Saturday, December 22, 2007

సినిమాలలో నటించలని ఉందా: ఉంటే www.pstl.in లోకి లాగిన్ కండి

సినిమా రంగానికి ప్రతిభా వంతులైన యువ కళాకారులను అందించే ప్రక్రియలో పిరమిడ్ సాయిమిరా సంస్థ "వన్ రీల్ మూమెంట్" కు తెర లేపింది. ప్రతిభా వంతులైన కళాకారులను తెరకందించే ప్రక్రియలో భాగంగా పిరమిడ్ సాయిమిరా థియేటర్ లిమిటెడ్, మరియు జ్ఞానబా విజువల్ మీడియాలు సమ్యుక్తంగా "వన్ రీల్ మూమెంట్" పేరుతో ఒక రీల్ చిత్రాలను అందించడానికి రంగం సిద్దం చేశాయి. పది నిమిషాలపాటు కొనసాగే ఈ వన్ రీల్ చిత్రాలను థియేటర్లలో ప్రధాన చిత్రానికి ముందుగా ప్రదర్శిస్తారు. అంటే న్యూస్ రీల్ మాదిరిగా అన్నమాట. అయితే ఇవి సంక్షిప్తమైన కథతో రూపొందించిన చిత్రాలన్న మాట. వీటికోసం అదనంగా ప్రేక్షకుల దగ్గ ఎటువంటి చార్జీని వసూలు చేయరు. పూర్తిగా కొత్త, యువ కళాకారులను భారత చిత్ర ప్రపంచానికి అందించడమే లక్ష్యంగా రూపొందనున్న ఈ చిత్రాలను ముందుగా చెన్నయ్ లో ప్రారంభించిన ఈ పద్దతిని, అతి త్వరలోనే దీనిని దేశవ్యాప్తంగా, ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా విస్తరించడం సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రక్రియలో భాగంగా జ్ఞానభాను విజువల్ మీడియా డైరెక్టర్ నాని దర్శకత్వంలో రూపొందిన వన్ రీల్ చిత్రంతో ఈ వన్ రీల్ చిత్రాల ప్రదర్శన ప్రారంభమైది. సినిమా రంగానికి ప్రతిభావంతులైన కళాకారులను అందించడమే లక్ష్యంగా ప్రారంభిస్తున్న ఈ కొత్త ట్రెండులో పూర్తిగా కొత్త వారికి అవకాశం కల్పించాలని నిర్ణయించడం జరిగింది. రెండున్నర గంటలలో చెప్పే సందేశాన్ని కేవలం పది నిమిషాల వ్యవధిలో చెప్పడం ఒక లక్ష్యం కాగా, కొత్త కళకారులకు ఎటువంటి లాభాపేక్ష లేకుండా అవకాశాన్ని అందించడం రెండవ లక్ష్యంగా ఈ ప్రక్రియ కొనసాగుతుందని పిరమిడ్ సాయిమిరా థియేటర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సామినాథన్ విలేఖరులకు తెలిపారు. ఈ వన్ రీల్ చిత్రాలలో నటించాలనుకునే నూతన కళాకారులు, ఔత్సాహికులు "వన్ రీల్ మూమెంట్, పిరమిడ్ సాయిమిరా థియేటర్ లిమిటెడ్, నంబర్ 27, జి.ఎన్ చెట్టి రోడ్, చెన్నై" చిరునామాకు తమవివరాలను, ఫోటోలను, అబ్యర్థనను పంపించవచ్చు. లేదా www.pstl.in వెబ్ సైట్ ద్వారా కూడా దరఖాస్తులను డౌన్ లోడ్ చేసుకుని తమ అబ్యర్థనను పంపించవచ్చు. ప్రస్తుతం తమిళంలో ప్రారంభమైన ఈ ప్రక్రియ అతి త్వరలోనే తెలుగు, మళయాలం,కన్నడ, హిందీ, ఇంగ్లీషు భాషలలో ప్రారంబించనున్నాము.

No comments: