Saturday, June 7, 2008

చిరంజీవికి అసలు సినిమాలు చేసే ఉద్దేశ్యం ఉందా?

ఏమో ఈ ప్రశ్నకు సమాధానం చెప్పమని విక్రమార్కుడు కథలోని బేతాళుడిని అడగాల్సొచ్చేలా ఉందని ఊహాగానాలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. చిరంజీవి కొత్త సినిమాకు రాజకీయ సంబంధం ఏర్పడటంతో అసలు చిరంజీవి సినిమాలు చేస్తాడా, లేదా?, చేస్తే సినిమాలు చేస్తూ రాజకీయాల్లో చేరతాడా? లేక రాజకియాల్లోకోచ్చి సినిమాలు మానేస్తాడా? కాదు కాదు చిరంజీవి సినిమాలు చేస్తాడని ఒకవైపు, కాదు కాదు చిరంజీవి రాజకీయాల్లోకే వస్తాడని మరోవైపు.. అసలివేం కావు చిరంజీవికి ఉన్న కొత్త ఉద్దేశ్యమే వేరు దానిని ఆయనే బహిరంగ పరుస్తాడని ఇంకోవైపు....ఇదీ ప్రస్తుతం టాలీవుడ్ లో నెలకొన్న చిరంజీవి కొత్త సినిమా భవిశ్యత్తు. ఈ మధ్యన కొత్తగా మరో విశయం తెలిసింది, అది చిరంజీవి కొత్త చిత్రం చేస్తాడనీ దానిని రాఘవేంద్రరావు దర్శకత్వంలో నిర్మిస్తారనీ, ఎప్పటినుంచో అనుకుంటున్న "అధినాయకుడు" చిత్రమే అదనీ తాజా సమాచారం. మరి ఈ చిత్రానికి ఎంకౌంటర్ "శంకర్" ని కదా ముందుగా దర్శకునిగా అనుకుందీ అంటే, అదినిజమే అయితే ప్రస్తుతం ఈ చిత్రానికి దర్శకుడిగా రాఘవేంద్ర రావు గారిని ఎన్నుకోవడం జరిగిందనీ అదనపు సమాచారం. ఇక్కడొక విషయం చెప్పాలి, ముందునుంచీ ఈ "అధినాయకుడు" చిత్రం వార్తల్లో నానుతోంది. చిరంజీవి 149వ చిత్రం గా నిర్మించదలచిన చిత్రం "అధినాయకుడు". చిరంజీవి యాక్షన్ సినిమా కథలాగానే రోజుకో విచిత్రమైన ట్విస్టుతో అందరిలో ఆసక్తి రేపడం సహజం. మొదట అసలు చిరంజీవికి ఈ సినిమా చేసే యోచన లేదని టాక్ వచ్చింది. తర్వాత ఈ సినిమానే కాదు అసలు ఏ సినిమాలోనూ ఇప్పట్లో చేయరు అన్నారు. తర్వాత కొంత కాలానికి "అధినాయకుడు" వస్తోందనీ పరుచూరి వారు స్క్రిప్టు తుది మెరుగులు దిద్దుతున్నారనీ, ఎన్.శంకర్ దర్శకత్వం వహిస్తాడని అన్నారు. తర్వాత ఇవేమీ నిజం కాదు నాగబాబు హీరోగా కోడి రామకృష్ణ దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి ఆ టైటిల్ వాడుతున్నారని అన్నారు. తర్వాత కాదు కాదు ఆ టైటిల్ తన అన్నకే సూటవుతుందని నాగబాబు చిరంజీవి సినిమాకే ఉంచుతానని అన్నాడు. తన చిత్రానికి "ఏక్ పోలీస్" అనే టైటిల్ పెట్టుకున్నాడు. ఇలా తడవకో మలుపు తిర్గుతున్న ఈ కథనం ఇప్పుడు మరో ముఖ్యమైన మలుపు తీసుకుంది. చిత్రానికి దర్శకుడిని మార్చారని తెలుస్తోంది. "పాండురంగడు" సినిమా తర్వాత వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను దృష్టిలో వుంచుకుని రాఘవేంద్రరావునే డైరెక్ట్ చేయమని చిరంజీవి కోరినట్లు తెలిసింది. రాఘవేంద్రరావు కూడా దీనికి సరేనన్నారు. ఈ సినిమాను రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, సి. అశ్వనీదత్ కలిసి నిర్మించనున్నారు. ఈ నెలలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలున్నాయి. పరుచూరి బ్రదర్స్ ఈ సినిమాకు రచన చేస్తున్నారు. మరి ఈ మార్పైనా మారకుండా సినిమా సెట్స్ మీదకు వెళ్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.

No comments: