Friday, February 29, 2008
అమెరికాలో నిర్వహించనున్న "చేంజ్ అండ్ హోప్ విత్ చిరంజీవి"
అమెరికాలోని "ప్రో తెలుగు ఆర్గనైజేషన్" (పిటివో) " చేంజ్ అండ్ హోప్ విత్ చిరంజీవి" అనే కార్యక్రమాన్ని మార్చి ఒకటో తేదీన సీటెల్, లాస్ వెగాస్, మిన్నె పోలిస్ నగరాల్లో నిర్వహించబోతోంది. పోర్ట్ ల్యాండ్ లో రెండో తేదీన సమావేశం జరుగుతుంది.ఈ సంస్ధ ఇటీవల డల్లస్, హోస్టన్, వాషింగ్టన్, న్యూజెర్సీ, బే ఏరియా, లాస్ ఎంజెలిస్, చికాగో, డెట్రాయిట్, అట్లాంటా, ఆర్లాండో, శాన్ డీగో, సెంట్ లూయిస్, బోస్టన్, కొలంబస్, ఫీనిక్స్, రలేగ్ ప్రాంతాల్లో నిర్వహించి ఇటువంటి కార్యక్రమాలకు మంచి స్పందన వచ్చిందని ప్రో తెలుగు ఆర్గనైజేషన్ ఒక ప్రకటనలో తెలియజేసింది. మార్చి 1, 2 తేదీల్లో అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో జరుగనున్న కార్యక్రమ్మాల్లో పాల్గొని చిరంజీవి రాజకీయాల్లోకి రావలసిన ఆవశ్యకత, పార్టీ విధానాలు తదితర అంశాలపై చర్చించడానికి రావలసిందిగా అమెరికాలో ని చిరంజీవి అభిమానులను ఈ సంస్ధ ఆహ్వానించింది. మరిన్ని వివరాలకు ఈ సైట్స్ ను సందర్శించవలసిందిగా ఈ సంస్ధ వ్యవస్ధాపకుడు రామ్ తాతినేని తెలిపారు.
Thursday, February 28, 2008
పిరమిడ్ గ్రూప్ విడుదల చేయనున్న "గమ్యం"
నరేష్, శర్వానంద్ హీరోలుగా, కమలిని ముఖర్జీ హీరోయింగా రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందిన "గమ్యం" చిత్రాన్ని పిరమిడ్ సాయిమిరా గ్రూప్ విడుదల చేస్తోంది. ఫర్స్ట్ ఫ్రేం పతాకంపై జగర్లమూడి సాయిబాబు రూపొందించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఎవరికైనా గమ్యం ఉంటుంది, అది చేరుకోవడానికి ఎవరి ప్రయత్నాలు వారు చేయడం సహజం. అలాగే ఈ చిత్రంలో కథా నాయకులకు, హీరోయిన్ కు వేరు వేరు గమ్యాలు వుంటాయి, వాటిని చేరుకోవడానికి వారు చేసిన ప్రqయత్నమే ఈ "గమ్యం" చిత్రం కథ.ఆద్యంతం వినోదాన్ని పంచుతూపోయే ఈ చిత్రంలో అభిషేక్, బ్రహ్మానందం, గిరిబాబు, శ్వేత అగర్వాల్, ఎల్ బీ శ్రీరాం, ఎం ఎస్ నారాయణ, హేమ ముఖ్య తారాగణంగా నటించిన ఈ చిత్రానికి సిరివెన్నెల సీతారామ శాస్త్రి అందించిన పాటలు ప్రత్యేక ఆకర్షనగా నిలుస్తాయని పత్రికలు తమ రివ్యూలలో పేర్కొనడం ఇక్కడ గమనార్హం.
పిరమిడ్ గ్రూప్ భారత్ లో విడుదలచేయనున్న హాలీవుడ్ చిత్రం "డి-వార్" గ్యాలరీ
కొరియాలో నిర్మింపబడి ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయాన్ని సాధించిన "డి-వార్" చిత్రాన్ని పిరమిడ్ సాయిమిరా థియేటర్ లిమిటెడ్ భారత దేశంలో విడుదల చేయనుంది. ఒక్క ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడులలో తప్ప మిగిలిన అన్ని రాష్టాలలో ఈ చిత్రాన్ని పిరమిడ్ విడుదల చేయనుంది. ప్రపంచ వ్యాప్తంగా మంచి విజయాన్ని సాధించిన ఈ చిత్రంపై భారతీయ చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలే నెలకొన్నాయి.
Wednesday, February 27, 2008
మార్చి 6న విడుదలవనున్న శ్రీహరి "భద్రాద్రి"
నంది ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీహరి, రాజా, గజాలా, నిఖిత జంటగా నటిస్తోన్న చిత్రం "భద్రాద్రి". మల్లికార్జున్ దర్శకత్వంలో యం శివకుమార్ నిర్మించారు. ఈ చిత్రాన్ని మార్చి 6న విడుదల చేస్తున్నట్లు నిర్మాత తెలిపారు. సెన్సార్ పూర్తయిన సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ చిత్రంపై ఉన్న నమ్మకంతో డిస్ట్రిబ్యూషన్ పెట్టి నైజాంలో 65 థియేటర్లలో విడుదల చేస్తున్నానని, మొత్తం 150 ప్రింట్లతో ముందుకు వస్తున్నామని పేర్కొన్నారు. నేటి వైద్య వ్యవస్థ ఎంత దిగజారిందో కళ్లకు కట్టినట్లు తెలియచెప్పే చిత్రమే "భద్రాద్రి" అని నటుడు రాజా అంటున్నారు. చాలా కాలం తర్వాత ఓ మంచి చిత్రంలో నటించాననే సంతృప్తి మిగిలిందని పేర్కొన్నారు. ఇందులో బ్రహ్మానందం పాత్ర హైలెట్‌గా నిలుస్తుందన్నారు. ఫైటర్స్ రామ్‌లక్ష్మణ్‌లు తనను కొత్త కోణంలో ఆవిష్కరించారన్నారు. శ్రీహరి మాట్లాడుతూ, నా చిత్రాల సేలబిలటీకంటే మించి శివకుమార్ ఖర్చుపెట్టారు. మంచి స్నేహితుని చిత్రంలో నటించినందుకు ఆనందంగా ఉంది. ఇటువంటి వ్యక్తులు నిర్మాతగా ఉంటే మరింత ఎత్తుకు ఎదుగుతాను. నాపై పెద్దగా బిజినెస్ అవ్వదు అని చాలా మంది నిర్మాతలు భయపెట్టినా తను నమ్మిన సిద్ధాంతంతో ముందుకు సాగుతున్నారు. బయ్యర్లు అనుకున్నవిధంగా డబ్బులు ఇవ్వకపోయినా తాను డిస్ట్రిబ్యూటర్‌గా మారి చిత్రాన్ని ముందుకు తెస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు మరోమారు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ, ఈ చిత్రానికి బాబీ రాసిన మాటలకు ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన వస్తుందనే నమ్మకముంది. ప్రతి వారినీ ఆలోచింపజేసేవిగా ఉంటాయి. మణిశర్మ సమకూర్చిన బాణీలకు ఆదరణ అనుకున్నవిధంగానే ఉంది. ప్లాటినం వేడుకను జరుపుకున్నామని తెలిపారు.
Tuesday, February 26, 2008
చిరంజీవి "చిరు"నామా & ఫోన్ నంబర్...

తెలుగు చిత్రసీమలో రారాజుగా వెలుగొందుతున్న నటుడు మెగాస్టార్ చిరంజీవి. "స్వయంకృషి"నే నమ్ముకుని వెండితెరపై నీరజానాలు అందుకుటున్న చిరంజివి తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగిడి 30 సంవత్సరాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో వుంటున్న మెగాస్టార్ చిరునామా తెలుసుకోవాలని ప్రతి తెలుగు అభిమానికి ఆసక్తిగానే వుంటుంది. వారి కోసం ఆయన ఇంటి అడ్రస్, ఫోన్ నంబరును కింది ఇస్తున్నాం.
పద్మభూషణ్ చిరంజీవి
పద్మభూషణ్ చిరంజీవి
ప్లాట్ నంబర్ 303 ఎన్,
రోడ్ నెంబర్ 25,
ఓబుల్ రెడ్డి స్కూల్ సమీపంలో,
రోడ్ నెంబర్ 64,
జుబ్లీ హిల్స్,
హైదరాబాద్-33.
ఫోన్ నంబర్. 044-23542765.
జాకీచాన్ విడుదల చేయనున్న "దశావతారం" ఆడియో

పద్మశ్రీ కమల్ హాసన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం "దశావతారం". ఇందులో ఆయన పది వేషాల్లో నటిస్తుండటంతోబాటు, బాలీవుడ్ సెక్సీబాంబ్ మల్లికాషెరావత్ ప్రత్యేక పాత్రలో తన అందాలను ప్రదర్శించి దక్షిణాది ప్రేక్షకులకు రుచి చూపించనుండటం మరో ప్రత్యేకత.ఈ ప్రత్యేకతలకు హాలీవుడ్ సూపర్ స్టార్ జాకీచాన్ కూడా ఇప్పుడు జత కలిశారు. ఆయన ఈ చిత్ర ఆడియోను విడుదల చేయనున్నారు.నిజంగానే జాకీచాన్ "దశావతారం" ఆడియోను ఆవిష్కరించనున్నారు. ఇందుకోసం కమల్ హాసన్ మల్లిక సాయం తీసుకున్నారు.జాకీ సరసన ఓ హాలీవుడ్ (ది మిథ్) చిత్రంలో మల్లిక నటించిన విషయం తెల్సిందే. అందువల్ల కమల్ ఆమె సాయం తీసుకుని జాకీని చెన్నైకు రప్పిస్తున్నారు. రానున్న మార్చిలో జాకీచాన్ చేతుల మీదుగా "దశావతారం" ఆడియో విడుదలకానుంది. ఈ చిత్రంలో మల్లికతో పాటు ఆసిన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, హిమేష్ రేష్మాయి సంగీత బాణీలు సమకూర్చారు.
Monday, February 25, 2008
"పాతాళ భైరవి" లాంటి చిత్రంలో నటించాలని ఉంది: అక్కినేని నాగార్జున
సినిమాల ఎంపికలో తనదైన బాణీని పలికించే నటుడు అక్కినేని నాగార్జున తెలుగు సినీ ఆణి ముత్యం "పాతాళ భైరవి" లాంటి చిత్రంలో నటించాలని ఉందని తెలిపారు. వీలైతే ఎవరైనా ఈ "పాతాళ భైరవి" చిత్రాన్ని రీమేక్ చేస్తే ఎలాంటి సంకోచం లేకుండా తాను అందులో నటించడానికి ఆసక్తి చూపుతానని ఆయన తెలిపారు. ఇప్పటిదాకా పలు సాంఘిక, పోరాణిక చిత్రాలలో నటించిన తనకు ఫాంటసీ చిత్రాలలో నటించాలని చాలా కుతూహలంగా ఉన్నట్లు తెలిపారు. ఎప్పటికైనా తన కలను నిజం చేసుకుంటానని, వీలైతే "పాతాళ భైరవి" చిత్రాన్ని తానే రీమేక్ చేసినా ఆశ్చర్యపోనక్కరలేదని ఆయన పాత్రికేయులతో తన అభిప్రాయం వ్యక్తం చేయడం ఇక్కడ గమనార్హం.ఎనీహౌ...బెస్ట్ ఆఫ్ లక్ నాగార్జున.
Wednesday, February 6, 2008
చిరంజీవి పార్టీ పేరు "ఠాగూర్"...నిజమేనా?

సొంతంగా రాజకీయపార్టీ పెట్టాలనుకుని చిరంజీవి నిర్ణయించుకోవడం దాదాపు పూర్తయినట్టు తెలుస్తోంది. నిర్ణయం తీసుకోవడంలో ఆయన తటపటాయిస్తున్నారన్న అపవాదు ఉన్నప్పటికీ ఆయన మంచి సమయం కోసమే ఎదురు చూస్తున్నట్టు సినీవర్గాలు చెబుతున్నాయి.రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఏడెనిమిది నెలల ముందు పార్టీని ప్రకటించాలని ఆయన యోచిస్తున్నట్టు తెలుస్తోంది. పదిహేను నెలల ముందే పార్టీని ప్రకటిస్తే ఆ టెంపోను మెయింటైన్ చేయడం కష్టమని, ఖర్చులను తట్టుకోవడం కూడా అనవసరమని చిరంజీవి క్యాంప్ లోని ముఖ్యులు చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ దిశగా ఇప్పటికే చిరంజీవి అడుగులు ముందుకు వేయడమే కాకుండా, తన తమ్ముడు నాగబాబు ద్వారా లోయర్ కేడర్ను బలోపేతం చేసే పనులలో నింగ్నమైనట్లు సమాచారం.
అయితే ఈ పార్టీకి "చిరంజీవి" పార్టీ అని పెడదామని కొందరు భావిస్తుండగా, చిరంజీవి సన్నిహితులు మాత్రం "ఠాగూర్" పార్టీ అని నామకరణం చేస్తే బావుంటుందని భావిస్తున్నట్లు తెలిసింది.
వి వి వినాయక్ దర్శకత్వంలో ఎన్టీఆర్

వి వి వినాయక్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతోంది. ఇది అందరూ అనుకుంటున్నట్లుగా యుగంధర్ రీమేక్ కాదట. వినాయక్ దర్శకత్వం వహించిన ఎన్టీఆర్ సినిమా "ఆది" బాక్సాఫీసు వద్ద పెద్దగా హిట్టయిన విషయం తెలిసిందే. మళ్లీ వీరిద్దరూ కలిసి పని చేస్తున్నారు. ఎన్టీఆర్ తో "సాంబ" సినిమాను నిర్మించిన కొడాలి నానీ ఈ సినిమా నిర్మాత. ఈ కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 28వ తేదీన ప్రారంభమవుతుందని తెలిసింది. వినాయక్ ఎన్టీఆర్ ను దృష్టిలో పెట్టుకుని స్క్రిప్టు రాస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది చివరలో విడుదల చేయాలని కొడాలి నాని భావిస్తున్నారు.
Tuesday, February 5, 2008
దర్శకుల సంఘం ఎన్నికల బరిలో ఎంఎస్ రాజు
నిర్మాతగా ఎన్నో విజయాలు సాధించిన రాజు తెలుగు సినిమా దర్శకుల సంఘం ఎన్నికల బరిలోఖీ దిగారు. ఈ నెల 10న జరుగనున్న దర్శకుల సంఘం ఎన్నికలలో ఆయన పోటీ చేస్తున్నారు. పరుచూరి బ్రదర్స్ ప్రోత్సాహంతో ఎంఎస్ రాజు ఈ ఎన్నికలలో పాల్గొంటున్నట్లు సమాచారం. ఇలా ఉండగా దాదాపు ప్రముఖ దర్శకులంతా ఎంఎస్ రాజు వ్యతిరేక కూటమిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఎన్నికల సందర్భంగా ఎంఎస్ రాజు ఇంద్రప్రస్ధ కాంప్లెక్స్ లో పెద్ద పార్టీ ఇచ్చారు.మరి చివరికి విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూస్తేగానీ తెలీదు.
Monday, February 4, 2008
ఫిబ్రవరి 15న విడుదలవనున్న "జోధా అక్బర్"
అద్బుతమైన ప్రేమ కథతో రూపొందించబడ్డ "జోధా అక్బర్" ఈ నెల 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవనుంది. ఐశ్వర్యారాయ్, హృతిక్ రోషన్ నటించిన "జోథా అక్బర్" చిత్రం పాటలు వీనులవిందుచేస్తుండగా, ఈ చిత్రంపై అంచనాలు భారీ యెత్తున పెరిగిపోయాయి. చిత్రాన్ని ఎప్పుడు వీక్షిద్దామా అన్న ఆసక్తిలో యావత్భారత సినీ ప్రేక్షకులు ఉన్నారు.16వ శతాబ్దంనాటి కాలాన్ని జ్ఞప్తికి తెచ్చే భారీ సెట్ల మధ్యన రూపొందించిన ఈ చిత్రంలో ప్రపంచ అందాల సుందరిగా మన్ననలు అందుకుంటున్న ఐశ్వర్యారాయ్ అద్భుత లావణ్యరాశి జోథా భాయ్ గా నటించటం, ఇండియన్ టార్జాన్ హృతిక్ రోషన్ జోథా ప్రేమికుడైన సలీం చాలా వ్యయ ప్రయాషలతో అతద్భుతంగా రూపొందించినట్లు వినికిడి. చిత్రం తాలూకు నటులు, వారి పాత్రలు ఎలా ఉంటాయన్నవాటిపై ఒక్కసారి దృష్టి సారిస్తే. బాలీవుడ్ డాషింగ్ హీరో హృతిక్ రోషన్ ప్రధానపాత్ర అయిన జలాలుద్దీన్ మహ్మద్ అక్బర్‌గా నటిస్తున్నాడు. రాజా భర్మాల్ కూతురైన జోథా పాత్రలో ఐశ్వర్యారాయ్ నటిస్తోంది.రాజకీయ విజయం సాధించి తనకు ఎదురేలేదని నిరూపించుకున్న అక్బర్(హృతిక్ రోషన్) తన సామ్రాజ్యాన్ని అటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇటు బంగాళాఖాతం వరకు, హిమాలయాలనుంచి గోదావరి వరకు విస్తరింపచేయాలని నిశ్చయించుకుంటాడు. ఈ క్రమంలో రాజ్‌పుట్‌లపై అక్బర్ ఘనవిజయం సాధించి రాజ్యాన్ని తన వశం చేసుకుంటాడు. రాజకీయ లబ్ధికోసం రాజా భర్మాల్ తన కుమార్తె జోథా చేతిని అక్బర్‌కి అందివ్వాలనుకుంటాడు. అయితే అక్బర్ తన పయనాన్ని నిజమైన ప్రేమవైపు సాగిస్తాడు. మరోవైపు యుద్ధభూమిలో అజేయుడైన జలాలుద్దీన్ "అక్బర్ ది గ్రేట్" బిరుదును పొందుతాడు. అరబిక్ భాషలో "అక్బర్" అంటే "గొప్ప" అని అర్థం. తన యుద్ధ నైపుణ్యంతో రాజ్యాలను సునాయాశంగా గెలిచిన అక్బర్ జోథా మనసును గెలుచుకోవటం కోసం ఏంచేశాడన్నఆసక్తితో చిత్రం సాగుతుంది. ఈ చిత్రాన్ని దాదాపు రూ.400 మిలియన్ల భారీ బడ్జెట్‌తో రూపొందించారు. అంతేకాదు నాటి పరిస్థితులను అద్దంపట్టేటట్లు ప్రముఖ చరిత్రకారులను వినియోగించారు. ఆగ్రా, జైపూర్ ప్రాంతాలలో ఈ చిత్రం రూపుదిద్దుకోవటంతో నాటి అక్బర్ సామ్రాజ్యం నిజంగానే మన కళ్లముందు ప్రత్యక్షమవుతుంది. ఇంకా ఈ చిత్రంలో 80 ఏనుగులు, వంద గుర్రాలు, 55 ఒ























































































































