అత్తిలి "తెలుగు మాస్టార్" గిన్నిస్ రికార్డు సాధించారు.తెలుగు చిత్ర సీమలో కామెడీ కింగ్‌గా పేరుగాంచిన "హాస్యబ్రహ్మ" బ్రహ్మానందం. తాను చిత్రాల్లో పండించే హావ భావాలతో ప్రేక్షకులను గిలిగింతలు పెట్టి, కడుపుబ్బ నవ్వించే ఈ అత్తిలి కళాశాల తెలుగు మాస్టారు సరికొత్త రికార్డును సృష్టించారు. ఒకే భాషలో 754 చిత్రాల్లో నటించి "గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్"లో తన పేరును లిఖించుకున్నాడు. ఈ విషయాన్ని "బ్రహ్మానందం డ్రామా కంపెనీ" చిత్ర షూటింగ్‌లో బ్రహ్మానందమే స్వయంగా వెల్లడించారు.తన పేరు గిన్నిస్ బుక్‌లో నమోదైనట్టు ఆ సంస్థ అధికారికంగా పంపిన లేఖను బ్రహ్మానందం విలేకరులకు చూపించారు.
అత్తిలి "తెలుగు మాస్టార్"నుంచి "గిన్నిస్ రికార్డు" వరకు
అత్తిలి కళాశాలో తెలుగు మాస్టారుగా పని చేస్తూ హాయిగా జీవితం గడుపుతున్న బ్రహ్మానందాన్ని అలనాటి హాస్యబ్రహ్మ జంధ్యాల తెలుగు వెండితెరకు పరిచయం చేశారు.1985 సంవత్సరం ఫిబ్రవరి ఒకటో తేదీన తన సినీ జీవితాన్ని ప్రారంభించిన బ్రహ్మానందంకు జంధ్యాల రూపొందించిన "సత్యాగ్రహం" తొలి చిత్రం. అయితే ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్ హీరోగా నిర్మించిన "అహనా పెళ్లంట" సినిమాలో "అరగుండు" బ్రహ్మానందం పాత్రతో ఆయనకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అక్కడ మొదలుకుని నేటి వరకు వెనుదిరిగి చూడలేదు. అవార్డులు, రివార్డులు, అరుదైన రికార్డులు ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి. సినిమా హిట్ కావాలంటే బ్రహ్మానందం కామెడీ తప్పనిసరి అన్న రేంజ్‌లో తన ఇమేజ్‌ను పెంచుకోవడమే కాకుండా, హాస్యాన్ని పండించడంలో ఆరితేరిపోయారు. ఒక పక్క హాస్య నటుడిగా నటన కొనసాగిస్తూనే మరోపక్క తనలోని హీరో అదృష్టాన్ని పరీక్షించుకున్న నటుడు కూడా ఆయనే. "లోఫర్ మామ-సూపర్ అల్లుడు","బాబాయ్ గారి హోటల్" సహా కొన్ని చిత్రాలలో బ్రహ్మానందం హీరోగా వెండితెరపై కనిపించాడు. గత 22 సంవత్సరాలుగా తెలుగు వెండితెరపై తిరుగులేని కామెడీని పంచుతూ, ప్రత్యేక ఇమేజ్‌ను తన సొంతం చేసుకున్న నటుడు బ్రహ్మానందం.ఆయనకు నాగార్జున విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేయగా, హాస్యనటుడు అల్లు రామలింగయ్య స్మారకార్థం ఏర్పాటు చేసిన "అల్లు అవార్డు"ను 2005లో ఈ నేటి హాస్యబ్రహ్మాన్ని ఎంపిక చేసి, సత్కరించారు. ఒక్క తెలుగు భాషలో 754 చిత్రాల్లో నటించి "గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్"లో తన పేరును లిఖించుకున్నాడు.

No comments:
Post a Comment