతున్నారు. చిరంజీవి ప్రజా అంకిత యాత్ర శుక్రవారం శ్రీకాకుళం నుంచి పలాస వరకు రోడ్‌ షోలతో సాగుతోంది.
శ్రీకాకుళంలో నిర్వహించిన రోడ్‌ షోలో మత్స్యకారులు తమ సమస్యలను చిరంజీవికి విన్నవించుకున్నారు. చిరంజీవి మాట్లాడుతూ మీ పిలుపు మేరకు నేను వచ్చాను, మీరు మార్పు కోరుకుంటున్నారు, అది ప్రజారాజ్యంతో తోనే సాధ్యమని అన్నారు. మీ నమ్మకాన్ని వమ్ము చేయను మీ కోర్కె తీర్చడమే ప్రజారాజ్యం ఎజెండా అని చిరంజీవి పేర్కొన్నారు.

ఉత్తరాంధ్రలో వెనుకబాటు తనానికి వలసలే నిదర్శనమని, ఇక్కడ మత్స్య సంపద ఉంది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, పొందూరు చేనేతకు పెట్టింది పేరు అలాంటిది వారికి ఆదరణ కరువైంది. రాష్ట్రంలో నిత్యావసరాలు పెరిగిపోయాయి, ధరలు చుక్కలనంటాయి, పేద, మధ్య తరగతి కుటుంబాల వారు ఎలా బ్రతుకుతారు, వీటన్నిటికి కారణం ఎవరు? అంటూ చిరంజీవి ప్రశ్నించారు. అందుకే మీ పిలుపు మేరకు నేను వచ్చాను. మీ కష్ట, నష్టాలు తెలుసుకుని వాటి పరిష్కార దిశగా పయనిస్తానని చిరంజీవి పేర్కొన్నారు.

1 comment:

Babu said...

కళ్ళతో కనికట్టు చేసి, రక్తాన్ని రాజకీయం కు వారధి కట్టొచ్చని దశాబ్దం
కిందే పునాది రాల్లేసి
అమ్మ సెంటిమెంటు తెరపైనే కాదు రాజకీయాల్లోనూ పండిస్తున్న చిరు నాయకునికి
రాజకీయాలు తెలీదంటారా?
మీకు నడక రాక మునుపు మధురాలు గుర్తున్నాయా? కాని అరంగేట్రమప్పుడు
తెరవేల్పు తేటతెల్లం చేసారు అమ్మసంకనెక్కిన మదురాలు మరచిపొలేదని. మనం
నమ్మక పోయినా మీడియా నమ్మింది, అందుకే అడగలేదు.
సజావుగా సభలనే నడపలేక తీసుకురాబడే జనాల సావులకు కారణమవుతున్నరని
అనుకొంటున్నారా, అక్కడె మీరు తక్కువ అంచనా వేసింది ఎందుకంటారా? మరి
ఎవరన్నా సస్తేనే గదా ఎంతమందొచ్చారో పబ్లిసిటీ రావడానికి, నిజం కాదంటారా
ఆయనకూ రాజకీయం తెలుసని.