Monday, August 11, 2008

మెగాస్టార్ చిరంజీవి (బయోగ్రఫీ)

మెగాస్టార్ గా తెలుగునాట సుపరిచితమైన చిరంజీవి 1955 ఆగష్టు 22న పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోని మిషనరి హాస్పిటల్ లో జన్మించారు. చిరంజీవి అసలు పేరు కొణిదల శివశంకర వర ప్రసాద్. చిరంజీవికి ఇద్దరు తమ్ముళ్ళు, ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. అయన తండ్రి వెంకట్రావు, తల్లి అంజనాదేవి. తండ్రి ఉద్యోగరీత్యా చిరంజీవి చిన్నవయసంతా తాతగారి ఊరైన మొగల్తూరు లోనే గడిపారు.
చదువు
చిరంజీవి విద్యాబ్యాసం ఒక్క చోటంటూ సాగలేదు. తండ్రి ఉద్యోగరీత్యా పలు చొట్లకు బదిలి కావల్సి వచ్చింది. అయన విద్యాబ్యాసం మొదట నిడదవోలులో ప్రారంభమైంది. అనంతరం గురజాల, పొన్నూరు, మంగళగిరి, మొగల్తూరు అంటూ సాగింది. చిన్న వయస్సు నుంచే చిరంజీవికి ఉన్న సినిమా ఆసక్తి పాఠశాల విద్యాబ్యాసంలోనే స్టేజ్ డ్రామాల్లో నటించేందుకు దారితీసింది. ఆయన హైస్కూలు చదివెటప్పుడు మొదటిసారిగా నటించిన పరంధామయ్య పంతులు డ్రామాకుగాను మొదటి బహుమతి అందుకున్నారు. అనంతరం బైపీసీకి గాను ఒంగోలు లోని పీఆర్ శర్మ జూనియర్ కళాశాలలో చేరారు. తదనంతరం నర్సాపూర్ కళాశాలలో బీకాం ముగించారు.
నటనాసక్తి... సినిమాలు
చిరంజీవికి సినిమాల్లో నటించాలన్నది చిన్న వయస్సులోనే ఆయన మనసులో నాటుకున్న కల. అందుకే స్కూల్ వయసు నుంచే డ్రామాల్లో నటిస్తూ తన నటనాసక్తికి తీర్చుకున్నారు. ఒకవైపు చదువుతున్నా సినిమాల్లో నటించాలన్న ఆసక్తిని వదులుకోలేదు. అందుకే తన డిగ్రీ ముగించగానే 1977లో మద్రాస్ వెళ్ళి ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో చేరారు. అదే సమయంలో రాజ్ కుమార్ దర్శకత్వంలో షేక్ అబ్దుల్ ఖాదర్ రూపొందిస్తున్న పునాదిరాళ్ళు చిత్రంలో నటించే అవకాశం కలిగింది. ఈ చిత్రంలో నటించేటప్పుడే శివశంకర వరప్రసాద్ చిరంజీవిగా మారారు. పునాదిరాళ్ళు చిరు మొదటి చిత్రమే అయినా ముందుగా 1978 సెప్టెంబర్ 22న విడుదలైంది మాత్రం ప్రాణంఖరీదు. దీనికి కె.వాసు దర్శకుడు. తదనంతరం విడుదలైన రెండవ చిత్రం మన ఊరి పాండవులు. ఈ చిత్రం చిరుకు హీరోగా గుర్తింపు లభింది.
విలన్ గా
ఆరంభ కాలంలో నటుడిగా గుర్తింపు పొందేందుకు విలన్ పాత్రల్లో సైతం పలు చిత్రాల్లో నటించారు. విలన్ గా నటించిన చిత్రాల్లో కుక్కకాటుకు చెప్పుదెబ్బ, కోతల రాయుడు తదితర చిత్రాలు ఉన్నాయి.
వివాహం.. పిల్లలు
అప్పటికే ప్రముఖ హాస్య నటుడిగా ఉన్న అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖతో 1980 పిబ్రవరి 20న చిరుకు వివాహమైంది. వీరికి రాం చరణ్ తేజ, సుస్మిత, శ్రీజ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు.
మొదటి విజయాలు
ఆరంభంలో కోతలరాయుడు, పున్నమినాగు, మొగుడుకావాలి, కిరాయిరౌడీలు, శుభలేఖ, మగమహరాజు, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, అభిలాష, మంత్రిగారి వియ్యంకుడు తదితర చిత్రాలు విజయం సాధించటం చిరంజీవి పరిశ్రమలొ నిలదొక్కుకునేందుకు దారితీసింది.
మలుపు
ప్రదమార్థమైన 1983లో విడుదలైన ఖైదీ చిరంజీవి కెరీర్ ను మలుపు తిప్పింది. కమర్షియల్ గా మెగా హిట్ తోపాటు చిరుకు ప్రత్యేక గుర్తింపునిచ్చింది. ఈ ద్వారా చిరంజీవిలోని నటుడు, డ్యాన్సర్ తెలుగు పరిశ్రమకు దక్కాడు. అనంతరం గూండా, దొంగ, నాగు, అడవిదొంగ, యమకింకరుడు, రుస్తుం ద్వారా చిరు యాక్షన్ హీరో అయ్యారు.
మెగా విజయాలు
ద్వితీయార్థంలో విజేత, మగధీరుడు, కొండవీటిరాజా, చంటబ్బాయ్, చాలెంజ్, రాక్షసుడు, దొంగమొగుడు వంటి చిత్రాల విజయాలు నటుడిగా అన్ని వర్గాల వారి నుంచి చిరుకు లభించాయి. 1987లో విడుదలైన పసివాడి ప్రాణం ద్వారా బారతీయ సినిమాలకు చిరు బ్రేక్ డ్యాన్స్ చూపించారు. అదే సమయంలో విడుదలైన స్వయంకృషి చిరుకు ఉత్తమ నటుడిగా నంది అవార్డ్ ను అందించింది.
చిరు ఓ ప్రభంజనం
పసివాడి ప్రాణం అనంతరం వచ్చిన యముడికిమొగుడు, అత్తకి యముడు అమ్మాయికి మొగుడు చిరును మెగా స్టార్ గా నిలిపాయి. నిర్మాత కే ఎస్ రామారావ్ తన మరణమృదంగం చిత్రం ద్వారా చిరును మెగాస్టార్ గా సంబొధించటం ఆయన మెగా నటుడిగా రూపాంతరం చెందేలా చేసింది. తదనంతరం చిరు నిర్మాతల పాలిట హాట్ కేక్ కాగా అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఈ సమయంలోనే చిరు నిర్మాతగా తీసిన రుద్రవీణ నర్గీస్ దత్ అవార్డును సొంతం చేసుకుని జాతీయంగా ఆయనకు పేరు ప్రఖ్యాతులను సాధించి పెట్టింది.
జాతీయంగా
1990 కాలంలో విడుదైల గ్యాంగ్ లీడర్, రౌడీల్లుడు, జగదేకవీరుడు అతిలోక సుందరి, ఘరానమొగుడు వంటి చిత్రాలు చిరును జాతీయ హీరోను చేశాయి. ఈ సమయంలోనే చిరు హిందీలో నటించిన ప్రతిభంధ్, ఆజ్ కా గూండారాజ్, ది జంటిల్ మెన్ చిత్రాలు బాక్స్ ఆపీస్ రికార్డ్ సృష్టించి ఆయన్ను జాతీయ నటుడిగా నిలబెట్టాయి.
'చిరు ' చిరు విశేషాలు
అసలు పేరు : కొణిదల శివశంకర వరాప్రసాద్
సినిమా పేరు : చిరంజీవి
జన్మస్థలం : మిషనరి హాస్పిటల్, నర్సాపూర్
తల్లిదండ్రులు : అంజనాదేవి, వెంకట్రావు
సోదరులు : నాగేంద్రబాబు, పవన్ కళ్యాన్
సోదరిణులు : విజయదుర్గ, మాదవి
బావలు : పంజా ప్రసాద్,సోమరాజు,అల్లు అరవింద్
విద్యాభ్యాసం : నిడదవోలు, గుజరాల, మొగల్తూరు, బాపట్ల, ఒంగోలు, నర్సాపూర్
పిల్మ్ ఇన్సిస్టూట్ : 1977
మొదటి చిత్రం, అవకాశం : పునాదిరాళ్ళు
వివాహం : ఉదయం 11.50, పిబ్రవరి 20, 1980
భార్య పేరు : సురేఖ
కుమారుడు : రాంచరణ్ తేజ
కుమార్తెలు : సుస్మితవందన, శ్రీజ
అత్తామామలు : అల్లు కనకరత్నం, రామలింగయ్య
ఇష్టదైవం : ఆంజనేయుడు
మొదటి 100 రోజుల చిత్రం :మన ఊరి పాండవులు
పౌరాణిక పాత్రలు
యమదర్మరాజు (చట్టంతో పొరాటం)
విశ్వామిత్ర, కౌసికుడు (ఖైదీ)
సత్యహరిచంద్ర (మగదీరుడు)
అర్జునుడు (స్టేట్ రౌడి)
ఆంజనేయుడు (జగదేకవీరుడు అతిలోకసుందరి)
పార్వతి పరమేశుడు (ఆపత్బాందవుడు)
నవలాధార సినిమాలు
చంటబ్బాయ్ (మల్లాది)
అభిలాష (యండమూరి)
చాలెంజ్ (యండమూరి)
రాక్షసుడు (యండమూరి)
రక్తసిందూరం (యండమూరి)
మరణమృదంగం (యండమూరి)రుద్రనేత్ర (యండమూరి)
దొంగమొగుడు (యండమూరి)
స్టువర్టుపురం పోలిస్టేషన్ (యండమూరి)
ఆంగ్లంలోకి అనువదింపబడిన సినిమ: హంటర్స్ ఆప్ ది ఇండియం ట్రెజర్ (కొదమసిం హం)
గాయకుడిగా : మాస్టర్ (తమ్ముడూ)
విదేశాల్లో మొదటి సినిమా : లవ్ ఇన్ సింగపూర్
మొదటి ఔట్ దోర్ : పునాదిరాళ్ళు (రాజమండ్రి)
అతిధిపాత్రలు:మాపిల్లై(తమిళ్),
సిపాయి(కన్నడ) హీరోగా బ్రేక్ చిత్రం : చట్టానికి కళ్ళులేవు
రష్య భాలో అనువదించబడిన చిత్రాలు : పసివాడిప్రాణం, స్వయంకృషి
ద్విపాత్రాభినయం : నకిలిమనిషి, జ్వాల, సిమ్హపురిసిమ్హం, రక్తసిందూరం, రోషగాడు, దొంగమొగుడు, యముడికి మొగుడు, రౌడి అల్లుడు, స్నేహంకోసం, అన్నయ్య, అందరివాడు
త్రిపాత్రాభినయం : ముగ్గురు మొనగాళ్ళు
చిరు బిరుదులు
మెగా స్టార్, నటకిషోర, డేరింగ్ డ్యాషింగ్ డైనమిక్ హీరో, నట భాస్కర

అవార్డులు

మనఊరి పాండవులు (స్పెషల్ జూరీ)

పున్నమినాగు (ఉత్తమ నటుడు - ఫిల్మ్ ఫేర్)

ఊరికిచ్చిన మాట (ఉత్తమ నటుడు-సినిహెరాల్డ్)

చట్టానికి కళ్ళులేవు (స్పెషల్ జూరీ)

శుభలేఖ (ఉత్తమ నటుడు-వంసి బర్కిలీ, సితార, ఫిల్మ్ ఫేర్)

మఘమహారాజు (ఉత్తమ నటుడు-కలాసాగర్)

ఇంటిగుట్టు (ఉత్తమ నటుడు-ఫిల్మ్ ఫేర్)

స్వయం కృషి (ఉత్తమ నటుడు-నంది)

రుద్రవీణ (ఉత్తమ నటుడు-ఫిల్మ్ ఫేర్, నర్గీస్ దత్ జాతీయ అవార్డ్)

ఆపద్బాందవుడు (ఉత్తమ నటుడు-నంది)

ముఠామేస్త్రీ(ఉత్తమ నటుడు-ఫిల్మ్ ఫేర్)

హిట్లర్ (ఉత్తమనటుడు-స్క్రీన్-వీడియోకాన్)

మాస్టర్(ఉత్తమ నటుడు-స్క్రీన్-వీడియోకాన్)

స్నేహం కోసం (ఉత్తమ నటుడు-ఫిల్మ్ ఫేర్)

ఇంద్ర(ఉత్తమ నటుడు-నంది, ఫిల్మ్ ఫేర్, సిని మా, శాంతారాం మెమోరియల్)

ఠాగూర్ (ఉత్తమ నటుడు-ఫిల్మ్ ఫేర్, సంతోషం)

శంకర్ దాదా ఎంబీబీఎస్ (ఉత్తమ నటుడు - ఫిల్మ్ ఫేర్, సంతోషం)

పద్మభూషణ్ పురస్కారం (2007)

మూలం: శ్రీవెంకట్

అనువాదం: జి.సంజయ్

No comments: