Wednesday, December 19, 2007

1000 ప్రింట్లతో కమల్ హాసన్ "దశావతారం" విడుదల..!?






వైవిద్యమైన నటననకు పేరెన్నికగన్న కమల్ హాసన్ తన తదుపరి చిత్రంతో మరో రికార్డు సృస్టించడానికి సమాయత్తమవుతున్నాడు. కమల్ హాసన్ నటించిన "దశావతారం" చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా వెయ్యి ప్రింట్లతో విడుదలచేయడానికి సమాయత్తమవుతున్నట్లు తెలిసింది. సాధారణంగా హాలీవుడ్ లో ఒక సినిమాను 3000 ప్రింట్లతో సైతం విడుదల చేస్తారు. ఆ సినిమాల మార్కెట్ అలాంటిది. బాలీవుడ్లో బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ నటించి స్వయంగా నిర్మించిన చిత్రం "ఓం శాంతి ఓం"ను 2000 ప్రింట్లతో విడుదల చేయడమే రికార్డులలోకి ఎక్కింది.తాజాగా బాలీవుడ్ సినిమాలకు లాటిన్ అమెరికాలో మార్కెట్ ఏర్పడింది. అందుకే షారూక్ అన్ని ప్రింట్లతో సినిమాను విడుదల చేశాడు. మిగతా భాషల చిత్రాల పరిస్థితి వేరు. హిందీ తరువాత అత్యధిక మార్కెట్ ఉన్న నటులు తమిళంలోనే ఉన్నారు. వీరి సినిమాలు వివిధ దేశాలలో విడుదల అవుతున్నాయి. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు జపాన్ లో విపరీత అభిమానులు ఉన్నారు. అందుకే ఆయన నటించిన "శివాజీ" సినిమా మరిన్ని దేశాలలో విడుదల అయింది. ఇపుడు కమల్ హాసన్ 10 విభిన్న పాత్రలలో నటిస్తున్న "దశావతారం" సినిమాను 1000 ప్రింట్లతో విడుదల చేయడానికి సమాయత్తమవుతున్నారు. సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్న ఈ సినిమాలో కమల్ 10 విభిన్న యాసలలో మాట్లాడనున్నాడు. కెయస్ రవికుమార్ దర్శకత్వంలో ఆస్కార్ రవి చంద్రన్ ప్రతిస్టాత్మకంగా భావించి రూపొందించిన ఈ చిత్రం భారతీయ చిత్ర పరిశ్రమలో మరిన్ని రికార్డులు సృస్టించాలని సినీ అభిమానులు కోరుకుంటున్నారు.

No comments: