Tuesday, September 30, 2008

క్వాంటం ఆఫ్ సోలాస్-007 వాల్ పేపర్స్




Monday, September 29, 2008

జెనిలియా డిసౌజా గ్లామరస్ స్టిల్స్








చిరంజీవి ప్రజాయాత్ర

చిరంజీవి ప్రజాయాత్రకు సమయం ఆసనమవుతోంది. ప్రజాయాత్ర తేదీలు ఇంకా ఖరారు కాలేదని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి చెప్పినా ఈ అక్టోబర్ రెండు నుంచి ఆయన అనధికారికంగా అధికార యాత్రనే చేయనున్నారు.
త్వరలో ఈ యాత్ర తేదీలను ఖరారు చేస్తామని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. తాను మొదట కోస్తాలో మూడు జిల్లాలు, ఆ తర్వాత రాయలసీమ, తెలంగాణ జిల్లాల్లో పర్యటిస్తానని ఆయన వెల్లడించారు. అక్టోబరు 2 గాంధీ జయంతి రోజున "వూరూరా ప్రజారాజ్యం-వూరూరా పండగ" అనే కార్యక్రమాన్ని వారం రోజుల పాటు జరపనున్నట్టు ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తెలిపారు. అక్టోబరు 2న రాష్ట్రంలోని అన్నీ గ్రామాలు, పట్టణాల్లో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పార్టీ జెండాలు ఆవిష్కరించాలని కోరారు. అదే రోజు కోటిమొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఆయన పిలుపునిచ్చారు. దీన్ని కేవలం పార్టీ కార్యక్రమంగా భావించకుండా ఒక సామాజిక కార్యక్రమంగా చూడాలని ఆయన పిలుపునిచ్చారు.

అదే రోజునుంచి పార్టీ సభ్యత్వ నమోదును కూడా ప్రారంభించనున్నట్టు ఆయన వెల్లడించారు. మొదటి సభ్యత్వం వికలాంగుడైన బాలకృష్ణకు ఇచ్చి, తరువాత తాను తీసుకుంటానని ఆయన తెలిపారు. మొదట జిల్లా కార్యాలయాలు ప్రారంభమవుతాయని అనంతరం మండలస్థాయి, గ్రామకమిటీలను ఏర్పాటు చేయనున్నట్టు చిరు తెలిపారు. ఆదీవాసీలకు ఇబ్బంది కలిగితే బాక్సైట్‌ వెలికితీతను ఆపాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. పోలేపల్లిలో ఎకరం రూ.18 వేలకు తీసుకొని అదే భూమిని లక్షలకు అమ్మడాన్ని ఆయన ప్రశ్నించారు.

అమెరికాతో చేసుకున్న 123 ఒప్పందంపై స్పష్టమైన వైఖరి వెల్లడించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఒప్పందంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, అందువల్ల స్పష్టత అవసరమని ఆయన అన్నారు.

Thursday, September 25, 2008

గోపీ చంద్ 'శౌర్యం'

గోపిచంద్, అనుష్క జంటగా సినిమాటోగ్రాఫర్ శివ దర్శకత్వంలో రూపుదిద్దుకొన్న చిత్రం "శౌర్యం"। ఈ రోజు (గురువారం) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ముస్తాబయ్యింది. కధ ప్రకారం ''విజయ్‌ (గోపీచంద్‌) తన చిన్నప్పటి లక్ష్యం కోసం కఠోరంగా శ్రమిస్తుంటాడు. అందులో భాగంగానే కోల్‌కతాకు వెళ్లాల్సి వస్తుంది. అక్కడ శ్వేత (అనుష్క), దివ్య (పూనమ్‌కౌర్‌) పరిచయమవుతారు. అతనికి లక్ష్యసాధనలో ఎదురైన అడ్డంకులేమిటి? వాటిని ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఆసక్తికరం'' అని దర్శకుడు పేర్కొన్నారు.అలాగే గోపిచంద్, అనుష్కలపై చిత్రీకరించిన రొమాంటిక్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకొంటాయని చెప్పారు. మణిశర్మ సంగీత బాణీలు సమకూర్చిన ఈ చిత్రం ఆడియోకు మంచి స్పందన లభిస్తోంది. ఇక భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయన మాట్లాడుతూ యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో కూడిన చిత్రంగా ఇది ఉంటుంది. అలాగే మా సినిమా పాటలు ఇప్పటికే ప్రజాదరణ పొందాయి. గోపీచంద్‌ సినిమాల్లో ఉండే యాక్షన్‌ సన్నివేశాలతోపాటు చక్కటి వినోదం, లవ్లీ రొమాన్స్‌ కూడా మా చిత్రంలో ఉంటాయి. స్విట్జర్లాండ్‌ లొకేషన్లు కూడా కనువిందు చేస్తాయని అన్నారు.

Tuesday, September 23, 2008

రజినీ కాంత్, ఐశ్వర్య రాయ్ ల "రోబో" ఎక్స్ క్లూజివ్ స్టిల్స్

రజినీ కాంత్ మరియు ఐశ్వర్య రాయ్ అభిమానులకు శుభవార్త. వీరిద్దరి కాంబినేషన్లో ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఇటీవలే యూరోప్ లో షూటింగ్ ప్రారంభించుకున్న "రోబో" చిత్రానికి సంబంధించిన కొన్ని షూటింగ్ స్టిల్స్ ను ఇక్కడ ఇస్తున్నాం. చూసి ఆనందించండి.





Saturday, September 20, 2008

విక్టరి వెంకటేశ్ "చింతకాయల రవి" వాల్ పేపర్స్ మరియు పోస్టర్స్

Telugu film “Chintakayala Ravi” Wallpapers and Posters














Thursday, September 18, 2008

తెలంగాణపై చిరంజీవికి స్పష్టత లేదు: విజయశాంతి

తెలంగాణ కోసం ఇదే చివరి యుద్ధమని తల్లి తెలంగాణ అధినేత విజయశాంతి అన్నారు. తెలంగాణ వాదులంతా ఏకం కావాలని ఆమె పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లా కడివెండి గ్రామంలో ఆమె తెలంగాణ సాయుధ పోరాట అమర వీరుడు దొడ్డి కొమురయ్య స్మారక స్థూపానికి నివాళులర్పించారు.తెలంగాణపై ప్రజారాజ్యం అధినేత చిరంజీవికి స్పష్టత లేదని ఆమె విమర్శించారు. తెలంగాణకు తాము వ్యతిరేకం కాదనే డొంక తిరుగుడు ప్రకటనలు వద్దని ఆమె అన్నారు.
తెలంగాణపై అన్ని పార్టీలు స్పష్టంగా ముందుకు రావాలని ఆమె అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చి తీరాల్సిందేనని ఆమె అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో తల్లి తెలంగాణ విలీనంపై విలేకరులు వేసిన ప్రశ్నకు ఆమె జవాబు దాటవేశారు. తెలంగాణ పార్టీల మధ్య ఐక్యతకు తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చొరవ చూపడం హర్షణీయమని ఆమె అన్నారు.

Wednesday, September 17, 2008

విక్టరీ వెంకటేశ్ "చింతకాయల రవి" ఆడియో రిలీజ్ ఫంక్షన్

video

video

తెలుగు హర్రర్ "రక్ష" Trailers

video

video

Wednesday, September 10, 2008

అక్కినేని నాగార్జున 'కింగ్'

అక్కినేని నాగార్జున కొత్త చొత్రం 'కింగ్'తో ఒకనాటి రాజరికాన్ని మరో మారు చూయించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. అలాగని ఇది ఏ జానపద లేక పౌరాణిక చిత్రమో కాదని, కథలో వచ్చే మలుపులలో రాజరికపు కథనం ఉంటుందని తెలుస్తోంది. ఒకప్పటి రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి కథతో "కింగ్" చిత్రం రూపొందుతోంది. తను ఇప్పటి కింగ్‌ననుకుంటాడా? ఆయనేం చేస్తాడు? అనేవి తెలుసుకోవాలంటే "కింగ్" సినిమా వచ్చే వరకు ఆగాల్సిందేనని చిత్ర నిర్మాత డి. శివప్రసాద్ రెడ్డి అంటున్నారు.
కామాక్షి కళామూవీస్ పతాకంపై నాగార్జునతో రూపొందిస్తున్న"కింగ్" సినిమా షూటింగ్ టోలీచౌక్‌లోని డాగ్‌హౌస్‌లో జరుగుతోంది. ఇప్పటి వరకు ఓ పాట, రెండు ఫైట్లు, కొంత టాకీ కలిపి 45శాతం షూటింగ్ పూర్తయిందని నిర్మాత చెప్పారు. ఈ నెల 26వరకు ఇదే ప్రాంతంలో షూటింగ్ జరుగనుందని, 27 నుంచి గోవాలో జరుగనున్న షూటింగ్‌లో ఛేజ్, ఓ పాటను చిత్రీకరిస్తామని నిర్మాత వెల్లడించారు. మళ్ళీ అక్టోబర్ ఆరు నుంచి నెలాఖరు వరకు బెంగళూరు పేలస్‌లో చిత్ర నిర్మాణం కొనసాగుతుందన్నారు. నవంబరులో రెండు పాటలను విదేశాల్లో చిత్రీకరించనున్నట్లు వెల్లడించారు. ఈ షూటింగ్ డిసెంబర్ 5వరకు జరుగుతుందని, అనుకున్నట్లుగా డిసెంబర్ 18న సినిమాను విడుదల చేస్తున్నట్లు నిర్మాత స్పష్టం చేశారు. మైసూర్ ప్యాలెస్‌లో దాదా 40 మంది నటీనటులు పాల్గొంటారని పేర్కొన్నారు.
పూర్తి వినోదాత్మకంగా చిత్రాన్ని మలుస్తున్నామని, ఇందులో సందేశాలంటూ ఏమీ ఉండవని నిర్మాణ సారథి అన్నారు.దర్శకుడిగా శ్రీనువైట్ల చాలా కంఫర్ట్‌బుల్‌గా ఉన్నారని, ముందే ఆయన పరిచయముంటే ఎప్పుడో ఇలాంటి చిత్రాన్ని నిర్మించే వాడినని నిర్మాత చెప్పుకొచ్చారు. కొత్త యాంగిల్‌లో "హలోబ్రదర్స్" చూస్తే ఎలా ఉంటుందో "కింగ్" కూడా అలాగే ఉంటుందన్నారు. త్రిష, మమతామోహన్‌దాస్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఐదు పాటలుంటాయని శివప్రసాద్ రెడ్డి చెప్పారు.

Friday, September 5, 2008

స-రో-జ వాల్ పేపర్స్










Thursday, September 4, 2008

ఈ శుక్రవారం విడుదలవనున్న నాలుగు సినిమాలు

ఈ వారంలో నాలుగు సినిమాలు

ఒక చిన్న సినిమా విజయం సాధిస్తే చాలు వెంటనే అదే తరహాలో పది సినిమాలు తెరకెక్కటం దక్షిణాదిన ఉన్న ఓ అలవాటు. ఈ మధ్య విడుదలైన కొన్ని చిన్న సినిమాలు నిర్మాతలను గట్టెక్కించటమే కాకుండా వటిల్లో నటించిన వారికి కొంచం పేరు కూడా తెచ్చిపెట్టాయి. దీంతో చిన్న సినిమాల సీజన్ ప్రారంభమైంది. తెలుగు సినీ పరిశ్రమ చిన్న సినిమాల విజయాలతో కాస్త ఊపిరి పీల్చుకుంటుండటంతో ఇదే శుభతరుణంగా భావించిన పలువురు చిన్న నిర్మాతలు తమ చిత్రాలను విడుదల చేసేందుకు సిద్దమయ్యారు. ఈ వరుసలోనే శుక్రవారం ఏకంగా నాలుగు సినిమాలు విడుదలవుతున్నాయి.

స-రో-జ

తమిళ్ లో చెన్నై-28 వంటి విజయవంతమైన చిత్రాన్ని అందించిన వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన చిత్రం స-రో-జ. నలుగురు కుర్రాళ్ల జీవితంలో ఒక రోజు చోటు చేసుకున్న సంఘటన ఆదారంగా తెరక్కెక్కిన సినిమా ఇది. ఇందులో శ్రీ హరి ప్రధాన భూమికను పోషించగా ప్రముఖ దర్శకుడు కోదండ రామిరెడి కుమారుడైన వైభవ్ హెరోగా, కాజల్ హీరోయిన్ గా, ఎస్పీ చరణ్, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ చిత్రాన్ని పిరమిడ్ సాయిమిర ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తోంది.

అష్టా చెమ్మా

గ్రహణం చిత్రం ద్వారా ఉత్తమ చిత్ర దర్శకుడిగా మన్ననలు పొందిన మోహనకృష్ణ ఇంద్రగంటి రూపొందించిన చిత్రమిది. ఇందులో మా టీవీలో కలర్స్ ప్రోగ్రాం ద్వారా సుపరిచితమైన స్వాతి హీరోయిన్ గా, కొత్త కుర్రాడు నాని హీరోగా నటించారు. పూర్తి స్థాహి అహ్లాదం ఈ చిత్రంలో ఉంటుందని అందుకే అష్టా చెమ్మా అనే పేరుపెట్టినట్లు దర్శకుడు అన్నారు.

అంకిత్ పల్లవి అండ్ ప్రెండ్స్

హ్యాపీడేస్ చిత్రం ద్వారా పరిచయమైన అఖిల్, కొత్త తార అక్ష, హరి ఎల్లెటి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమిది. కాలేగ్ వయస్సులో యువతలోని భావాలకు అనుగునంగా ఈ చిత్రం ఉంటుందని నిర్మాతలు ప్రారంభం నాడే చెప్పారు. శిక్రవారం విడుదలవుతిన్న ఈ చిత్రం ఆడియోకు మంచి స్పందనే రావటంతో సినిమా కూడ విజయం సాధిస్తుందనే ఆకాంక్షను చిత్ర యూనిట్ వెలిబుచ్చారు.
బ్యాంక్

కొంతకాలంగా విడుదలకు నోచుకోక ఎట్టకేలకు విముక్తి పొందుతున్న చిత్రం బ్యాంక్. ఇప్పటికే ఈ చిత్రం విడుదలను పలుమార్లు ప్రకటించి వెనక్కు తగ్గిన నిర్మాతలు చివరిగా ఈ శుక్రవారం తాడోపేడోకు సిద్దమయ్యారు. ఇక ఈ చిత్రంలో బాలివుడ్ నటుడు జాకీష్రాప్, అబ్బస్, అర్చన(వేద) నటించగా దివంగత రఘువరన్ ప్రధాన భూమికను పోషించిన చివరి చిత్రం ఇదే.

రజనీకాంత్ వర్సెస్ చక్రీ...!

ఇదేంటీ అనుకుంటున్నారా నిజమే.. రజనీ నటించే రోబో చిత్రంలో చక్రీ విలన్ గా నటించనున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి. శివ చిత్రం ద్వారా రాం గోపాల్ వర్మ పరిచయం చేసిన నటుల్లో జేడి చక్రవర్తి(గడ్డం చక్రవర్తి) ఒకరు. శివ తర్వాత చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక పంధాను ఏర్పర్చుకున్న జేడి ఈ మద్య కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే తిరిగి దుబాయ్ శీను చిత్రం ద్వారా నటుడిగా కనిపించిన చక్రీ నటనకంటే తన గురువైన రాం గోపాల్ వర్మ పంధాలో దర్శకుడు కావాలనే కలను నిజం చేసుకునే ప్రయత్నంలో పడ్డారు. ఇందులో బాగంగానే ఈ మద్య జగపతిబాబును నటించిన "హోమం" ద్వారా చక్రీ దర్శకుడయ్యారు. ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా చక్రీ మంచి మార్కులే కొట్టెశాడని కోలివుడ్ నుంచి వచ్చిన ప్రశంస.
ఆరంభ కాలంలో నటుడిగా మంచి క్రేజ్ ను ఏర్పర్చుకున్న జేడీ అసలు కల దర్శకుడవటమే. అయితే ఎలాగో హోమం ద్వారా మంచి మార్కులే వచ్చిన చక్రీకి ఇప్పుడు దర్శకత్వంకంటే నటనావకాశాలు కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతున్నాయి. అందునా తమిళ్లో అయితే ఏకంగా రజనీకాంత్ చిత్రంలో విలన్ గా నటీంచే అవకాశం వచ్చింది. హోమం చిత్రం చూసిన దర్శకుడు శంకర్ చక్రీని తమ రోబొలో విలన్ గా నటించాలని పట్టుబట్టారు. దీనికి ముందే సర్వం అనే చిత్రంలో విలన్ గా నటించేందుకు అంగీకరించిన చక్రీ కొత్తగా రోబోతోపాటు మరికొన్ని చిత్రాలలో నటించేందుకు అంగీకరించినట్లు తెలిసింది.
దర్శకుడిగా కెరీర్ ను పెంచుకుందామని ప్రయత్నిస్తున్న చక్రీకి నటనావకాశాలు వెల్లువెత్తుతుండటంతో ఆయన రెండవ ఇన్నింగ్స్ విజయపధాన్నే వరిస్తుందని చెప్పొచ్చు. రాం గోపాల్ వర్మ శిష్యుడిగానే సుపరిచితమైన చక్రీ ఏకంగా ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం చిత్రంలో నటించటం ద్వారా జాతీయ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా సత్య ద్వారా బాలివుడ్ చిత్రసీమలో తనకంటూ గుర్తింపుతెచ్చుకున్న చక్రీ మంచి నటనకు అవకాశమున్న పత్రల్లను ఎంపిక చేసుకుంటూ తన కెరీర్ ను విజయపధంలోకి తెసుకెళుతుండటం అభినందించదగ్గ విషయం.

Tuesday, September 2, 2008

విఘ్నాలు వదిలే "చవితి" శుభాకాంక్షలు

శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం... అంటూ వక్రతుండుడైన విఘ్న రాజ వినాయకుడిని మొక్కందే ఏ రోజు ప్రారంభం కాదు. ముందు ఆయనకు పూజ చేసిన తర్వాతే మిగిలిన దేవుళ్లకు. అలా శాశించింది కూడా పరమేశ్వరుడే. అందుకే ఎంతటి వారైన సరే ముందుగా విఘ్నేశ్వరున్ని తలంచుకుని తమ విఘ్నాలన్ని తొలగిపొయ్యి అంతా శుభం జరగాలని కోరుకుంటారు. అంతేకాదు భారతీయ సంసృతి, సాంప్రదాయాల్లో, ఆచార, వ్యవహారాల్లో కూడా విఘ్న రాజుకు ప్రధమ నివేదనకే ప్రాధాన్యత ఇస్తారు. దీనికి తోడు భారతీయులు జరుపుకునే పండుగల్లో వినాయక చవితి (వినాయకచతుర్థి)ని మొదటి పండుగగా వ్యవరిస్తారు.
ఇందులో భాగంగానే నేడు వినాయక చతుర్థి(03.09.2009)అంటే భారతీయుల మొదటి పండుగ. నేటి నుండి దేశంలోని అన్ని ప్రాంతాలలో వినాయకుడి విగ్రహాలను కొలువుతీర్చి తొమ్మిది రోజులపాటు భక్తి శ్రద్దలతో కొలుస్తారు. హైదరాబాద్, ముంబై వంటి ప్రధాన నగరాలలో వేలాదిగా వినాయకుడి విగ్రహాలకు భారి స్థాయిలో ఏర్పాటు చేసేందుకు పోటీలు పడతారు. నవరాత్రులు ప్రత్యేక పూజలు నిర్వహించి చివరిగా భక్తి శ్రద్దలతో నిమజ్జనం చేస్తారు.
గత ఆరు నెలల ముందు నుంచే విఘ్నేశ్వరుడు అయిన వినాయకుడి విగ్రహాలను తయారు చేయించటంలో పోటి పడిన హైదరాబాద్ నగర వాసులు తమ ప్రాతాలలో వీటిని కొలువుతీర్చేందుకు సిద్దమయ్యారు. విభిన్న అవతారాలలో దర్శనమిస్తున్న విఘ్నేశ్వరుడి రూపాలు నగరానికి కొత్త శోభను అందించనున్నయి. విగ్రహాలను ఏర్పాటు చేయనున్న ప్రాతాలకు పోలిసుల అనుమతి కూడా తీసుకోవటం జరిగింది. అదేవిధంగా పండుగ సందర్బంగా ఎటువంటి అవాంచనీయ సంగటనలు జరగకుండా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లలో పోలీసు యంత్రాంగం సిద్దంగా ఉంది. ఈ ఏదాది కేవలం హైదరాబాద్ నగరంలోనే 25 వేల విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. విగ్రాహాల ఏర్పాట్లు, నిర్వాహణ, నిమజ్జనం ద్వారా మొత్తం సుమారు 100 కోట్ల రూపాయిల మేరకు ఖర్చు కానుంది.
భక్తి శ్రద్దలతో వినాయక చతుర్థిని జరుపుకుంటున్న అఖిలాండకోటి భారతీయులకు పిరమిడ్ సాయిమిరా సంస్థకు చెందిన హైదరాబాద్ సాయిమిర (http://www.hyderabadsaimira.com/ ), న్యూస్ రీల్ ఇండియా ( http://www.newsreelindia.in/)హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలుపుతోంది.

వినాయకుడి గజాననుని కథ

శివపార్వతుల ప్రథమ కుమారుడు వినాయకుడు. సర్వవిజ్ఞాలను తొలగించే దేవునిగా వినాయకుడు ప్రఖ్యాతి గాంచాడు. ఏ కార్యక్రమాన్ని అయినా ప్రారంభించే ముందు వినాయకుని పూజించడం హిందూవుల ఆనవాయితీ. ఈ వినాయక చవితి వేడుకలను పది రోజుల పాటు అతి వైభవంగా నిర్వహిస్తారు.కుమారస్వామి వలె వినాయకుడు పార్వతీ దేవి గర్భం నుంచి జన్మించలేదు. ఒక నాడు కైలాసంలో పార్వతీ దేవీ నలుగు పెట్టుకుని స్నానం చేస్తోంది. ఆ సమయంలో ఏమీ తోచక నలుగు పిండితో చిన్న బొమ్మను తయారు చేసింది. పార్వతీ దేవీ చెలికత్తె ఆ బొమ్మను చూసి బొమ్మ ముద్దుగా ఉందమ్మా ప్రాణం పోస్తే బాగుంటుందని అన్నది. దీంతో ముచ్చటపడిన పార్వతీ దేవీ ఆ బొమ్మను బ్రహ్మ వద్దకు తీసుకెళ్లి ప్రాణం పోయించి తీసుకురమ్మని చెలికత్తెలను పంపింది.అలా ప్రాణం పోసుకున్న ఆ బాలుడిని ఆమె స్నానాల గది బయట కాపలాకు పెట్టింది. ఆభరణాలను అలంకరించుకుని ఆమె భర్త రాకకై నిరీక్షించసాగింది. ఈ విషయం తెలియని పరమశివుడు పార్వతీ దేవీ మందిరంలోకి ప్రవేశించబోగా, ఆ బాలుడు అడ్డుకున్నాడు. ఆశ్చర్యపోయిన శివుడు ఎవరు నీవని ప్రశ్నించాడు? లోనికి ప్రవేశము లేదని ఆ బాలుడు చెప్పాడు. చాలా సేపు ఇద్దరి మధ్యా వాగ్యుద్దము జరిగిన తర్వాత ఆగ్రహోపేతుడైన పరమ శివుడు త్రిశూలంతో బాలుని తల నరికాడు. బాలుని హాహాకారాలు విన్న పార్వతీ దేవీ పరుగున వచ్చింది. రక్తపు మడుగులో ఉన్న కుమారుని చూచి నిశ్చేష్టురాలైంది. భర్తతో వాదులాడింది. జరిగిన తప్పు తెలుసుకున్న కైలాసనాథుడు పశ్చాత్తాపపడ్డాడు. బాలునికి ప్రాణం పోస్తానని మాట ఇచ్చాడు. అప్పుడే యుద్ధం చేసి ఖండించి తీసుకువచ్చిన గజాననుడు అనే రాక్షసుని తలను కుమారుడికి అతికించాడు. అప్పటినుంచి వినాయకుడికి గజాననుడు అనే పేరు వచ్చింది.

విఘ్నేశ్వరుడి పత్రి పూజ

ఈ పూజలో ముఖ్యమైనది గరిక. గరిక అంటే స్వామి వారికి ఎంత ఇష్టమో మనకు తెలిసిందే. దీనిని దూర్వా పత్రమని అంటారు. ఇందులో తెల్ల గరిక, నల్ల గరిక అని రెండు రకాలు ఉంటాయి. తర్వాతది మాచీ పత్రం అంటే చేమంతి జాతికి ఆకులు. ఈ ఆకులు సువాసన భరితంగా ఉంటాయి. తర్వాతి పత్రం అపామార్గ పత్రాలు. ఇవి గుండ్రంగా ఉంటాయి. దీనినే తెలుగులో ఉత్తరేణి అని అంటారు. బృహతీ పత్రం, వీటినే ములక అని అంటారు. వీటిలో చిన్న ములక, పెద్ద ములకలు అని రెండు రకాలు ఉన్నాయి. దుత్తూర పత్రం, అంటే ఉమ్మెత్త ఆకులు. వంకాయ జాతికి చెందిన చెట్లు ఇవి. తులసీ పత్రం, ఈ పత్రాల గురించి ప్రత్యేకంగా చెప్పేదీ ఏమీ లేదు. దేవతార్చనలో వాడే ఈ పత్రాలు మంగళదాయకమైనవి.

హ్యాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాన్... ఈ పేరు వినగానే యువతలో టక్కున ఓ షార్ప్ నెస్ కనిపిస్తుంది. అంతేకాదు కొత్త ప్యషన్లు... స్టైల్.. తాను ఏది చేసిన కొత్తదనాన్ని చూపటం అయనకే సాద్యం. అందుకే ఆయన పేరు వినగానే కుర్రకారు చిందేస్తారు. అయితే సినిమాలేమోగానీ అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఆవిర్బావానికి చమతోడ్చిన పవన్ కళ్యాన్ కొద్ది రోజుల విరామం తర్వాత ఇదిగో ఈరోజు పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు. విభిన్నతను కోరుకుంటూ ఆచితూచి సినిమాల్లో నటించే పవన్ ప్రస్తుతం ఎస్ జే సూర్య దర్శకత్వలో "పులి" చిత్రంలో నటిస్తున్నాడు.
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమకు పరిచయమైన పవన్ చేసిన ప్రతి చిత్రంలోనూ తనకంటూ ప్రత్యేకతను తెచ్చుకున్నారు. సుస్వాగతం ఆయనకు బ్రేక్ ను ఇవ్వగా తొలిప్రేమ తెలుగు చిత్రసీమలో లవర్ బాయ్ క్రేజ్ ను తెచ్చింది. తదనంతరం తమ్ముడు, భద్రి, ఖుషి చిత్రాలు పవన్ అంటే పవర్ స్టార్ అనే గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఖుషిలోని సిద్దు ఉరప్ సిద్దార్థ్ రాయ్ పాత్ర పవన్ సిని జీవితాన్ని ఓ మలుపు తిప్పింది.
ఎప్పుడూ కొత్తదనాన్ని కొరుకునే పవన్ తన ఆలోచనలను తెరకెక్కించే ప్రయత్నంలో జాని చిత్రం ద్వారా దర్శకుడి అవతారం కూడా ఎత్తారు. అయితే ఆ చిత్రం సాంకేతికంగా గుర్తింపు పొందిన ఆర్థికంగా నిరాశపరిచింది. అయినా కలత చెందకుండా వరుస చిత్రాలలో నటిస్తూ ముందుకు సాగుతున్నారు. కుషి విదుదలై ఆరేళ్ల తర్వాత ఆ చిత్ర దర్శకుడైన ఎస్ జే సూర్యాతో మరో సంచలనానికి సిద్దమయ్యారు. వీరి కాంభినేషన్ లో వస్తున్న ఈ చిత్రానికి "పులి"గ నామకరణం చేసి జోరుగా చిత్రీకరణ జరుపుతున్నారు. ఇందులో పవన్ కు జోడిగా ముంబైకి చెందిన నిఖిషాపటేల్ నటిస్తుండగా మెగా ప్రొడ్యూసర్ శింగనమల రమేష్ నిర్మాత.
నిజజీవితంలో విశాఖపట్నం కు చెందిన నందినిని వివాహం చేసుకున్న పవన్ అనంతరం వైవాహిక జీవితానికి బైబై చెప్పారు. ఇటీవలే నందినితో వివాహాన్ని రద్దు చేసుకున్న పవన్ మెగాస్టార్ ప్రజా పార్టీ పనుల్లో తలమునకలయ్యారు. నందినితో తెగదెంపులు చేసున్న పవన్ నటి (ఒకప్పుడు) రేణుడేశాయ్ తో కలిసి ఉంటున్నారు. వీరికి ఓ సంతానం కూడా ఉంది. వ్యక్తిగత జీవితాన్ని వెళ్లడించటానికి ఆసక్తి చూపించని పవన్ ప్రస్తుతం ప్రజారాజ్యం పార్టీ పనుల్లో, పులి చిత్రీకరణలోబిజీగా ఉన్నారు.
ఈ నేపధ్యంలో జన్మదినాన్ని జరుపుకుంటున్న పవన్ కళ్యన్ కు పిరమిడ్ సాయిమిరా గ్రూప్ కు చెందిన హైదరాబాద్ సాయిమిరా ( http://www.hyderabadsaimira.com/), న్యూస్ రీల్ ఇండియా (http://www.newsreelindia.in/ ) హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతోంది.