
బుల్లి తెరపై సంచలనం సృష్టిస్తున్న సిమ్రాన్ ఇప్పుడు ధీర వనిత గాధలో "నువ్వా నేనా"తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. "మా టీవి"లో ప్రసారమవుతున్న "సిమ్రాన్ మరపురాని కథలు" లో భాగంగా ఈ నెల ముప్పై నుంచి ప్రసారం కానున్న "నువ్వా నేనా" సీరియల్ లో సిమ్రాన్ తన చిన్ని తెర జీవితంలోనే మరపురాని పాత్రతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు."సిమ్రాన్ మరపురాని కథలు"లో భాగంగా ప్రసారమైన మొదటి భాగం "సీతాకోకచిలుక"లో గృహిణి పాత్రలో ప్రేక్షకులను అలరించిన సిమ్రాన్ ఇప్పుడు ధీరోదాత్తమైన పాత్రలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
"నువ్వా నేనా" ధారావాహికలో సిమ్రాన్ ధైర్య వంతురాలైన ఆధునిక అమ్మాయిగా నటిస్తున్నారు. ఎటువంటి చాలెంజ్ నయినా ధైర్యంగా ఎదుర్కొనే ఈ పాత్రలో ఆమె తన కన్నతల్లికి, తనకు అన్యాయం చేసిన వారిపై ఎదురుతిరిగి, విజయం సాధించే పాత్రలో ప్రేక్షకులను అలరించనున్నారు. ఆగ్రహం, పగ, ప్రతీకారం, వివక్షలు ప్రధాన అంశాలుగా కొనసాగే ఈ ధారావాహికలో శుభలేఖ సుధాకర్,రిషి, శ్రీనివాస్, ఐశ్వర్య, లతా రావ్,అళగులు ప్రధాన పాత్రలు పోశిస్తున్నారు. ఈ ధారావాహిక అళగర్ దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ కార్యక్రమం ఈ నెల ముప్పై నుంచి సోమవారం నుంచి, గురువారం వరకు రాత్రి 8:30 నిమిషములకు "మాటీవి"లో ప్రసారమవుతుంది.
కథ: శుభా వెంకట్
స్క్రీన్ ప్లే, మాటలు: కుమరేశన్
సినెమాటోగ్రఫీ: గోపాల్
దర్శకత్వం: అళగర్
క్రియేటివ్ హెడ్: శుభా వెంకట్