Tuesday, August 12, 2008

ఒలంపిక్ లో భారత్ 'బంగారం' అబినవ్ బింద్రా

భారత క్రీడ చరిత్రలో ఆగస్టు 11 సువర్ణాక్షరాలతో లిఖించబడింది. దేశ క్రీడాకారులంతా సగర్వంగా తలెత్తుకునె సంఘటన వెలిగిచూసింది. బీజింగ్ లో జరుగుతున్న విశ్వా క్రీడా సంబరంలో పసిడి పతకాన్ని అందించి 112 ఏళ్ళ ఒలంపిక్ చరిత్రలో భారత్ పేరును ప్రపంచం నలుమూలలా ఇనుమడింప చేసిన ఘనతను 25 ఏళ్ళ షూటర్ అబినవ్ బింద్రా దక్కించారు. బీజింగ్ లో జరుగుతున్న ఒలంపిక్ క్రీడల్లో భాగంగా భారత షూటర్ అభినవ్ బింద్రా పురుషుల వ్యక్తిగత 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో చైనాకు చెందిన హాట్ పేవరేట్ జుక్వినాన్ ను మట్టి కరిపించారు. మొత్తం 700.5 పాయింట్ల స్కోర్ తో ఒలంపిక్ లో వ్యక్తిగత స్వర్ణాన్ని చేజిక్కించుకొని దేశ ప్రతిష్టను ప్రపంచం నలుమూలల వ్యాపింపజేశారు. బింద్రా కు దేశం మొత్తం అభినందన వర్షం కురిపించింది. బింద్రా సొంత రాష్ట్రమైన పంజాబ్ ప్రభుత్వం కోటి రూపాయిల నజరాన ప్రకటించగా దేశంలోని పలు రాష్ట్రాలు తమ వంతుగా లక్షల రూపాయిల నజరానాలు ప్రకటించాయి. రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ మొదలు ప్రదాని, వివిద రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, పార్టీల ప్రముఖులు, క్రీడాకారులు అభినందనలు అందించారు.
అభినవ్ బింద్రా గురించి క్లుప్తంగా...
పేరు : అభినవ్ బింద్రా
జననం : 28 సెప్టెంబర్ ౧౯౮౩
తల్లిదండ్రులు : బబ్లి బింద్రా, ఏఎస్ బింద్రా
ప్రాంతం : చండీగడ్
చదువు : ఎంబీఏ
ఉద్యోగం : సీఈవో, అబినవ్ ప్యూచరిస్టిక్
రికార్డు : 1998 కామన్ వెల్త్ గేంస్ లో పాల్గొన్న అతిచిన్న వయస్సు షూటర్
పతకాలు : 2001 మ్యూనిచ్ వరల్డ్ కప్ కాంస్యం, 2002 మాంచెస్టర్ (ఇంగ్ళాండ్) కామన్ వెల్త్ గేంస్ లో స్వ్ర్ణం (పెయిర్స్ విభాగం), రజతం (వ్యక్తిగత విభాగం), 2001 ఆయా వేదికల్లో జరిగిన ఈవెంట్లలో ఆరు స్వ్ర్ణాలు, 2006 జాగ్రెబ్ (క్రోయేషియా) వరల్డ్ చాంపియన్ షిప్
అవర్డులు : 2001లో అర్జున అవార్డ్, 2001-02లో రాజీవ్ గాంధి ఖేల్ రత్న అవార్డ్

No comments: