Monday, December 31, 2007

లండన్ పారిశ్రామికవేత్త రాజ్ కుంద్రాతో శిల్పాశెట్టి డేటింగ్‌


బాలీవుడ్ హీరోయిన్లలో శిల్పాశెట్టికి ప్రత్యేక గుర్తింపువుంది. ఎందుకంటే ఆమె చేసే ప్రతి పనీ ఓ సంచలనమే. మొన్న యూకే సెలిబ్రిటీగా ఎన్నిక కావడం. ఆ తర్వాత ఢిల్లీలో జరిగిన ఎయిడ్స్ అవగాహన కార్యక్రమంలో హాలీవుడ్ నటుడితో బహిరంగ చుంభనం చేయడం వంటివి స్వదేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలు సృష్టించాయి. తాజాగా లండన్ పారిశ్రామికవేత్తరాజ్ కుంద్రాతో డేటింగ్‌లో పాల్గొన్నట్టు యూకే సెలిబ్రిటీగా నీరజనాలు అందుకున్న శిల్పాశెట్టి ప్రకటించి 2007 సంవత్సరానికి ముగింపు పలుకనుంది. ఈ పారిశ్రామికవేత్త, తనకు మధ్య ప్రేమాయణం సాగుతున్నట్టు ఆమె స్వయంగా ప్రకటించింది. అయితే ఈ ప్రేమకథ ఇంకా ప్రారంభదశలోనే ఉందని, దీనిపై లేనిపోని కట్టుకథలు రాసి మొగ్గలోనే తుంచి వేయవద్దని ఆమె మీడియాకు విజ్ఞప్తి చేయడం గమనార్హం. తాజాగా డైలీ మెయిల్‌కు శిల్పా శెట్టి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో తన మనస్సులో దాగివున్న ప్రేమ రహస్యాన్ని బయటపెట్టింది. గత వేసవి కాలంలో లండన్‌కు వెళ్లినపుడు ఆ దేశానికి చెందిన ఒక పారిశ్రామికవేత్తతో పరిచయం ఏర్పడింది. ఇలా ఆరంభమైన తమ ప్రేమకథ అపుడపుడూ డేటింగ్‌లకు వెళ్లే వరకు వచ్చింది. అయితే మా మధ్య ఉన్న పరిచయం ఇంకా ఆరంభదశలోనే ఉంది. నేను చాలా అందంగా ఉంటానని, నా కోసం, నా స్నేహం కోసం కోట్లాది మంది పడితపిస్తారని పలు మ్యాగజైన్‌లలో కథనాలు వస్తుంటాయి. అయితే ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా నా ఎదుటకు వచ్చి ఇష్టపడుతున్నట్టు చెప్పేందుకు సాహసం చేయలేదు. వివిధ కార్యక్రమాల నిమిత్తం విదేశాలకు వెళ్లినప్పుడు ఒంటరి తనం నన్ను చాలా వేధించేది. ముఖ్యంగా ఇంటికి దూరంగా ఉన్పప్పుడు చాలా బోర్‌గా కొట్టేది. ఇప్పటి వరకు బాయ్‌ఫ్రెండ్స్ అంటూ ఎవరూ లేరు. నాకు కూడా ప్రేమను పంచుకోవాలని ఉంది. అందుకే లండన్ పారిశ్రామికవేత్తతో మనస్సు విప్పి మాట్లాడుతున్నానని యూకే సెలబ్రిటీ శిల్పాశెట్టి కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది.

Saturday, December 29, 2007

చిరంజీవి 149వ చిత్రానికి దర్శకత్వం వహించనున్న వి వి వినాయక్



చివరికి మెగాస్టార్ చిరంజీవినటించే 149వ చిత్రానికి దర్శకుడిని ఖరారు చేశారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించేందుకు గుణశేఖర్, వి.వి.వినాయక్‌ల పేర్లు వచ్చాయి, ఒక దశలో తమిళ దర్శకుడు శంకర్ తో చిరంజీవి 149వ చిత్ర ఉంటుందనీ వార్తలు వచ్చాయి, అయితే చివరికి వినాయక్ పేరు ఖరారు చేసినట్లు ఫిలిం నగర్ వర్గాల సమాచారం. ఈ చిత్రానికి "చెలి","అపరిచితుడు","ఘర్షణ" వంటి మ్యూజికల్ హిట్స్ అందించిన హరీష్ జయరాజ్ బాణీలు సమకూర్చనున్నట్లు సమాచారం. అల్లుఅరవింద్, అశ్వినీదత్‌ల సంయుక్త నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రం రూపొందనున్నట్లు తెలిపాయి. "స్టాలిన్" చిత్రం తర్వాత వచ్చిన "శంకర్‌దాదా జిందాబాద్" ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల చిరంజీవి తండ్రి మరణంతో ఈ చిత్రం రూపొందడంలో కాస్త ఆలస్యమవ్వచ్చని వార్తలు అందుతున్నాయి.

Friday, December 28, 2007

"కృష్ణార్జున" పాటలు విడుదలయ్యాయి


శ్రీలక్ష్మీప్రసన్న పిక్చర్స్ పతాకంపై రూపొందుతున్న "కృష్ణార్జున" చిత్రంపాటలు విడుదలయ్యాయి. పి వాసు దర్శకత్వంలో ఎం మోహన్ బాబు నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున, మంచు విష్ణువర్థన్ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు.ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు సినీరంగ ప్రముఖులు పాల్గొన్నారు. ముందుగా అక్కినేని నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. నాగార్జున మాట్లాడుతూ మోహన్‌బాబు చాలా చిత్రాలను ఈ స్టూడియోలో తీసి మా సంస్థకు గొప్ప ఎస్సెట్‌గా మారారని ఆయన పేర్కొన్నారు. భక్తుడు చిక్కుల్లో ఉంటే భగవంతుడు ఏ విధంగా కాపాడాడు అన్నది ఈ చిత్రంలో కీలకాంశంగా తెరకెక్కించిన వైనం బాగుందన్నారు.ఇందులో తనది చాలా మంచి పాత్రగా వివరించాడు. మల్టీ స్టారర్ చిత్రాలు ఈ చిత్రంతో ఊపందుకోవాలని చెప్పాడు. మోహన్ బాబు మాట్లాడుతూ నాగార్జున అడిగిన వెంటనే కథ వినకుండానే ఈ చిత్రంలో నటించేందుకు అంగీకరించడం తనకు ఆనందాన్ని కలిగించిందని, అదే సమయంలో భాద్యతను గుర్తుచేసిందని చెబుతూ నాగార్జునకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జనవరి 25న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు.

Thursday, December 27, 2007

మొమైత్ ఖాన్ కథానయకిగా "బేసిక్ ఇన్‌స్టింక్ట్స్‌" తెలుగులో పునర్నిర్మాణం


హాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన చిత్రం "బేసిక్ ఇన్‌స్టింక్ట్స్‌". హాలీవుడ్ శృంగార నాయకి షరాన్ స్టోన్ తన ఒంపు సొంపులు, వయ్యారాలతో ప్రపంచవ్యాప్తంగా కుర్రకారును వెర్రెత్తించింది. ఈ చిత్రాన్ని టాలీవుడ్ హాట్ భామిని మొమైత్ ఖాన్ కథానాయికగా రూపొందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. కొద్ది పాటి మార్పు, చేర్పులతో తెలుగు వాతావరణంలో పునర్నిర్మించనున్న ఈ చిత్రం ద్వారా మొమైత్ ఖాన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని సదరు దర్శక,నిర్మాతలు భావిస్తున్నట్లు తెలిసింది."మైసమ్మ ఐపీస్" చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డప్పటికీ ముమైత్‌లో ఇంకా సత్తా తగ్గలేదని, ఆమె అంటే అభిమానులు ఎగబడుతారని నిర్మాతలు అంచనా వేస్తున్నారు.హాలీవుడ్‌లో వివాస్పదమైన ఈ చిత్ర కథలో సీరియల్ హత్యల్లో ప్రధాన పాత్ర పోషించిన ఓ బైసెక్సువల్ శృంగార రచయిత్రిని, ఓ పోలీసు ఆఫీసర్ ఇంటరాగేట్ చేయడానికి ఆమె కోసం ప్రయత్నించడం, ఆమెతో ప్రేమాయణం, తదనంత సంఘటనల నేపద్యంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా మంచి కలెక్షన్లను సాధించింది.

అవకాశాల్లేక ఇటెం సాంగ్ ల కోసం ఎదురు చూస్తున్న మనీషా కొయిరాలా!!!?

ఒకప్పటటి నేపాల్ రాజ కుటుంబానికి చెందిన మనీషా కొయిరాలా బాలీవుడ్ నటిగా ఒక వెలుగు వెలిగింది. కొద్ది కాలం మంచి నటిగా గుర్తింపు పొందిన మనీషాకు అకస్మాత్తుగా సినిమాలు తగ్గిపోయాయి. దాంతో గత కొంత కాలంగా సినిమాలకు దూరమైన మనీషా కోయిరాల మళ్లీ సినిమాలలో కనిపించడానికి సమాయత్తమవుతోంది. ఇంతకుముందు "ఒంబాయి","భారతీయుడు", "ఒకే ఒక్కడు", "క్రిమినల్" తదితర సినిమాలతో దక్షిణాది ప్రేక్షకులకు పరిచయమున్న మనీషా కోయిరాల ఇపుడు తెలుగు సినిమా నగరంలో ఐటమ్ సాంగ్ చేయడానికి ఓకే అంది. శ్రీకాంత్, జగపతి బాబు హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో మనీషా తన ఐటమ్ సాంగ్ తో అలరించనున్నది.

Wednesday, December 26, 2007

ధోనీతో కలిసి నటించాలని ఉంది : ఛార్మీ


టాలీవుడ్ క్రేజీ సుందరి ఛార్మీకి క్రికెట్ స్టార్ ధోనీతో కలిసి నటించాలని ఉందట. తన జీవితంలో తాను అత్యంత అభిమానించే వ్యక్తులలో ధోనీదే అగ్ర స్థానం అని చెబుతున్న ఛార్మీకి ధోనీతో కలిసి ఒక్క చిత్రంలో అయినా నటించాలని ఉందని తన మనసులోని కోరికను వ్యక్తం చేసింది. ధోనీ ఒప్పుకుంటే అతనితో కలిసి యాడ్ ఫిలింలో అయినాసరే తాను నటించడానికి సిద్దమేనని, ఇందుకు సదరు నిర్మాత తనకు ఒక్క రూపాయి ఇవ్వకపోయినా సరేనని మరీ చెప్పింది. ఇప్పుడున్న పొట్టి జుట్టు ధోనీకన్నా, గతంలోని పొడవుజుట్టు ధోనీ అంటే అమ్మాయిలకు తెగ క్రేజీ వుండేదని, అయితే ఆ జుట్టు తో బాటే వారి అభిమానం పోలేదని, హ్యాండ్ సం ధోనీ ఎలా ఉన్నా తమకు నచ్చుతాడని అమ్మాయిల తరపున వకాల్తా పుచ్చుకుని మరీ చెబుతున్న ఛార్మీ, తాను త్వరలో ఓ పెళ్ళికూతురిని కాబోతున్నానని, తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తినే తాను వివాహం చేసుకోబోతున్నట్లు తెలిపింది. అయితే టాలీవుడ్ లో మాత్రం ఛార్మీ తన ప్రియుడు, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ నే వివాహం చేసుకోనుందని కోడై కూస్తున్నా, ఛార్మీ మాత్రం అతని పేరు ఇప్పట్లో చెప్పనని చెబుతోంది. ఏదేమైనా ఛార్మీ కోరిక అన్ని విషయాలలో నెరవేరాలని కోరుకుందాం.

రవి తేజ "క్రిష్ణ" ఎక్స్ క్లూజివ్ ఫొటో గ్యాలరీ











Tuesday, December 25, 2007

పిరమిడ్ విడుదల చేయనున్న బాలకృష్ణ "ఒక్క మగాడు" ఎక్స్ క్లూజివ్ గ్యాలరీ












బాలీవుడ్ క్రేజీ బామిని "మల్లికా శరావత్" ఎక్స్ క్లూజివ్ గ్యాలరీ










చార్మీ "మంత్ర" ట్రైలర్

video

Monday, December 24, 2007

ఈ శతాబ్దపు ప్రపంచ శృంగార నటి:ఏంజెలీనా జోలి

హాలీవుడ్ హాటెస్ట్ నటీమణి ఏంజెలినా జోలి ప్రపంచంలోని ఈ శతాబ్దపు శృంగార నటిగా ఎన్నికైంది. హాలీవుడ్ కు చెందిన ప్రముఖ చలనచిత్ర పత్రిక ఎంపరర్ జరిపిన సర్వేలో ప్రపంచవ్యాప్తంగా అభిమానులు శృంగారనటిగా ఏంజెలినాకు పట్టం కట్టారు.ఈ నటీమనికి సంబంధించిన కొన్ని ఫోటోలను ఇక్కడ ఇస్తున్నాము. గమనించండి.




నటుడు చిరంజీవికి పితృవియోగం


మెగాస్టార్ చిరంజీవి తండ్రి కొణిదెల వెంకట్రావు సోమవారం తెల్లవారుజామున హృదయసంబంధిత వ్యాధితో కన్నుమూశారు. క్రమశిక్షణకు మారుపేరైన వెంకట్రావు మృతి చిరజీవి కుటుంబాన్ని తీవ్ర దుఖఃసాగరంలో ముంచెత్తింది. రాష్ట్ర ఎక్సైజ్ విభాగంలో ఎస్‌ఐగా పనిచేసిన వెంకట్రావు ప్రతి చిన్న విషయాన్ని నిశితంగా విశ్లేషించి, చక్కని నిర్ణయాలు తీసుకునేవారు. గత రెండుమూడు నెలలుగా అస్వస్థకు లోనైన వెంకట్రావును స్థానికంగా ఉన్న ఒక కార్పోరేట్ ఆస్పత్రిలో చేర్చారు. ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. చిరంజీవి తండ్రి కన్నుమూశారని వార్త తెలియడంతో పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, చిరంజీవి అభిమానులు జూబ్లీ హిల్స్‌లోని చిరంజీవి నివాసానికి చేరుకుని తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ చిరు కుటుంబసభ్యులను ఓదార్చారు. కాగా వెంకట్రావుకు భార్య అంజనీదేవీ, కుమారులు చిరంజీవి, నాగేంద్రబాబు, పవన్ కళ్యాణ్, కుమార్తెలు విజయదుర్గ, మాధవిలు ఉన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుకొండలో జన్మించిన వెంకట్రావు అదే జిల్లాలో ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్‌గా చేసి, నెల్లూరు జిల్లాలో ఎస్ఐగా పదవీ విరమణ చేశరు. ప్రతి ఒక్కరితో కలుపుగోలుతనంగా ఉండే వెంకట్రావు మృతి సినీ రంగానికి చెందిన పలువురిని దిగ్భ్రాంతికి గురిచేసింది.

Saturday, December 22, 2007

సినిమాలలో నటించలని ఉందా: ఉంటే www.pstl.in లోకి లాగిన్ కండి

సినిమా రంగానికి ప్రతిభా వంతులైన యువ కళాకారులను అందించే ప్రక్రియలో పిరమిడ్ సాయిమిరా సంస్థ "వన్ రీల్ మూమెంట్" కు తెర లేపింది. ప్రతిభా వంతులైన కళాకారులను తెరకందించే ప్రక్రియలో భాగంగా పిరమిడ్ సాయిమిరా థియేటర్ లిమిటెడ్, మరియు జ్ఞానబా విజువల్ మీడియాలు సమ్యుక్తంగా "వన్ రీల్ మూమెంట్" పేరుతో ఒక రీల్ చిత్రాలను అందించడానికి రంగం సిద్దం చేశాయి. పది నిమిషాలపాటు కొనసాగే ఈ వన్ రీల్ చిత్రాలను థియేటర్లలో ప్రధాన చిత్రానికి ముందుగా ప్రదర్శిస్తారు. అంటే న్యూస్ రీల్ మాదిరిగా అన్నమాట. అయితే ఇవి సంక్షిప్తమైన కథతో రూపొందించిన చిత్రాలన్న మాట. వీటికోసం అదనంగా ప్రేక్షకుల దగ్గ ఎటువంటి చార్జీని వసూలు చేయరు. పూర్తిగా కొత్త, యువ కళాకారులను భారత చిత్ర ప్రపంచానికి అందించడమే లక్ష్యంగా రూపొందనున్న ఈ చిత్రాలను ముందుగా చెన్నయ్ లో ప్రారంభించిన ఈ పద్దతిని, అతి త్వరలోనే దీనిని దేశవ్యాప్తంగా, ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా విస్తరించడం సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రక్రియలో భాగంగా జ్ఞానభాను విజువల్ మీడియా డైరెక్టర్ నాని దర్శకత్వంలో రూపొందిన వన్ రీల్ చిత్రంతో ఈ వన్ రీల్ చిత్రాల ప్రదర్శన ప్రారంభమైది. సినిమా రంగానికి ప్రతిభావంతులైన కళాకారులను అందించడమే లక్ష్యంగా ప్రారంభిస్తున్న ఈ కొత్త ట్రెండులో పూర్తిగా కొత్త వారికి అవకాశం కల్పించాలని నిర్ణయించడం జరిగింది. రెండున్నర గంటలలో చెప్పే సందేశాన్ని కేవలం పది నిమిషాల వ్యవధిలో చెప్పడం ఒక లక్ష్యం కాగా, కొత్త కళకారులకు ఎటువంటి లాభాపేక్ష లేకుండా అవకాశాన్ని అందించడం రెండవ లక్ష్యంగా ఈ ప్రక్రియ కొనసాగుతుందని పిరమిడ్ సాయిమిరా థియేటర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సామినాథన్ విలేఖరులకు తెలిపారు. ఈ వన్ రీల్ చిత్రాలలో నటించాలనుకునే నూతన కళాకారులు, ఔత్సాహికులు "వన్ రీల్ మూమెంట్, పిరమిడ్ సాయిమిరా థియేటర్ లిమిటెడ్, నంబర్ 27, జి.ఎన్ చెట్టి రోడ్, చెన్నై" చిరునామాకు తమవివరాలను, ఫోటోలను, అబ్యర్థనను పంపించవచ్చు. లేదా www.pstl.in వెబ్ సైట్ ద్వారా కూడా దరఖాస్తులను డౌన్ లోడ్ చేసుకుని తమ అబ్యర్థనను పంపించవచ్చు. ప్రస్తుతం తమిళంలో ప్రారంభమైన ఈ ప్రక్రియ అతి త్వరలోనే తెలుగు, మళయాలం,కన్నడ, హిందీ, ఇంగ్లీషు భాషలలో ప్రారంబించనున్నాము.

హాలీవుడ్ హాట్ "హిలరీ డఫ్" ఎక్స్ క్లూజివ్ వీకెండ్ గ్యాలరీ










బాలీవుడ్ భామిని కంగనా రావత్ ఫొటో గ్యాలరీ










Friday, December 21, 2007

పెళ్ళికి ముందు శృంగారం వ్యాఖ్యలపై సుస్మితా సేన్ కు కోర్టు నోటీసు



ఖుష్పూ, రీమాసేన్, శిల్పాశెట్టిల సరసన ఇప్పుడు సుస్మితా సేన్ కూడా చేరింది. పెళ్ళికి ముందే శృంగారం అంశంలో వీరు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు వీరిని చిక్కుల్లోకి లాగుతున్నాయి. ఆ కోవలోనే బాలీవుడ్ నటి సుస్మితా సేన్ కూడా చేరారు. దేశంలో పవిత్రత, కన్యత్వం కోల్పోని బ్రహ్మచారులు, బ్రహ్మచారిణిలు లేరని ఒక టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సుస్మితా సేన్ వ్యాఖ్యానించింది. ఈ ఇంటర్వ్యూ పూర్తిపాఠాన్ని ఒక తమిళ దిన పత్రిక కూడా ప్రచురించింది. దీనిపై మద్రాసు హైకోర్టుకు చెందిన న్యాయవాది ఒకరు కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన మద్రాసు హైకోర్టు మదురై బెంచ్ సుస్మితా సేన్‌తో పాటు ఇంటర్వ్యూను ప్రచురించిన తమిళ పత్రికకు నోటీసు జారీ చేసింది. పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొనడం తప్పులేదని తమిళ నటి ఖుష్బూ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. తాజాగా సుస్మితా చేసిన వ్యాఖ్యలు ఆమెను పెద్ద ఇరకాటంలోనే పెట్టాయి.

భూములు, పొలాల ద్వారా 10వేల కోట్లు సంపాదించిన నాగార్జున



సంపాదించడం అందరూ చేస్తారు, కానీ సంపాదనను మంచి చోట్లలో పెట్టుబడి పెట్టుకునే కళ, ముందు చూపు కొందరిలో మాత్రమే ఉంటాయి. కళాకారులకు సాధారణంగా పెట్టుబడి కళలు అబ్బవు. హీరో నాగార్జున అందుకు మినహాయింపు. దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి ఆయన పొలాలపై పెట్టుకున్న పెట్టుబడులు ఇప్పుడు దాదాపు 10 వేల కోట్లకు చేరుకున్నట్టు అంచనా.హైటెక్ సిటీకి అత్యంత సమీపంలో ఉన్ననానక్ రామ్ గుడా లో పచ్చటి వరిపొలాలతో కళకళలాడే మూడు వందల ఎకరాలను నాగార్జున ఏనాడో ఎకరం యాభై వేలకు కొనుగోలు చేశారట. ఇప్పుడు అక్కడ ఎకరం ధర పాతిక కోట్ల పై మాటే. చిరంజీవితో కలిసి ఆయన మూడేళ్ళ క్రితం కోకాపేటలో వందల ఎకరాల్లో కొన్ని భూమి విలువ కూడా ఎన్నోరెట్లు పెరిగింది. ఈ ఆస్తులను కాపాడుకోడానికి 24 గంటల న్యూస్ చానల్ పెట్టుకోవాలని నాగార్జున అలోచిస్తున్నారట. మా టీవీలో ఆయనకు కొంత వాటా ఉన్న విషయం తెలిసిందే.

Thursday, December 20, 2007

పెళ్ళానికి విడాకులు-ప్రియురాలికి శుభలేఖలు :సిద్దార్థ స్టైల్


"నువ్వొస్తానంటే నేనొద్దంటానా" అన్నట్టుంది "బొమ్మరిల్లు" హీరో సిద్ధార్థ కథ. ఈయనగారు హిందీలో నటించిన "రంగ్ దే బసంతి" సినిమాలో సహ నటి అయిన సొహా అలీఖాన్ తో చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్నాడనే వార్త పాతదే అయినా ఇపుడు గ్రీన్ సిగ్నల్ లభించినట్టు సమాచారం. గ్రీన్ సిగ్నల్ వచ్చింది సొహా అలీఖాన్ తల్లిదండ్రులు నుంచి. గ్రీన్ సిగ్నల్ లభించడంతో తమ బంధాన్ని దృఢం చేసుకునే పనిలో ఈ కొత్త లవ్ జంట పడ్డట్టు తెలుస్తోంది. అక్కడ ఇక్కడ కబుర్లు పెట్టకుండా ఈ జంట ఏకంగా సొహా అలీఖాన్ తల్లిదండ్రులను కలిసి విషయం గురించి చర్చించారట. సొహా తల్లిదండ్రులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సంవత్సరకాలంగా నడుస్తున్న తమ ప్రేమను శుభం పలికే పనుల్లో వీౠ నిమగ్నమైనట్లు సమాచారం. ప్రియురాలి కథ సుఖాంతం అవుతుండటంతో తమ ప్రేమకు అడ్డుగా వున్న తన భార్య మేఘనకు విడాకులిచ్చి తనవైపునుంచి ఎలాంటి అడ్డంకులు లేకుండా చేసుకున్నాడు సిద్దార్థ. ఇక మిగిలింది సొహా-సిద్ధార్థల పెళ్లి బాజాలు మోగడమే.

షారూక్ భార్య గౌరి ముఖచిత్రంతో "వోగ్" కవర్ పేజ్ చాలా హాట్ గురూ!!!


బాలీవుడ్ లో షారూక్ ఖాన్ పట్టిందల్లా బంగారం అవుతోంది. "చక్ దే","ఓం శాంతి ఓం" సినిమాలు వరుసగా ఘనవిజయాలు సాధించాయి. ఇందులో "ఓం శాంతి ఓం" సినిమా స్వయంగా నిర్మించింది కావడం గమనించదగ్గ విశయం. ఇదిలా ఉంటే షారూక్ ఇంట మరో ఆసక్తికర అంశం చోటు చేసుకుంది. షారూక్ ఖాన్ భార్య గౌరీ ఇన్నాళ్లు ఇల్లాలుగా మాత్రమే ఉండేది. అయితే అందం విషయంలో ఆమె హీరోయిన్లకేమాత్రం తీసిపోదు. ఇద్దరు పిల్లల తల్లి అయినా కూడా గౌరీ యువ హీరోయిన్ లా మెరిసిపోతోంది. అందుకేనేమో ఇంట్లోనుంచి బయటకు రావడానికి గౌరీ సిద్ధపడింది. "వోగ్" పత్రిక జనవరి ఎడిషన్ ముఖచిత్రంగా గౌరీ కనిపించబోతోంది. ఇది తన ప్రొఫేషన్ కానప్పటికీ చాలా కొత్తగా, వింతగా ఉందని చెబుతోంది. "వోగ్" ఇండియా ఎడిటర్ ప్రియా తమన్నా, గౌరీ ఖాన్ ను ఎందుకు ఎంచుకుందో కానీ గౌరీ మాత్రం అదిరిపోయిందని అంటోంది. రేపోమాపో మార్కెట్ లోకి రానున్న ఈ పత్రిక 2008వ సంవత్సరానికి ప్రత్యేకంగానే రూపుదిద్దుకుందని చెప్పవచ్చు.

Wednesday, December 19, 2007

జేంస్ బాండ్ గర్ల్స్ (ఎక్స్ క్లూజివ్ ఫొటో గ్యాలరీ)












1000 ప్రింట్లతో కమల్ హాసన్ "దశావతారం" విడుదల..!?






వైవిద్యమైన నటననకు పేరెన్నికగన్న కమల్ హాసన్ తన తదుపరి చిత్రంతో మరో రికార్డు సృస్టించడానికి సమాయత్తమవుతున్నాడు. కమల్ హాసన్ నటించిన "దశావతారం" చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా వెయ్యి ప్రింట్లతో విడుదలచేయడానికి సమాయత్తమవుతున్నట్లు తెలిసింది. సాధారణంగా హాలీవుడ్ లో ఒక సినిమాను 3000 ప్రింట్లతో సైతం విడుదల చేస్తారు. ఆ సినిమాల మార్కెట్ అలాంటిది. బాలీవుడ్లో బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ నటించి స్వయంగా నిర్మించిన చిత్రం "ఓం శాంతి ఓం"ను 2000 ప్రింట్లతో విడుదల చేయడమే రికార్డులలోకి ఎక్కింది.తాజాగా బాలీవుడ్ సినిమాలకు లాటిన్ అమెరికాలో మార్కెట్ ఏర్పడింది. అందుకే షారూక్ అన్ని ప్రింట్లతో సినిమాను విడుదల చేశాడు. మిగతా భాషల చిత్రాల పరిస్థితి వేరు. హిందీ తరువాత అత్యధిక మార్కెట్ ఉన్న నటులు తమిళంలోనే ఉన్నారు. వీరి సినిమాలు వివిధ దేశాలలో విడుదల అవుతున్నాయి. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు జపాన్ లో విపరీత అభిమానులు ఉన్నారు. అందుకే ఆయన నటించిన "శివాజీ" సినిమా మరిన్ని దేశాలలో విడుదల అయింది. ఇపుడు కమల్ హాసన్ 10 విభిన్న పాత్రలలో నటిస్తున్న "దశావతారం" సినిమాను 1000 ప్రింట్లతో విడుదల చేయడానికి సమాయత్తమవుతున్నారు. సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్న ఈ సినిమాలో కమల్ 10 విభిన్న యాసలలో మాట్లాడనున్నాడు. కెయస్ రవికుమార్ దర్శకత్వంలో ఆస్కార్ రవి చంద్రన్ ప్రతిస్టాత్మకంగా భావించి రూపొందించిన ఈ చిత్రం భారతీయ చిత్ర పరిశ్రమలో మరిన్ని రికార్డులు సృస్టించాలని సినీ అభిమానులు కోరుకుంటున్నారు.

Tuesday, December 18, 2007

సున్నిత మనస్కుడైన చిరంజీవికి రాజకీయాలు సరిపడవు : సిసిరెడ్డి



మెగాస్టార్ చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశంపై రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. ఒక్కో పార్టీకి చెందిన ఒక్కో నేత తమకు తోచిన రీతిలో స్పందిస్తున్నారు. అయితే అటు సినీ నిర్మాతగా, ఇటు ప్రభుత్వ సలహాదారుగా ఉంటున్న సిసిరెడ్డి మాత్రం.. సినీ బాణీలో తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పారు. చిరంజీవి కొత్త పార్టీ ఏర్పాటుపై వస్తున్న ఊహాగానాలపై సిసిరెడ్డి స్పందిస్తూ.. నాకు మెగాస్టార్ మరీ సన్నిహితం కాకపోయినా.. ఆయన గురించి బాగా తెలుసు. శాంత స్వభావి. నిగర్వి. సినీ రంగంలో బాగా కష్టపడి పైకొచ్చారు. అలాగే రాణించారు. రాణిస్తున్నారు కూడా. కథకు అనుగుణంగా తన నటనను ప్రదర్శించి కోట్లాది మంది అభిమానులను దరిచేర్చుకున్నారు. అయితే ఆయన రాజకీయ ప్రవేశం చేస్తే పరిస్థితి పూర్తి భిన్నంగా వుంటుంది. మంత్రి పదవి లభించని వారు, ఇతరాత్రా లాభాలు లేనివారు వ్యతిరేకులవుతారు. సినిమాల్లో తప్పు జరిగితే వెంటనే ఎదిరించేందుకు, ఫైట్స్ చేసేందుకు డూప్స్ సిద్ధంగా ఉంటారు. మరి ఇక్కడ? పూర్తి విరుద్ధం. కష్టాల్లో చిక్కుకుంటే ఆదుకునేందుకు ఎవరూ దగ్గరకు రారు. డూప్స్ ఉండరు. చుట్టూ శత్రువులే చేరుతారు. ప్రతికూలురు, అనుకూలురు, అవినీతిపరులు మాత్రమే ఉంటారు. వారిని నియంత్రించేందుకు సరైన స్క్రిప్ట్, క్లైమాక్స్ అనేవి ఈ "రాజకీయ చదరంగం"లో ఉండవని సిసి రెడ్డి అభిప్రాయపడ్డారు.

రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బిజీ కానున్న త్రిష


ఎక్కడ చూసినా రియల్ ఎస్టేట్ భూం కొనసాగుతోంది. అది సినీ పరిశ్రమలో కూడా విస్తృతంగా వ్యాపించింది. వెటరన్ హీరోలు మురళీ మోహన్, శోభన్ బాబు తదితరులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత హీరోలు ఈ దిశగా పెద్దగా దృష్టి సారించడంలేదు. హీరోయిన్లు మాత్రం దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని తపనపడుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెడుతున్నారు. ఈ లిస్ట్ లో స్నేహ ముందంజలో ఉండగా ఇపుడు తాజాగా త్రిషా కూడా చేరింది. ఇంతకుముందే నందనం లాంటి పెద్ద బిల్డింగ్ లను సొంతం చేసుకున్న త్రిషా హైదరాబాద్ లోనూ ఒక ఇల్లు కొనుక్కున్నట్టు సమాచారం. గతవారం చెన్నయ్ సమీపంలో నిర్మాణంలో ఉన్న 50 ఎకరాల ఫామ్ హౌస్ ను కొన్నది. ఇందులో అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయట. ఇంతటితో త్రిషా ఊరుకోవడం లేదు. అల్వార్ పేట్ సమీపంలోనూ ఒక బిల్డింగ్ ను కొనడానికి సిద్ధపడిందట. 26 ఏళ్ల వయసులోనే కోట్ల రూపాయల విలువగల ఆస్తులను భూముల రూపంలో సొంతం చేసుకోవడానికి మరిన్ని ప్రణాళికలు చేస్తోంది.

Monday, December 17, 2007

బాలీవుడ్ హాట్ "దీపికా పదుకొనే" ఎక్స్ క్లూజివ్ గ్యాలరీ













సానియా మీర్జా, షాహిద్ కపూర్, షోయెబ్ అక్తర్ ల ట్రైయాంగిల్ లవ్ స్టోరీ!!!!




కరీనా కపూర్ తో బెడిసినప్పటినుంచి షాహిద్ కపూర్ పరిస్థితి మరింత మెరుగు పడింది. కరీనాతో లింక్ ఉన్నన్నాళ్లు వేరే అమ్మాయి దిక్కు చూడలేకపోయిన షాహిద్ కపూర్ ఇపుడు ఎంచక్కా అందరివైపు చూస్తూ అందాలను అస్వాదిస్తున్నాడట. అందుకే ఇపుడు షాహిద్ తో రోజుకో అమ్మాయిని లింక్ చేస్తున్నారు బాలీవుడ్ జనాలు.మొన్నటిదాకా విద్యా బాలన్, ఆ తరువాత అమృతారావు అన్న జనాలు ఇపుడు మరో కొత్త పేరును లింక్ చేస్తున్నారు. ఆమె ఎవరో కాదు మన హైదరాబాద్ అమ్మాయే. టెన్నస్ స్టార్ సానియా మీర్జా కావడం విశేషం. సానియా మీర్జాను లైన్ లో పెట్టడానికి తెగ ప్రయత్నిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. నిజమో కాదో తెలియదు కానీ సానియా మీర్జా మాత్రం భారత్-పాక్ జట్ల మధ్య జరిగిన కొన్ని మ్యాచ్ లను వీక్షించింది. పాక్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ తో సానియా మీర్జా లవ్వాట ఫలితమే ఈ మ్యాచ్ లను సానియా తెగ చూడటం వెనుక అసలు ఉద్దేస్యమనీ హైదరాబాదులో తెగ ప్రచారం జరిగింది. చూస్తుంటే ఇది ట్రైయాంగిల్ లవ్ స్టోరీలా కనిపించడం లేదూ. చూద్దాం. ఫైనల్ గా కౌన్ జీతేగా ఔర్ కౌన్ హరేగా. జో జీతా వోహీహై సికందర్...

హిందీ "పోకిరి" హీరో,హీరోయిన్ ల మార్పు!!!


తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయిన "పోకిరి" చిత్రం ప్రస్తుతం హిందీలో పునర్-నిర్మితమవుతున్న విషయం తెల్సిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ను హీరోగా ఎంపిక చేశారు. కృష్ణ జింకల వేట కేసులో ఈ హీరోకు జోధ్‌పూర్ కోర్టు జైలు శిక్ష విధించింది. దాంతో ఈ చిత్రం షూటింగ్‌కు అంతరాయాలు తలెత్తాయి. అయితే బెయిల్‌పై విడుదలయ్యాక కూడా సల్మాన్ ఖాన్ షూటింగ్‌కు దూరంగా ఉండటంతో ఆగ్రహించిన నిర్మాత హీరోను మార్చివేసినట్టు సమాచారం. ఇక హీరోయిన్‌గా ఆసిన్‌ నటిస్తుందని తొలుత భావించారు. ఆమె ప్రస్తుతం తమిళంలో పలు చిత్రాల్లో నటిస్తుండటంతో "పోకిరి" చిత్రానికి కాల్షీట్లు ఇవ్వలేని పరిస్థితి ఎదురైనట్లు చెన్నై వర్గాల వినికిడి. ఆసిన్ తమిళంలో "దశావతారం","వేల్", హిందీ "గజని" చిత్రాల్లో నటిస్తూ యమ బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో "పోకిరి" చిత్రంలో హీరోయిన్‌గా "సూపర్" హీరోయిన్ అయేషా టకియాను ఎంపిక చేశారట. ఈ చిత్రాన్నిఅలనాటి మేటి కథానాయిక శ్రీదేవి భర్త బోనీ కపూర్ నిర్మిస్తుండగా, ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నారు.

Saturday, December 15, 2007

హాలీవుడ్ హాట్ "జెస్సీకా ఆల్బా" ఎక్స్ క్లూజివ్ వీకెండ్ గ్యాలరీ


































































ఫర్జానా గ్యాలరీ






















ప్రెస్ కాంఫరెన్స్ లో మీడియాపై భూమిక చిందులు



సినీనటి భూమిక మీడియాపై చిందులు తొక్కారు. గత శుక్రవారం భూమిక నటించిన కొత్త చిత్రం "అనసూయ" చిత్రంపై ఏర్పాటు చేసిన ప్రెస్ కాంఫరెన్స్ లో ఈ సంఘటన చోటుచేసుకుంది. సినీ ప్రమోషన్ కార్యక్రమంలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. కార్యక్రమం జరుగుతుండగా ఒక జర్నలిస్టు సెల్ ఫోన్ మోగింది. దాంతో భూమిక అసహనం ప్రదర్శిస్తూ - సెల్ ఫోన్లు స్విచాఫ్ చేయాలని, లేదంటే బయటకు వెళ్లాలని కసురుకున్నారు. దీంతో జర్నలిస్టులు షాక్ తిన్నారు. ఈ సినిమాలో భూమికది జర్నలిస్టు పాత్ర కావడం గమనార్హం.

Friday, December 14, 2007

బ్రహ్మానందం గిన్నిస్ రికార్డు






అత్తిలి "తెలుగు మాస్టార్" గిన్నిస్ రికార్డు సాధించారు.తెలుగు చిత్ర సీమలో కామెడీ కింగ్‌గా పేరుగాంచిన "హాస్యబ్రహ్మ" బ్రహ్మానందం. తాను చిత్రాల్లో పండించే హావ భావాలతో ప్రేక్షకులను గిలిగింతలు పెట్టి, కడుపుబ్బ నవ్వించే ఈ అత్తిలి కళాశాల తెలుగు మాస్టారు సరికొత్త రికార్డును సృష్టించారు. ఒకే భాషలో 754 చిత్రాల్లో నటించి "గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌"లో తన పేరును లిఖించుకున్నాడు. ఈ విషయాన్ని "బ్రహ్మానందం డ్రామా కంపెనీ" చిత్ర షూటింగ్‌లో బ్రహ్మానందమే స్వయంగా వెల్లడించారు.తన పేరు గిన్నిస్ బుక్‌లో నమోదైనట్టు ఆ సంస్థ అధికారికంగా పంపిన లేఖను బ్రహ్మానందం విలేకరులకు చూపించారు.
అత్తిలి "తెలుగు మాస్టార్"నుంచి "గిన్నిస్ రికార్డు" వరకు
అత్తిలి కళాశాలో తెలుగు మాస్టారుగా పని చేస్తూ హాయిగా జీవితం గడుపుతున్న బ్రహ్మానందాన్ని అలనాటి హాస్యబ్రహ్మ జంధ్యాల తెలుగు వెండితెరకు పరిచయం చేశారు.1985 సంవత్సరం ఫిబ్రవరి ఒకటో తేదీన తన సినీ జీవితాన్ని ప్రారంభించిన బ్రహ్మానందంకు జంధ్యాల రూపొందించిన "సత్యాగ్రహం" తొలి చిత్రం. అయితే ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్ హీరోగా నిర్మించిన "అహనా పెళ్లంట" సినిమాలో "అరగుండు" బ్రహ్మానందం పాత్రతో ఆయనకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అక్కడ మొదలుకుని నేటి వరకు వెనుదిరిగి చూడలేదు. అవార్డులు, రివార్డులు, అరుదైన రికార్డులు ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి. సినిమా హిట్‌ కావాలంటే బ్రహ్మానందం కామెడీ తప్పనిసరి అన్న రేంజ్‌లో తన ఇమేజ్‌ను పెంచుకోవడమే కాకుండా, హాస్యాన్ని పండించడంలో ఆరితేరిపోయారు. ఒక పక్క హాస్య నటుడిగా నటన కొనసాగిస్తూనే మరోపక్క తనలోని హీరో అదృష్టాన్ని పరీక్షించుకున్న నటుడు కూడా ఆయనే. "లోఫర్ మామ-సూపర్ అల్లుడు","బాబాయ్ గారి హోటల్" సహా కొన్ని చిత్రాలలో బ్రహ్మానందం హీరోగా వెండితెరపై కనిపించాడు. గత 22 సంవత్సరాలుగా తెలుగు వెండితెరపై తిరుగులేని కామెడీని పంచుతూ, ప్రత్యేక ఇమేజ్‌ను తన సొంతం చేసుకున్న నటుడు బ్రహ్మానందం.ఆయనకు నాగార్జున విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేయగా, హాస్యనటుడు అల్లు రామలింగయ్య స్మారకార్థం ఏర్పాటు చేసిన "అల్లు అవార్డు"ను 2005లో ఈ నేటి హాస్యబ్రహ్మాన్ని ఎంపిక చేసి, సత్కరించారు. ఒక్క తెలుగు భాషలో 754 చిత్రాల్లో నటించి "గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌"లో తన పేరును లిఖించుకున్నాడు.

Thursday, December 13, 2007

ఛార్మీ "మంత్ర" (ట్రైలర్)

video

"సదా" స్మరామి (ఎక్స్ క్లూజివ్ ఫొటో గ్యాలరీ)




























'ప్రేమ మధురం..త్యాగం అమరం" రెండూ కలిస్తే "వాన" :ఎంఎస్ రాజు

సక్సెస్ ఫుల్ చిత్రాల నిర్మాతగా పేరొందిన ఎంఎస్ రాజు నిర్మాణ సారథ్యంలో, స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న "వాన" చిత్రం సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్‌ పతాకంపై చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను ఆదిత్య మ్యూజిక్ ద్వారా జనవరి 14న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శక,నిర్మాత ఎంఎస్ రాజు మాట్లాడుతూ "కమలాకర్ సంగీత సారథ్యంలో చక్కని బాణీలు కుదిరాయని,ఇప్పటి వరకు మా బేనర్‌లో విడుదలైన దాదాపు అన్ని చిత్రాల పాటలు ప్రేక్షకులను అలరించాయి. ఈ "వాన" ఏకంగా సంగీతపు వర్శంలో తడిపిస్తుందని పేర్కొన్నారు. పాటలు పూర్తిగా కథలో భాగంలాగా వైవిధ్యంగా ఉంటాయని, ఇవి కథలో డెప్త్‌ పెంచుతాయని ఆయన చెప్పారు. ఈ చిత్రం యూత్‌తో పాటు క్లాస్, మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కన్నడంలో హిట్ అయిన "ముంగారుమాలై" అనే చిత్రం ఆధారంగా "వాన" చిత్రాన్ని తెరకెక్కించామని తెలిపారు.ప్రేమ మధురం... త్యాగం అమరం.. మా వాన చిత్రానికి ఇదే మూలంఅని చెప్పారు దర్శక,నిర్మాత ఎంఎస్ రాజు.

Wednesday, December 12, 2007

ప్రతిష్టాత్మకమైన రెడ్ కార్పెట్ ఫిలిం రేటింగ్స్ (12-12-2007)

(ఈ వారం అమెరికాలో విడుదల కానున్న చిత్రాలకు ప్రతిష్టాత్మక "మోషన్ పిక్చర్స్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా" సంస్థ ఇచ్చిన రెడ్ కార్పెట్ ఫిలిం రేటింగ్స్ వివరాలు ఈ క్రింది విధంగా వున్నాయి)
ALVIN AND THE CHIPMUNKS : Rating-PG
(for some mild rude humor)I AM LEGEND : Rating-PG-13
(for intense sequences of sci-fi action and violence)

NANKING : Rating-R
(for disturbing images and descriptions of wartime atrocities, including rape)

THE KITE RUNNER : Rating- PG-13
(for strong thematic material including the rape of a child, violence and brief strong language)

THE PERFECT HOLIDAY :Rating- PG
(for brief language and some suggestive humor)

YOUTH WITHOUT YOUTH :Rating-R
(for some sexuality, nudity and a brief disturbing image)




RATINGS GUIDE
G : GENERAL AUDIENCES (All Ages Admitted)
PG : PARENTAL GUIDANCE SUGGESTED (Some Material May Not Be Suitable for Children)
PG-13 : PARENTS STRONGLY CAUTIONED (Some Material May Be Inappropriate for Children Under 13)
R : NO ONE 17 AND UNDER ADMITTED RESTRICTED (Under 17 Requires Accompanying Parent or Adult Guardian)
NC-17 : NO ONE 17 AND UNDER ADMITTED

శ్రీవెంకట్ బులెమోని

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించనున్న విక్టరీ వెంకటేశ్



తెలుగు తెరపైకి మరో కొత్త కాంబినేషన్ వస్తోంది. తనదైన బాణీలో చిత్రాలను నిర్మిస్తూ వరుస విజయాలతో ముందుకు సాగుతున్న ఈనాటి క్రేజీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల, విక్టరీ వెంకటేశ్ ల కాంబినేషన్ లో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. శేఖర్ కమ్ములకు బందువు అయిన సానం నాగ అశోక్ కుమార్ నిర్మించనున్న ఈ చిత్రానికి సంబంధించిన కథా రూపకల్పన ప్రస్తుతం జరుగుతోంది. గతంలో సానం నాగ అశోక్ కుమార్ విక్టరీ వెంకటేశ్ హీరోగా నిర్మించిన "వసంతం", "ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే" చిత్రాలు బాక్స్ ఆఫీసు దగ్గర అఖండ విజయాన్ని చవిచూసాయి. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడవ చిత్రం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందనుండటం తో సినీ పరిశ్రమలో భారీ అంచనాలకు తెరలేచింది. పూర్తి స్థాయి వినోదం, కుటుంబ నేపధ్యం, మానసిక భావోద్వేగాల కలయికలో రూపొందనున్న ఈ చిత్రం పై సహజంగానే తెలుగు సినీ పరిశ్రమ మొత్తం దృష్టి సారించింది. ఈ చిత్రం వెంకటేశ్ కెరీర్ లోనే మంచి చిత్రం కావచ్చనే ఊహాగానాలూ బయలుదేరాయి. ఏదేమినా అభిరుచి గల నిర్మాత, ప్రతిభావంతుడైన దర్శకుడు, విభిన్న భావోద్వేగాలను పలికించడంలో, సెంటిమెంటు కురిపించడంలో దిట్ట అయిన హీరోల కలయికలో చిత్రం రూపొందనుండటం నిజంగా మంచి పరిణామమే.

టాప్ హీరోల డ్యాన్సింగ్ హంగామా (ఎక్స్ క్లూజివ్ వీడియో)

videoచిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, రవితేజ మొదలుకొని ప్రముఖ తెలుగు సినీ తారలందరూ కలిసి నృత్యం చేస్తే అది చూడటానికి అభిమానుల రెండు కళ్ళు చాలవు. ఒక ప్రైవేటు ఫంక్షనుకు తెలుగు సినీ ప్రముఖ తారాగణం హాజరై చేసిన డ్యాన్స్ హంగామా అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది.అతి అరుదైన ఆ దృష్యాలను చిత్రీకరించిన ప్రత్యేక వీడియోను మీకందిస్తున్నాము. చూసి ఆనందించండి.

Tuesday, December 11, 2007

వెంకటేశ్, పవన్ కళ్యాణ్ ల కాంబినేషన్ చిత్రానికి కథ కావాలి




విక్టరీ వెంకటేశ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల కాంబినేషన్ లో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. అయితే ఈ చిత్రానికి ఇంతవరకూ ఒక్క మంచి కథ కూడా దొరకక, ఒక్కటైనా మంచి కథ దొరుకుతుందేమోనని ఈ ఇద్దరు హీరోలూ గత కొన్ని రోజులుగా ఎదురుచూస్తున్నారు. కొంతమంది ప్రముఖ రచయితలు, దర్శకులు వీరి కాంబినేషన్లో చిత్రానికి స్టోరీ లైన్ వినిపించినా అది ఈ ఇద్దరికీ నచ్చక పోవడంతో వీరిద్దరి కాంబినేషన్ చిత్రం ప్రస్తుతానికి అటకెక్కింది. అసలు విషయం ఏమిటంటే విక్టరీ వెంకటేశ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లు మంచి మితృలు.ఒకరి చిత్ర కథపై మరొకరు ముందుగానే అభిప్రాయం తీసుకునే దగ్గరితనం వారిద్దరి మధ్యన వుంది. దాంతో ఎప్పటినుంచో వీరిద్దరు కలిసి ఒక చిత్రంలో నటించాలని భావిస్తూ వస్తున్నా, వారిద్దరి మాస్ ఇమేజ్ కు తగ్గ కథ మాత్రం వారికి దొరకడంలేదు. దాంతో వీరిద్దరి మధ్యన చిత్రం వస్తుందని గత రెండు సంవత్సరాల క్రితమ్నుంచే వీరిద్దరి అభిమానులు ఆశిస్తూ వస్తున్నా కథా కొరతతో అది కార్య రూపం దరించడం లేదు.దాంతో వీరిద్దరికి పూర్తిగా సరిపోయే చిత్ర కథతో ఎవరు వచ్చినా ఆ కథ నచ్చితే దానితో చిత్రాన్ని నిర్మిస్తామని అటు విక్టరీ వెంకటేశ్, ఇటు పవన్ కళ్యాణ్ లు ఇద్దరూ తమకు తెలిసినవారిదగ్గర చెబుతున్నట్లు వినికిడి. మంచి కథ వ్రాయగలిగిన వారు ఎవరైనా కథతో రామానాయుడు స్టూడియోలోగానీ, లేక పవన్ కళ్యాణ్ ఆఫీసులోగానీ సంప్రదిస్తే సరిపోతుంది. సో, ప్రతిభా వంతులైన రచయితలు తమ కళాన్ని ఝులిపిస్తే సరిపోతుంది.

క్రేజీ గర్ల్ జెనీలియా ఎక్స్ క్లూజివ్ వాల్ పేపర్స్






















Monday, December 10, 2007

కార్పోరేట్ కంపెనీల ఆఫర్లతో తలమునకలౌతున్న శేఖర్ కమ్ముల






'ఆనంద్", "గోదావరి" ల తర్వాత తన దర్శకత్వంలో నిర్మించిన "హ్యాప్పీడేస్" చిత్రంతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న దర్శకుడు శేఖర్ కమ్ములను కార్పోరేట్ కంపెనీలు ఆఫర్లతో ముంచెత్తుతున్నాయి. ముంబైకి చెందిన ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ "యుటివి",రిలయెన్స్ లతోబాటు తాజాగా మోజర్ బేర్ సంస్థ కూడా తమ చిత్రాన్ని శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నిర్మించాలని ప్రణాళికలు వేసుకుని తదనుగుణంగా శేఖర్ కమ్ములను సంప్రదిస్తున్నాయి. యు టి వి సంస్థ తాము మహేశ్ బాబుతో నిర్మించదలచిన తమ కాంబినేశన్ లోని మూడవ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తే బావుంటుందని భావించి, శేఖర్ కమ్ములను సంప్రదించడమే కాకుండా, అందుకుగాను భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ను ప్రకటించింది. ఈ చిత్రం ప్రస్తుతం సిట్టింగ్ ల స్థాయిలోనే వుంది. ఇక రిలయెన్స్ సంస్థకు చెందిన యాడ్ ల్యాబ్స్ కూడా శేఖర్ కమ్ములను సంప్రదించడం జరిగింది. మరోవైపు వీసీడీ, డీవీడీ రంగంలో తిరుగులని ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్న మోజర్ బేర్ సంస్థ తమ తొలి చిత్రాన్ని శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నిర్మించాలని భావిస్తూ, అందుకుగాను పెద్దమొత్తమే ఇవ్వడానికి సిద్దమైంది. ఇక తాజాగా స్టార్ ప్రొడ్యూసర్ రామానాయుడు కూడా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తన మనవడు హీరోగా ఒక చిత్రాన్ని నిర్మించాలని ప్రయత్నిస్తున్నాడు. ఇలా ఆఫర్లు ఒకదానికి మించి మరోటి వస్తున్నా శేఖర్ కమ్ముల మాత్రం ఏచిత్రానికీ ఇంకా ఒప్పుకోకుండా తన తదుపరి చిత్రాన్ని తన స్వీయ నిర్మాణంలో నిర్మించడానికి సమాయత్తమై, దానికి సంబంధించిన స్క్రిప్టు పనులను అతివేగవంతంగా కొనసాగిస్తున్నాడు. చూద్దాం ముందు ముందు మరేం జరుగుతుందో, అలాగే శేఖర్ కమ్ముల ఏ చిత్ర నిర్మాణ సంస్థ వైపు మొగ్గు చూపుతాడో.

Monday, December 3, 2007

శ్రీకాంత్ వందో చిత్రానికి కృష్ణవంశీ దర్శకత్వం

శ్రీకాంత్ వందో చిత్రానికి చేరువయ్యాడు. సైడ్ హీరో క్యారెక్టర్లలో నటిస్తూ హీరోగా ఎదిగిన శ్రీకాంత్ కు ఇవివి చిత్రం "ఆమె" సక్సెస్ నిచ్చి, అతని కెరీర్ ని మలౌపుతిప్పింది. ఆ తర్వాత నటుడిగా కృష్ణవంశీ "ఖడ్గం"లో నిరూపించుకున్నాడు. ఆ చిత్రంలో సీరియస్ పోలీసాఫీసర్ పాత్ర అతనికి మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమలో ప్రతిభావంతుడైన నటుడిగా గుర్తిపు తెచ్చుకునే అనేక చిత్రాలలో శ్రీకాంత్ నటించాడు. ఇప్పటిదాకా 99 చిత్రాలలో నటించిన శ్రీకాంత్ తాజాగా ఆయన 100వ సినిమాకు సిద్దమయ్యాడు. నటుడిగా తనను విభిన్నంగా చూయించిన కృష్ణవంశీ దర్శకత్వంలో నటించబోతున్నాడు. 2008వ సంవత్సరంలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రానికి నిర్మాత శ్రీకాంత్ భార్య ఊహ కావటం విశేషం.

Saturday, December 1, 2007

హాలీవుడ్ హాటెస్ట్ భామిని జేలో ఎక్స్ క్లూజివ్ వీకెండ్ గ్యాలరీ










వెడ్డింగ్ కపుల్: భూమికా ఆండ్ భరత్ ఠాకూర్ (గ్యాలరీ)








విక్టరీ వెంకటేశ్ డబల్ రోల్



"సూర్యవంశం","సుభాష్ చంద్ర బోస్","జయం మనదేరా" లాంటి పలు చిత్రాలలో ద్విపాత్రాభినయం చేసిన విక్టరీ వెంకటేష్‌ తదుపరి చిత్రంలో కూడా డబుల్ రోల్స్‌ను పోషించనున్నట్లు చలన చిత్ర వర్గాల సమాచారం. అయితే ఈ విషయమై వెంకటేష్ గానీ, ఇతర సంబందీకులుగానీ ఎటువంటి ప్రకటన చేయలేదు. "లక్ష్మీ", "ఆడవారి మాటలకు అర్థాలే" వేరులే వంటి సెంటిమెంట్ చిత్రాల్లో నటించిన మాస్, యాక్షన్ కలగలిసిన "తులసి"లో ఇటీవల నటించాడు.అయితే ప్రస్తుతం వెంకటేశ్ డబుల్ రోల్ చిత్ర కథకు ఓకే చెప్పినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం.ఈ చిత్రానికి సంబధించిన కథ, కథనాలు ఇప్పటికే పూర్తయ్యాయని,త్వరలోనే రామానాయుడు స్టూడియోలో షూటింగ్ ప్రారంభం కానుందని తెలిసింది. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోలు ద్విపాత్రాభినయంతో వచ్చే సినిమాలు చాలా తక్కువైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంలో వెంకటేశ్ నటించనున్న ద్విపాత్రాభినయ చిత్రానికి సహజంగానే క్రేజ్ ఏర్పడటం సహజం. దానికి తోడు గతంలో వెంకటేశ్ నటించిన ద్విపాత్రాభినయ చిత్రాలలో ఎక్కువశాతం మంచి విజయాన్ని సాధించాయి కూడా. సో విక్టరీ అభిమానులు తమ హీరోను త్వరలోనే ద్విపాత్రాభినయంలో చూసుకుంటారన్న మాట.

నవగ్రహ శాంతి పూజల్లో మెగాస్టార్ కుటుంబం



తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి కుటుంబం ప్రస్తుతం శాంతి పూజల్లో నిమగ్నమైనట్టు సమాచారం. తన కుటుంబ జ్యోతిష్య పండితుల సూచన మేరకు ఈ పూజలు నిర్వహిస్తున్నట్టు టాలీవుడ్ వర్గాల భొగొట్టా. తెలుగు చిత్ర పరిశ్రమలో నానాటికీ పెరుగుతున్న తన ఇమేజ్‌పై "దిష్టి" తగిలిందని బలంగా నమ్ముతున్న చిరు కుటుంబ స్బ్యులు, మరియు జ్యోతిష్యుని సలహా మేరకు వాటి నుంచి త్వరగా విముక్తుడయ్యేందుకు వీలుగా నవగ్రహ గ్రహ శాంతి పూజలు, నర్పదోష, ఇతర రకాల పూజలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. దీనికి తోడు అత్యంత ప్రతిష్టాత్మకంగా తాను తదుపరి నిర్మించనున్న 149 చిత్రం కూడా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.