Friday, August 22, 2008

జై చిరంజీవ

రాజకీయారంగేట్రం చేస్తున్న పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదినం నేడు. ఈ సందర్బంగానే 30 ఏళ్ల తెలుగు సినీ కళామతల్లి ఒడిలోంచి రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్న మెగాస్టార్ కు అశేష ఆంద్ర ప్రజానికం అభినందనలు తెలిపింది. శుక్రవారం తెల్లవారుజాము నుంచే వద్దని వారించినా వేలాదిమంది అభిమానులు చిరంజీవి గృహం ముందు పడిగాపులు కాస్తూ తమ అభిమాన నాయకుడికి శుభాకాంక్షలు తెలిపారు. మన ఊరి పాండవులు చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేసిన చిరంజీవిక్ గడిచిన 30 ఏళ్ల జీవితంలో 148 చిత్రాల్లో నటించి అఖిలాంధ్ర ప్రేక్షకాభిమానుల అభినందనలు గౌరవాన్ని అందుకున్నారు. మూడు సార్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ నటుడికి అందించే నంది అవార్డును అందుకున్నారు. భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక పద్మభూషణ్ గౌరవాన్ని పొందిన చిరంజీవి బ్లడ్ బ్యంక్, ఐ బ్యాంక్ ద్వారా స్వచ్చమద సేవకు శ్రీకారం చుట్టి బడుగు వర్గాలకు దగ్గరయ్యారు. తానను కదిలించిన రెండు సంఘటనలతో రాజకీయారంగేట్రానికి తెరతీసిన చిరంజీవి 26న తిరుపతిలో జరిగే బహిరంగ సభ ద్వారా పార్టీ పేరును, పతాకాన్ని, విధివిదానాలను ప్రకటించనున్నారు. ఈ నేపధ్యంలో జన్మదినాన్ని జరుపుకుంటున్న మెగాస్టార్ కు సన్నిహితులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, రాజకీయ, పారిశ్రామిక, సినీరంగ ప్రముఖులు అభినందనలు తెలిపారు.
ముందస్తుగా ప్రకటించినట్లుగానే చిరంజీవి తన పుట్టిన రోజున తన తల్లితోనే గడిపారు. ఉదయానే తన తల్లి అంజనదేవి పాదాలకు నమస్కరించి అశిర్వాదం అందుకున్న చిరు ముందుగా కుటుంభ సభ్యుల శుభాకాంక్షలు అందుకున్నారు. అనంతరం తన కోసం వచ్చిన అభిమానుల నుంచి అభినందనలు అందుకున్నారు.

చిరు జన్మదినాన్ని పురష్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా ముస్లిం సోదరులు మసీదుల్లో నమాజులు, క్రిష్టియన్ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఇందులో కొందరు అభిమానులు చిరును నేరుగా కలిసి అభినందనలు తెలుపగా మరికొందరు పొన్ల ద్వారా అభినందనలు తెలిపారు. దీనితోడు చిరు జన్మదినాన్ని పురస్కరించుకొని వివిద ప్రాంతాల్లోని వేలాది మంది అభిమానులు పేదలకు అన్నదానం, విద్యార్ధులకు పుస్తకాలు, రక్తదాన శిభిరాలు నిర్వహించారు. అదేవిదంగా చిరు పిలుపు మేరకు ఆయన అభిమానులు మొక్కలు నాటి స్వీట్స్ పంచారు.

ఇదిలా ఉండగా విశాకపట్నమ జిల్లా చోడవర్మ్ కు చెందిన గోతిరెడ్డి రాంబాబు అనే అభిమాన దంపతులు చిరంజీవి రాజకీయ భవిష్యత్తు దిగ్విజయంగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ కాంచిపురంలోని కామాక్షి ఆలయంలో శతచండి యాగం నిర్వహించారు. ఈ యాగానికి నటరాజ శాస్త్రీ గురుకుల్ నేతృత్వం వహించారు. ఈ సందర్బంగా చిరంజీవి కుటుంభికుల పేరున మహా సంకల్పం నిర్వహించారు. ఇందులో 30 మంది వేద పండితులు పాల్గొన్నారు. యాగం కోసం ప్రత్యేకంగా సిద్దం చేసిన కూర్మాసనానికి నటరాజ శాస్త్రీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కూర్మాసనంపై కూర్చుని యాగం చేస్తే రాజ్యాధికార్మ్ చేపట్ట వచ్చని అనాధిగ వస్తున్న నమ్మకమని నటరాజ శాస్త్రీ తెలిపారు. ఇదిలా ఉండగా చిరంజీవికి కంచి స్వాములైన జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతి జన్మదిన అభినందనలు తెలిపారు. చిరంజీవికి అంతా శుభమే జరుగుతుందని ఆశీర్వదించారు.

ఎన్నో విజయాలతో ముందుకు వెళుతూ జన్మదినాన్ని జరుపుకుంటున్న మెగాస్టార్ చిరంజీవికి పిరమిడ్ సాయిమిరా గ్రూప్స్ కు చెందిన హైదరాబాద్ సాయిమిరా ( http://www.hyderabadsaimira.com/ )మరియు న్యూస్ రీల్ ఇండియా ( http://www.newsreelindia.in/)హృదయ పూర్వక శుభాకాంక్షలు చెపుతోంది.

No comments: