Friday, December 21, 2007

పెళ్ళికి ముందు శృంగారం వ్యాఖ్యలపై సుస్మితా సేన్ కు కోర్టు నోటీసు



ఖుష్పూ, రీమాసేన్, శిల్పాశెట్టిల సరసన ఇప్పుడు సుస్మితా సేన్ కూడా చేరింది. పెళ్ళికి ముందే శృంగారం అంశంలో వీరు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు వీరిని చిక్కుల్లోకి లాగుతున్నాయి. ఆ కోవలోనే బాలీవుడ్ నటి సుస్మితా సేన్ కూడా చేరారు. దేశంలో పవిత్రత, కన్యత్వం కోల్పోని బ్రహ్మచారులు, బ్రహ్మచారిణిలు లేరని ఒక టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సుస్మితా సేన్ వ్యాఖ్యానించింది. ఈ ఇంటర్వ్యూ పూర్తిపాఠాన్ని ఒక తమిళ దిన పత్రిక కూడా ప్రచురించింది. దీనిపై మద్రాసు హైకోర్టుకు చెందిన న్యాయవాది ఒకరు కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన మద్రాసు హైకోర్టు మదురై బెంచ్ సుస్మితా సేన్‌తో పాటు ఇంటర్వ్యూను ప్రచురించిన తమిళ పత్రికకు నోటీసు జారీ చేసింది. పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొనడం తప్పులేదని తమిళ నటి ఖుష్బూ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. తాజాగా సుస్మితా చేసిన వ్యాఖ్యలు ఆమెను పెద్ద ఇరకాటంలోనే పెట్టాయి.

No comments: