Monday, June 30, 2008

"కథానాయకుడు"లో కొత్తగా కనిపించనున్న రజినీ

సూపర్ స్టార్ రజినీ కాంత్ "కథానాయకుడు" చిత్రంలో కొత్తగా కనిపించనున్నారు. పిరమిడ్ సాయిమిరా థియేటర్ లిమిటెడ్ ప్రపంచవ్యాప్తంగా విడుదలచేయనున్న ఈ తెలుగు, తమిళ చిత్రంలో రజినీ కాంత్ అభిమానులను ఇరవై పాత్రలతో అలరించనున్నారు.ఈ చిత్రంలో సూపర్ స్టార్ స్మార్ట్ గా, హ్యాండ్ సం గా కనిపించనున్నారు. ప్రముఖ నిర్మాత వైజయంతీ ఫిలింస్ అధినేత సి.అశ్వినీ దత్ తెలుగులో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తమిళంలో ప్రముఖ దర్శకనిర్మాత కె.బాలచందర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రజినీ కాంత్ నిజజీవితంలోని పాత్రనే పోషిస్తున్నారు. నిజజీవితంలో సినీ కథానాయకుడైన రజినీకాంత్ అదే పాత్రను ఈ చిత్రంలో పోషిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఇరవై గెటప్ లలో కనిపించనున్నారు. ఆయన సరసన నయనతార, మమతా మోహందాస్ సహా పలువురు కథానాయికలు నటించనున్నారు. రజినీ కాంత్ చిన్ననాటి మితృడి పాత్రలో హీరో జగపతి బాబు నటిస్తున్నారు. ఆయన సరసన మీనా కథానాయకిగా నటిస్తోంది. ఇంకా ఈ చిత్రంలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం, బ్రహ్మానందం, సునీల్, ఎం ఎస్ నారాయణ, నర్సింగ్ యాదవ్ సహా పలువురు హాస్య నటులు నటిస్తున్నారు.ఈ చిత్రానికి సంగీతం జి వి ప్రకాశ్. దలేర్ మెహందీ రజినీకాంత్ కోసం ఓ ప్రత్యేక గీతాన్ని ఆలపిస్తున్నారు.ఈ చిత్రం ఆడియో ఈ నెల 30వ తేదీన విడుదలవుతోంది.




Saturday, June 28, 2008

Thursday, June 26, 2008

సిమ్రాన్ "నువ్వా-నేనా"

బుల్లి తెరపై సంచలనం సృష్టిస్తున్న సిమ్రాన్ ఇప్పుడు ధీర వనిత గాధలో "నువ్వా నేనా"తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. "మా టీవి"లో ప్రసారమవుతున్న "సిమ్రాన్ మరపురాని కథలు" లో భాగంగా ఈ నెల ముప్పై నుంచి ప్రసారం కానున్న "నువ్వా నేనా" సీరియల్ లో సిమ్రాన్ తన చిన్ని తెర జీవితంలోనే మరపురాని పాత్రతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు."సిమ్రాన్ మరపురాని కథలు"లో భాగంగా ప్రసారమైన మొదటి భాగం "సీతాకోకచిలుక"లో గృహిణి పాత్రలో ప్రేక్షకులను అలరించిన సిమ్రాన్ ఇప్పుడు ధీరోదాత్తమైన పాత్రలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
"నువ్వా నేనా" ధారావాహికలో సిమ్రాన్ ధైర్య వంతురాలైన ఆధునిక అమ్మాయిగా నటిస్తున్నారు. ఎటువంటి చాలెంజ్ నయినా ధైర్యంగా ఎదుర్కొనే ఈ పాత్రలో ఆమె తన కన్నతల్లికి, తనకు అన్యాయం చేసిన వారిపై ఎదురుతిరిగి, విజయం సాధించే పాత్రలో ప్రేక్షకులను అలరించనున్నారు. ఆగ్రహం, పగ, ప్రతీకారం, వివక్షలు ప్రధాన అంశాలుగా కొనసాగే ఈ ధారావాహికలో శుభలేఖ సుధాకర్,రిషి, శ్రీనివాస్, ఐశ్వర్య, లతా రావ్,అళగులు ప్రధాన పాత్రలు పోశిస్తున్నారు. ఈ ధారావాహిక అళగర్ దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ కార్యక్రమం ఈ నెల ముప్పై నుంచి సోమవారం నుంచి, గురువారం వరకు రాత్రి 8:30 నిమిషములకు "మాటీవి"లో ప్రసారమవుతుంది.
కథ: శుభా వెంకట్
స్క్రీన్ ప్లే, మాటలు: కుమరేశన్
సినెమాటోగ్రఫీ: గోపాల్
దర్శకత్వం: అళగర్
క్రియేటివ్ హెడ్: శుభా వెంకట్







పిరమిడ్ అందిస్తున్న మరో "స్వరనీరాజనం"

పిరమిడ్ సాయిమిరా ప్రొడక్షన్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ రూపొందించిన మరో మెగా రియాలిటీ షో "స్వరనీరాజనం" తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలు చూరగొంటోంది. పిరమిడ్ ఆధ్వర్యంలో ప్రస్తుతం "జీ తెలుగు" లో ప్రసారమవుతున్న "స రి గ మ ప" టెలీ సీరియల్ మంచి విజయాన్ని సాధించి, సెమీ ఫైనల్ స్థాయికి చేరుకున్న విశయం తెలిసిందే. తాజాగా అలనాటి సంగీత సామ్రాట్టులు మొదలు, నేటి సంగీత సామ్రాట్టుల దాకా తెలుగు చిత్ర సీమకు అందించిన మేటి గీతాలతో కొనసాగే ఈ కార్యక్రమం ప్రస్తుతం "జీ తెలుగు" లో ప్రసారం అవుతోంది. పరనిక వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రతి ఆదివారం రాత్రి 9:00 గంటల నుంచి, రాత్రి 10:30 దాకా "జీ తెలుగు"లో ప్రసారం చేస్తున్నారు. ఈ కార్యక్రమం కళ్యాణ్ దర్శకత్వంలో రూపొందుతోంది.



Monday, June 23, 2008

సెమీ ఫైనల్స్ లోకి అడుగు పెట్టిన "స రి గ మ ప"

పిరమిడ్ సాయిమిరా ప్రొడక్షన్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, హైదరాబాదు విభాగం నిర్మిస్తున్న "స రి గ మ ప" రియాలిటీ షో విజయవంతంగా సెమీ ఫైనల్స్ లోకి అడుగుపెట్టింది. పిరమిడ్ సాయిమిరా థియేటర్ లిమిటెడ్ లో భాగమైన పిరమిడ్ సాయిమిరా ప్రొడక్షన్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ "స రి గ మ ప" గానలహరి ఆంధ్ర ప్రదేశ్ లోని ఆబాలగోపాలాన్ని ఎంతగానో అలరిస్తోంది. గత కొన్ని నెలల క్రితం 'జీ టీవీ'లో ప్రసారం ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇంకా చివరి దశకు చేరుకోకుండానే, ఇందులో పాల్గొంటున్న అభిరాం, సాహితి, పూజ మరియు రఘురాం లకు పలు చిత్రాలలో పాటలు పాడే అవకాశం రావడం గమనార్హం. 14 నుంచి 24 మద్య వయసున్న 30 మంది వర్దమాన గాయకులతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇటీవల సెమీ ఫినల్స్ కు చేరుకుంది. ప్రతి బుధ, గురు వారాలలో రాత్రి 9:00 గంటలనుంచి, రాత్రి 10:30 నిమిషములదాకా కొనసాగుతున్న ఈ కార్యక్రమానికి గాయని గీతా మాధురి యాంకర్ గా వ్యవహరిస్తుండగా, మ్యూజిక్ కంపోసర్ కోటేశ్వర రావ్, "గోదావరి" చిత్ర సంగీత దర్శకుడు రాధాకృష్ణ లు న్యాయ నిర్నేతలుగా వ్యవహరిస్తున్నారు. కళ్యాణ్ దర్శకత్వంలో కొనసాగుతున్న "స రి గ మ ప" కార్యక్రమ క్వార్టర్ ఫైనల్స్ లో సాహిథి, పూజ, పవన్, శ్రీకృష్ణ, అభిరాం మరియు అనుదీప్ లు సెమీ ఫినల్స్ కు చేరుకున్నారు.












ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిలిం "బ్రిక్ లేన్" ట్రైలర్

Indian international flick “Brick Lane” Trailer

Saturday, June 21, 2008

ఘన విజయం దిశగా సిమ్రాన్ "సీతాకోక చిలుక"

గ్లామర్ తారగా ఆబాలగోపాలాన్ని అలరించిన ప్రముఖ సినీ నటీమణి సిమ్రాన్ బుల్లితెరపై చేసిన మొదటి కార్యక్రమం "సిమ్రాన్ మరపురాని కథలు" ఘన విజయం దిశగా పయనిస్తున్నాయి. పిరమిడ్ సాయిమిరా ప్రొడక్షన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ధారావాహిక గత మే 26నుంచి సోమవారం నుంచి శుక్రవారం దాకా రాత్రి 8.30 నుంచి 9.00 గంటలదాకా 'మాటీవీ' లో ప్రసారమవుతోంది. తెలుగు, తమిళ సినీ రంగాలలోని ప్రముఖ దర్శకులు, సినిమాటోగ్రాఫర్స్, కథా రచయితల నేతృత్వంలో రూపొందుతున్న "సిమ్రాన్ మరపురాని కథలు" ధారావాహికలో భాగంగా, మొదట "సీతాకోక చిలుక" ప్రసారమవుతోంది. ప్రముఖ తమిళ రచయిత సుజాత వ్రాసిన "వానత్తుపూచ్చి వేట్టై" కథ ఆధారంగా రూపొందించిన ఈ సీరియల్ లో సిమ్రాన్, రాఘవ్, వై విజయ, పూజ, వరదరాజన్, మోహన్ రాం, మీనా క్రిష్ణన్ లు నటించారు. పిరమిడ్ సాయిమిరా ప్రొడక్షన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ నిర్మిస్తున్న ఈ సీరియల్ ప్రతి నెలకు ఒక కొత్త కథతో ప్రారంభం కొనసాగుతుంది. ప్రస్తుతం కొనసాగుతున్న "సీతాకోక చిలుక" తదనంతరం, మరో కథతో కొత్త ధారావాహిక ఈ నెలలోనే మొదలవుతుందని సమాచారం.






Friday, June 20, 2008

నాగార్జున "రామ మందిర్" ను ఆవిష్కరించిన ఎల్ కె అద్వానీ

అక్కినేని నాగార్జన,స్నేహ కాంబినేషన్ లో రాఘవేంద్రరావు రూపొందించిన 'శ్రీరామదాసు' చిత్రం 'శ్రీరామమందిర్' గా హిందీలోకి అనువాదమవుతన్నసంగతి తెలిసిందే. ఈ చిత్రానికి చెందిన ఆడియో క్యాసెట్, సి డి లను బిజెపి అగ్రనేత ఎల్‌ కె అద్వానీ ఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ చిత్ర కార్యక్రమానికి భార్య కమలతోసహా హాజరై, ముందుగా ఏర్పాటు చేసిన ప్రివ్యూను తిలకించారు. తరువాత మీడియాతో మాట్లాడుతూ శ్రీరాముడు ఆదర్శపురుషుడని, ఆయన అడుగుజాడలు దేశ ప్రజలందరికీ ఆదర్శనమని చెప్పారు. చిత్రంలో కులమతాలకతీతంగా రాముడిని కొలిచిన తీరును చాలా బాగా చిత్రీకరించారని, అదే పద్దతిలో అయోధ్యలో రామాలయ నిర్మాణం తన చిరకాల కోరిక అని అధ్వానీ అన్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ టైమ్‌లో అద్వానీ మరోసారి అయోధ్య రామాలయ అంశాన్ని బయటకు తేవడం అంతటా చర్చనీయాంశమైంది.

Wednesday, June 18, 2008

ఆంజనేయా...ఆదుకోవా: చిరంజీవి

ఈ ఫోటోలు చూస్తుంటే చిరంజీవి ప్రస్తుత రాజకీయాలనుంచి రాష్ట్రాన్ని ఆదుకోవలసిందిగా కోరుతున్నట్లు ఉంది కదూ. అయితే నిజం వేరు. ఆంజనేయ స్వామి భక్తుడైన చిరంజీవి మంగళవారం జూబిలీ హిల్స్ లోని దాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుమారుడు రాంచరన్ తేజ, భార్య సురేఖ లతోబాటు, ప్రముఖ నటులు మురలీ మోహన్, నిర్మాత ఆలయ కమిటీ చైర్మెన్ వి బి రాజేంద్ర ప్రసాద్ లు సహితం ఈ పూజలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజూకీయ ప్రవేశం పై స్పందించవలసిందిగా తనతో మాట్లాడిన విలేఖరులతో చిరంజీవి, ఆ విషయాలు ప్రస్తుతానికి వద్దని తోసిపుచ్చారు. మరి దేవుడిని ఏం కోరుకున్నారని అడగగా "సర్వేజనా సుఖినోభవంతు" అని కోరుకున్నానంటూ ముందుకు కదిలిపోవడం గమనార్హం.


"మడగాస్కర్-ఎస్కేప్ టు ఆఫ్రికా" Trailer

Madagascar - Escape 2 Africa Trailer

Tuesday, June 17, 2008

చిరంజీవి తయారు చేయించుకుంటున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం

చిరంజీవి రాజకీయ ప్రవేశానికి సంబంధించిన మరో అంకం తుది దశకు చేరుకుంది. చిరంజీవి రాజకీయ ప్రవేశం అధికారికంగా ఇంకా ప్రకటించకున్నా, ఆయన రాజకీయ ప్రవేశం ఖరారైంది. దాంతో చిరంజీవి అనుయాయులు చిరంజీవికోసం రక్షణ అంశాలపై ఇప్పుడు దృష్టి సారించారు. గత కొంత కాలంగా చిరంజీవి రక్షణ కోసం ఓ బుల్లెట్ ప్రూఫ్ వాహనం రూపొందుతోంది. చిరంజీవి ప్రచార రథం గా కూడా వినియోగించే ఈ వాహనం హైదరాబాద్ లోని జీడి మెట్లలో ఉన్న రియల్ కార్స్ లో రూపు దిద్దుకుంటోంది. రాష్ట్రంలో బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు తయారు చేయడంలో అగ్రగామిగా ఉన్న ఈ సంస్థలో ఈ భారీ రక్షణ వాహనం రూపుదిద్దుకుంటోంది. ఒక ఐషర్ వ్యాన్ ను తీసుకుని దానికి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. ఇప్పటికే ప్రాధమిక స్థాయిలో ఈ వాహనాన్ని పలుమార్లు పరీక్షించడం కూడా జరిగిందని సమాచారం.
చిరంజీవి తన రాజకీయ కార్యక్రమాలలో పాల్గొనడంకోసం, ప్రచార కార్యక్రమాలలో ఉపయోగించడం కోసం ఈ వాహనాన్ని ప్రత్యేక సదుపాయాలతో తయారు చేశారు. ఇందులో చిరంజీవి తన ప్రయాన సమయంలో పడుకోడానికి, స్నానం చేయడానికి వీలుగా అన్ని ఏర్పాట్లు చేయించుకుంటున్నారు. చిరంజీవి మరో జంబో వాహనాన్ని అహ్మదాబాద్ లో తయారు చేయించుకుంటున్నారన్న వార్త కూడా నిజమే. అయితే ఆ ఆ జంబో వాహనంలో తను కాకుండా అల్లు అరవింద్, నాగబాబు, పవన్ కళ్యాణ్ సహా ఇతర ముఖ్య నాయకులకు కేటాయించినట్లు సమాచారం. తను మాత్రం ఎన్టీఆర్ లా సింపుల్ గా ఉండటం కోసం, అన్ని రకాల చిన్న పెద్ద సమావేశాలకు ఉపయోగించడం కోసం పెద్ద వాహనమైతే ప్రతిబందకంగా మారుతుందని, అలాగే పెద్ద వాహనాన్ని ఎవరైనా సులువుగా గుర్తించే వీలుండటంతో చిరంజీవి తనకిఎసం ఈ చిన్న వాహనాన్ని రూపొందించుకుంటున్నట్లు సమాచారం. జీడిమెట్లలో తయారవుతున్న చిరంజీవి "ప్రచారరథం"పై ఇప్పటికే నిఘా పోలీసులు సహజంగా దృష్టి సారించినట్లు బోగట్టా. చిరంజీవి భద్రతకు ఏ కోణం నుంచి చూసినా ప్రమాదం లేదని, ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం అవసరం లేదని నిఘా పోలీసుల అభిప్రాయంగా తెలుస్తోంది.అయితే ప్రైవేటు వ్యక్తులు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను తయారు చేయించుకోవచ్చా? ఇది కొత్త విషయం కాబట్టి దీనిపై ప్రభుత్వం ఇంతవరకు మార్గదర్శకాలను రూపొందించుకోలేదు. ఈనాడు గ్రూపు సంస్ధల అదినేత రామోజీరావుకు, ఎమ్మెల్సీ కాసాని గ్జానేశ్వర్ లతోబాటు మరికొందరు ప్రముఖులు అనధికారికంగా బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు వాడుతున్నట్లు సమాచారం. కాబట్టి చిరంజీవి అటువంటి వాహనం తయారు చేయించుకోవడం చట్టవిరుద్ధం కాదని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

ఎక్స్-ఫైల్స్: ఐ వాంట్ టు బిలీవ్" ట్రైలర్


X-Files: I Want to Believe Trailer

Monday, June 16, 2008

ది మమ్మీ: 3 టాంబ్ ఆప్ ది డ్రాగన్ ఎంపరర్ ట్రైలర్

The Mummy 3: Tomb of the Dragon Emperor Official Trailer

చిరంజీవి రాజకీయ పార్టీ అధికారిక ప్రకటన ఆగస్టులో: నాగబాబు

చిరంజీవి తాను పెట్టబోయే పార్టీ గురించి ఆగస్టులో ప్రకటిస్తారని ఆయన సోదరుడు, సినీ నటుడు నాగబాబు చెప్పారు. ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. తమ పార్టీ బిసి, ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి పాటు పడుతుందని ఆయన చెప్పారు. ప్రజల మేలు కోసమే చిరంజీవి రాజకీయాల్లోకి వస్తున్నారని ఆయన చెప్పారు. చిరంజీవి రాజకీయాల్లోకి రావాలని అందరూ కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. విభజించి పాలించు అనే బ్రిటిష్ పాలకుల నీతిని అనుసరిస్తున్నారని, చిరంజీవి పార్టీ అందరికీ సమాన ప్రాధాన్యం ఇస్తుందని ఆయన చెప్పారు. పార్టీలో చిరంజీవి అభిమానులకు ప్రాధాన్యం ఉంటుందని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు ఈ విషయాన్ని చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ మాత్రమే ప్రకటిస్తూ వచ్చారు. తాజాగా నాగబాబు ఆ విషయాన్ని ప్రస్తావించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

"స్పేస్ చింప్స్" ట్రైలర్

“Space Chimps” Trailer

Saturday, June 14, 2008

మళ్ళీ దర్శకత్వం వైపు మల్లిన పవన్ కళ్యాణ్ దృష్టి

పవన్ కళ్యాణ్ తిరిగి దర్శకత్వం వైపు దృష్టి సారించాడు. తన డ్రీం ప్రాజెక్ట్ గా ప్రారంభించిన "సత్యాగ్రహి" స్క్రిప్టును దుమ్ము దులిపి తిరిగి తెరకెక్కించే ప్రక్రియకు ఇటీవలే ప్రాణం పోశాడు. అప్పట్లో శ్రీ సూర్యా మూవీస్ అధినేత ఎ.ఎం. రత్నం ఈ "సత్యాగ్రహి" సినిమాను నిర్మించాలనుకున్నారు. అయితే ఆ తర్వాత వరస ఫ్లాపులతో రత్నం నిండా నష్టాల్లో కూరుకు పోవడంతో ఆయన "సత్యాగ్రహి"ని నిర్మంచలేనని పవన్‌కు తేల్చి చెప్పేశారు. కానీ పవన్ కి ఆప్రాజెక్టు పై ఆసక్తి తగ్గలేదు. దాదాపు రెండేళ్ల తర్వాత నూకారపు సూర్య ప్రకాశరావు రూపంలో పవన్‌కు మరో నిర్మాత లభించాడు. అలాగే "సత్యాగ్రహి" చిత్రాన్ని పవన్ కళ్యాణ్ దర్శకత్వంలోనే నిర్మించేందుకు నూకారపు ఆనందంగా అంగీకరించారని తెలుస్తోంది.ఒకవైపు "పులి" కోసం పవన్ సిద్ధమవుతూనే, మరోవైపు "సత్యాగ్రహి" స్క్రిప్టును తన రచయితల బృందంతో కలిసి తయారు చేస్తున్నాడు . ఇప్పటికి ఆ స్క్రిప్ట్ 75 శాతం దాకా పూర్తయిందని అంటున్నారు. అర్జెంటీనా విప్లవ యోధుడు చేగువేరాని అమితంగా ఆరాధించే పవన్, ఆయన స్ఫూర్తితో ఈ కథను రూపొందిస్తున్నాడు. అన్నీ అనుకూలిస్తే ఈ సినిమా 2009 జనవరిలో సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలున్నాయి. పూర్తవటానికి ఒక యేడాది గ్యారింటీగా పడుతుంది. అంటే పవన్ దర్శకత్వంలో తయారయ్యే సినిమా చూడాలంటే మనం 2010దాకా ఆగాలి.

"కుంగ్ ఫూ పాండా" వాల్ పేపర్స్

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చిన్నారులను, కామిక్ కథలను ఇష్టపడే వారికోసం వాల్ట్ డిస్నీ రూపొందించిన "కుంగ్ ఫూ పాండా" హాలీవుడ్ లో కలెక్షన్ల పరంగా రికార్డు సృష్టిస్తోంది. ఆసక్తి గల కామిక్ లవర్స్ కోసం డిస్నీ రూపొందించిన ప్రత్యేకమైన "కుంగ్ ఫూ పాండా" మీకోసం.