Friday, December 21, 2007

భూములు, పొలాల ద్వారా 10వేల కోట్లు సంపాదించిన నాగార్జున



సంపాదించడం అందరూ చేస్తారు, కానీ సంపాదనను మంచి చోట్లలో పెట్టుబడి పెట్టుకునే కళ, ముందు చూపు కొందరిలో మాత్రమే ఉంటాయి. కళాకారులకు సాధారణంగా పెట్టుబడి కళలు అబ్బవు. హీరో నాగార్జున అందుకు మినహాయింపు. దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి ఆయన పొలాలపై పెట్టుకున్న పెట్టుబడులు ఇప్పుడు దాదాపు 10 వేల కోట్లకు చేరుకున్నట్టు అంచనా.హైటెక్ సిటీకి అత్యంత సమీపంలో ఉన్ననానక్ రామ్ గుడా లో పచ్చటి వరిపొలాలతో కళకళలాడే మూడు వందల ఎకరాలను నాగార్జున ఏనాడో ఎకరం యాభై వేలకు కొనుగోలు చేశారట. ఇప్పుడు అక్కడ ఎకరం ధర పాతిక కోట్ల పై మాటే. చిరంజీవితో కలిసి ఆయన మూడేళ్ళ క్రితం కోకాపేటలో వందల ఎకరాల్లో కొన్ని భూమి విలువ కూడా ఎన్నోరెట్లు పెరిగింది. ఈ ఆస్తులను కాపాడుకోడానికి 24 గంటల న్యూస్ చానల్ పెట్టుకోవాలని నాగార్జున అలోచిస్తున్నారట. మా టీవీలో ఆయనకు కొంత వాటా ఉన్న విషయం తెలిసిందే.

No comments: