Monday, August 4, 2008

చిరంజీవి పార్టీకి రూ.500 కోట్ల ఎన్నారై నిధులు

మెగాస్టార్ ప్రారంభించనున్న కొత్త పార్టీకి ఎన్నారైల నుంచి నుధులు వెల్లువెత్తుతున్నాయి. విదేశాల్లోని ప్రవాస భారతీయులు, పారిశ్రామికవేత్తలు, ఉన్నత వర్గాలకు చెందిన అభిమానుల నుంచి ఇప్పటికే రూ.500 కోట్లకు మేర నిధులు అందినట్లు తెలుస్తోంది. చిరు కొత్త పార్టీకి సారధులైన నాగబాబు, అల్లు అరవింద్, పవన్ కళ్యాన్, డా.మిత్రాలు ఈ నిధుల సేకరణలో ప్రధాన భూమికను పోషిస్తునట్లు తెలుస్తోంది. ఇప్పటికే వివిద జిల్లాల ప్రముఖ నేతలతో చర్చలు జరుపుతూ పార్టీని బలోపేతం చెస్తున్న సారధులు పార్టీ ప్రరంభం నాటికే భారిగా నిదులను సైతం సేకరించాలని నిర్ణయించారు. తద్వారనే పార్టీకీ భవిష్యత్తులో సైతం నిదుల లేమి రాకుండా చేయాలని వారు ప్రణాళికను సిద్దం చేసినటు తెలుస్తోంది. ఇందులో భాగంగానే పార్టీ సభ్యత్వంతో పాటు నిధులపై దృష్టి సారించారు. అయితే పార్టీకి సంభందించిన వివరాలపై చిరు ఇంతవరకు నోరు మెదపక పోవటం గమనార్హం. రాష్ట్రంలోని ప్రదాన పార్టీలన్నీ చిరు ప్రకటన కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో చిరు తమ ఏజండాను అన్ని వర్గాల వారికి అనుగుణంగా కొత్త రాజకీయాలను వెలుగు చూపించే విధంగా విదివిదానాలను సిద్దం చేస్తున్నారు. అదేవిదంగా చిరు రైల్ ఎక్కెందుకు వివిద పార్టీలకు చెందిన సీనియర్ నేతలు ఎదురు చూస్తుండటంతో వచ్చే ఎన్నికల్లో ఎవరికి టికెట్స్ ఇవ్వాలనే విషయమై ముందుగానే చర్చిస్తున్నారు. ఏది ఏమైన చిరు పార్టీకి అటు నిధుల వరదతో పాటు, పార్టీలో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకు అధికమవటం కొత్త రాజకీయలకు తెరతీస్తుంది.

No comments: