Thursday, August 7, 2008

పిరమిడ్ సాయిమిరా 'వాయిస్ ఆప్ యూత్ '

తెలుగులో వరుస చిత్రాల నిర్మాణానికి సిద్దమవుతున్న పిరమిడ్ సాయిమిర సంస్థ జీ (తెలుగు) టీవీలో వాయిస్ ఆప్ యూత్ పేరుతో సరికొత్త టాలెంట్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రంలో టాప్ 10గా నిలిచిన గాయని గాయకులతో వాయిస్ ఆప్ యూత్ అనే ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బం ను రూపొందించడానికి పిరమిడ్ సాయిమిరా సన్నాహాలు చేస్తోందని సంస్థ ప్రతినిధి, దర్శక, నిర్మాత తమ్మారెడ్ది భరద్వాజ తెలిపారు. అదేవిధంగా వాయిస్ ఆప్ యూత్ కార్యక్రమంలో పాల్గొనే ప్రతిభవంతులైన గాయని గాయకులకు తమ సంస్థ నిర్మించనున్న చిత్రాలలో అవకాశాలు ఇవ్వనున్నామని చెప్పారు. సినిమా అవకాశాలకు ముందుగా ఆల్బంలో అవకాశం ఇచ్చేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ ఆల్బంకు కోటి, కె.ఎం రాధాకృష్ణన్, నితిష్ నారాయణన్ లు సంగీతం అందించనున్నారని తెలిపారు. వీడియో ఆల్బం కూడా నిర్మిచే ఆలోచన్లో ఉన్న పిరమిడ్ సాయిమిరా సంస్థతోపాటు విశాల్ ప్రాజెక్ట్ లిమిటెడ్ సంస్థ పాలుపంచుకోనుందని భరద్వాజ చెప్పారు.

No comments: