Saturday, August 30, 2008

రంగులలో రానున్న "శ్రీకృష్ణ తులాబారం"

అలనాటి బ్లాక్ అండ్ వైట్ సినిమాలు త్వరలో సప్తవర్ణాల శోభను సంతరించుకోనున్నాయి. ప్రదానంగా ఎన్ టీఆర్ నటించిన పౌరాణిక అణిముత్యాలైన చిత్రాలను రంగుల్లోకి మార్చేందుకు ప్రముఖ నిర్మాత రామానాయుడు యత్నిస్తున్నారు. త్వరలోనే ఈ ప్రయత్నాలు విజయవంతంగా అమలు చేస్తామని రామానాయుడే స్వయంగా చెప్పారు. అంతే కాకుండా కొన్ని పాత చిత్రాలను చిత్రాలను పునర్నిర్మించనున్నట్లు ఆయన వెళ్లడించారు.
ఇందులో భాగంగానే అలనాటి అణిముత్యంగా అందరి మన్ననలు పొందిన శ్రీకృష్ణ తులాభారం చిత్రం త్వరలో సప్తవర్ణాలతో పులుముకోనుంది. ఈ చిత్రాన్ని రంగుల్లోకి మార్చి రాష్ట్ర వ్యాప్తంగా మరోమారు విడుదల చేసే పనుల్లో అగ్ర నిర్మాత రామానాయుడు నిమగ్నమయ్యారు. ఇందుకు సంబందించి ముంబైలోని ఆయా రంగాల సాంకేతిక నిపుణులతో చర్చించిన రామానాయుడు శ్రీకృష్ణ తులాబారం, మాయాబజార్ వంటి ఘన విజయం సాధించిన చిత్రాలను రంగుల్లోకి మార్చనున్నట్లు చెప్పారు.
దీంతోపాటు ఎన్ టీఆర్ సురేష్ ప్రొడక్షన్ పతాకంలో నటించిన రాముడు భీముడు చిత్రాన్ని రీమేక్ చేసే ప్రయత్నాలలో ఉన్నట్లు రామానాయుడు తెలిపారు. ఎన్ టీఆర్ ద్విపాత్రాభినయంలో నటించి అప్పట్లో సంచల విజయం సాధించిన రాముడు భీముడు చిత్రాన్ని ఎన్ టీఆర్ మనవడైన జూనియర్ ఎణ్ టీఆర్ తో పునర్నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నట్లు రామానాయుడు తెలిపారు. శాతాధిక చిత్రాల నిర్మాతగా గిన్నిస్ బుక్ ఆప్ రికార్డ్స్ లో స్థానం సంపాధించిన రామానాయుడు అలనాటి చిత్రాలకు రంగుల శొభను అద్దటంతో పాటు, కొన్ని చిత్రాలను రేమేక్ చేయటం ద్వారా కూడ అంతర్జాతీయంగా తమ బ్యానర్ కు గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.

No comments: