Wednesday, August 20, 2008

కమల్ తో పిరమిడ్ సాయిమిరా 'మర్మయోగి '

పద్మశ్రీ కమల్ హాసన్ ప్రతిష్టాత్మక చిత్రమైన మర్మయోగి పలు భాషల్లో నిర్మించేందుకు అంతర్జాతీయ ఎంటర్ టైన్మెంట్ సంస్థ పిరమిడ్ సాయిమిరా ముందుకు వచ్చింది. ఇందుకు సంభందించిన ఒప్పందాన్ని పిరమిడ్ సాయిమిరా సంస్థ కమల్ హాసన్ తో కుదుర్చుకుంది. తదనుగునంగా పిరమిడ్ సాయిమిరా, రాజ్ కమల్ పిల్మ్ ఇంటర్ నేషనల్ సం యుక్తంగా మర్మయోగిని నిర్మించనున్నయని పిరమిడ్ సంస్థల చైర్మన్ పి ఎస్ స్వామినాధన్ ప్రకటించారు.

ప్రతిష్టాత్మక మర్మయోగి చిత్రం గురించిన ఊహాగానాలు గత ఐదేళ్ళుగా తమిళ సినీ పరిశ్రమలో వినిపిస్తూనే ఉన్నాయి. అయితే హాలివుడ్ స్థాయిలో భారి బడ్జెట్ గా ఈ చిత్రం నిర్మించటానికి సుమారు 100 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని అంచనా కావటంతో దీనిని నిర్మించేందుకు ఏ నిర్మాత సాహసించలేదు. దీంతో ఈ ప్రాజెక్ట్ వాయిదా పడుతూ వచ్చింది. ఈ నేపద్యంలో కమల్ తన తదుపరి చిత్రంగా మర్మయోగి తెరకెక్కించనున్నట్లు వెల్లడించారు. దీంతో మళ్ళీ ఈ చిత్రంపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఇదిలా ఉండగా ఈ భారీ ప్రాజెక్ట్ ను ఎవరు నిర్మించనున్నారనే చర్చ తిరిగి మొదలయింది.

ఈ నేపద్యంలో మర్మయోగిని ప్రముఖ ఎంటర్ టైన్మెంట్ సంస్థ పిరమిడ్ నిర్మించనున్నట్లు వార్తలు వెలువడ్డాయి। ఇదిలా ఉండగా కొద్దిరోజులకే ఈ చిత్రాన్ని పిరమిడ్ సాయిమిరా నిర్మించటం లేదని వదంతులు వ్యాపించాయి। దీంతో ఈ చిత్రంపై ఉన్న ఊహగానాలకు తెరతీస్తూ పిరమిడ్ సంస్థల చైర్మన్ స్వామినాధన్, నటుడు కమల్ హాసన్ ఒకేసారి ప్రకటన వెలువరిచారు. వీరి ప్రకటనల మేరకు మర్మయోగి చిత్రాన్ని పిరమిడ్ సాయిమిరా, రాజ్ కమల్ పిల్మ్ ఇంటర్ నేషనల్ సమ్యుక్తంగా భారి స్థాయిలో రూపొందించేందుకు సిద్దమవుతున్నాయి. ఈ విషయమై స్వామినాధన్ మాట్లాడుతూ మర్మయో చిత్రపై పూర్తి స్థాయి పరిశోదన జరిగాకే తమ సంస్థ దీనిని నిర్మించేందుకు ముందుకు వచ్చిందని తెలిపారు. కథకు తగ్గట్లుగానే భారి బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ఒప్పందం కుదుర్చుకోవటం జరిగిందని చెప్పారు.

మర్మయోగి గురించి...

త్రిభాషా చిత్రంగా తెరకెక్కనున్న ఈ మర్మయోగి తెలుగు, తమిళ్, హింది భాషాల్లో రూపొందనుంది. అదేసమయంలో ఇంగ్లీష్ లో కూడా రూపొందనుంది. అంతర్జాతీయ తారాగణంతోపాటు భారి బడ్జెట్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. కమల్ హాసన్ సొంత కథతో అయన దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో కమల్ ప్రధాన కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పిరమిడ్ సాయిమిర, రాజ్ కమల్ ఇంటర్ నేషనల్ సం యుక్తంగా నిర్మించనున్నాయి.

No comments: