Saturday, June 14, 2008

మళ్ళీ దర్శకత్వం వైపు మల్లిన పవన్ కళ్యాణ్ దృష్టి

పవన్ కళ్యాణ్ తిరిగి దర్శకత్వం వైపు దృష్టి సారించాడు. తన డ్రీం ప్రాజెక్ట్ గా ప్రారంభించిన "సత్యాగ్రహి" స్క్రిప్టును దుమ్ము దులిపి తిరిగి తెరకెక్కించే ప్రక్రియకు ఇటీవలే ప్రాణం పోశాడు. అప్పట్లో శ్రీ సూర్యా మూవీస్ అధినేత ఎ.ఎం. రత్నం ఈ "సత్యాగ్రహి" సినిమాను నిర్మించాలనుకున్నారు. అయితే ఆ తర్వాత వరస ఫ్లాపులతో రత్నం నిండా నష్టాల్లో కూరుకు పోవడంతో ఆయన "సత్యాగ్రహి"ని నిర్మంచలేనని పవన్‌కు తేల్చి చెప్పేశారు. కానీ పవన్ కి ఆప్రాజెక్టు పై ఆసక్తి తగ్గలేదు. దాదాపు రెండేళ్ల తర్వాత నూకారపు సూర్య ప్రకాశరావు రూపంలో పవన్‌కు మరో నిర్మాత లభించాడు. అలాగే "సత్యాగ్రహి" చిత్రాన్ని పవన్ కళ్యాణ్ దర్శకత్వంలోనే నిర్మించేందుకు నూకారపు ఆనందంగా అంగీకరించారని తెలుస్తోంది.ఒకవైపు "పులి" కోసం పవన్ సిద్ధమవుతూనే, మరోవైపు "సత్యాగ్రహి" స్క్రిప్టును తన రచయితల బృందంతో కలిసి తయారు చేస్తున్నాడు . ఇప్పటికి ఆ స్క్రిప్ట్ 75 శాతం దాకా పూర్తయిందని అంటున్నారు. అర్జెంటీనా విప్లవ యోధుడు చేగువేరాని అమితంగా ఆరాధించే పవన్, ఆయన స్ఫూర్తితో ఈ కథను రూపొందిస్తున్నాడు. అన్నీ అనుకూలిస్తే ఈ సినిమా 2009 జనవరిలో సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలున్నాయి. పూర్తవటానికి ఒక యేడాది గ్యారింటీగా పడుతుంది. అంటే పవన్ దర్శకత్వంలో తయారయ్యే సినిమా చూడాలంటే మనం 2010దాకా ఆగాలి.

1 comment:

Jobove - Reus said...

very good blog congratulations
regard from Catalonia Spain
thank you