Tuesday, December 18, 2007

సున్నిత మనస్కుడైన చిరంజీవికి రాజకీయాలు సరిపడవు : సిసిరెడ్డి



మెగాస్టార్ చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశంపై రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. ఒక్కో పార్టీకి చెందిన ఒక్కో నేత తమకు తోచిన రీతిలో స్పందిస్తున్నారు. అయితే అటు సినీ నిర్మాతగా, ఇటు ప్రభుత్వ సలహాదారుగా ఉంటున్న సిసిరెడ్డి మాత్రం.. సినీ బాణీలో తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పారు. చిరంజీవి కొత్త పార్టీ ఏర్పాటుపై వస్తున్న ఊహాగానాలపై సిసిరెడ్డి స్పందిస్తూ.. నాకు మెగాస్టార్ మరీ సన్నిహితం కాకపోయినా.. ఆయన గురించి బాగా తెలుసు. శాంత స్వభావి. నిగర్వి. సినీ రంగంలో బాగా కష్టపడి పైకొచ్చారు. అలాగే రాణించారు. రాణిస్తున్నారు కూడా. కథకు అనుగుణంగా తన నటనను ప్రదర్శించి కోట్లాది మంది అభిమానులను దరిచేర్చుకున్నారు. అయితే ఆయన రాజకీయ ప్రవేశం చేస్తే పరిస్థితి పూర్తి భిన్నంగా వుంటుంది. మంత్రి పదవి లభించని వారు, ఇతరాత్రా లాభాలు లేనివారు వ్యతిరేకులవుతారు. సినిమాల్లో తప్పు జరిగితే వెంటనే ఎదిరించేందుకు, ఫైట్స్ చేసేందుకు డూప్స్ సిద్ధంగా ఉంటారు. మరి ఇక్కడ? పూర్తి విరుద్ధం. కష్టాల్లో చిక్కుకుంటే ఆదుకునేందుకు ఎవరూ దగ్గరకు రారు. డూప్స్ ఉండరు. చుట్టూ శత్రువులే చేరుతారు. ప్రతికూలురు, అనుకూలురు, అవినీతిపరులు మాత్రమే ఉంటారు. వారిని నియంత్రించేందుకు సరైన స్క్రిప్ట్, క్లైమాక్స్ అనేవి ఈ "రాజకీయ చదరంగం"లో ఉండవని సిసి రెడ్డి అభిప్రాయపడ్డారు.

No comments: