Thursday, January 31, 2008
కత్రినా కైఫ్ లవ్ స్టోరీ

కండల హీరో సల్మాన్ ఖాన్ ప్రేమ కథ మరోసారి విషాదాంతం కానున్నట్లు సమాచారం. ఇప్పటికే పలుమార్లు సల్మాన్ ఖాన్ ప్రేమ విషాదాంతంగా ముగిసింది. తాజాగా అతన్ని కత్రీనా కైఫ్ కూడా వదిలేసేటట్లు ఉందనే ప్రచారం బాలీవుడ్ లో ఊపందకుంది. ఇటీవలి కాలంలో కత్రీనా, సల్మాన్ ఖాన్ లేకుండా హాజరైన పార్టీలు లేవనే చెప్పాలి. అయితే తాజాగా ఆమె "సావరియా" సినిమా హీరో రణబీర్ కపూర్ తో లేట్ నైట్ పార్టీలో కనిపించి చాలా మందిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. వీరిద్దరు ఇటీవల రెగ్యులర్ గా కలుసుకుంటూ కబుర్లలో మునిగితేలుతున్నట్లు సమాచార. కత్రీనా చివరికి సల్మాన్ ఖాన్ ను వదులుకుంటుందా, లేదంటే రణబీర్ కు గుడ్ బై చెబుతుందా అనేది ప్రశ్న. ఇప్పుడు ఎవరి ప్రమ కథ సుఖాంతమౌతుందో, లేక మరెవరి ప్రేమకథ విషాదాంతమవుతుందో అనే చర్చ బాలీవుడ్ లో రాజ్యమేలుతోంది. ఇప్పుడు కత్రినా ప్రేమను కోల్పోయినవారికి శుభాకాంక్షలు చెప్పి, గెలిచిన వారి పట్ల జాలి చూపిద్దామా...??? లేక రివర్సా...మీరే ఆలోచించండి.
Wednesday, January 30, 2008
రెడ్ కార్పెట్ ఫిలిం రేటింగ్స్ (30-01-2008)
(Courtesy:Motion Picture Association of America, Inc)
(Ratings for Movies Debuting in Theaters This Week)
CARAMEL
CARAMEL
Ratings-PG
(for thematic elements involving sexuality, language and some smoking)
(for thematic elements involving sexuality, language and some smoking)

Ratings-PG-13
(for violence/terror and disturbing content)
(for violence/terror and disturbing content)

Ratings- G
(all ages admitted)

Ratings-PG-13
(for sexual content and language)

G
GENERAL AUDIENCES (All Ages Admitted)
PG
PARENTAL GUIDANCE SUGGESTED (Some Material May Not Be Suitable for Children)
PG-13
PARENTS STRONGLY CAUTIONED (Some Material May Be Inappropriate for Children Under 13)
R
RESTRICTED (Under 17 Requires Accompanying Parent or Adult Guardian)
NC-17
NO ONE 17 AND UNDER ADMITTED
Tuesday, January 29, 2008
రాజశేఖర్ పై దాడికేసు: నిందితుల లొంగుబాటు

సినీ నటుడు రాజశేఖర్ పై దాడి కేసులో పది మంది మంగళవారంనాడు హైదరాబాదులోని పంజగుట్ల పోలీసు స్టేషనులో లొంగిపోయారు. రాయపురెడ్డి సూరిబాబు అలియాస్ రాజా నాయకత్వంలో తాము రాజశేఖర్ ను వెంబడించామని నిందితులు చెప్పారు. తాము రాజశేఖర్ పై దాడి చేయలేదని, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయడానికి రాజశేఖర్ కారును వెంబడించామని వారు చెప్పారు. తమను చూసి రాజశేఖర్ భయానికి గురై లారీని, శాంత్రో కారును ఢీకొట్టారని, దాడి చేసే ఉద్దేశం తమకు లేదని వారు చెప్పారు.
నగేష్ బాబు, రాజు, నాయుడు, నగేష్ బాబు, విష్ణు, పల్లంరాజు, గణేష్, కళ్యాణ్, షేక్ సలీం అలీ, రాంమోహన్ అనేవారిని రాజశేఖర్ పై దాడి కేసులో నిందితులుగా గుర్తించారు. తాము పదిమందిమి ముందు నాంపల్లి స్టేషనుకు వెళ్లామని, ఆ తర్వాత సికింద్రాబాదు రైల్వే స్టేషనుకు వెళ్లి రాజశేఖర్ కారును వెంబడించామని వారు చెప్పారు. నిందితులను పోలీసులు విచారించారు
నగేష్ బాబు, రాజు, నాయుడు, నగేష్ బాబు, విష్ణు, పల్లంరాజు, గణేష్, కళ్యాణ్, షేక్ సలీం అలీ, రాంమోహన్ అనేవారిని రాజశేఖర్ పై దాడి కేసులో నిందితులుగా గుర్తించారు. తాము పదిమందిమి ముందు నాంపల్లి స్టేషనుకు వెళ్లామని, ఆ తర్వాత సికింద్రాబాదు రైల్వే స్టేషనుకు వెళ్లి రాజశేఖర్ కారును వెంబడించామని వారు చెప్పారు. నిందితులను పోలీసులు విచారించారు
బాలకృష్ణ హీరోగా నటించనున్న తదుపరి చిత్రం "చౌదరి"

బాలకృష్ణ హీరోగా "చౌదరి" అనే సినిమా రాబోతున్నట్లు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. బాలకృష్ణతో "వీరభద్ర" అనే సినిమాను చేసిన రవికుమార్ చౌదరి సినిమాకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. "వీరభద్ర" సినిమా సరిగా ఆడకపోయినప్పటికీ రవికుమార్ పనితనం బాలకృష్ణకు నచ్చిందట. దాంతో "చౌదరి" సినిమా చేయడానికి ఆయన అంగీకరించారని వినికిడి. ప్రస్తుతం రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందుతున్న "పాండురంగ" చిత్రంతో బిజీగా ఉన్నారు. దీని తర్వాత గుణశేఖర్ దర్శకత్వంలో "సాధు" సినిమా చేయడానికి బాలకృష్ణ అంగీకరించారు. రవికుమార్ దర్శకత్వం వహించే "చౌదరి" సినిమా "సాధు" కన్నా ముందు ఉంటుందా, తర్వాత ఉంటుందా అనేది తెలియడం లేదు.
Monday, January 28, 2008
రాజశేఖర్ పై "చిరు ఫ్యాన్స్" దాడి :మెగాస్టార్ క్షమాపణ (Photos)



మెగాస్టార్ క్షమాపణ : హర్షించిన రాజశేఖర్
తన అభిమానుల దాడిలో గాయపడిన సినీనటుడు రాజశేఖర్‌కు మెగాస్టార్ చిరంజీవి ఈరోజు మద్యాహ్నం క్షమాపణ చెప్పారు. అభిమానులు విధ్వంసక చర్యలకు పాల్పడకుండా సంయమనం పాటించాలని మెగాస్టార్ పిలుపునిచ్చారు. చిరంజీవి క్షమాపణ పట్ల గాయపడిన రాజశేఖర్ హర్షం వ్యక్తం చేశారు. దాడి చాలా భయంకరమైందిగా రాజశేఖర సతీమణి జీవిత పేర్కొన్నారు. రాజశేఖర్
నివాసానికి స్వయంగా వెళ్లిన మెగాస్టార్ ఆయన్ను ఆప్యాయంగా హత్తుకుని ఈ సందర్భంగా అభిమానులు సంయమనం పాటించాలని ఇద్దరు హీరోలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో దాడుల సంస్కృతి మంచిదికాదని హితపుపలికారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంటుందని పేర్కొన్న చిరంజీవి రాజశేఖర్ తనపై చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనప్పటికీ, తన అభిమానుల మనోభావాలను దెబ్బతీశాయ
ని పేర్కొన్నారు. రాజశేఖర్ నా సోదరుడులాంటివాడని, తెలుగు చిత్ర పరిశ్రమ కుటుంబంలో ఒక సభ్యుడని చిరంజీవి పేర్కొన్నారు.కాగా తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్ర బాబు నాయుడుతో సహా, పలువురు రాజకీయ, సినీ నటులు రాజశేఖర్ కుటింబీకులను పరామర్షించారు.


బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ కు "ఫ్రాన్స్" పురస్కారం

సాంస్కృతిక రంగంలో విశేషంగా రాణిస్తూ సేవలు అందించే వారికి ఫ్రాన్స్ ప్రభుత్వం ప్రధానం చేసే అత్యున్నత పురస్కారం "ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్" అవార్డు బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్‌ను వరించింది. ఈ బాలీవుడ్ బాద్ షా తన నటనా పటిమతో కళారంగానికి చేసిన విశేష సేవ, కృషికి గానూ ఈ అవార్డును ప్రధానం చేయనున్నట్లు ఫ్రాన్స్ ప్రభుత్వం పేర్కొంది. ఫ్రాన్స్ ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించడం పట్ల, షారుక్‌ఖాన్‌తో పాటు ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.
Subscribe to:
Posts (Atom)